The Survival Machine: Why the Female Body is Nature's Greatest Invention | Nagna Satyam Podcast
Author Name:Nagna Satyam
Youtube Channel Url:https://www.youtube.com/@Nagnasatyam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UdNyO53OOPU
Transcript:
(00:16) ఒక మగవాడు చేతిలో ఈటి పట్టుకొని ఒక పెద్ద జంతువును వేటాడుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక స్త్రీ తన బిడ్డను ఎత్తుకొని గుహ దగ్గర [సంగీతం] కూర్చొని ఏదో చిన్న చిన్న పండ్లు ఎదుక్కుంటూ ఉంటుంది. మ్యాన్ ద హంటర్ అనే ఈ థియరీ మన మెదడులో ఎంత బలంగా నాటుకుపోయిందంటే అసలు పరిణామ క్రమం అంటేనే మగవాడి కండరాలు అతని వేట అతని పరాక్రమం అనుకుంటాం.
(00:41) కానీ గాడ్ బోహానన్ తన ఈవ్ పుస్తకంలో ఈ మొత్తం వాదనను పచ్చిగా నిర్మొహమాటంగా బద్దలు కొట్టేసింది. ఈ మ్యాన్ ద హంటర్ అనేది ఒక సైంటిఫికల్ ప్రూవ్ కాదు. అది గత శతాబ్దపు పురుష ఆధిపత్య శాస్త్రవేత్తలు తమకు అనుకూలంగా అల్లుకున్న ఒక కల్పిత కథ మాత్రమే. నిజానికి స్త్రీ శరీరం, ఆమె మెటబాలిజం, ఇంకా ఆమె ఓర్పు లేకపోతే మానవజాతి వేటలో గెలిచేదే కాదు.
(01:04) అసలు ఈ స్థాయిలో మనుగడ సాగించేదే కాదు. మనం ఈ విషయాన్ని ఎంత లోతుగా చూస్తే అంత షాకింగ్ నిజాలు బయటపడతాయి. మగవాడు వేటకు వెళితే స్త్రీ ఇంట్లో కూర్చునేదనే మాట పచ్చి అబద్ధం నిజానికి ప్రాచీన కాలంలో స్త్రీలు కూడా మగవారితో సమానంగా కొన్నిసార్లు వారికంటే మెరుగ్గా వేటలో ఉండేవారు. 2020 లో పెరు దేశంలోని యాండీస్ పర్వతాల్లో విలమయ్య పచ్చ ప్రార్థనలో పురావస్థ శాస్త్రవేత్తలకు 9000 ఏళ్ల క్రితం నాటి ఒక అస్తి పంజరం దొరికింది.
(01:34) దాని పక్కనే వేటగాళ్ళు వాడే అద్భుతమైన రాతి ఆయుధాలు జంతువుల చర్మం వలిచే పరికరాలు ఉన్నాయి. తొలుత శాస్త్రవేత్తలు ఏమాత్రం ఆలోచించకుండా ఇంత పెద్ద వేట ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఇది కచ్చితంగా ఒక గొప్ప మగ వేటగాడి అస్తిపంజరం అని నిర్ధారించేశారు. కానీ తరువాత DNA పరీక్షలు దంతాల విశ్లేషణ చేస్తే తెలిసిన నిజం ఏంటంటే అది ఒక 17 19 ఏళ్ల యువతి అస్తి పంజరం.
(01:58) ఈ ఒక్క ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంత్రపాలజిస్ట్ లను వణకించింది. ఆ ఒక్క సమాధి మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల దొరికిన 429 అస్తి పంజరాలను మళ్ళీ రీఎగ్జామిన్ చేస్తే అందులో వేట ఆయుధాలతో ఉన్న వారిలో దాదాపు 30 నుండి 50% మంది స్త్రీలే అని తేలింది. అంటే మనం వేల ఏళ్లుగా నమ్ముతున్న మగవాడు వేటగాడు ఆడది వంటగెత్త అనే కాన్సెప్ట్ ఒక సోషల్ కన్స్ట్రక్ట్ తప్ప బయోలాజికల్ ఫాక్ట్ కాదు.
(02:24) స్త్రీలు కేవలం చిన్న చిన్న కుందేళ్లను కాదు మ్యామత్ వంటి భారీ జంతువులను వేటాడే బృందాల్లో కీలక సభ్యులుగా ఉండేవారు. స్త్రీ శరీరం వేటకు సరిపోదు అనుకోవడం మన అజ్ఞానం నిజానికి ఎవల్యూషన్ పరంగా చూస్తే లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ లేదా ఓర్పు అవసరమైన పనుల్లో స్త్రీ శరీరం మగవారి కంటే మెరుగ్గా పనిచేస్తుంది. మగవారికి కండరాల బలం ఎక్కువ ఉండొచ్చు కానీ గంటల తరబడి రోజుల తరబడి ఒక జంతువును వెంటాడే పర్సిస్టెన్స్ హంటింగ్ [సంగీతం] లో స్త్రీల మెటబాలిజం అద్భుతంగా పనిచేస్తుంది.
(02:51) స్త్రీ శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ కేవలం పునరుత్పత్తికి మాత్రమే కాదు అది శరీరంలోని కొవ్వును ఎనర్జీగా మార్చడంలో మగవారి టెస్టోస్టిరాన్ కంటే సమర్ధవంతంగా పనిచేస్తుంది. వేటలో గ్లైకోజన్ అయిపోయినప్పుడు మగవారు త్వరగా అలసిపోతారు. కానీ స్త్రీ శరీరం తనలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించి నిరంతరాయంగా ఎనర్జీని అందిస్తూనే ఉంటుంది. అందుకే అల్ట్రా మారథాన్ లలో లేదా అతి కష్టమైన శారీరక శ్రమలో స్త్రీలు మగవారికి గట్టి పోటీ ఇస్తారు.
(03:20) ఈ జీవశాస్త్రపరమైన వాస్తవం 200 మిలియన్ ఏళ్ల నుండే మనలో ఉంది. కానీ మనం దాన్ని పురుష దృక్పదంతో మూసి పెట్టాం. ఇంకో పచ్చి నిజం ఏంటంటే చింపాంజీలను గమనిస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. శెనగల్ వద్ది ప్రాంతాల్లో అడవి చింపాంజీలను పరిశీలిస్తే అక్కడ ఆడ చింపాంజీలే ఈటల్ లాంటి కర్రలను తయారు చేసుకుని వాటిని పదును పెట్టి వేటాడతాయి. మగ చింపాంజీలు తమ చేతులతో వేటాడడానికి ప్రయత్నిస్తాయి.
(03:43) ఆడ చింపాంజీలు టూల్స్ వాడి తెలివిగా వేటాడతాయి. మన పూర్వీకుల్లో కూడా ఇదే జరిగి ఉంటుంది. స్త్రీకి తన బిడ్డను పెంచడానికి అధిక క్యాలరీలు అధిక ప్రోటీన్ అవసరం. ఆ అవసరమే ఆమెను అద్భుతమైన పరికరాలను కనిపెట్టేలా చేసింది. నిజానికి మానవ చరిత్రలో మొదటి పరికరం ఏదైనా ఉందంటే అది వేటాడే కత్తి కాదు తన బిడ్డను వీపును కట్టుకునే ఒక క్యాటలాగ్ లేదా ఆహారాన్ని నిల్వ చేసే బుట్ట అయి ఉంటుంది.
(04:06) ఈ ఆవిష్కరణలే మనల్ని జంతువుల నుండి వేరు చేశాయి. ఆకలి అనేది అందరికీ సమానమైనప్పుడు కేవలం మగవాడు తెచ్చే మాంసం కోసం స్త్రీ ఎదురుచూస్తూ కూర్చుంది అనుకోవడం లాజిక్ లేని మాట. బిడ్డకు పాలిచ్చే తల్లికి సాధారణ వ్యక్తి కంటే రెండున్నర శాతం ఎక్కువ శక్తి కావాలి. ఆ శక్తి కోసం ఆమె వేటలో పాలు పంచుకోక తప్పదు. భాష పుట్టుక గురించి కూడా మనం తప్పుగా అనుకుంటాం.
(04:28) మగవారు వేటలో సైగలు చేసుకోవడానికి భాష కనిపెట్టారు అనుకుంటాం. కానీ స్త్రీలు తమ బిడ్డలతో కమ్యూనికేట్ చేయడానికి సమూహంలోని ఇతర స్త్రీలతో సహకరించడానికి వాడిన శబ్దాలే భాషగా పరిణమించాయని బోహానన్ చెప్తున్నారు. ఒకవేళ విజయవంతం అవ్వాలంటే కేవలం బలం సరిపోదు వ్యూహం కావాలి ఆ వ్యూహ రచనలో సమన్వయంలో స్త్రీలే ముందుండేవారు. మ్యాన్ ద హంటర్ థియరీ కేవలం చరిత్రను వక్రీకరించడమే కాదు అది నేటి వైద్యశాస్త్రాన్ని [సంగీతం] కూడా తప్పుదోవ పట్టింది.
(04:57) స్త్రీ శరీరం అంటే కేవలం ఒక చిన్న సైజు మగ శరీరం అని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా భ్రమపడ్డారు. గుండెపోటు లక్షణాల నుండి మందుల డోసేజ్ వరకు అన్ని మగవారి శరీరాల బట్టే నిర్ణయించారు. కానీ స్త్రీ పరిణామ క్రమం వేరు ఆమె అవసరాలు వేరు స్త్రీలు వేటగాళ్లుగా ఉన్నప్పుడే మన మెదడు పరిమాణం పెరిగింది. ఎందుకంటే అధిక ప్రోటీన్ ఉన్న మాంసం తినడం వల్లే మనకు ఆ తెలివితేటలు వచ్చాయి.
(05:19) ఆ మాంసాన్ని సేకరించడంలో స్త్రీల పాత్ర 50 శాతం కంటే ఎక్కువే ఉంది. మెనోపాజ్ అనే ప్రక్రియ గురించి ఆలోచిస్తే స్త్రీల పాత్ర ఎంత కీలకమో అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ జంతువుకైనా సంతానోత్పత్తి సామర్థ్యం పోతే అది చనిపోతుంది. కానీ మనుషుల్లో స్త్రీలు సంతానం ఆడిపోయిన తర్వాత కూడా దశాబ్దాలుగా బతుకుతారు. ఎందుకు? దీనినే గ్రాండ్ మదర్ హైపోతేసిస్ అంటారు.
(05:42) వయసు మళ్ళిన స్త్రీలు అంటే అమ్మమ్మలు నాయనమ్మలు వేటలోనూ ఆహార సేకరణలోనూ తమ అనుభవాన్ని ఉపయోగించి మొత్తం తెగను కాపాడేవారు. మగవారు వేటలో విఫలమైనప్పుడు ఈ అనుభవ్యజ్ఞులైన [సంగీతం] స్త్రీలే వేర్లు, దుంపలు, చిన్న చిన్న జంతువులను సేకరించి తెగను ఆకలి నుండి రక్షించేవారు. అంటే స్త్రీ శరీరంలో ప్రతి మార్పు మానవజాతి మనుగడ కోసమే జరిగింది. మనం ఇప్పటికైనా ఈ మగ పరాక్రమ కథలని పక్కన పెట్టి స్త్రీ శరీరం ఈ 200 మిలియన్ ఏళ్లలో ఎదుర్కొన్న సవాళ్లను అది చేసిన వేటను అది సాధించిన విజయాలను గుర్తించాలి.
(06:13) స్త్రీ కేవలం సహకరించే వ్యక్తి కాదు ఆమె ఈ పరిణామ క్రమాన్ని నడిపించిన డ్రైవర్ మన చరిత్ర రక్తంతో మాంసంతో వేటతో రాయబడితే ఆ రక్తంలో సగం వాటా స్త్రీలదే స్త్రీ శరీరాన్ని కేవలం ఒక అందమైన వస్తువుగానో లేదా పిల్లలకనే యంత్రంగానో చూడడం అనేది ఎవల్యూషనరీ సైన్స్ దృష్టిలో ఒక పెద్ద నేరం ఆ శరీరం ఒక అద్భుతమైన సర్వైవల్ మెషిన్ ఒక గ్రేట్ హంటర్ మరియు మన జాతికి అసలైన సృష్టికర్త
No comments:
Post a Comment