Tuesday, July 23, 2024

 *కన్నయ్యను ప్రేమించండి!*
                     ➖➖➖✍️

ఇప్పటిదాకా బంగారాన్ని ఆస్తుల్నీ హోదాల్నీ ఎలక్ట్రానిక్ ఉపకరణాల్ని ....ఇంకా వేటి వేటినో చాలా చాలా ప్రేమించి ఉంటారు....
ఆ ప్రేమతోనే ఒక్కసారి కన్నయ్యను ప్రేమించి చూడండి.. ఇంకా దేన్నీ ప్రేమించాల్సిన అవసరం బహుశా రాదేమో, ఆ సుందర మోహనకారుడి అద్వీతీయ మనోహర అనుపమాన రూపలావణ్యాలను మనోనేత్రాలతో మీ హృదయ వాకిట ప్రతిష్ట చేసుకోండి,ఇంకా దేనిని ద్వేషించాల్సిన అవసరం మునుముందెన్నడూ మీకు కలగకపోవచ్చు..

ఉట్టిమీద పాలమీగడలు దొంగిలించిన  ఆ అమాయక మానస చోరుడిని మీ మనసులోకి ఆవాహన చేసుకొండొక్కసారీ...అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతం ఎత్తి పట్టుకున్న ఆ పరందాముడి లీలా వినోదాలను చేతులు జోడించి కృష్ణా... కృష్ణా....అని ప్రేమతో మీ కంటిలో నిలుపుకోండి, ఆ కంటిలో ఆనంద భాష్పాలే తప్ప విచారాలు నేల రాలవు...   
ఆ కృష్ణ ప్రేమప్రవాహంలో గోపికలై తరించండి, కాళింది కదిలినప్పుడు తకదిమి తకదిమి అంటూ నాట్యం చేయడానికి, ఆ విషపునాగులను పారద్రోలాడానికి మీ చెంత వేణుగానాన్ని అలపిస్తూ ఉంటాడు, కానీ నువ్వే గుర్తించట్లేదు.... పసిబాలుడు, అందునా ముద్దుగారే యశోదాతనయడు, దేవకినందనుడు... కోటి సూర్యకాంతి ప్రభలతో వెలిగే ఆ ముద్దుమోమును తుదముట్టించడానికి ఎన్ని పన్నాగాలు పన్నారు, బకాసురుడు, తృణావర్తుడు, శకాటసురుడు, కంసచాణురాది రక్కసులు. అయినా ఆ తుంటరి కిట్టడు ఆసురులను పావులుగా చేసుకుని హాయిగా చందరంగం ఆడేసుకున్నాడు...ఆ ధైర్యాన్ని ఆ 
గుండెబలాన్ని కన్నయ్య రూపాన ఆవాహన చేసుకుని సమస్యలకై మనం పోరాటం చేద్దాం.. కన్నయ్య మన జీవితాల్లోకొస్తే ద్వేషం అనే పదం మనం ఉపయోగించాల్సిన అవసరం ఉండదేమో...అంతా కృష్ణమయమే అవుతుంది, ప్రేమమయమే అవుతుంది.... 

ఆ కన్నయ్యే మన సమస్యలకు గీతాచార్యుడు, ఆ కన్నయ్యే మన నుదుటి నొసల గీతలు మార్చే గీతాగోవిందుడు.....
ఆ కన్నయ్య పాదాలు పట్టుకుందాము, ఇంకా దేనినీ పట్టుకోవాల్సిన అవసరం మనకు జన్మలో రాదు. 

కృష్ణా నీ ప్రేమ బృందావన ధూళినైనా మామీద కురిపోయించు...ఆ మధూళి ధూళిలో నిర్జరులమై నీ చెంత సేదతీరుతాము కన్నయ్య.... అవకాశమివ్వు......✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
          🌷🙏🌷

🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment