Wednesday, August 20, 2025

 365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో

♥️ *కథ* -*131* ♥️

భగవంతుని ఉనికిని మనం నమ్ముతున్నామా? ఈ నమ్మకాన్ని బలపరచడానికి మన దగ్గర ఋజువు ఉందా?

ఈ మనోహరమైన ఉపమానం డాక్టర్ వేయిన్  డయర్ రాసిన "యువర్ సెక్రెడ్ సెల్ఫ్", ( నీ పవిత్ర అంతరంగం ) అనే పుస్తకం నుండి తీసుకోబడినది.

ఒక తల్లి కడుపులో ఉన్న ఇద్దరు బిడ్డలు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు.

ఒక బిడ్డ మరొక బిడ్డతో  :  పుట్టిన తర్వాత మన జీవితంపై నీకు నమ్మకం ఉందా?

దానికి రెండవ బిడ్డ:  తప్పకుండా, ఏం ఎందుకు కాదు! బయటకువచ్చిన  తర్వాత మన జీవితంలో అంతా కొత్తగా, భిన్నంగా ఉంటుంది. రాబోయే దాని కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికే బహుశా మనం ఇక్కడ ఉన్నామేమో.

మొదటి బిడ్డ : అదంతా చెత్త! పుట్టిన తర్వాత మనకు జీవితం ఉండదు! ఒకవేళ ఉన్నా, అది ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు?

రెండవ బిడ్డ :  కానీ ఇక్కడ ఉన్నదానికంటే ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. బహుశా మన కాళ్ళ మీద మనం నడువవచ్చేమో, మన నోటి నుండి మనమే తినవచ్చేమో. బహుశా ఇప్పుడు మనం  అర్థం చేసుకోలేని ఇతర ఇంద్రియాలు మనకు ఉండవచ్చునేమో.

మొదటి బిడ్డ :  అది అర్థంలేనిది. మన కాళ్లపై మనం నడవడం అసాధ్యం. పైగా మన నోటితో మనమే తినడమా? హాస్యాస్పదంగా ఉంది ! ఈ నాభినాడి (బొడ్డు తాడు) పోషణను, మనకు అవసరమైన ప్రతిదాన్ని అందిస్తోంది. కానీ ఇది చాలా చిన్నది, కాబట్టి బయటకివచ్చిన తర్వాత జీవించటం ఖచ్చితంగా సాధ్యం కాదు.

ఈసారి రెండవ బిడ్డ కొంచం గట్టిగా చెప్తూ :  సరే, పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందని నేను భావిస్తున్నాను. అది ఇక్కడ ఉన్నదాని కన్నా భిన్నంగా ఉంటుంది. బహుశా మనకు ఇకపై భౌతికమైన ఈ నాభినాడి అవసరం ఉండదేమో.

మొదటి బిడ్డ : నీవన్నీ వృథా మాటలు ! పైగా, అక్కడ జీవం ఉంటే, అక్కడి నుండి ఎవరూ ఎందుకు తిరిగి రాలేదు? పుట్టడం అనేది జీవితానికి అంతం, పుట్టిన తర్వాత చీకటి, నిశ్శబ్దం, మరపు స్థితి తప్ప మరేమీ లేదు. ఇది మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. 
రెండవ బిడ్డ  :  ఏమో, అదంతా నాకు తెలియదు,  కానీ ఖచ్చితంగా మనం మన అమ్మను కలుస్తాం, ఆమె మనలని జాగ్రత్తగా చూసుకుంటుంది.

మొదటి బిడ్డ : “అమ్మా?....   నీవు నిజంగా తల్లి అనే భావనను నమ్ముతున్నావా? చాలా హాస్యాస్పదంగా ఉంది. తల్లి అనేది ఉనికిలో ఉంటే, ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది?

రెండవ బిడ్డ :  ఆమె మన చుట్టూ ఉంది. మనం ఆమె చుట్టూ ఉన్నాం. మనం ఆమె యొక్క అస్తిత్వమే. ఆమెలోనే మనం జీవిస్తున్నాం. ఆమె లేకుండా ఈ ప్రపంచం లేదు, ఉండదు కూడా.

మొదటి బిడ్డ : కానీ, మనమిద్దరం ఆమెను చూడలేం, కాబట్టి ఆమె ఉనికిలో లేదని చెప్పడం ఒక తర్కం మాత్రమే అవుతుంది. ఇది ఒక అభూతకల్పన తప్ప ఇంకేమీ కాదు.

దీనికి, రెండవ బిడ్డ :  కొన్నిసార్లు, నీవు మౌనంగా,  నీ దృష్టి కేంద్రీకరించి వింటే, ఆమె ఉనికిని గ్రహించగలవు... ఆమె ప్రేమపూర్వక స్వరాన్ని కూడా వినగలవు.


"తల్లి" - "పిల్లలు" యొక్క ఈ సారూప్యత భగవంతునికి సంబంధించి మన అనుభవానికి ఖచ్చితంగా వర్తిస్తుంది. రెండు రకాల మనుషులు ఉంటారని ఈ కథ మనకు తెలుపుతుంది – 

- కళ్ళకు కనపడేదాని ప్రకారం జీవించేవారు, 

- చుట్టూఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తున్నా, దానిని మించినది ఇంకా ఏదో ఉందని నమ్మేవారు. కళ్ళతో చూడలేనప్పటికీ, వారు తమ భౌతిక భావనను శాంతపరచడం ద్వారా వారి ఆధ్యాత్మిక భావనను చైతన్యవంతం చేసుకుంటారు.

శిశువులకు కనిపించకపోయినా "తల్లి" ఉన్నట్లే, భగవంతుడు కూడా ఉన్నాడు. మనం ఆయనను చూడలేనప్పటికీ లేదా ఆయనను తాకలేకపోయినా, ఆయన అక్కడ ఉన్నాడు - మనకు జీవితాన్ని, సదుపాయాలను, అవసరమైన అన్ని వనరులను ఇస్తూ, మన పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో తెలియపరుస్తాడు.

ఆయన మన సృష్టికర్త, ఆయన వల్లనే మనం ఉనికిలో ఉన్నాం. మనం ఆయన ఘనమైన ఉనికిని అనుభూతి చెందడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన ఆధ్యాత్మిక భావనలను చైతన్యవంతం చేయడం అవసరం. 

తన తల్లి ఉనికిని గుర్తించడానికి కడుపులో ఉన్న శిశువు మౌనంగా ఉండవలసి వస్తుంది. అలాగే, మనం భగవంతుని అనుభూతి చెందాలంటే, ధ్యానంలో మౌనంగా కూర్చుని,  ఆయన ప్రేమపూర్వక స్వరాన్ని మన హృదయాలు తెరచి వినాలి.

♾️

భగవంతుడు, మీ హృదయాలలో తనని దాచుకుని, మిమ్మల్ని బహిర్గతం చేసాడు. మిమ్మల్ని మీరు దాచుకుని, భగవంతుణ్ణి బహిర్గతం చేయండి! 🌼

*లాలాజీ* *మహారాజ్*


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

HFN Story team

No comments:

Post a Comment