పరమాత్మ కు రూపం ఉండదు, రూపం లేని వాడికి నామం కూడా ఉండదు.
ఎందుకని?
"యదృపం తదనష్టం" అన్నారు. అంటే ఏదైతే రూపం కలిగి ఉంటుందో, అంది పుట్టి, ఉండి, పెరిగి, కృశించి నశించాల్సిందే.
మరి పరమాత్మ అజుడు (జన్మ లేని వాడు, అచ్యుతుడు(మరణం లేని వాడు) ఆయన అవ్యయుడు (తరుగులేని వాడు). అందుకని ఆయనకు రూపం లేదు, నామం లేదు.
మరి ఆయన అనుభూతి పొందడం ఎలా?
పూర్వం నిశ్శబ్దం ఉందట, దాని లోనుండి శబ్దము,(ఆకాశమ), స్పర్శ (వాయువు), రూపము (అగ్ని), రుచి (నీరు ) గంధము (భూమి) ఏర్పడ్డాయి, ఈ ఐదుటితో ప్రపంచం, యవద్ సృష్టి ఏర్పడింది.
తిరిగి ప్రళయ సమయంములో భూమి నీటిలో,
నీరు అగ్నిలో, అగ్ని వాయువులో,
వాయువు ఆకాశంలో, ఆకాశము నిశ్శబ్దంలో లీనం అవుతాయి. అవ్యయక్తం నిశ్శబ్దం, వ్యక్తం శబ్దం.
అవ్యక్తుడైన పరామాత్మ అనుభూతి పొందాలి అంటే మౌనమే మార్గము.
అందుకే "నిశ్శబ్దం పరబ్రహ్మ ఉచ్ఛతే" అన్నారు. కుదరక పోతే నిశ్శబ్దంనుంచి శబ్దం ఏర్పడింది, కాబట్టి శబ్దంగా కూడా ఆరాధించవచ్చు.
ఆ శబ్దమే "ఓం". అందుకనే "ఓం" ఇత్యేకాక్షరం బ్రహ్మ" అన్నారు.
మరి నామ రూపముల పరమాత్మకి ఎలా వచ్చాయి?
పరమాత్మ "అస్తి" అంటే "ఉన్నారు"
మరి ఉంటే ఎలా ఉన్నారు అంటే " భాతి" అంటే "ప్రకాశిస్తున్నారు" అంటారు. అందుకే
"దీపం పరబ్రహ్మ " అన్నారు.
ఆ పరమాత్మ మనకి ఇష్టమైన రూపంలో దర్శనం ఇద్దాము అనుకున్నారు అందుకని భక్తుడు ప్రియరూపం ఏర్పర్చుకొన్నాడు. అందుకని మూడవ లక్షణము "ప్రియము" ఏర్పడింది.
ఈ ప్రియము రూపముగా, రూపానికి నామము ఏర్పడ్డాయి.
ఇలా అవ్యక్త పరమాత్మ వ్యక్తం కావడానికి మూడు ఏర్పాట్లు చేసుకొన్నాము మనము, అవి ప్రియ, రూప నామాలు.
ఇంకో విషయం ఏమిటి అంటే, ఈ సర్వ సృష్టి పరమాత్మ లోనుంచి వచ్చింది. ఒక తల్లి
గర్భంలోనుంచి బిడ్డ వచ్చినట్లు. తల్లికి బిడ్డపై షరతులు లేని ప్రేమ ఉన్నట్టు ఆయనకు తన సృష్టి పై అవ్యాజామైన ప్రేమ ఉంది.
రూపంలేని పరమాత్మ ని నిశ్శబ్దంలో ఆరాధించాలి. కుదరకపోతే దీపం ద్వారా ఆరాధించాలి. కుదరక పోతే ఓంకారమును జపించాలి. సర్వ సృష్టిని ప్రేమించాలి.
ఇదే పరమాత్మ ఆరాధన. మిగిలినది అంతా మన తృప్తికోసం చేసే కర్మ కాండలు.
🌹🙏
No comments:
Post a Comment