Tuesday, May 12, 2026

How to see life - by Jiddu Krishnamurti/ Motivational video in Telugu

How to see life - by Jiddu Krishnamurti/ Motivational video in Telugu

Author Name:Satya Shodhan

Youtube Channel Url:https://www.youtube.com/@Satyashodhan

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZCcYn98slZk



Transcript:
(00:17) భయం భయం అనే మాటలోనే భయం ఉంది. మనలో భయం అనే భారం బాహ్యంగానే కాదు అంతర్గతంగా కూడా మనం మోస్తూ ఉంటాం. ఉద్యోగం పోతుందేమో తినడానికి తగినంత ఆహారం ఉండదేమో ఇప్పుడు మనం ఉన్న స్థితిలో నుండి కిందకు పడిపోతామేమో మన పై అధికారి మనపై అసహ్యంగా ప్రవర్తిస్తాడేమో అనేవి బాహ్యంగా ఉండే భయాలు అంతర్గతంగా కూడా ఎన్నో భయాలు జీవితంలో మనం ఏమి సాధించలేదనే భయం చనిపోవడం అంటే భయం ఒంటరితనం అంటే భయం ఇతరుల ప్రేమను పొందలేనేమో అనే భయం గతంలో చేసిన తప్పులు బయట పడతాయనేమో భయం ఇటువంటివి
(01:01) ఈ భయమే మనల్ని లోపలికి లోతుగా తెరిచి చూసుకోకుండా ఆపుతుంది. కాబట్టి మన ప్రధాన సమస్య ఏమిటంటే భయం అనే బీతి నుండి ఎలా బయటపడాలి భయం ఏం చేస్తుందో మీకు తెలుసా అది మన మనసును చీకటితో నింపేస్తుంది. మనసును మందకుండిగా తయారు చేస్తుంది. భయంలో నుండే హింస బయలుదేరుతుంది. భయంలో నుండే మనకు బొత్తిగా ఏమీ తెలియని దానిని మనోకాల్పనిక రూపాన్ని పూజించడం కూడా ఆరంభం అవుతుంది.
(01:34) మనలో చాలామందికి మనం భయపడుతున్నామ అనే ఎరుకే ఉండదు. దేని గురించి భయపడుతున్నామ అనేది కూడా మనకు తెలియదు. ఒకవేళ తెలిసినా ఇక ఆ తర్వాత ఏం చేయాలనేది తెలియక దాని నుండి పారిపోతూ ఉంటాం. మీకు అర్థంవుతున్నదా నిజంగా మనం ఏమిటో దాని నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాం. అదే భయం మీరు మీ భయాలతో ఒక రోజుని గడిపినట్లుగా మీ జీవితాన్ని గడిపేస్తారు.
(02:02) ఇంకా జీవితంలో చాలా రోజులు ఉన్నాయి కనుక ఈరోజు ఎలా ఉన్నా పర్వాలేదులే అనే వలలో పడిపోతారు. అలా ఊరికే బతికేయడానికి నిజంగా జీవించడానికి చాలా వ్యత్యాసం ఉంది. సరే ఈ భయాన్ని కలిగించేది ఏది? భయం ఎప్పుడు మరొక దాని కారణంగానే ఉలుకులోకి [సంగీతం] వస్తుంది. మరి ఈ భయాన్ని తీసుకొచ్చే ఆ మరొకటి ఏది అదే కాలంతో ముడిపడిన అంచన కదు అంటే జరిగిపోయినది మరియు జరగబోయేది అంటే గతం మరియు భవిష్యత్తు భవిష్యత్తులో మా ఆర్థిక పరిస్థితి గురించి నా కుటుంబం గురించి నా ఉద్యోగం నా ఆరోగ్యం అంటూ ఆలోచించడం వలనే నేను భయపడతాను.
(02:48) కాబట్టి ఆలోచనే భయానికి జన్మనిచ్చి పెంచి పోషిస్తుంది. మరి మనలో ఆలోచనే సుఖాన్ని కూడా సృష్టిస్తున్నది. ఎలా అంటే మీరు ఒకప్పటి బాధను గుర్తు తెచ్చుకున్నట్లే మీరు మీ సుఖాల్ని [సంగీతం] గుర్తు తెచ్చుకుంటారు. ఆ సుఖం ఇంకా కొనసాగితే బాగుండననే ఆలోచిస్తారు. కనుక ఈ ఒత్తిడి లోలోన జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సమస్య చాలా పెద్దది.
(03:19) దాని నుండి దూరంగా పారిపోవడం ద్వారా మీరు సమస్యను పరిష్కరించుకోలేరు. ఇప్పుడు ప్రపంచాన్ని మీకు మీరుగా ఎదుర్కోవాలి. ఇక మీదట ఒంటరిగా నిష్క్రియగా కూర్చోవడానికి వీలు లేదు. కనుక ఇక్కడ ప్రశ్న ఏమిటంటే సుఖం గురించి గాని బాధ గురించి కానీ ఆలోచించకుండా ఉండటం సాధ్యమేనా ఆలోచన యొక్క అవసరం లేనప్పుడు కాకుండా ఆలోచన అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించడం సాధ్యమేనా ఆలోచన మనకు చాలా ముఖ్యమైనది.
(03:54) మనకు ఉన్న ఒకే ఒక్క పనిముట్టు అదే స్మృతి ప్రతిస్పందించడమే ఆలోచన స్మృతి అంటే అనుభవం ద్వారా జ్ఞానం ద్వారా సంప్రదాయం ద్వారా పోగు చేసుకున్న విషయ సమాచారం స్మృతికి కారణమైనది కాలం ఆలోచన యొక్క పనుల్లో ముఖ్యమైనది నిరంతరం ఏదో ఒక వ్యాపకంతో ఉండటం ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ ఉండటం మరి ఈ జిత్తులు మారు మనసును దాని ఆలోచనలను అదుపు చేయుటకు మీరు ఒక పద్ధతిని గాని ఒక విధానాన్ని గాని అనుసరిస్తున్నప్పుడు నిజంగా మీరు చేస్తున్నది ఏమిటి? ఒక విధమైన పద్ధతిని లేదా విధానాన్ని మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా యాంత్రికంగా కొన్ని
(04:38) అలవాట్లను అలవర్చుకుంటున్నారు. దీనివల్ల మనసు మందకొండిగా తయారవుతుంది. దీనివల్ల మనసు యొక్క చురుకుదనం కోల్పోతుంది. సున్నితమైన అమాయకపు మనసులోనే ప్రేమ ఆనందం వికసిస్తాయి. అందుకు మీరు చేయవలసిందల్లా మీ పూర్తి ఎరుకను శ్రద్ధను మీ మనసుపై పెట్టి ఒక ప్రేక్షకునిలా మీ ఆలోచనలను మీ భయాలను నమ్మకాలను అన్నింటిని చూడాలి. మీ అంతట మీరే పరిశీలించుకోవాలి.
(05:11) ఇలా చూస్తున్నప్పుడు ఇది మంచి ఇది చెడు అని వేరు చేయొద్దు. ఈ పరిశీలనే మీలో ఒక అవగాహన తీసుకొస్తుంది. ఈ అవగాహనే మీ భయాలకు అవతల ఉన్న స్వేచ్ఛ అనే తలుపులు తెరుస్తుంది. ఇలా మీరు మీ సమస్త భయాల నుండి బయట పడ్డాకే మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఈ ప్రపంచంలో మహాత్ములు అనిపించుకున్న వారందరికీ ఉన్న గొప్ప సుగుణం ఒకటే వాళ్ళకు వాళ్ళు ఏమిటో తెలుసు కావున గుర్తుంచుకోండి.
(05:48) నిజంగా మనం ఏమిటో దాని నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాం. అదే భయం మనసు మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ మనసు ఏంటి? దాని మర్మం ఏంటి? మనిషి భావోద్వేగాలకు సుఖ దుఃఖాలకు కారణమై మనిషినే శాసించే ఈ మనసు గురించి ఎప్పుడైనా ఆలోచించారా కొన్ని శతాబ్దాల పాటు మనిషి మనసు నుండి మనో ఆలోచనల నుండి బయటపడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
(06:32) పుస్తకం, పూజ, ప్రార్థన, గురువు, జ్ఞానం, ధ్యానం, కర్మ, భక్తి, సిద్ధాంతం, ఆస్తికత్వం, నాస్తికత్వం అంటూ అనేక మార్గాలను అనుసరిస్తున్నాడు. వాటిని అవలంబిస్తున్నాడు కూడా ఆలోచించండి. అయినా మనిషి తన మనసును ఎందుకు జయించ లేకపోతున్నాడు? మనిషి తన మనసు చేతిలో ఎందుకు బానిస అయిపోతున్నాడు? సరే ముందుగా మనసు అంటే ఏమిటో చూద్దాం మీ మనసు అంటే మీ ఆలోచనలే మీ మనసు యొక్క పనుల్లో ముఖ్యమైనది ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండడం మీరు నిరంతరం ఏదో ఒక వ్యాపకంతో ఉండడం వలనే మీ
(07:19) ఆలోచనలు అనే ముసుగులో మీరు కొట్టుకుపోతున్నారు. మనసు అనేది రాత్రింబగళ్లుు ఆగకుండా పని చేసే ఒక యంత్రం వంటిది చెప్పాలంటే అది మీకు ఒక గొప్ప సేవకురాలు కానీ ఒక ప్రమాదకరమైన యజమాని కూడా మీ కోరికల గురించి మీరు పదే పదే ఆలోచించడం వలనే దానికి జీవం పోస్తూ ఉంటారు మీ కోరికల కదలికలను అవగాహన చేసుకోవాలే తప్ప వాటిని దూరంగా నెట్టివేయడమో అనగ ద్రొక్కడమో చెయకూడదు.
(07:54) ఎందుకంటే మనలో విభజన వ్యతిరేకత ఉన్నంతకాలం విచారం దుఃఖం అనేవి మనల్ని వదిలి వెళ్ళవు. కోరికల తీరుతెనుల్ని అవగాహన చేసుకోకుండా కేవలం ఆలోచనలని అదుపు చేయడం వల్ల ఏ మాత్రం లాభం లేదు. దీనికి గాను మీరు ఏం చేస్తారు? మీ మనసును ఒక పద్ధతి ద్వారా ఒక విధానం ద్వారా నిగ్రహించాలి, నియంత్రించాలి అనుకుంటారు. అంతేగాని దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఏనాడూ చేయరు.
(08:30) మీరు సంవత్సరాల తరబడి నిద్రపోయారు. ఎందుకు ఈరోజు మీరు మేలుకోకూడదు. ఆలోచనలతో మనోభావాలతో దగ్గరగా ముడి వేసుకొని పోయి జీవించడం అనే ప్రమాదం ఎప్పుడూ ఉంది. మన ఆలోచనల మనో భావాలను గురించిన స్పృహ మనకు ఉండాలి. మనం లోలోపల లోతుల్లోకి వెళ్లి ఏం జరుగుతున్నదో ఏనాడూ కనిపెట్టలేదు. ఉపరితలం మీదే బ్రతుకుతూ వచ్చాం. మీరు చాలా ప్రమాదకరమైన కొండ అంచు మీద ఉన్నారు అనుకోండి లేదా ఒక పులి మీ ఎదురుగా వచ్చి కూర్చున్నది అనుకోండి.
(09:06) అప్పుడు మీరు ఎలా స్పందిస్తారు అప్పుడు మీ చర్య పాక్షికంగా ఉండదు. సంపూర్ణమైన చర్య ఉంటుంది. మీ జీవితంలో అటువంటి ప్రమాదకరమైన విపత్తులు ఆలోచనల రూపంలో నిరంతరం వస్తూనే ఉన్నాయి. మీరు వాటికి అలవాటు పడిపోయారు లేదు అంటే చూసి చూడనట్లు ఉపేక్షిస్తున్నారు. మేధావులు అనిపించుకునే వారు మీతో అంటారు మీ ఆలోచనకు పదును పెట్టండి. ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు సాగండి అని అసలు ఆలోచన అనేదే ఒక పెద్ద సమస్య అది మనల్ని సమస్యల నుండి ఎలా బయటపడవేస్తుంది మీలో ఉన్న కోరిక, భయం కోపం, హింస, ఈర్ష, అసూయ, అహం మొదలైన గుణాలకు కారణం మీ
(09:54) ఆలోచనలే మనిషిని దిగజార్చే ఈ గుణాలే మీలో ఆలోచనల రూపంలో ఉన్నాయి. ఈ ప్రపంచంలో మీ ఆలోచనల కంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి ఏవి లేవు అనే విషయం మీకు తెలుసా మీరు అనుకునే పరిమితులన్నీ మీరు స్వయంగా విధించుకున్నవి మీ ఆలోచనలే కోరికల రూపంలో మీ మనసే అహంగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని బంధిస్తున్నవి మరి ఈ ఆలోచనలకు ఆసరాగా నిలుస్తుంది ఏమిటి అది మీకు తెలిసిన జ్ఞానమే కాదు మీకు తెలిసి తెలిసిన దానితో మీకు తెలియని దానిని తెలుసుకోగలరా తెలుసుకోలేరు మీకు తెలిసిన జ్ఞానమే మిమ్మల్ని
(10:38) అడ్డుకుంటుంది. అది మీలో నమ్మకాల రూపంలో భయాల రూపంలో ఉంటూ ప్రశ్నిస్తుంది. పోల్చి చూస్తుంది ఇది సరి అయినది ఇది సరికాదు అని విభజిస్తుంది అటువంటప్పుడు మీరు ఒక విషయాన్ని సంపూర్ణంగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేరు. కాబట్టి ఒక విషయం గురించి మీరు అన్వేషించేటప్పుడు దాని గురించి మీకు తెలిసిందంతా పక్కన పెట్టాలి అది మీకు ఒకరు చెప్పింది కావచ్చు మీరు చదివింది కావచ్చు మనసు పాత దాని నుంచి విముక్తి పొందినప్పుడు మాత్రమే అది ప్రతి దానికి కొత్త దనాన్ని ఇస్తుంది మరియు దానిలోనే ఆనందం ఉంటుంది. స్పష్టంగా చూడాలంటే మనసు
(11:25) ఖాళీగా ఉండాలి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం అనేది ఇతరుల నుండి నేర్చుకోలేరు. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోకుండా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేరు. మీ మనసునే పుస్తకం మీ దగ్గర ఉండగా మీకు ఇతర పుస్తకాలు చదవావల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీ మనసును గనుక మీరు చదివితే ప్రతీక్షణం మీరు సంపూర్ణంగా ఆనందంగా జీవించగలరు. మీరు ఆనందాన్ని బయట వెతుకుతున్నారు.
(11:57) కానీ ఒక అద్భుతమైన ప్రపంచం మీలోనే ఉంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. నిజానికి మీరు ఆలయాలలో, చర్చులలో, మసీదులలో, ఆరామాలలో వెతికే దైవత్వం, పవిత్రత అనేవి మీలోనే ఉన్నాయి. కనుక ముందు మీ మనస్సు, ఆలోచనలు, సృష్టించే ప్రమాదాన్ని అవగాహన చేసుకోవాలి. నిజానికి మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే మీ ప్రవర్తనని మీ మాటలను మీ రోజువారి సంబంధాలలో మీరు ఏం చేస్తుంటారో దానిని గమనిస్తూ ఉండటం కేవలం గమనిస్తూ ఉండండి ఇది తప్పు ఇది ఒప్పు అని ఇది మంచి ఇది చెడు అని నిరసించడం గాని ఆమోదించడం గాని
(12:42) చేయవద్దు వాటికి బానిసలు కావద్దు వాటి నుండి పారిపోవద్దు ప్రయత్నించి చూడండి. మీ మనసును తెరిచిన కిటికీ వలె ఉంచండి. ఏ విధంగా చల్లని గాలి కిటికీ గుండా లోపలికి వచ్చి బయటకు పోతుందో అలాగే మీ ఆలోచనలను స్వేచ్ఛగా లోపలికి వచ్చి బయటకు పోనివ్వండి. ఈ మధ్యలో అవి ఎలా వస్తున్నాయి ఎలా వెళ్తున్నాయి అని మాత్రం చూడండి. ఒక ఆలోచన మిమ్మల్ని వంద సార్లు ఇబ్బంది పెట్టిన నిశశబ్దంగా దానిని చూస్తూ ఉండండి.
(13:18) ఇప్పుడు అది ఏం చేయాలనుకుంటుందో గమనించండి. అంతర్ముఖులై ఉండడానికి నిరంతరం మనం మనతో సంబంధాన్ని కలిగి ఉండాలి. మనపై మన శ్రద్ధను పెట్టాలి. మీరు రోజుకు ఒకసారైనా మీతో మీరు మాట్లాడండి. లేకపోతే మీరు ఈ ప్రపంచంలో ఒక మహా మేధావిని కలవని వారు అవుతారు. ఏకాంతంగా ఉండటం చాలా అందంగా ఉంటుంది. ఏకాంతంగా ఉండటం అంటే ఒంటరిగా ఉండటం కాదు.
(13:47) ఒంటరితనం అంటే శారీరకంగా ఇతరుల నుండి వేరుగా ఉండడం ఏకాంతం అంటే మనసులో నిశశబ్దాన్ని కలిగి ఉండడం దీని అర్థం మనసు సమాజం చే ప్రభావితం చేయబడలేదు మరియు కలుస్తం కాదు అపరమితమైన వాటిని అర్థం చేసుకోవడానికి మనసు అసాధారణంగా నిశ్శబ్దంగా ఉండాలి. మీరు కనుక మీ ఆలోచన యొక్క కదలికలు అన్నింటిని దాని నిబద్ధీకరణాన్ని దాని వ్యాపకాలను దాని భయాలను దాని సౌఖ్యాలను శోషించడం పరిశీలించడం వినడం గనుక చేస్తే అప్పుడు మీ మనసు అపూర్వమైన రీతిలో నిశశబ్దంగా మారడం మీరు గమనిస్తారు. ఏది ఏమైనా మీరు ఈ
(14:34) ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటే ముందు అది మీతోనే ప్రారంభించాలి. విద్య గందరగోళంగా ఉన్న ఈ ప్రపంచాన్ని ఎదుర్కొని నిలబడాలంటే మా పిల్లలకి ఎటువంటి విద్యా విధానం ఉండాలి? మా పిల్లలను ఉన్నతులుగా తయారు చేయాలంటే మేము ఏం చేయాలి? అనే ప్రశ్నలు ప్రతి తల్లిదండ్రులకు తలెత్తుతాయి. అయితే ఇక్కడ సమస్య పిల్లలకి ఎటువంటి విద్య ఉండాలని కాదు అసలు అధ్యాపకుడికి తల్లిదండ్రులకే ముందు చదువు నేర్పించాలి.
(15:22) దయచేసి ఈ విషయాన్ని హాస్యంగా తీసుకోకండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కల్లా కపటాలు ఎరుగని పిల్లలు చల్లని వారు కరుణామయులు అసూయా ద్వేషాలు అంటని వారు స్వార్థం లేకుండట వాళ్ళ ప్రత్యేకత దేనినైనా అవసరం మేరకే గ్రహిస్తారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వాళ్ళ నైజం తత్వం కాదు. కుతూహలం వాళ్ళ విద్య వాళ్ళ మనస్తత్వం ఆకర్షణీయం.
(15:53) వాళ్ళ అంతరంగం కడిగిన ముత్యం మరి అటువంటి మీ పిల్లలు ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మీరే నిర్ణయిస్తారు. మీరు పెట్టుకున్న ఆశయాలను వారి ద్వారా సాధించాలని వారిపై వాటిని రుద్దుతారు. మీ స్నేహితుల పిల్లలను చూస్తారు. వారిలాగే మీ పిల్లలు ఉండాలని ఆశించి మీరు అనుకునే ఒక విధమైన క్రమశిక్షణను కట్టుబడి ఉండడాన్ని బలవంతంగా వారి మనసును ఒకే విషయంపై నిలపడాన్ని వారికి నేర్పుతారు.
(16:28) రోజు చేసినదే చేయడం అనే కృత్యం ద్వారా వారి జీవితాన్ని యాంత్రికంగా మార్చివేస్తారు. కనుకనే పిల్లలు చదువులకు విసుగు చెందుతున్నారు. విద్య అంటే అర్థం ఏమిటి? చదవడము రాయడము నేర్చుకోవడమేనా మీ పిల్లలను పాఠశాలలకు పంపుతారు. వారి వారి జీవనోపాధికి అవసరమైన ఒక విద్య కౌశలాన్ని నేర్చుకుంటారు. ఇక ఆ తరువాత వారిని సమాజం పైకి వదులుతారు.
(17:00) వారు కేవలం జానడు పొట్ట కొరకై ఉద్యోగం చేయటానికి సంసిద్ధులు అవుతారు. ఈ విధంగా వారు వారి జీవితాలను వారి పనులకు ముడి వేసుకుంటున్నారు. సరైన శిక్షణ ఇవ్వకుండా ఒక సైనికుని యుద్ధానికి పంపడం ఎంత ప్రమాదమో అలాగే సక్రమమైన క్రమశిక్షణ లేని ఒక మనసు తెచ్చే ప్రమాదం అంతకన్నా ఎక్కువ అయితే దీనికి పరిష్కారం ఏమిటి మనిషికి బాహ్యంగా మాత్రమే విద్య నేర్పించి అంతర్కేంద్రాన్ని వదిలేస్తే ఎలా అనగా మనం సాంకేతికంగా ఎంతో ఎదిగాం కానీ మానసికంగా ఆదిమ [సంగీతం] స్థితిలో సంఘర్షణలతో నమ్మకాలతో దేవుళ్లతో బేదాభిప్రాయాలతో
(17:45) ఉండిపోయాం. కనుక మీ పిల్లల చదువులు వారిని రోడ్లపై నించో పెట్టకూడదు అనుకుంటే వారికి స్వేచ్ఛ ఇవ్వండి. అనగా పిల్లలను ఇష్టానుసారంగా వదిలివేయమని కాదు స్వేచ్ఛగా ఉండడం అంటే ఏమిటో మీరు అర్థం చేసుకున్నారు. కావున మీ పిల్లలు సంపూర్ణమైన స్వేచ్ఛలో ఎదగడానికి మీరు తోడపడగలరా ఎందుకంటే స్వేచ్ఛలో మాత్రమే సృజనాత్మకంగా ఆలోచించగలం.
(18:18) అయితే లోపల స్వేచ్ఛతో ఉండటానికి చాలా గొప్ప శ్రద్ధ వివేకం అవసరం. కానీ దాని ప్రాముఖ్యతను ఎవ్వరూ గ్రహించరు. మన అక్కరంతా బాహ్యాన్ని గురించే తప్ప పిల్లలు సృజనాత్మకంగా తెలివైన వారిగా తయారు కావాలంటే ముందుగా వారికి పోటీ లేని పోలిక లేని విద్యా విధానాన్ని పరిచయం చేయాలి. వ్యక్తి వికాసం అభ్యుదయం సమాజ శ్రేయస్సు సరళ జీవనం వంటివి విద్యతో పాటే నేర్పించాలి.
(18:52) అనగా పాఠశాలలు మానవతా వికాస కేంద్రాలు కావాలి. స్వార్థానికి ఘర్షణలకు తావులేని మనస్తత్వం గల విద్యార్థులను విద్యావేత్తలు తయారు చేయాలి. నిజానికి నేర్చుకోవడం వేరు జ్ఞానం పొందడం వేరు నేర్చుకోవడం అంటే తెలివి లేక వివేకం జ్ఞానం పొందడం అంటే విషయ సేకరణ జ్ఞానం సమస్యలను తీర్చలేదు అని గ్రహించడమే తెలివి కనుక గుర్తుంచుకోండి ఏం ఆలోచించాలో కాక ఎలా ఆలోచించాలో నేర్పడమే నిజమైన విద్య ప్రేమ
(19:39) మీరు ప్రేమను ఎప్పుడైనా స్పృశించారా? ప్రేమకు నిజమైన అర్థం ఏమిటి? అసలు ప్రేమ అంటే ఏమిటి? ఈ మాటకు ఎన్ని విపరీతార్థాలు ఉన్నాయి పూర్తిగా [సంగీతం] భ్రష్టం అయిపోయింది ఈ మాట. నిజానికి అందరూ ప్రేమ గురించే మాట్లాడతారు. వార్తా పత్రికలు పవిత్ర గ్రంథాలు మత ప్రవక్తలు అంతు లేకుండా ప్రేమను గురించే భాషిస్తారు. ముందుగా మనం ఏవి ప్రేమ కాదో చూద్దాం.
(20:12) నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. నా నాయకుడిని ప్రేమిస్తున్నాను నా భార్యను ప్రేమిస్తున్నాను భగవంతుని ప్రేమిస్తున్నాను ఏదో పుస్తకాన్ని ప్రేమిస్తున్నాను అని మీరు అంటారు. ప్రేమ అనేది ఒక భావన. అలా అయితే దానిని పెంచుకోవచ్చు అలవరుచుకోవచ్చు. ప్రభుత్వం అంటుంది వెళ్ళు నీ దేశం కోసం వెళ్ళు వాళ్ళను చంపిరా అదేనా ప్రేమ అంటే నిజానికి ప్రేమ అనేది హింసను కోరుకుంటుందా మతం అంటుంది నీవు కోరికలు కలిగి ఉండకూడదు.
(20:47) లైంగిక పరమైన సంబంధాలు కలిగి ఉండకూడదు. అందమైన స్త్రీని చూడకూడదని ఒకవేళ చూసినా నీ సోదరిగానో లేదా తల్లిగానో భావించాలని ఈ సమయంలో జరిగేది ఏమిటి? మనం బయటకు భక్తిని ప్రదర్శిస్తాం. కానీ మన లోపల కోరికలనే ఆలోచనల జ్వాలలు రగులుతూనే ఉంటాయి. ఇదే మనం పాటిస్తున్న మతపరమైన ప్రేమ. భగవంతుని పట్ల ప్రేమ. తన మతాన్ని ప్రేమించేవారు ఇతరుల మతాలను వేరు దృష్టితో [సంగీతం] చూస్తారు.
(21:19) ఇక్కడే ద్వంద్వ భావన ఏర్పడింది. ప్రాచీన కాలం నుంచి మత విద్వేషాలకు కలహాలకు ఈ మత దృష్టి ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. కనుక ఘర్షణలు సృష్టించే ప్రేమ ప్రేమే కాదు. భగవంతుడిని ప్రేమిస్తున్నాను అంటే ఏమిటి అర్థం నిజానికి భగవంతుడిని మీరు చూడలేదు కావున భగవంతుడు అంటే ఇలా ఉంటాడు అతని గుణగణాలు ఇలా ఉంటాయని మీరు ముందే ఒక అభిప్రాయానికి వస్తారు.
(21:49) మీ ఆలోచన మరియు ఊహాసక్తితో ఒక రూపాన్ని ఏర్పరచుకుంటారు. అంటే మీరే నిర్మించుకున్న ఒక సుదీర్ఘ రూపాన్ని మీరు ప్రేమిస్తున్నారు అన్నమాట. అందుచేత భగవంతుని ప్రేమిస్తున్నాను అనడం అర్థరహితమైన మాట. ఇక మీకు మీ భార్య అంటే ప్రేమను చెబుతారు. ఆ ప్రేమలో లైంగిక సుఖం ఇవిడి ఉన్నది. ఇల్లు చూచుకొనుటకు ఇంట్లో పిల్లల పెంపకానికి వంట చేయడానికి మీ తాత్కాలిక సుఖాల కొరకు ఓ మనిషి కావాలి.
(22:21) ఆమె మీద మీరు ఆధారపడతారు మీ మీద ఆమె ఆధారపడుతుంది. మీ ఇరువురి మధ్య ఉన్న అనురాగం భద్రతా భావం ఆధారపడటం వ్యామోహం దీనిని ప్రేమ అనవచ్చా ఇది కూడా మొదట్లోనే మీ భార్యతో ఉంటుంది. క్రమేన ఆ ఇష్టం మరొకరి పైకి పోతుంది. ఇలా మార్పు చెందే ఇష్టాన్నే మీరు ప్రేమను పిలుస్తారు. అవునా ఈ అనురాగం కోరిక ఇష్టం మోహం వంటివి ప్రేమను అవగాహన చేసుకోకుండా అడ్డుకుంటాయి.
(22:53) ఎందుకంటే మీరు ఇవి కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తి నుంచి ఆశించిన ప్రతిస్పందన ఆ వ్యక్తి నుంచి మీకు లభించలేనప్పుడు ఇవే మిమ్మల్ని క్రూరంగా తయారు చేస్తాయి. కనుక ఇవేవి ప్రేమ కాకపోవచ్చు. మీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఆకర్షణ పోనీ ప్రేమ అంటే అనుబంధమా ఒక వ్యక్తితో అనుబంధం మీ ఆస్తితో అనుబంధం మీ నమ్మకాలతో అనుబంధం మీ దేవునితో అనుబంధం మీ సిద్ధాంతాలతో అనుబంధం ఇదే నా ప్రేమ అంటే ఎక్కడ అనుబంధం ఉంటుందో అక్కడ దుఃఖం [సంగీతం] భయం అసూయ ఆందోళన ఉంటాయి.
(23:33) కాబట్టి ఇది ప్రేమ కాదు ఆనందం కూడా ప్రేమ కాదు కారణం ఆనందానికి కొనసాగింపు కావాలి [సంగీతం] ఇంకా ఉంటే బాగును అనే కోరిక అందులో అంతర్లీనంగా దాగి ఉంది. ప్రేమ అనేది నిత్య నూతనమైనది అది కోరిక వలన [సంగీతం] వచ్చేది కాదు. మనసు ప్రేమ యొక్క అందాన్ని ఆనందాన్ని మీకు చూపించలేదు. [సంగీతం] కారణం చిన్న చిన్న ఉద్వేగాలకు లొంగుపోయే మనసు అనంత తత్వాన్ని తన నుంచి వ్యక్తపరచలేదు.
(24:03) మనసు ప్రేమను కలుషితం చేస్తుంది. అది చేయగలిగినది అదే మీరు ప్రేమను గురించి కవిత్వం రాయవచ్చు కానీ అది [సంగీతం] ప్రేమ మాత్రం కాదు కాబట్టి ప్రేమ అనేది మనసుకు సంబంధించినది కాదు ప్రేమ గురించి ఆలోచించడం కుదురుతుందా కుదరదు ఎందుకంటే అది ఉన్నప్పుడు ఆలోచించే మీరు ఉండరు. కారణం మీ మనసే మీ ఆలోచన. ప్రేమను పెంపొందించుకోవడం కుదరదు ప్రేమను సాధన చేయడం కుదరదు మరి ఇది ఎలా సాధ్యం మీ లాభాపేక్షకై చేసే మీ ప్రయత్నాలన్నీ ఆగిపోయినప్పుడు మిమ్మల్ని మీరు మౌనంగా అవగాహన చేసుకుంటున్నప్పుడు [సంగీతం]
(24:46) మీ మనసు నిజంగా నిశశబ్దంగా ఉన్నప్పుడు మీలో ప్రేమ ఉదయించవచ్చు. మీలో అసూయ అత్యాసలు లేనప్పుడు మీకు గౌరవం దయ కారుణ్యం ఉన్నప్పుడు మీ భార్య పట్ల బిడ్డల పట్ల ఇరుగు పొరుగు వారి పట్ల అభాగ్యులైన మీ పనివారి పట్ల ఆదరం ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే [సంగీతం] మీరు ప్రేమించగలరు. ఎల్లప్పుడూ ఉత్తమమైనది చేయడమే భగవంతుని [సంగీతం] ప్రేమించడం అంటే నిజమైన ప్రేమ నేను వీరిని ప్రేమిస్తున్నాను వీరిని ప్రేమించడం లేదు అని అనలేదు.
(25:25) ప్రేమించిన వారిపై కోప్పడను లేదు నిజానికి మీరు ప్రేమ అంటే ఇది అనే భావననే కలిగి ఉన్నారు. ప్రేమను కలిగిలేరు. ప్రేమ అంటే ఇది అని చెప్పుకునే పదాలు భావాలు ప్రేమ కాదు ఒకవేళ మీరు ప్రేమను కలిగి ఉంటే దుఃఖం భయం వంటివి మీ దరి చేరలేవు ఎందుకంటే ప్రేమను ఆనందం కోరికలు భయం ఈర్ష అసూయలు వంటివి ఏవి తాకలేవు ప్రేమకు పోటీ తత్వమో ఓ లక్ష్యమో అంటూ ఉండవు ప్రేమను ఇది నా ప్రేమ ఇది నీ ప్రేమ అని విభజించలేవు నిజమైన ప్రేమ నాకు నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి అని అడగదు. ఇతరుల నుండి ఏమి
(26:11) ఆశించదు కూడా మీరు మీ కోరికల యొక్క కదలికలు మీ అనుబంధాలు ఆనందాలు అన్నింటిని పరిశీలనగా చూసినప్పుడు అప్పుడు ఆ అవగాహన యొక్క లోతుల్లో నుండి ఈ ప్రేమ అనే వింత పుష్పం దాని అసాధారణమైన పరిమలంతో వస్తుంది. అది ప్రేమ అంటే అది అద్భుతమైన ఈ నూతన ప్రేమ ఒక్కటే ఈ ప్రపంచంలో క్రమతను సంస్కృతిని ఒక కొత్త జీవన విధానాన్ని తీసుకొని రాగలుగుతుంది.
(26:46) అంతేకానీ ఈ సిద్ధాంతాలు మత సంస్కృతులు మూఢ విశ్వాసాలు దేశ రాజకీయ పరిస్థితులు కట్టుదిట్టమైన నియమ నిబంధనలు హింసాత్మక చర్యలు ఇవేవి మార్పును తేలేవు వివాహం చాలా చాలా కొద్దిమందికి ప్రేమించే వారికి మాత్రమే వివాహ బాంధవ్యానికి ఉన్న విలువ తెలుసు వారికి అది విడదీయరానిది. అది శరీర సంబంధమైన సెక్స్ సంబంధమైన అవసరాల మీద ఆధారపడినది కాదు. నిజం ఎల్లప్పుడూ చేదుగా కఠినంగా నమ్మలేనిదిగానే ఉంటుంది కనుక వినండి.
(27:31) యవ్వనంలో ఉన్నప్పుడు శరీర సంబంధమైన సెక్స్ సంబంధమైన వాంచ చాలా తీవ్రంగా ఉంటుంది. దీనికి హద్దులు ఏర్పరచడం కోసం వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇరు పక్షాలలో ఈ శరీర సంబంధమైన వాంచ ఉంటుంది. అందుకే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు పిల్లల్ని కంటున్నారు ఒక పురుషుడికో స్త్రీకో జీవిత పర్యంతం మిమ్మల్ని మీరు కట్టివేసుకుంటున్నారు.
(28:00) ఈ విధంగా మీకు జీవిత పర్యంతం సుఖం భద్రత ఆమె ఆధారం లభిస్తాయి. దాని ఫలితంగా క్రమక్రమంగా మీరు క్షీణించుకుపోతారు. అలవాటు అనే చక్రంలో పడి జీవిస్తూ ఉంటారు. అలవాటు అంటేనే క్షీణించకపోవడం ఈ శరీర సంబంధమైన సెక్స్ సంబంధమైన వాంచను అవగాహన చేసుకోవాలంటే విశేషమైన తెలివి ఉండాలి. అయితే ఇంత వివేకం మనలో కలిగేలా మనకు విద్యాబోధన జరగడం లేదు.
(28:36) 20 25 ఏళ్ల వయసులో నేను పెళ్లి చేసుకుంటాను. ఇక తక్కిన జీవితకాలం అంతా ఆ స్త్రీ గురించి నాకు ఏమీ తెలియకపోయినా ఆమెతో నేను గడిపి తీరాలి. నేను ఎదుగుతున్న కొద్దీ పరిశీలిస్తున్న కొద్దీ ఆమెకు నాకు మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఆమె అభిరుచులు వేరు నా అభిరుచులు వేరు అని నేను గ్రహిస్తాను. ఆమెకు సినిమాలు శికార్లు క్లబ్బులకు వెళ్ళడం అంటే ఇష్టం నాకేమో గంభీరమైన విషయాల్లో ఆసక్తి లేదు ఆమెకు ఇందులోనూ నాకు అందులోనూ ఆసక్తి అయినా కూడా మీకు పిల్లలు కలుగుతారు అదే ఇందులో ఉన్న వింత వివాహం అనే పేరుతో మీరు పిలుస్తున్నది ఇదేనా
(29:23) ఏ నిబంధనలు లేని ప్రేమలోనే వ్యక్తిత్వాలు పూర్తిగా కలిసి ఒకటవుతాయి. వేరువేరుగా ఉన్న రెండు వ్యక్తిత్వాలు కలిసి ఒకటైపోవాలంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. [సంగీతం] అప్పుడే ఆమె అతనిని అతను ఆమెను పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఇది మీ మధ్య ఉండవలసిన ప్రేమ అంటే అప్పుడు మీ మధ్య ఎటువంటి సమస్యలు అవరోధాలు రాక జీవితం సంతోషంగా సాగుతుంది.
(29:54) కానీ మీరు అలా చేయరు పైగా ఒకరిపై ఒకరు ఆధారపడి మీ కోరికలను శారీరక మానసిక వాంచలను తీర్చుకుంటూ ఉండడాన్నే మీరు ప్రేమ అంటారు. ప్రేమ ఉన్నప్పుడు మీ మధ్య ఘర్షణలు రావు కానీ మీరు మీ అవసరాల దృష్టిా చూసినప్పుడు ఆ అవసరం తీరినా తీరకపోయినా మీలో కలిగిన ఆ సంతృప్తి లేదా అసంతృప్తి మీ మధ్య వివాదాలకు కారణమగును. ఎందుకంటే మీ ఏకాంతంలో మీరు నివసిస్తూ ఉంటారు ఆమె ఏకాంతంలో ఆమె నివసిస్తూ ఉంటుంది.
(30:32) అయినా నిరాటంకంగా సెక్స్ సుఖపు అలవాట్లను సాగించుకుంటూ ఉంటారు. ఒక స్థిరమైన ఆదాయం క్రమం తప్పకుండా వస్తూ ఉంటే ఇక ఆ వ్యక్తి ఏమైపోతాడు నిస్సందేహంగా దిగజారిపోతాడు. మీరు ఆ సంగతి గమనించలేదా మీ మీ స్వాభిలాషలు నెరవేర్చుకునేందుకు కలిసిఉండే ఇలాంటి బాంధవ్యం ఫలితంగా వికృతమైన శిశువులు వికృతమైన నాగరికత తప్ప మరొకడు జనిస్తుందా కాబట్టి ఈ ప్రక్రియనంతా అసహ్యించుకోకుండా గమనించాలి.
(31:09) మీ కళ్ళ ముందు జరుగుతున్న ఒక నిజమైన వాస్తవం అని గ్రహించాలి. అయితే మీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను మీరు ఎదుర్కోలేక మీ భర్త లేదా భార్యల నుండి దూరంగా ఉండేందుకే మీరు త్రాగుడునో రాజకీయాలనో లేదా వేరో స్త్రీనో వేరో అలవాటునో చేసుకుంటున్నారు అన్నది వాస్తవం. [సంగీతం] కాదంటారా? అలవాటు ఏదైనప్పటికీ అది మీ భార్య నుంచో భర్త నుంచో లేక మీ జీవిత సమస్యల నుంచో మిమ్మల్ని దూరంగా తీసుకుపోతే చాలు ఈ విధంగా మీరు మీ సమస్యలని పరిష్కరించుకున్నామని అనుకుంటున్నారు.
(31:52) మీరు అస్తమానం ఒకరినొకరు సాధించుకుంటూ పేచీలు పడుతూ ఉంటే దాని ప్రభావం మీ పిల్లలపై పడకుండా ఉంటుందా కాబట్టి వివాహాన్ని ఒక అలవాటుగా ప్రతిరోజు సుఖాన్ని అందజేసేదిగా మీరు చూడకూడదు. సవ్యంగా జీవించడం ఎలా అన్నది కనిపెట్టడం అనే పెద్ద అల్లకల్లోలాని నెత్తిని వేసుకోవడం మీకు ఇష్టం ఉండదు. అందువల్ల సమస్య అట్లాగే ఉండిపోతుంది. కలహించుకుంటూ ఉంటారు మళ్ళీ సర్దుకు పోతూ ఉంటారు. చివరికి మీరు చనిపోతారు.
(32:28) చనిపోతే ఏడవడానికి ఎవరో ఒకరు ఉంటారు. ఏడుపు చనిపోయిన వారి గురించి కాదు నిజానికి అది తమ ఒంటరితనం తలుచుకొని ఏ మార్పు లేకుండానే గడిపి వేస్తూ ఉంటారు. అయినా చట్టాలు చేయగల గొప్ప పదవులు చేపెట్టగల దేవుని గురించే మాట్లాడగల యుద్ధాలు ఆపే మార్గాలు కనుక్కోగల గొప్ప మానవులం అని మీరు అనుకుంటూ ఉంటారు. వీటి వల్ల ఏమీ లాభం లేదు ఎందుకంటే అసలు ముఖ్యమైన సమస్యలను మీరు పరిష్కరించనే లేదు.
(33:01) కనుక మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పరం ప్రేమించుకోండి కానీ ఆ ప్రేమ బంధమే మిమ్మల్ని బంధించకుండా చూసుకోండి. మీరు ఒకరి హృదయాలను ఒకరికి అర్పించుకోండి కానీ ఒకరి చేతుల్లో ఒకరు చిక్కుకోకండి. ఒకే దేవాలయానికి గల స్తంభాలు విడివిడిగా ఉన్నట్లుగా మీరు జంటగా నిలవండి కానీ అంటుకొని ఉండకండి. ఒకే లయకు ప్రకంపించే వేనతీగలు వేరువేరుగా ఉన్నాయిగా సెక్స్ లైంగిక సుఖం సెక్స్ కి అంత
(33:59) ప్రాముఖ్యత ఎలా వచ్చింది? ఇది మీపై ఇంత ఆధిపత్యం చలాయిస్తూ మిమ్మల్ని ఎలా ఆడించగలుగుతుంది. దీన్ని నిరోధించడం ఎందుకు మీకు అసాధ్యమైన కార్యంగా మిగిలిపోయింది. అసలు సెక్స్ ని ఒక సమస్యగా ఎందుకు మార్చారు? [సంగీతం] మీ జీవితంలో అనేక విషయాలు ఎన్నో మీకోసం కాచుకొని ఉన్నాయి. మీరు అత్యవసరంగా చేయవలసిన పనులు అనేకం వండగా మీరు లైంగిక సంబంధం గురించే శ్రద్ధగా ఆలోచిస్తున్నారు.
(34:29) మీ మనసులు దానిపై ఎందుకు లగ్నమై ఉన్నాయి అది ఒక పలాయన మార్గం అవ్వటం చేతనే కదా మానవుడు తనను తాను పూర్తిగా మర్చిపోవడానికి ఇదొక మార్గం. ఎందుకంటే జీవితంలో ఏ వైపు చూసినా సంఘర్షణలతోనూ అహాన్ని పెంచుకోవడంలోనూ నిరాశ నిస్పృహలలోనూ మీరు గడుపుతూ ఉంటారు. [సంగీతం] కాబట్టి మీలో నేను నాది నా అనే భావనలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు మీకు సమస్యలు తప్పవు.
(35:04) కారణం నేను ఉన్నంతవరకు భయం స్వార్థం ఈర్ష్య స్వ పర వంటి భావనలు వృద్ధి చెందుతూ ఉంటాయి. వీటివలన చూసిన ప్రతిది నాకు నాది వంటి సమస్య తలెత్తుతుంది. దానికై మనిషి ఏమైనా చేస్తాడు. పరాయ స్త్రీని తీసుకురావచ్చు ఒకరి వస్తువునో పదవునో ఉద్యోగాన్నో లాక్కోవచ్చు ధనం కొరకు ఒకరిని చంపనవచ్చు. ఇలా మనిషి రోజు రోజుకి దిగజారి చివరికి పిచ్చివాడు అవుతున్నాడు.
(35:36) కావున నేనును విడవాలి అనుకుంటాడు. తనని తాను చూసుకునే ధైర్యం లేక నేను అనే స్పృహ నుండి తప్పించుకోవాలి అనుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తన నుండి తాను పారిపోయే ప్రయత్నం చేస్తాడు. నిజానికి సెక్స్ గురించి చేసే ఆలోచనే సమస్యను సృష్టిస్తుంది కానీ సెక్స్ మాత్రం ఎన్నటికీ సమస్య కాదు. విత్తనం లేనిది మొక్క రానట్లే ఆలోచన లేనిదే క్రియ కూడా సాధ్యం కాదు.
(36:06) కనుక మనం దృష్టి పెట్టాల్సింది ఆలోచన పైనే మరి ఆ ఆలోచనను ఆపేందుకు మీరు శతవిధాల ప్రయత్నం చేస్తారు. బ్రహ్మచర్యం అనే ఆదర్శం పాటిస్తారు భగవంతుడు భక్తి పూజ భజన అంటూ సమయాన్ని వెచ్చిస్తారు. బలవంతంగా మీ ఆలోచనను అనచ వేసుకోవడం నిగ్రహించుకోవడం లేదా మనోధ్యాసను మరో దాని మీదకు మల్లించడం వంటి ప్రయత్నాలు చేస్తారు.
(36:38) అయినప్పటికీ ప్రయోజనం శూన్యం [సంగీతం] కారణం లైంగిక సమస్య గురించి ఆలోచించే మనసును మీరు అవగాహన చేసుకోనంత కాలం మీకు అది విపరీతమైన కఠిన సమస్యగానే ఉండిపోతుంది. మీరు ఒకవైపు నేను నా అనే అహానికి కారణమైన ఆలోచనలను అనచాలని చూస్తూనే మరోవైపు నేను అనే అహాన్ని అభివృద్ధి చేస్తారు. మీకు తెలియకుండానే మీరు ఎల్లవేలలా మీకంటూ ఒక గుర్తింపును ప్రత్యేకతను కోరుకుంటారు.
(37:12) కావున మీరు జీవితంలో చేసే ప్రతి కార్యం మీ నేనును బలపరుస్తుంది. మీ వ్యాపారం మీ మతం మీ నాయకులు మీ దేవుళ్లు మీ నమ్మకాలు మీ రాజకీయ ఆర్థిక విషయాలు మీ సాంఘిక కార్యకలాపాలు మొదలైనవన్నీ మీలో నేనును బలపరుస్తాయి. ఒకవైపు మీ అహాన్ని అనుస్తూ మరోవైపు దాన్ని వృద్ధి చేస్తూ రెండు వ్యతిరేక పనులు ఏకకాలంలో ఎలా చేయగలుగుతున్నారు. [సంగీతం] కావునే మీ మనసులో ఘర్షణ సెల్ ఫోన్లలో సినిమాలలో బయట ప్రపంచంలో పత్రికల్లో మీరు చూసే అర్ధనగ్న స్త్రీల చిత్రాలు మీలో కోరికను రేపి నేనుకు ప్రాముఖ్యాన్ని ఇవ్వటంలో ప్రోత్సహిస్తాయి. అయితే అదే
(37:57) సమయంలో మీరు దయతో ప్రేమతో మృదువుగా సోదరి భావంతో ఉండాలని ప్రయత్నిస్తారు. [సంగీతం] రెండు కలిసి ఉండలేవు. మరి ఈ సమస్యకు గల ఒకే ఒక పరిష్కారం అన్ని భయాలకు సంఘర్షణలకు మంచి చెడు ఆలోచనలకు కారణం నేను కావున మీరు ఇది నేను అని అనుకునేదంతా వదిలివేయాలి. మీకు మీరుగా తెలిసిన గుర్తింపులుఅన్నీ పోవాలి అంటే మీ వ్యక్తిత్వం మీ ఆలోచనలు అంతా ఇది మీలోకి మీరు తొంగు చూసుకోవడం వలనే సాధ్యం.
(38:37) అలా చూస్తూ మీ ఆలోచనలు అవగాహన చేసుకున్న క్షణం నుండి వాటి వలన వచ్చే ఇబ్బందులను ప్రమాదాలను గ్రహించని మీలో మార్పు మొదలవుతుంది. [సంగీతం] ఎప్పుడైతే మీరు మీ శారీరక మానసిక నిర్బంధాలకు అతీతంగా ఉండగలరో [సంగీతం] అప్పుడే మీరు శాశ్వతంగా నిలిచిపోతారు. ఇదే జీవిస్తూ మరణించడం అంటే [సంగీతం] అదే మీ శాశ్వతమైన ఉనికి. దేవుడు దేవుడు అంటే ఎవరు? అతను ఎక్కడ ఉంటాడు? ఉంటే అతను ఎలా తెలుసుకోవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని మనిషి కొన్ని వేల
(39:23) సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాడు. అయితే ఇందులో ఋషులు సన్యాసులు [సంగీతం] ఆస్తికులు గురువులు తత్వవేత్తలు మనోశాస్త్రవేత్తలు నిత్య సత్యాన్వేషకులు అని చెప్పుకునే వారందరూ వెతికారు వెతుకుతూనే ఉన్నారు. అయినా ఎందుకు ఈ విషయంలో మనిషి పూర్తిగా విజయం సాధించలేకపోతున్నాడు లేదా సత్యాన్వేషణలో మనిషి ఎందుకు విఫలం అవుతున్నాడు.
(39:56) నిజానికి మనిషి దేవుని కోసం అన్వేషిస్తున్నాడు కానీ దేవుని కోసం జీవించడం లేదు. మీకు తెలియని దేవునిపై మీరు విశ్వాసం గాని అవిశ్వాసం గాని ఉంచడం అనేది కేవలం మీ స్వీయాన్ని ప్రదర్శించడమే ఈ పవిత్ర గ్రంథాలన్నీ భగవంతుడు ఏమిటో వర్ణించాయి కానీ ఆ వర్ణనలన్నీ భగవంతుడు కాదు ఎవరెవరో వచ్చి భగవంతుని గూర్చి బోధించారు కానీ ఆ బోధనలన్నీ భగవంతుడు కాదు ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడు అనే మాటే భగవంతుడు కాదు సత్యం ఏమిటో తెలుసుకోవాలంటే మీరెంత మాత్రం ఆమోదించకూడదు.
(40:38) పుస్తకాలు గురువులు ఎవరేమి చెప్పినా ప్రభావితం అవ్వకూడదు వాడితో ప్రభావితం అయితే మీరేమి తెలుసుకోవాలని వారు అనుకున్నారో అదే మీరు తెలుసుకుంటారు. ఒక మూఢ నమ్మకాన్ని ఆమోదించడం గానీ పవిత్ర గ్రంథాల నుండి వాటిని చదవడం గాన ఏ గురువును అనుసరించడం గాన చేయకూడదు అప్పుడే మీ మనసు పూర్తి స్వేచ్ఛగా ఉండగలుగుతుంది. నిజమైనది ఏదో ఆ క్షణం మీరు తెలుసుకోగలరు.
(41:09) ఆలోచన అనేది తనకు నచ్చిన భగవంతుని సృష్టించను కలదు లేడని అనను గలదు. మీ మనోపరిధులు ఆవలగా ఉన్న సత్యాన్ని మీరు మీ మనసు సహాయంతో చూడడానికి ప్రయత్నిస్తున్నారు. [సంగీతం] అది ఎలా సాధ్యం? నిన్నటి జ్ఞాపకాల మీద ఆధారపడిన మనసు స్థిరత్వం లేని మనసు ఈ విషయంలో మీకు ఎలా దారి చూపుతుందని అనుకుంటున్నారు. కాలానికి అవతలగా ఉన్న సత్యాన్ని మీరు కాలంలోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
(41:40) ఇది సాధ్యమా అందువల్ల ఆలోచన ఏదో ఒక రూపాన్ని ఆకారాన్ని ఇస్తూ ఉన్నంతవరకు కాలానికి అతీతమైన దాన్ని మీరు ఎప్పటికీ కనుగొనలేరు. కనుక భగవంతుడిని లేదా యదార్థ తత్వాన్ని తెలుసుకోగలిగేది మీ ఆలోచన అంతమైనప్పుడే కాలాతీతమైన దాని అనుభవం గ్రహింపు కావాలనుకున్నప్పుడు మనం కాల ప్రక్రియను తప్పక అర్థం చేసుకోవాలి. మనసు కాల ఫలితం నిన్నటి జ్ఞాపకాల మీద ఆధారపడింది.
(42:12) ఆ లెక్కలేనని జ్ఞాపకాల నుండి విముక్తులైనప్పుడే మీరు బహుశా భగవంతుని తెలుసుకొనగలరు. జ్ఞాపకం పని చేస్తున్నంత కాలం మనసు ఉన్న స్థితిని అవగాహన చేసుకోలేదు. ఉన్న స్థితిని అవగాహన చేసుకోవడమే సత్యాన్ని అవగాహన చేసుకోవడం అనిర్వచనీయమైన దాన్ని మాటల్లో చెప్పడం సాధ్యమవుతుందా? దాన్ని సూత్రీకరించి మాటల్లో చెప్తే అది సత్యం అవుతుందా? అపరిమితమైన దాన్ని అంచనా వేయగలమా అలా అంచనా వేయగలిగితే అది అపరిమితం అవుతుందా? వాస్తవం అవుతుందా? కాదు నిశ్చయంగా కాదు ఎందుచేతన అంటే అనిర్వచనీయమైన దాన్ని మీరు నిర్వచించడం మొదలు పెడితే అది ఆ క్షణంలోనే సత్యం
(42:57) కాకుండా పోతుంది. కనుక ఈ విషయంలో మీరు చేయగలిగింది ఒక్కటే పూర్తిగా నిశశబ్దంగా ఉండుకోండి. మీపై మీరు నిరంతరం ఎరుకుతూ ఉండండి. మీ సంబంధం అంతా ఎప్పుడ ఎవరితోనో దేనితోనో కాక కేవలం మీతోనే ఉండాలి. ఎందుకంటే సత్యం ఎప్పుడూ మీలోనే మీతోనే ఉంది. కనుక మీరు మీ యెడల గౌరవంగా మర్యాదగా నీతిగా నిజాయితిగా ధర్మంగా మసలుకోండి. నిజానికి మీరు మీలో ఉన్న చైతన్యాన్ని నడిపించన అవసరం లేదు.
(43:35) నడిపించలేరు కూడా మీ లోపల చైతన్యానికి అన్నీ తెలుసు తను ఎటువైపు ప్రయాణం చేయాలో ఏం చేయాలో ఏది చేయకూడదో ఎవరిని కలవాలో అది తను ఎంచుకున్న ప్రణాళికా మార్గంలో జీవించడంలోనే తనకు మోక్షం ఆనందం జ్ఞానం అందుతాయి. ఆ మార్గం కష్టాలు తెచ్చేదైనా మరణాన్ని ఇచ్చేదైనా ధ్యానం
(44:20) మనిషిని మనీషిగా మార్చగలిగేది ధ్యానం అని చాలామంది విశ్వాసం మన ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు ధ్యానం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. వారు చెప్పిన వివిధ పద్ధతులు ప్రక్రియలు అవలంబించిన వారు పూర్తి సంతృప్తి పొందలేకపోయారు. [సంగీతం] ధ్యానం చేయుటకు సరైన పద్ధతి కోసం మనిషి ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాడు.
(44:50) సరే ధ్యానం అంటే ఏమిటి అని తెలుసుకోబోయే ముందు ఏది ధ్యానం కాదో తెలుసుకొని తీరాలి. [సంగీతం] నిజమైన ధ్యానం అంటే ఏమిటో మీకు తెలియకపోతే స్వీయజ్ఞానం కూడా లేదు. మీ గురించి మీకు తెలియకపోతే ధ్యానానికి అర్థమే లేదు. [సంగీతం] ఏకాగ్రత ధ్యానం కాదనడంలో సందేహం లేదు. ఎందుకంటే మీరు గమనించి చూస్తే [సంగీతం] ఒక దానిపై ఏకాగ్రత నిలపడం అనే ప్రక్రియలో మిగిలిన వాటిని విడవడం నిరాకరించడం ఉంటుంది.
(45:27) అంటే ఒక దాని మీద ఏకాగ్రత నిలపాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మీ మనసు మరో దాని మీదకు శికారు వెళ్తూ ఉంటుంది. మనసు స్థిరంగా ఒక దాని మీద నిలపడం అది తిరస్కరించడం మరో దాని గురించి ఆలోచించడం ఈ రెండింటి మధ్య సదా సమరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు సంవత్సరాల తరబడి ప్రయత్నించిన వృధ [సంగీతం] ఇక ప్రార్థన ధ్యానం అంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనసు నెమ్మదించడం నిజమే కానీ మీరు మంత్రాలు వల్లి వేసిన గంటల తరబడి ప్రార్థనలు చేసినా అది మీ మనసుని మీరు సమ్మోహ పరుచుకునే పద్ధతి మాత్రమే
(46:11) [సంగీతం] మీ మనసు యొక్క నిజత్వాన్ని తెలుసుకోకుండా మీ మనసు చేసే ఇంద్రజాలం ఇదంతా కావున ప్రార్థనల వలన మనలో అవగాహన కలగదు సరే [సంగీతం] ధ్యానం అంటే భక్తి అనేవారు ఉన్నారు. ఒక బొమ్మకు గాని ఒక ఆలోచనకు గాని ఒక పరమ గురువుకు గాని భక్తి చూపడం ధ్యానం కాదు చాలామంది భౌతికంగా కనిపించే విగ్రహాలకు ప్రతిమలకు పూజించడం మాత్రమే వెర్రితనం మూఢ విశ్వాసం అనుకోవచ్చు.
(46:47) కానీ చాలామంది వారి మనసులో పుట్టిన లేదా కల్పించుకున్న భావాలను కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఇది కూడా విగ్రహారాధన వంటిదే ఇదంతా నిస్సందేహంగా తన నుంచి తాను పారిపోవడానికి ఒక మార్గం [సంగీతం] చాలామంది తాము సత్పురుషులుగా మారాలనే నిరంతర ప్రయాసతో తమ మనసులను తాము అనుచుకోవడం క్రమశిక్షణలో పెట్టడం పరీక్షకు గురి చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ధ్యానం కాదు అని గట్టిగా చెప్పవచ్చు.
(47:17) [సంగీతం] ఎందుకంటే మీలో మారాలనే కోరిక మీ మనసును అనచడం ద్వారా దానిని వ్యతిరేకించడం అవుతుంది. [సంగీతం] మనలో చాలామంది ఈ ప్రక్రియలో చిక్కుకుపోతారు. ఇవి మనల్ని గురించిన అవగాహనను మనకు కల్పించవు. [సంగీతం] ఎందుకంటే యదార్థంగా లోన ఏముందో దానిని చూడగలగాలి. లోన ఏమిటి ఉండాలని మీరు అనుకుంటున్నారో దానిని కాదు అసలు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకపోతే సవ్యంగా ఆలోచించడానికి మీకు ఆధారం ఎక్కడ ఉంటుంది? ఇన్నేళ్ల జీవితంలో మీ శారీరక మనోవికాసాలకు దోహద పడలేని మీ భయాలను తొలగించలేని సిద్ధాంతాలను నమ్మకాలను మీరు ఇంకా ఎందుకు పట్టుకొని వేలబడాలి
(48:03) ఆలోచనలన్నింటిని మన పూర్వ జ్ఞానాన్ని అది మిమ్మల్ని బాధించేదైనా సంతోషంలో ముంచేదైనా వీటిని పూర్తిగా మన మనసు నుండి తుడిచివేయాలి. బాగా వర్షం పడి మబ్బులు పోయిన తర్వాత నిర్మలంగా కనిపించే ఆకాశం వలె మీ మనసు నిర్మలంగా మారిపోవాలి. మరి అది ఎలా సాధ్యం [సంగీతం] మొదటిగా మీ ఆలోచనలను లేదా మనసును నిగ్రహించలేరు అనచలేరు అని మీరు తెలుసుకోవాలి.
(48:35) మరి ఉపాయం ఏమిటి? మొదట ఒకచోట సుఖంగా కూర్చోండి. మనసును దాని మానాన దాన్ని వదిలేయండి. అది ఎక్కడికైనా పరుగులు పెట్టనివ్వండి. [సంగీతం] ఇది మీరు చేయాల్సిన మొదటి పని అలా కూర్చున్నప్పుడు మనసు గంతులు వేస్తూ నిలకడలేని కోతిలా పరుగులు పెడుతుంది. కోతి లాంటి ఈ మనసును ఆలోచనలను యధేయచ్చగా గంతులు వేయనివ్వండి.
(49:05) అయితే మీరు మాత్రం దాని కోతి చాష్టలు అన్నింటిని జాగ్రత్తగా పరీక్షిస్తూనే ఉండాలి. కారణం మన మనసుకు సంబంధించిన అవగాహనే మనలో మార్పు తెస్తుంది. తెలియని వ్యక్తి గురించి మనం ఏ విధంగా చెప్పలేమో మన మనసు గురించి తెలియనప్పుడు మనకు మనం [సంగీతం] తెలియని వారమే అవుతాం పరాయవాళ్ళమే అవుతాం. మనసే మనుషుల బంధ మోక్షములకు కారణం అని మీరు వినే ఉంటారు.
(49:33) బయట లోపల పనులన్నీ ఇంద్రియాలతో మనసు కలవడం వలనే జరుగుతాయి. ఇష్టంగానో అయిష్టంగానో మనసు ఇంద్రియాలతో ఆకర్షితం అవుతుంది. వాటితో సంయోగం చెందుతుంది. మీరు మూర్ఖపు పనులు చేస్తారు ఆపై దుఃఖిస్తారు. నిజానికి సుఖ దుఃఖాలను కోరుకునేది మనసే వాటిని పుట్టించేది మనసే వాటిని పొందేది మనసే [సంగీతం] ఇదే దానిలో ఉన్న విచిత్రం. ఇవి ఎక్కడ పుడుతున్నాయో చివరికి అక్కడే అంతమవుతున్నాయి.
(50:06) కనుక నీలోనే ఉంటూ నిన్ను సుఖ దుఃఖాలకు గురి చేస్తూ నీలో ఘర్షణలు సృష్టించే వాటిని మౌనంగా గమనించాలి. వాటి చేష్టలను వాటి డాబులను వాటి బూటకపు మాటలను చూస్తూ ఉంటే నీ ఇంటికి ఒక అతిథి వచ్చి వెళ్ళిపోయినట్లుగా అవి మెల్లగా జారుకోవడం నీవు గమనిస్తావు. అయితే ఇలా గమనిస్తున్నప్పుడు వాటిని అంగీకరించడమో వ్యతిరేకించడమో లేదా ఆపడమో చేయకూడదు. [సంగీతం] అవి మిమ్ములను ఎన్ని సార్లు బాధించినా చేతులు చాచకుండా చల్లగాలిని ఆహ్వానించినట్లుగా వాటికి స్వాగతం పలకండి.
(50:42) ఇప్పుడు ఆ ఆలోచన ఏమి చేయాలనుకుంటున్నదో గమనించండి. [సంగీతం] మిమ్మల్ని మీరే గమనిస్తూ ఉంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ప్రవర్తిస్తున్నారు ఇతరుల గురించి కబుర్లు ఈర్షలు ద్వేషాలు గమనిస్తూ ఉంటే ధ్యానం అదే కొనసాగును తద్వారా మీరు మీ గురించి తెలుసుకుంటారు. దీనినే స్వీయజ్ఞానం అంటారు. దీనికై మీలో పూర్తి శ్రద్ధాసక్తులు అవసరం. ఇలా గమనించడం మీరు చేసే రెండవ పని [సంగీతం] ఈ ప్రక్రియలో మీరు ఒక విషయం గ్రహిస్తారు మీలోకి వచ్చిపోయే ఆలోచనలు మీరు దాచిపెట్టుకున్న మీ పూర్వజ్ఞానం నుండే వస్తున్నాయని మరి ఈ పూర్వ జ్ఞానం నుండి తెలిసిన విషయాల నుండి విముక్తి చెందడమే
(51:29) ధ్యానంలో పరిపక్వత ఎందుకంటే [సంగీతం] అనుభవాలన్నింటికీ ఒక రూపుని ఇచ్చేది వాటిని అదుపు చేసేది ఈ తెలిసిన జ్ఞానమే [సంగీతం] మీకు తెలి తెలిసిన జ్ఞానంతో మీ మనసును ఇట్లా ఉండాలి ఇట్లా ఉండకూడదు అనే ఆజ్ఞలను చేయకూడదు. అప్పుడు మాత్రమే దానిపై ఎటువంటి ప్రభావాలు ఉండవు. మీరు దేనికి ఎవరికీ లోబడవద్దు. మీ అంతశాతనము మీ అవగాహనే మీకు మార్గదర్శకం.
(51:59) మీకు వేరొక గురువు అవసరం లేదు. కారణం మీకు మంచి చెడులను బోధించే బోధకుడు మీ లోపలే ఉన్నాడు. [సంగీతం] ఆ అంతర్బోధ అందాలంటే నిరంతరం మీ మనసుతో మీరు అనుసంధానమై ఉండాలి. [సంగీతం] తనకు తానే వెలుగునిచ్చుకునే మనసుకు ఏ జ్ఞానము ఏ అనుభవాలు అవసరం లేదు. మీరు ఆ వెలుగును అంతర్గతంగా ఉన్నవాడికి ఇవ్వలేరు మీరు చేసేదల్లా ఆ వెలుగుకు అడ్డంగా ఉన్న అడ్డంకులు తొలగించడమే అది సహజంగానే వెలుగు కలది. [సంగీతం] కావున నిరంతరం గమనించాలి.
(52:34) మీరు మీ దైనందిన గృహ కృత్యాలు చేసుకుంటూనే మీ మనసును గమనించడంలో ఉంచాలి. తద్వారా మీకు మీరే జ్యోతి అయ వెలుగునిచ్చుకుంటారు. [సంగీతం] [సంగీతం] ఉమ్

No comments:

Post a Comment