Thursday, August 21, 2025

 @కంటిరెప్పతో కథ చెప్పారు@46
           తేది:20/08/2025
""''''''""""""""""""""""""""""""""""""""""""""""

మనిషి అనుకుంటే కానిదేముంది అంటారు కదా కానీ
అనుకున్నంత మాత్రాన అయిపోవు అన్నీ అందుకు ఎంతో
పట్టుదల, కృషి అవసరం, కార్యసాధనలో ఎదురయ్యే
సమస్యల్ని నేర్పుగా అధిగమిస్తూ దృఢసంకల్పంతో ముందు
కెళ్లిన వాళ్లే విజయం సాధిస్తారు కాలాతీత వ్యక్తులుగా
చరిత్రలో నిలుస్తారు అలాంటి ఓ విజేత కథ ఇది...
ఆయన పేరు జీన్ డామినిక్ బాబీ ఓ ప్రఖ్యాత ఫ్రెంచ్
మ్యాగజైన్ ఎడిటర్ భార్య, ఇద్దరు పిల్లలతో జీవితం
హాయిగా సాగిపోతోంది నలభై మూడేళ్ల బాబీ ఓ రోజు
కారులో కొడుకుని తీసుకుని బయటికి వెళ్తుండగా స్ట్రోక్
వచ్చింది ఇరవై రోజుల తరువాత స్పృహ వచ్చేసరికి ఆయన
ఆస్పత్రి మంచం మీద ఉన్నాడు పైనుంచి కిందివరకు
ఒంట్లో ఏ భాగమూ స్వాధీనంలో లేదు ఒకే ఒక్క ఎడమ
కన్ను మాత్రం తెరవడం మూయడం చేయగలుగుతున్నాడు
ఆయన పరిస్థితిని 'లాక్డ్ ఇన్ సిండ్రోమ్'గా పేర్కొన్నారు
వైద్యులు స్ట్రోక్ రావడానికి ముందే బాబీ ఒక పుస్తకం
రాయడానికి ప్రచురణకర్తలతో ఒప్పందం చేసుకున్నాడు
మెదడు బాగానే పనిచేస్తోంది కాబట్టి ఎలాగైనా ఆ పుస్తకం
రాయాలనుకున్నాడు బాబీ ఆ ఒక్క కంటిని మూయడం
తెరవడం ద్వారా ఆయన చెప్పదలచుకున్నది చెప్పేలా స్పీచ్
థెరపిస్ట్ సాయం చేసింది ఆ డిక్టేషన్ తీసుకుని రాయడానికి
ప్రచురణకర్తలు ఒక అసిస్టెంట్ని ఏర్పాటు చేశారు
"ఎ "నుంచి
"జడ్"వరకు ఒక్కో అక్షరాన్ని ఆమె పలుకుతుంటే అనుకున్న
అక్షరం రాగానే బాబీ కన్ను ఆర్పేవాడు అలా రోజూ మూడు
గంటల చొప్పున రెండు నెలల పాటు కష్టపడి రాసిన 137
పేజీల పుస్తకమే 'ద డైవింగ్ బెల్ అండ్ ద బటర్ ఫ్లై
ఆయనకి స్ట్రోక్ వచ్చిన తరువాత 14 నెలలకు పబ్లిష్
అయింది విపరీతంగా అమ్ముడైంది
అటువంటి పరిస్థితిలోనూ బాబీ చమత్కారంతో కూడిన
తన శైలిని మరవకపోగా తనమీద తనే జోకులు వేసుకునే
వాడు పిల్లల్ని దగ్గరకు తీసుకోలేని తన అశక్తత పట్ల
విచారం వ్యక్తంచేసేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ
'లాక్డ్ ఇన్ సిండ్రోమ్ ' ది తన మీద పైచేయి కాకూడదనుకున్న బాబీ
పుస్తకం రాయడమే కాదు, ఆ కొద్ది సమయంలోనే చాలా
పనులు చేశాడు తనలాంటి స్థితిలో ఉన్నవారి కోసం ఒక
అసోసియేషన్ పెట్టాడు ఒక టీవీ షోలో పాల్గొన్నాడు
మరో పుస్తకం రాయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు
దురదృష్టవశాత్తూ న్యూమోనియా రావడంతో పుస్తకం
విడుదలైన రెండురోజులకే చనిపోయాడు
మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే
తపన ఉంటుంది తీవ్రంగా కృషి చేస్తారు కూడా ఏవైనా
సమస్యలు, ఆటంకాలు ఎదురైతే మాత్రం అధికశాతం నిరాశలో
కూరుకుపోతారు తమకు అదృష్టం లేదనుకుని అక్కడితో
ఆగిపోతారు సంకల్పబలం ఉంటే అదృష్టంతో పని ఉండదన
డానికి బాబీ జీవితం కన్నా
@గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది..?@*

No comments:

Post a Comment