Monday, August 25, 2025

 నీకు చేతకాదు అని 
హేళన చేసేవారి చేత
చప్పట్లు కొట్టించుకోవాలి

నీవు పనికిరావు అని
నిన్ను దూరం పెట్టినవారు
నిన్ను వెతుక్కుంటూ రావాలి

నువ్వు ఏమీ చేయలేవు అని
చులకనగా మాట్లాడిన వారు
మమ్మల్ని ఏమీ చేయద్దని
ప్రాధేయపడాలి 

నీకు ద్రోహం చేసిన వారే
నీ సాయం కోసం
నీ ముందు తలవంచాలి

నీకు కన్నీళ్లు పరిచయం చేసినవాళ్లే
ఆ కన్నీళ్లకు క్షమాపణ చెప్పుకోవాలి

నువ్వు వెళ్లేదారిలో
ముళ్ళను వేసినవాళ్లే
నీకు పూలస్వాగతం
పలికేలా నువ్వు మారాలి

నిన్ను భయపెట్టాలి అని
అనుకున్నవారికి 
నీ ధైర్యాన్ని రుచి చూపించు

నువ్వు నిలబడడమే 
కష్టం అని అనేవారి ముందు
అడుగులు వేసి చూపించు

నువ్వు ఓడిపోతే 
నవ్వాలని వేచిచూస్తున్నవారికి
నీ గెలుపును కానుకగా
వారికి ఇవ్వాలి...!!

Sekarana 

No comments:

Post a Comment