Saturday, April 18, 2026

సత్తు పానీయం - కండరాలకు శక్తి, బలం | 1 Glass Sattu = 12g Protein 😳 Doctors Recommend This!

సత్తు పానీయం - కండరాలకు శక్తి, బలం | 1 Glass Sattu = 12g Protein 😳 Doctors Recommend This!

Author Name:Dr Murali Manohar Chirumamilla, MD (Ayu) Official

Youtube Channel Url:https://www.youtube.com/@DrMuraliManoharChirumamilla

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OA9n4MUiUFI



Transcript:
(00:00) శక్తి కోసం టానిక్ల్ని ప్రోటీన్స్ ని రాసమని చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే ఖరీదండి ప్రోటీన్ల కంటే కూడా శక్తికి కేర్ ఆఫ్ అడ్రెస్ గా చెప్పదగినటువంటి ప్రోటీన్ ఖజానా ఒకటి ఉంది సత్తు పానీయం దీని తయారీ దీని ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సత్తు అనేది అద్భుతమైన దేశీ సూపర్ ఫుడ్ ఒక గ్లాసు పానీయంతో ఒకటి కాదు రెండు కాదు 12 గ్రాముల ప్రోటీన్ ఎలా అందుతుందో మీకు తెలుసా? వ్యాసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచేటువంటి సాధిసిద్ధమైన పానీయం ఈ సత్తు పిండి.
(00:38) ఇది ఎండ వేడి నుంచి రక్షణని ఉపశమనాన్ని ఎలా కలిగిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? శ్రామికుల శక్తి రహస్యంగా ఉన్న సత్తుపిండిని నేడు ఆ చాలా మంది రికమెండ్ చేయడానికి కారణం ఏమిటి అంటే దీంట్లో ఉండేటువంటి ఎనర్జీ గివింగ్ నేచర్. ఖరీదైన ప్రోటీన్ పౌడర్ల కంటే తక్కువ ధరలో లభించే సత్తు పిండిని మన ఆహారంలో ఎలా చేర్చుకోవాలో మీకు తెలుసా? సత్తు అనేది కేవలం ఆహారం కాదు ఇది అపారమైన శక్తిని ఇచ్చేటువంటి ఒక పోషకాల గని మన శరీరానికి అవసరమైనంటి ప్రోటీన్ పీచు పదార్థం అంటే ఫైబర్ ఇలాంటి వాటిని అందించడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది.
(01:20) ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. [సంగీతం] మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో అద్భుతమైన ఒక పానీయం గురించి తెలుసుకోబోతున్నాం. మంచి ఎనర్జీని అలాగే శక్తిని కండరాల ఆ తాలకు పునర్నిర్మాణాన్ని కలిగించేటటువంటి సత్తు పానీయం దీని ప్రత్యేకతలు ముఖ్యాంశాలు ఈ సమాచారాన్ని తెలుసుకుందాం.
(01:47) శెనగల్ని వేయించి పొడి చేసిన ఈ సత్తు అనేది ప్రోటీన్ అధికంగా ఉండేటువంటి ఆహారాలలో ఒకటిగా మంచి ది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా ఆదరణ పొందినటువంటి ఈ పానీయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచూర్యం పొందుతూ ఉంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. సత్తుపిండి తాలకు ప్రాముఖ్యత ముందు మీరు తెలుసుకోవాలి.
(02:09) సత్తు అనేది ప్రాచీన కాలం నుంచి భారతీయ ఆహార సంప్రదాయంలో అంతర్భాగంగా ఉంది. ఇది వేయించిన శెనగల్ని పొడి చేయడం ద్వారా తయారవుతుంది. ఉత్తర భారతదేశంలో దీన్ని పేదల ప్రోటీన్ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని వెనక ఉన్నటువంటి బలమైన శాస్త్రీయ కారణం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. శెనగలను వేయించడం వల్ల వాటిలో ఉండేటువంటి పోషక విలువలు అలాగే ఉంటాయి అంటే నష్టం చెందకుండా ఉంటాయి.
(02:30) ఇది శరీరానికి సులభంగా జీర్ణం అయ్యేలాగా మారుతుంది. వేయించడం వల్ల. పల్లెటూళ్లల్లో రైతులు శ్రామికులు రోజంతా కష్టపడటానికి అవసరమైన శక్తిని దీని ద్వారానే పొందుతారు. ఇది కడుపు నిండుగా ఉంచుతుంది అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా చేయగలుగుతుంది. ఈ నాణ్యమైన పిండిని మన రెగ్యులర్ గా నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం అనేది ఎంతో అవసరం.
(02:51) ప్రోటీన్ ఖజానా ఈ సత్తు అని చెప్పొచ్చు ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది చాలా ముఖ్యమైన భాగం. ఒక గ్లాసు ఒక సత్తు పానీయం తాగారనుకోండి. దాదాపు 12 gల ప్రోటీన్ మీకు లభిస్తుంది. ఇది ఆ ఖండాల నిర్మాణానికి ఎంతో తోడ్పడుతుంది. నేటి కాలంలో చాలా మంది ఖరీదైన జిమ్ ప్రోటీన్ పౌడర్ల మీద ఆధారపడుతున్నారు.
(03:11) కానీ సహజంగా లభించేటువంటి ఈ సత్తు పిండి ఆ వాటికంటే కూడా మెరుగ్గా పనిచేస్తుంది. దీంట్లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇది స్వచ్ఛమైనటువంటి శాఖహార ప్రోటీన్ మూలం. ముఖ్యంగా శాఖహారులకి ప్రోటీన్ లోపం రాకుండా ఉండటానికి ఇది ఒక వరం. రోజూ ఒక గ్లాసు సత్తు నీరు లేదా ఈ సత్తు తాగితే దీనికి శరీరానికి అవసరమైన అమినో ఆసిడ్స్ అందుతాయి.
(03:32) ఇది శరీరపు కణజాలాల మరమొత్తు కూడా సహాయపడుతుంది. సహజ సిద్ధమైన శీతలీకరణి ఈ సత్తు అని చెప్పొచ్చు. భారతదేశం లాంటి ఉష్ణమండల దేశాలలో వేసవి వేడి అనేది ఒక పెద్ద సమస్య. సత్తు అనేది అద్భుతమైన శీతలీకరణిగా ఒక కూలెంట్ కింద పనిచేస్తుంది. ఇది శరీరపు ఉష్ణోగ్రత ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఎండలో బయట తిరిగేటటువంటి వాళ్ళకి ఇది ఒక రక్షణ కవచం.
(03:52) కోలాలు ఇతర కృత్రిమ పాయాల కంటే సత్తు నీరు అనేది ఎంతో శ్రేయస్కరం. ఇది శరీరంలో ఉండేటువంటి విషుల్యాన్ని బయటకి పంపించేయగలుగుతుంది. జీర్ణ వ్యవస్థను చల్లబరుస్తుంది. కడుపులో మంట అలాగే ఎసిడిటీ ఇలాంటి సమస్యలను నివారించగలుగుతుంది. దీని వల్ల వడ దెబ్బ తగిలే ప్రమాదం తగ్గుతుంది. ఎండ నుంచి ఇంటికి రాగానే ఒక గ్లాసు సత్తు పానీయం తాగటం వల్ల తక్షణమే రీహైడ్రేషన్ అనేది జరుగుతుంది.
(04:15) జీర్ణక్రియ మెరుగుదల కూడా ఈ సత్తు పానీయంతో మీకు ఇంప్రూవ్ కనిపిస్తుంది. సత్తుపిండిలో పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మలబద్దకం అంటే కాన్స్టిపేషన్ సమస్యతోటి బాధపడే వాళ్ళకి ఇది ఒక గొప్ప ఔషదం లోపల పేగుల్ని శుభ్రపరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సత్తులో ఉండే ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించగలుగుతుంది.
(04:34) దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీన్ని గ్యాస్ సమస్యలు లాంటివి ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు గ్యాస్ సమస్యలు తలెత్తకుండా జీర్ణాశయాన్ని కాపాడుతుంది. ప్రతిరోజు ఉదయం సత్తుపానీయాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కోసం మెటబాలిజామ్ కి మంచి స్ట్రెంత్ వస్తుంది. అంటే మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది.
(04:52) ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచగలుగుతుంది. మధుమేహం నియంత్రణ కూడా సత్తుతో సాధ్యమవుతుంది. సత్తుపిండి అనేది తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండేటటువంటి ఆహారం. దీని అర్ధం ఇది రక్తంలో చక్ర స్థాయిని వేగంగా పెంచకుండా ఉంటుంది. దీనివల్ల మధుమేహం అంటే డయాబెటిస్ ఉన్నవాళ్ళకి ఇది ఒక సురక్షితమైన ఆహారం కింద పనిచేస్తుంది. చక్రవ్యాధి తోటి బాధపడే వాళ్ళు తీపి పానీయాలకు బదులుగా ఉప్పు కాస్త ఉప్పు కలిపినటువంటి సత్తు నీరు తాగవచ్చు.
(05:18) ఇది రక్తపోటు నియంత్రణలో కూడా ఉంచుతుంది. కాబట్టి రక్తపోటు ఉన్నప్పుడు ఉప్పు కాకుండా కాస్త నిమ్మరసం కలుపుకోవాలి. దీంట్లో ఉండేటువంటి మెగ్నీషియం, ఐరన్ ఇలాంటి ఖనిజ లవణాలు రక్తహీనత రాకుండా చూస్తాయి. రక్త ప్రశ్నని క్రమబద్ధీకరిస్తాయి. ఇది ఇన్సులిన్ తత్వాన్ని పెంచుతుంది. రక్తంలో ఉండేటువంటి చక్కర నిలవలని సమతుల్యం చేస్తుంది. బరువు తగ్గటానికి సత్తు అనేది మీకు సహకరిస్తుంది.
(05:38) అధిక బరువుతో బాధపడే వాళ్ళకి సత్తు అనేది సరైన ఎంపిక. దీన్ని తాగటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆ మీకు అనవసరమైన చిరును తినాలన్న కోరిక అంటే బింజి ఈటింగ్ అనేది తగ్గుతుంది. తక్కువ క్యాలరీలతో ఎక్కువ శక్తిని దీనితో పొందొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఉదయంపూట అల్పాహారంగా దీన్ని తీసుకోవచ్చు. ఇది శరీరంలో ఉండేటువంటి కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుంది.
(05:58) సత్తుపానీయం తాగడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి నీరు పుష్కాలకు కూడా అందుతాయి. ఇది నీరసం రాకుండా చూస్తుంది. వ్యాయామం చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్రీ వర్కవుట్ డ్రింక్ ఇది కండాలకు తక్షణమే శక్తిని ఇస్తుంది. సరే మరి ఈ సత్తు పానీయం తయారు చేసే విధానం ఏమిటి ఇది తెలుసుకోవాలి. సత్తును తీసుకోవడం అనేది లేదా తయారు చేసుకోవడం అనేది చాలా సులభం.
(06:18) ఒక గ్లాసు నీళ్ళకి రెండు చెంచాల సత్తు పిండి కలపాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం కాస్త ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి కలిపితే ఈ సత్తు పానీయం అనేసి సిద్ధమవుతుంది. తీపి ఇష్టపడే వాళ్ళు బెల్లం పొడి కలుపుకోవచ్చు. బెల్లం వల్ల ఐరన్ కూడా అందుతుంది. దీన్ని కేవలం పానీయంగానే కాకుండా చపాతీలు పరాటాల్లో కూడా దీన్ని స్టఫింగ్ గా కూడా వాడుకోవచ్చు.
(06:38) లడ్డూల రూపంలో కూడా దీన్ని తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చు. సత్తు పిండితోటి చేసేటువంటి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పాతకాలపు ఈ ఆహారాన్ని ఆధునిక జీవనశైలికి తగ్గట్టుగా మార్చుకోవడం మంచిది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. సత్తుపిండి అనేది తక్కువ ఖర్చుతో కూడినటువంటి అధిక ప్రోటీన్ కలిగినటువంటి సాంప్రదాయపు భారతీయ సూపర్ ఫుడ్.
(06:58) ఇది జీర్ణక్రియని మెరుగుపరచడంతో పాటు శరీరానికి తక్షణమే శక్తిని చల్లదనాన్ని ఇస్తుంది. మన దేశీయ ఆహారపు అలవాట్ల పైన నమ్మకం ఉంచి కృత్రిమ ఆహారాలను వదిలి ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి సత్తుని ఎంచుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన రేపటి కోసం సత్తుని మన దైనందన జీవితంలో భాగం చేసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(07:19) అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సరవవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష మన ఆకాంక్షలు నెరవేరుతాయి.
(07:37) శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శత వసంతాన్ 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment