నీ అహంకారం నీ తలకెక్కితే
నీవే గొప్ప అని నువ్వు అనుకుంటే.,
నేనే ఈ భూలోకానికి రథసారధి
అని నువ్వు అనుకుంటే.,
నేనే ఈ సమాజానికి గొప్ప
మేధావిని నువ్వు అనుకుంటే.,
ఈ దేశానికి పాలించే
రాజు అని అనుకుంటే.,
నేనే ఈ ప్రపంచ భూబండలానికి
శాసించే వ్యక్తిని నువ్వు అనుకుంటే.,
నేనే డబ్బు ఉన్నవాడని
నేనే బంధువులు బలగాలు ఉన్నవాడవని.,
ఈ ప్రపంచంలో నేను ఏది చేసినా
చెల్లుతుందని నువ్వు నీ గర్వంతో
నువ్వు వీర్రవీగితే,
ఒకే ఒక్కసారి ఇటు వైపు చూడు..,
నీకన్నా ఎంతోమంది మేధావులు
నీ కన్నా ఎంతో మంది రాజులు,
నీ కన్నా ఎంతో మంది ధనికులు
నీలాగే అహంకారంతో తలకెక్కిన వారు,
స్మశానములో హాయిగా నిద్రపోతున్నారు.
No comments:
Post a Comment