https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v
🌺 అమృతం గమయ 🌺
మీ జీవితం యొక్క నిరాశలు, బాహ్య మరియు వ్యక్తిగతీకరించిన రూపాల పట్ల మీ లోతైన ప్రమేయం కారణంగా ఉన్నాయి. ఈ రూపాల యొక్క సార్వత్రిక మరియు దైవిక స్వభావాన్ని మీరు చూసినప్పుడు, మీరు విముక్తిని అనుభవిస్తారు - సత్ చిత్.
*అమృతం గమయ*
*సత్ చిత్*
శ్రద్ధగా విను. నీకు తెలిసిన విషయం మాత్రమే నీవు ఆచరించగలవు. అంటే నీ జ్ఞానాన్ని మాత్రమే అనుభవంగా మార్చుకోగలవు. దీని అర్థం ఏంటి అంటే నీ వాస్తవాలకు వాస్తవ రూపం ఇవ్వ గలిగిన వాస్తవం కేవలం జ్ఞానం మాత్రమే. అంటే నీ ఆధ్యాత్మిక అనుభవాలు కేవలం జ్ఞానం వలన మాత్రమే సాధ్యం. అంటే నిజానికి నీకు ఇప్పటిదాకా సత్యమును విపులంగా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ఎవరైనా మీకు చెప్పడానికి ప్రయత్నం చేసినా వాళ్లని అవహేళన చేయటమో, పట్టించుకోకపోవడమో, విసుగు ప్రదర్శించటమో చేస్తావు. జ్ఞానాన్ని తెలుసుకొని నీ సంకల్పానుసారంగా జీవితాన్ని స్వేచ్ఛగా మార్చుకోవటమే నిజమైన స్వేచ్ఛ. అంతే తప్ప జ్ఞానం తెలియని స్థితిలో నీవు చేసేటటువంటి ఆలోచనలే స్వేచ్ఛ అని, అంతేకాకుండా ఇతరులు ఎవరో నీ స్వేచ్ఛని హరించి వేస్తున్నారని భ్రమ పడుతుంటావు. అదే స్వేచ్ఛనుకుని ఎల్లప్పుడూ విరామం లేని ఆలోచనలతో విసుగుతో నిస్పృహతో బంది అయి ఉంటావు. అలాంటి జీవితంలో నిత్యం విసుగు మాత్రం నిండి ఉంటుంది. ఆ విసుగును ఈర్ష్య అసూయ ద్వేషాలను ఓర్వలేనితనాన్ని ఇప్పటిదాకా జీవిస్తూనే ఉన్నావు. నిన్ను నీవే ఓడించుకుంటున్నావు. దానికి ఇతరుల పేరు పెట్టుకుంటున్నావు. ఈ స్థితిలో అసత్య ప్రసంగాలు అనురక్తిని కలిగిస్తూ ఉంటాయి. సత్య జ్ఞానం అంగీకరించేటువంటి మనస్థితి కలిగి ఉండలేవు. పూర్తిగా అవివేకివి అయిపోతావు.
శంకరభగవత్పాదులు వివేకచూడామణిలో పరబ్రహ్మ తత్వం గురించి విపులంగా చెప్పారు. వివేకి అయిన సాధకుడు బాహ్యవస్తు స్మరణ మాని ప్రత్యగాత్మను స్మరించాలి. బాహ్య ప్రపంచం గురించి ఆలోచనలను తిరస్కరించడం ద్వారా మనసు ప్రసన్నతను పొందుతుంది.ఈ ప్రసన్నత పరమాత్మ దర్శనానికి దారి చూపుతుంది.పరమాత్మ సాక్షాత్కారం జనన మరణ శ్రేణిని ఛేదిస్తుంది. ఎవరైతే అఖండ పరిపూర్ణ పరబ్రహ్మం లో లీనమై ఉంటాడో, అతడే ముక్తుడు అని అంటారు. పరమాత్మ తత్వం అతి సూక్ష్మమైనది. స్థూల దృష్టితో, తర్కం, వాదోపవాదాలతో దాన్ని గ్రహించలేం. మహనీయులు చిత్తవృత్తులను నిరోధించి మిక్కిలి నిర్మలం, సూక్ష్మం అయిన స్థితిని పొంది పరమాత్మ తత్వానికి చేరువవుతారు. భ్రాంతివల్ల తాడును పాము అనుకొంటాం అదే రజ్జు సర్ప భ్రాంతి. వివేకం అనే దీపం వెలుగులో ఆ భ్రాంతి తొలగినప్పుడు రజ్జు నిజరూపం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ జగత్తు నిజస్వరూపం పరబ్రహ్మమేనని, వివేకజ్ఞానం వల్ల తెలుసుకుంటాం. మనకు కనిపించేది అద్వితీయ పరబ్రహ్మ తప్ప మరేదీ కాదు.
సత్ (సత్యం) చిత్ (జ్ఞానం) ఆనందం. వీటికి సార భూతమైన పరమాత్మ ఒక్కటే. సర్వాంతర్యామి సర్వతోముఖం, అంటే సర్వత్రా సమంగా వ్యాపించినది. అది అనంతం. అన్ని విధాలా సమగ్రమైన పరబ్రహ్మమొక్కటే. అంటే ఈశ్వరతత్త్వమే.
ఆనంద మకరందంతో నిండిన ఈశ్వరతత్వాన్ని మాటల్లో చెప్పలేం. మనసుకు కూడా అందదు. సముద్రంలో కలిసిన వడగళ్లు సముద్రంలోనే కరిగిపోతాయి. ఈశ్వర అంశ అయిన మనసు ఈశ్వరునిలోనే లీనమై పోవాలి. ఈశ్వరునిగా మారిపోవాలి. శివోహం. అదే జీవన లక్ష్యం. అది సాధించేవరకు జీవనంలో సత్యమైనటువంటి శాంతి లభించదు. అశాంతి విసుగుల నుంచి విరమణ లభించదు. సత్యమైన స్వేచ్ఛ కలుగదు.
*అసతోమా సద్గమయ*
*తమసోమా జ్యోతిర్గమయ*
*మృత్యోర్మా అమృతంగమయ*
ఓం శాంతిః శాంతిః శాంతిః
No comments:
Post a Comment