Wednesday, August 20, 2025

 *శ్రీమద్రామాయణము* 

*అయోధ్యాకాండము* 

*నేడు 61వ సర్గ* 

🌺📿🌺 *కౌసల్య విలపిస్తూ దశరథుని నిందించడం* 🌺📿🌺

*కౌసల్యాదేవి ఏడుస్తూ దశరథ మహారాజును చూసి ఇలా అన్నది.*

*"మహారాజా! ధర్మం ఆచరించటంలో శ్రేష్ఠుడవు, దయాశీలుడవని, ఉదార స్వభావుడవని మూడు లోకాల్లోనూ నీకు పేరు ఉంది. ఉంటే ఉండవచ్చునుగాక! అటువంటి నువ్వు నీ పెద్దకొడుకు విషయంలో ఏం చేశావు? ప్రజలందరిచేత ప్రేమించబడ్డ రాముణ్ణి వనవాసానికి పంపావు. పుట్టినప్పటి నుండీ సుఖాలకు, భోగాలకూ అలవాటుపడిన సీత అల్లారుముద్దుగా పెరిగింది. పైగా యౌవనంలో ఉంది. అటువంటి సీతను కూడా రామలక్ష్మణులతోపాటు అడవులకు పంపావు. అక్కడ ఉంటే ఆ శీతోష్టాలకు ఆ పిల్ల తట్టుకోగలడా? ఇంతవరకూ మంచి రుచికరమైన రకరకాల ఆహారాలను భుజించేది. ఇప్పుడు అరణ్యంలో దొరికే కందమూలాలతో సరిపెట్టుకోవలసిందే కదా! మంగళకరమైన గీతవాద్యాలను వింటూ ఆనందిస్తూ ఉండేది. ఇకపైన ఆ జానకి సింహాలు,* *పెద్దపులుల అరుపులతో సరిపెట్టుకోవాల్సిందే. ఇంద్రుడి ధ్వజస్తంభంలా ఎంతో ఉన్నతంగా ఉండేవాడు, పొడుగాటి బాహువులుగల వాడు. మహాబలశాలి అయిన రాముడు తలకింద చెయ్యి పెట్టుకొని పడుకోవలసిందే. నా రాముడి ముఖం పద్మంలా ఉంటుంది. నా రాముడి జుట్టు ఎంతో అందంగా ఉంటుంది. అటువంటి రాముణ్ణి మళ్ళీ ఎప్పుడు చూడగలుగుతానో గదా? రాముడి కోసం ఇంతగా తపిస్తున్నాకూడా నా గుండె వెయ్యిముక్కలు కాకుండా ఉందే! అంటే దాన్ని ఏ వజ్రంతోనో చేసి ఉండాలి? లేకపోతే ఈపాటికే పగిలి తునాతునకలయ్యేది.*

*ఓ మహారాజా! నీవు దయాదాక్షిణ్యాలు లేని కసాయివాడవు. లేకుంటే సకల సుఖాలు అనుభవించవలసిన నా సీతారామలక్ష్మణులను నా నుంచి దూరంగా అడవులకు పంపి ఉండేవాడవు. కావు, వాళ్ళు ముగ్గురూ అతిదీనంగా అడవుల్లో కష్టాలు పడుతున్నా కూడా నా గుండె పగిలిపోకుండా ఉంది.*

*ఓ రాజా! రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి పదిహేనో సంవత్సరాన తిరిగి అయోధ్యకు వచ్చినా కూడా, భరతుడు తన సింహాసనాన్ని, కోశాగారాన్ని రాముడికిస్తాదా? కొంతమంది పితృదేవతలకు శ్రాద్ధం పెడుతూ భోజనాలు బ్రాహ్మణులకన్నా ముందుగా తమ బంధువులకే పెడ్తారు. ఆ తరువాత బ్రాహ్మణులకు భోజనం వడ్డిస్తారట. అట్లా ఆహ్వానించబడిన బ్రాహ్మణులు, విద్వాంసులు, గుణవంతులు, పండితులు, దేవతలతో సమానమైన తపశ్శాలురయితే ఇతరులు భోజనం చేసిన తరువాత తమకు అమృతం వడ్డించినా ముట్టుకోరు. తమకంటే ముందు తిని వెళ్లినవారు బ్రాహ్మణలే అయినా కూడా బుద్ధిమంతులైనవారు భోజనం చేయటానికి అంగీకరించరు ఎడ్లు తమ కొమ్ములు కోయించుకోవటానికి ఇష్టపడతాయా? ఏనుగులు తమ దంతాలు పీకుతామంటే ఒప్పుకుంటాయా?*

*మహారాజా! రాముడు మీకు పెద్దకొడుకు మాత్రమే కాదు, పరమ శ్రేష్టుడు కూడాను. తమ్ముడు అనుభవిస్తున్న రాజ్యాన్ని కోరుకుంటాడా? పెద్దపులులు, సింహాలు మరో జంతువు మూతిపెట్టిన అహారాన్ని తినవు. అట్లాగే రాముడు కూడా ఇతరులు అనుభవించిన రాజ్యాన్ని అంగీకరించడు. యజ్ఞయాగారుల్లో హవిస్సు, నెయ్యి పురోడాశములు, కుశలు, యూపస్తంభాలు మొదలైన వాటిని ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ యజ్ఞంలో ఉపయోగించరు. అట్లాగే రాముడుకూడా ఇతరులు అనుభవించిన రాజ్యాన్ని సారాన్ని తీసేసిన మద్యంలా, నష్టమైపోయిన సోమలతగల యజ్ఞంలా ఆంగీకరించదు.*

*బాజా! రాముడు చాలా అర్యాభిమానం కలవాడే కానీ, బలహీనుడు కాదు. వాడికి కోపం వస్తే మందరపర్వతానైనా పిండిచేయగలడు. ఏదో కన్న తండ్రివి కదా అన్న మమకారంతో ఆ మహాత్ముడు నిస్తూ దంపలేదు. గోపంచస్తే సూర్యచంద్రుల్ని, నక్షత్రమండలాన్ని, ద్యులోకాన్నికూడా క్రిందికి ఎదగొట్టగల సమర్థుడు, వాడే తలచుకుంటే వందలకొద్దీ పర్వతాలున్న భూమండలాన్నే చిల్చిచండాడగలదు అటువంటి నా రాముడు నీ మాటను సత్యం చేయటంకోసం మారు మాట్లాడకుండా వనవాసానికి వెళ్ళాడు.*

*రాజా! పులితోక పుచ్చుకొని ఎవరైనా ఆడుకుంటారా? అట్లాగే రాముడు ఈ అవమానాన్ని సహించడు. లోకాలన్నీ కలసి మహాయుద్ధాన్ని ప్రకటించినా రాముణ్ణి భయపెట్టలేవు. ఈ ధర్మాత్ముడు లోకంలో ధర్మాన్ని స్థాపించగల సమర్థుడు, మహా పరాక్రమశాలి అయిన రాముడి బాణాలనుండి పుట్టే అగ్ని సకలభూతాలను, సప్తసముద్రాలను కూడా కాల్చివేయగలదు.*

*మహారాజా! సింహం వంటి బలశాలి అయిన రాముణ్ణి చేపలు తమ సంతానాన్ని తామే చంపినట్లు చంపేశావు. ధర్మాత్యుడైన కుమారుణ్ణి దేశంనుండి వెళ్ళగొట్టావు. ఇది శాస్త్రసమ్మతమా? బ్రహ్మవేత్తలు అనుసరించే సనాతనధర్మమేనా ఇది?*

*రాజా! స్త్రీకి భర్త మొదటి రక్షకుడు. తరువాత కుమారుడు. జ్ఞాతులు మూడవగతి అవుతారు. ఇప్పుడు నీవు జీవించి ఉన్నా లేనివాడిక్రిందే లెక్క ఇక నా పుత్రుడు అడవులపాలయ్యాడు, అన్నివిధాలా నన్ను గతిలేనిదాన్నిగా చేశావు. నీ మూలంగా ఈ దేశం నాశనమయింది. మంత్రులందరినీ చంపేశావు. చివరగా నిన్ను నీవే చంపుకున్నావు. నన్నూ నా కుమారుణ్ణి చంపేశావు, చిన్ను నమ్ముకున్న ప్రజల్ని చంపేశావు. ఇక నీ కొడుకు భరతుడు, నీ భార్య కైకేయి మాత్రమే ఈ రాజ్యాన్ని ఏలేందుకు మిగులుతారు. వాళ్ళిద్దరే ఆనందించేవాళ్ళు.*

*రేపటి శీర్షికలో...* 

🌺🌸🏵️ *దశరథుడు కౌసల్యను ఊరడించటం* 🏵️🌸🌺

*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🦚🏹🦚 🙏🕉️🙏 🦚🏹🦚

No comments:

Post a Comment