Wednesday, May 13, 2026

అత్యాశ ఉంటే జరిగేదే ఇదే! 😱 | Lord Krishna Life Lessons in Telugu | Mahabharata Quotes

అత్యాశ ఉంటే జరిగేదే ఇదే! 😱 | Lord Krishna Life Lessons in Telugu | Mahabharata Quotes

Author Name:Telugu Box Stories

Youtube Channel Url:https://www.youtube.com/@telugubox_stories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mZInOGdcH44



Transcript:
(00:00) మిత్రులారా ఒకప్పుడు సైకిల్ ఉంటే చాలనుకున్న మన మనసు బైక్ వచ్చాక కారు కావాలంటుంది. చిన్న ఇల్లు ఉంటే చాలనుకున్న మనసు అది కొన్నాక బంగ్లా కావాలంటుంది. నెలకు 5000 సంపాదిస్తే నా జీవితం సెటిల్ అయిపోతుంది అనుకున్న రోజులు పోయి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్న కోట్ల బ్యాలెన్స్ ఉన్నా ఏదో తెలియని అసంతృప్తి ఇంకా కావాలనే ఒక పిచ్చి తపన మనల్ని లోలోపల నలిపేస్తూనే ఉంటుంది.
(00:30) అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మనిషి ఎంత సంపాదించినా ఏ స్థాయికి వెళ్ళినా నాకు ఇది చాలు అని మనస్ఫూర్తిగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? మన ఆశకు అసలు అంతం అనేది లేదా? ఆధునిక మానసిక శాస్త్రవేత్తలు దీనిని ఒక అద్భుతమైన పదంతో పిలిచారు. అదే హీడానిక్ ట్రెడ్మిల్. ట్రెడ్మిల్ పై మనం ఎంత వేగంగా పరిగెత్తినా ఒకే చోట ఎలా ఉంటామో కోరికల వెనక మనం ఎంత పరిగెత్తినా మన సంతోషం కూడా చివరికి సున్నా దగ్గరే ఆగిపోతుంది.
(01:00) మరోవైపు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయాన్ని ఎంతో స్పష్టంగా హెచ్చరించారు. నరకానికి వెళ్లే మూడు ముఖ్యమైన ద్వారాలలో లోభం ఒకటని చెప్పారు. ఇటు సైన్స్ అటు ఆధ్యాత్మికత ఈ రెండు మనకు ఒకే సత్యాన్ని ఎందుకు బోధిస్తున్నాయి? సంతృప్తి అనేది మన చేతిలో ఉండే వస్తువుల్లో లేదా? మన మనసులోనే ఉందా? మిత్రులారా ఈ వీడియోలో మనల్ని ప్రశాంతంగా బతకనివ్వకుండా వెర్రి పరుగులు పెట్టిస్తున్న ఈ అత్యాస వెనక ఉన్న సైకాలజీని మరియు దాన్ని జయించి నిజమైన సుఖాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం.
(01:36) మిత్రులారా మీ జీవితంలో ఎప్పుడైనా ఈ అనుభవం ఎదురైందా? చాలా కాలం కష్టపడి ఎంతో ఆశపడి ఒక కొత్త ఐఫోన్ కొంటారు. అది చేతిలోకి వచ్చిన మొదటి రెండు రోజులు ఆ సంతోషం ఆకాశంలో ఉంటుంది. కానీ సరిగ్గా ఒక వారం గడిచేసరికి ఆ ఫోన్ చాలా సాధారణంగా అనిపిస్తుంది. జీతం పెరిగితే బాగుండు అనుకుంటారు. ప్రమోషన్ వచ్చి జీతం పెరుగుతుంది.
(02:01) ఆ నెల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మూడు నెలలు తిరిగేసరికి ఆ పెరిగిన జీతం కూడా సరిపోనట్లు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ఎక్కువ జీతం కావాలనిపిస్తుంది. అసలు ఎంతో కష్టపడి మనం సాధించిన సంతోషం కొద్ది రోజులకే ఎందుకు మాయమైపోతుంది? మనం మళ్ళీ పాత అసంతృప్తి స్థితికి ఎందుకు చేరుకుంటాం? దీనికి సైకాలజీలో ఒక అద్భుతమైన పేరు ఉంది. దాన్నే హెడానిక్ ట్రెడ్మిల్ లేదా హెడానిక్ అడాప్టేషన్ అంటారు.
(02:28) మిత్రులారా జిమ్ లో ఉండే ట్రెడ్మిల్ పై మనం ఎంత వేగంగా పరిగెత్తినా ఒకే చోట ఎలా ఉంటామో ఈ హెడానిక్ ట్రెడ్మిల్ కూడా అంతే. మనం కొత్త ఇల్లు కొన్నా కొత్త కారు కొన్నా పెళ్లి చేసుకున్నా [సంగీతం] లేదా లాటరీ తగిలిన మన సంతోషం తాత్కాలికంగా ఒక్కసారిగా పైకి లేస్తుంది. కానీ మన మెదడు చాలా తెలివైనది. అది ఆ కొత్త సుఖాన్ని చాలా త్వరగా అలవాటు చేసేసుకుంటుంది.
(02:51) దాంతో ఆ కొత్త లగ్జరీ అనేది మనకు చాలా నార్మల్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ కొత్త వస్తువు మనకి నార్మల్ అయిపోతుందో మన మనసు మళ్ళీ బోరు కొట్టేసి అంతకంటే పెద్ద వస్తువు కోసం మరింత ఎక్కువ సుఖం కోసం పరుగు తీయడం ప్రారంభిస్తుంది. అంటే మనం జీవితాంతం కోరికల ట్రెడ్మిల్ మీద పరిగెడుతూనే ఉంటాం. అలసిపోతూనే ఉంటాం. కానీ నిలకడైన సంతోషం అనే గమ్యస్థానాన్ని మాత్రం ఎప్పటికీ చేరుకోలేం.
(03:17) మిత్రులారా మనం హెడోనిక్ ట్రెడ్మిల్ గురించి మాట్లాడుకున్నాం. ఎంత సాధించినా మన సంతోషం మళ్ళీ [సంగీతం] మొదటికే ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం. కానీ అసలు మనల్ని అలా నిరంతరం పరిగెత్తించే ఆ అదృశ్య హంతకుడు ఎవరు? మన మెదడు లోపల ఉండి ఇంకా కావాలి. ఇది సరిపోదు అని మనల్ని వెర్రివాళ్ళను చేసే ఆ విలన్ పేరేంటో తెలుసా? అదే డోపమైన్ చాలామంది డోపమైన్ అంటే సంతోషాన్ని ఇచ్చే హార్మోన్ అనుకుంటారు కానీ అది పచ్చి అబద్ధం సైన్స్ ప్రకారం డోపమైన్ అనేది సంతోషాన్ని ఇచ్చే కెమికల్ కాదు అది కేవలం ఆ సంతోషం కోసం మనల్ని పరిగెత్తించే కెమికల్ అసలు ఈ డోపమైన్ మాయాజాలం మనల్ని
(04:04) అత్యాస అనే ఉచ్చులో ఎలా పడేస్తుంది? మిత్రులారా మన మెదడుకు ఒక వింత స్వభావం ఉంది. మనం ఏదైనా కొత్త వస్తువును కొనాలని ఆశపడుతున్నప్పుడు లేదా మనకు నచ్చిన పని [సంగీతం] చేయబోతున్నప్పుడు ఆ నిమిషం కంటే ముందే మన మెదడులో డోపమైన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఉదాహరణకు ఒక కొత్త బైక్ కొనాలని మీరు ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం.
(04:30) షోరూమ్ కి వెళ్ళేటప్పుడు ఆ బైక్ ఫోటోలు చూసేటప్పుడు మీ మెదడులో డోపమైన్ వెల్లువలా ప్రవహిస్తుంది. ఆ సమయంలో మీకు కలిగే ఆ కిక్కే వేరు కానీ ఎప్పుడైతే ఆ బైక్ మీ ఇంటికి వచ్చేస్తుందో ఆ క్షణం నుండి డోపమైన్ విడుదల కావడం తగ్గిపోతుంది. ఎందుకంటే మెదడుకు ఆ వస్తువు దొరికేసింది. దొరికిన వస్తువుపై దానికి ఆసక్తి ఉండదు. దాంతో సంతోషం ఆవిరైపోతుంది.
(04:58) మళ్ళీ ఆ కోల్పోయిన కిక్ కోసం మెదడు మీతో మరొక కొత్త వస్తువుపై ఆశపడేలా చేస్తుంది. బైక్ వచ్చేసిందిగా ఇప్పుడు కారుకొను అప్పుడు ఇంకా ఎక్కువ కిక్ వస్తుంది అని మిమ్మల్ని మరో పరుగుకు ఉసిగొలుపుతుంది. ఇదే డోపమైన్ ట్రాప్ ఈ చక్రానికి అంతం [సంగీతం] లేదు. మనం వస్తువుల వెనుక పరిగెడుతున్నాం అనుకుంటాం. కానీ నిజానికి మనల్ని పరిగెత్తిస్తుంది మన తలలోని ఈ చిన్న కెమికల్ మాత్రమే.
(05:28) మిత్రులారా మనం మన తలలో ఉండే డోపమైన్ అనే కెమికల్ మనల్ని నిరంతరం అత్యాస వైపు పరిగత్తిస్తుందో శాస్త్రీయంగా తెలుసుకుందాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేటి సైన్స్ కనిపెట్టిన ఈ సత్యాన్ని వేల సంవత్సరాల క్రితమే కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎంతో స్పష్టంగా బోధించారు. [సంగీతం] భగవద్గీతలోని 16వ అధ్యాయం 21వ శ్లోకంలో కృష్ణుడు ఇలా అంటారు.
(05:57) త్రివిధం నరకస్దం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తధ [సంగీతం] లోభస్తస్మాదేతత్రయం త్యజేత్ దీని అర్థం మనిషిని సర్వనాశనం చేసి నరకానికి దారి తీసే ద్వారాలు మూడు ఉన్నాయి. అవి కామము క్రోధము మరియు లోభము అందుకే ఈ మూడింటిని వెంటనే వదిలపెట్టాలి. అసలు కృష్ణుడు అత్యాసను నరక ద్వారంతో ఎందుకు పోల్చారు కోరికలు అనేవి అగ్ని లాంటివి మండుతున్న అగ్నిలో నెయ్యి పోస్తే ఏమవుతుంది మంటలు చల్లారుతాయా లేదు మరింత ఉదృతంగా పైకి లేస్తాయి.
(06:36) మన కోరికలు కూడా అంతే ఒక కోరిక తీరగానే అబ్బా ప్రశాంతంగా ఉంది. ఇక నాకు ఏ కోరికలు వద్దు అని మనసు అనుకోదు. మరింత పెద్ద కోరిక అనే నెయ్యిని ఆ మనసులోని అగ్నిలో పోసి నిరంతరం రగిలిపోయేలా చేస్తుంది. అందుకే గీతలో లోభాన్ని నరకం అన్నారు. ఎందుకంటే ఎంత ఉన్నా తృప్తి చెందకుండా లోలోపల నిరంతరం రగిలిపోతూ బ్రతకడమే అసలైన నరకం. ఎదుటివాడి ఆస్తిని చూసి కుళ్లిపోవడం ఇంకా సంపాదించాలనే పిచ్చితో నైతిక విలువలను వదిలేయడం చివరకు మనిషిని మానసికంగా సెవెన్ లా మారుస్తాయి.
(07:15) మిత్రులారా కృష్ణుడు మనల్ని సంపాదించవద్దని చెప్పలేదు. కర్మను వదిలేయమని అనలేదు. ఆయన హెచ్చరించింది కేవలం అత్యాశ గురించి మాత్రమే మరి మేము అసలు ఆశపడకూడదా జీవితంలో పైకి ఎదగాలని కోరుకోవడం తప్ప మంచి ఇల్లు కారు కొనుక్కోవాలని కలలు కనడం కూడా అత్యాశే అవుతుందా? ఖచ్చితంగా కాదు మిత్రులారా జీవితంలో ఎదగాలని కోరుకోవడం ఆశ [సంగీతం] కానీ ఎదుటివాడిని తొక్కేసయనా సరే నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం అత్యాశ అసలు ఈ ఆశకు మరియు అత్యాశకు మధ్య ఉన్న ఆ సన్నటి గీత ఏంటి? దీనిని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది.
(07:55) పడవ నీటిలో ఉంటేనే ప్రయాణించగలదు. నదిలో నీరు ఉండడం పడవకు ఎంత అవసరమో మన జీవితం సాగడానికి డబ్బు వస్తువులు ఉండడం కూడా అంతే అవసరం. ఇది మన కనీస అవసరం లేదా ఆశ. కానీ అదే నది నీరు పడవ లోపలికి వస్తే ఏమవుతుంది? ఆ పడవ మునిగిపోతుంది. అలాగే డబ్బు మన జేబిలోనూ అవసరాలు తీర్చుకోవడంలోనూ ఉన్నంతవరకు ఏ సమస్య లేదు. కానీ ఎప్పుడైతే ఆ డబ్బు మరింత సంపాదించాలనే వెర్రి కోరిక మన తలకఎక్కుతుందో అది మన మనశశాంతిని చివరకు మన ఆత్మ గౌరవాన్ని కూడా ముంచేస్తుంది.
(08:30) ఇదే అత్యాస. ఎప్పుడైతే ఒక మనిషి అత్యాస అనే ఊబిలో పడిపోతాడో వాడికి తన ఆత్మగౌరవం కంటే విలువలు బంధాల కంటే డబ్బే ఎక్కువైపోతుంది. తప్పుడు మార్గాల్లోనైనా సరే సంపాదించాలనుకుంటాడు. వాడు ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజంలో వాడికి గౌరవం దక్కదు. మిత్రులారా ఆశ నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీ కుటుంబానికి మంచి భవిష్యత్తుని ఇస్తుంది.
(08:56) కానీ అత్యాశ నిన్ను గుడ్డివాడిని చేస్తుంది. నీ ఆత్మగౌరవాన్ని సైతం తాకట్టు పెట్టేలా చేస్తుంది. అందుకే మన అవసరం ఏంటో మనం తెలుసుకోవాలి. మిత్రులారా అత్యాశ అనే రోగం మనిషిని ఎంతటి ప్రమాదంలోకి నిడుతుందో మన కంటికి కనిపించని ఆశల వెనక పరిగెడితే చివరకు ఏం మిగులుతుందో వివరించడానికి ప్రపంచ ప్రసిద్ధ రచయిత లియో టాల్స్టాయ్ రాసిన ఒక అద్భుతమైన కథ ఇప్పుడు విందాం.
(09:23) ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఎప్పటికైనా సొంతంగా భూమి సంపాదించి గొప్పవాడవ్వాలనే బలమైన కోరిక ఉండేది. ఒకరోజు ఆ దేశపు రాజు ఆ రైతుకు ఒక వింత ఆఫర్ ఇచ్చాడు. ఓ రైతు రేపు ఉదయం సూర్యోదయ సమయానికి నువ్వు ఇక్కడి నుండి పరుగు ప్రారంభించాలి. సూర్యాస్తమయం అయ్యేలోపు నువ్వు ఎంత దూరం పరిగెత్తి మళ్ళీ సరిగ్గా అదే సమయానికి నేను చెప్పిన చోటుకు తిరిగి వస్తావో ఆ పరుగులో నువ్వు చుట్టి వచ్చిన భూమి అంతా నీ సొంతం అవుతుంది.
(09:58) కానీ ఒకవేళ సూర్యాస్తమయం లోపు నువ్వు తిరిగిన చోటుకు చేరలేకపోతే నీకు ఒక్క గజం నేల కూడా దక్కదు. అసలు ఆ రైతు ఆ రోజంతా ఎలా పరిగెత్తాడు మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే రైతు పరుగు ప్రారంభించాడు. అతడు మొదట చాలా వేగంగా పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పచ్చటి పొలం కనిపించింది. [సంగీతం] అబ్బా ఇది చాలా బాగుంది.
(10:23) దీన్ని కూడా నా భూమిలో కలుపుకుంటాను అని అటువైపు పరిగెత్తాడు. మధ్యాహ్నం అయింది విపరీతమైన ఎండ దాహం వేస్తోంది. అయినా అతడు ఆగలేదు ఈ ఒక్క రోజు కష్టపడితే నా జీవితాంతం హాయిగా బ్రతకవచ్చు అని అనుకుంటూ ఇంకా ముందుకు పరిగెట్టాడు. సమయం మధ్యాహ్నం మూడు దాటింది. ఇప్పుడు అతనికి భయం మొదలయింది. తను చాలా దూరం వచ్చేసాడు. సూర్యాస్తమయం లోపు మళ్ళీ మొదటి స్థానానికి చేరుకోవాలి.
(10:50) లేదంటే ఎంత పరిగెత్తిన ఒక్క గజం భూమి కూడా దక్కదు. అలసిపోయిన కాళ్ళతో ఊపిరాడని గుండెతో వెనక్కి పరుగు లంకించుకున్నాడు. సూర్యుడు మెల్లగా కిందకు జారిపోతున్నాడు. దూరం నుండి రాజు గిరిజనులు నిలబడిన కొండ కనిపిస్తోంది. రైతు తన శరీరంలోని చివరి శ్వాస వరకు శక్తులన్నిటిని కూడగొట్టుకొని రక్తపు ఓడుతున్న కాళ్ళతో పరిగెట్టాడు.
(11:15) సూర్యుడు పూర్తిగా అస్తమించే సరిగ్గా అదే సెకనకు ఆ రైతు ఎలాగోలా గీతను తాకి కింద పడిపోయాడు. రాజు సంతోషంగా నువ్వు గెలిచావు ఈ భూమి అంతా నీదే అని కేక వేశడు. కానీ ఆ రైతు పలకలేదు. అతిగా పరిగెత్తడం వల్ల గుండె ఆగిపోయి అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చివరకు ఆ గిరిజనులు ఒక పార తీసుకొని ఆ రైతు శవాన్ని పూర్చడానికి ఒక గోతిని తవ్వారు.
(11:45) ఆ గోతి పొడవు ఎంతో తెలుసా? కేవలం ఆ ఆరు అడుగుల నేల మాత్రమే. మిత్రులారా ఆ రోజంతా వేల ఎకరాల భూమి కోసం ప్రాణాలు పోయేలా పరిగెత్తిన ఆ రైతుకు చివరకు మిగిలింది కేవలం తన శవాన్ని పూర్చడానికి సరిపడా ఆ ఆరు అడుగుల నేల మాత్రమే మన జీవితం కూడా ఇంతే కదా ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు వెనకేసినా పోయేటప్పుడు మనం తీసుకెళ్లేది ఏముంది? మరి లేని దాని కోసం ఈ వెర్రి పరుగు ఎందుకు? కానీ మన ఈ వెర్రి పరుగుకు కేవలం మన ఆశలే కారణమా? లేక మన చుట్టూ ఉండే సమాజం సోషల్ మీడియా మనల్ని పక్కవారితో పోల్చుకునేలా చేసి మనల్ని మరింత అత్యాస వైపు నెడుతున్నాయా మిత్రులారా ఈ రోజుల్లో మనకు
(12:29) కావాల్సినవన్నీ ఉండి మనం ఎంతో సంతోషంగా ఉన్నా సరే అకస్మాత్తుగా మన మనసులో లేనిపోని అసంతృప్తిని అత్యాసను రేకెత్తిస్తున్న ఒక పెద్ద మాయా ప్రపంచం మన చేతుల్లోనే ఉంది. అదే సోషల్ మీడియా మనకొక చిన్న కార్ ఉంటుంది. దాంతో మనం ఎంతో సంతోషంగా ప్రయాణిస్తుంటాం. కానీ ఒకరోజు ఉదయాన్నేఇస్గ్ర ఓపెన్ చేయగానే మన క్లాస్మేట్ ఎవరో 30 లక్షల లగ్జరీ కారు కొన్నట్లు పెట్టిన ఫోటో కనిపిస్తుంది.
(13:00) అంతే ఆ మరుక్షణమే మనకున్న కారుపై మనకు అసంతృప్తి మొదలవుతుంది. మన ఇల్లు చిన్నలైపోతుంది. మన జీవితం దండగలా అనిపిస్తుంది. అసలు ఈ కంపారిజన్ ట్రాప్ మనల్ని ఎలా నాశనం చేస్తోంది? మిత్రులారా సోషల్ మీడియా గురించి ఒక గొప్ప సైకలాజికల్ సత్యం ఉంది. మనం ఇతరుల యొక్క హైలైట్ రీల్ చూసి మన జీవితం యొక్క బిహైండ్ ద సీన్స్ తో పోల్చుకుంటున్నాం.
(13:29) ఎవరైనా సరే తమ జీవితంలోని బాధలను గొడవలను అప్పులను Facebook లోనోఇస్గ లోనో పోస్ట్ చేస్తారా? చేయరు. వారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆ ఒక్క క్షణపు సంతోషాన్ని రంగుల ప్రపంచాన్ని మాత్రమే ప్రపంచానికి చూపిస్తారు. కానీ మనమేం భావిస్తామ అంటే వాళ్ళ జీవితం ఎంత అద్భుతంగా ఉందో నా బతుకే ఇలా తగలబడింది అని మనల్ని మనం తిట్టుకుంటాం. ఫలితంగా మన అవసరాలు తీరినా కూడా పక్కవాడి కంటే గొప్పగా కనిపించాలని ఒక సరికొత్త అత్యాశ మన తలకఎక్కుతుంది.
(14:03) ఆ పోలికల పరుగులో పడి మనకున్న సంతోషాన్ని మనమే చేతులారా తగులబెట్టేసుకుంటాం. థియోడర్ రూజ్వెల్ట్ అన్నట్లు కంపారిజన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ జాయ్. మిత్రులారా పక్కవాడి లైఫ్ తో నీ జీవితాన్ని పోల్చుకోవడం ఆపనంత కాలం నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఈ భూమిపై పరమ దరిద్రుడిలాగే బ్రతుకుతావు. ఎందుకంటే నీకంటే ఎక్కువ ఉన్నవాడు ఎవడో ఒకడు ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు.
(14:29) నీ ప్రయాణం నీది వాడి ప్రయాణం వాడిది. మిత్రులారా ఇప్పటివరకు మనం అత్యాస వెనక ఉన్న సైకాలజీని సోషల్ మీడియా మనల్ని నెట్టే పోలికల ఉచ్చు గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి మనసులో ఒక మౌలికమైన ప్రశ్న ఖచ్చితంగా మెదులుతుంది. [సంగీతం] అసలు డబ్బు సంతోషాన్ని ఇవ్వదా? ఒకవేళ ఇస్తే డబ్బు మనల్ని ఎంతవరకు సంతోషంగా ఉంచగలదు? దీనికి శాస్త్రీయమైన పరిమితి ఏమైనా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి.
(15:07) నోబెల్ బహుమతి గ్రహీతలైన సైకాలజిస్ట్లు సైతం దీనిపై లోతైన అధ్యయనాలు చేశారు. వారంతా తీల్చిన ఆశ్చర్యకరమైన నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రులారా శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం డబ్బు ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంది. కానీ కేవలం ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే. మనకు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకునే స్తోమత లేకపోతే డబ్బు మనకు అత్యంత అవసరం.
(15:39) ఆ సమయంలో డబ్బు మనకు వచ్చే కొద్దీ మన సంతోషం ప్రశాంతత విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే అది మన ప్రాథమిక అవసరాలను తీర్చి మనల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడుతుంది. కానీ ఎప్పుడైతే ఒక మనిషి తన కనీస అవసరాలు దాటి ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని చేరుకుంటాడో ఆ తరువాత అతడి సంపాదన ఎంత పెరిగినా అతడి రోజువారి సంతోషంలో ఎలాంటి మార్పు ఉండదు.
(16:11) ఉదాహరణకు రోజుకు మూడు పూటల హాయిగా తినే వ్యక్తికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్లో తినే వ్యక్తికి లభించే ఆకలి తృప్తి [సంగీతం] ఒక్కటే ఒక సాదా సీదా కార్లో ప్రయాణించే వ్యక్తి ఐదు కోట్ల లగ్జరీ కార్లో ప్రయాణించే వ్యక్తి ఇద్దరూ చేరుకునే గమ్యం ఒక్కటే మిత్రులారా డబ్బుతో మనం ఒక లగ్జరీ బెడ్ ను కొనగలం కానీ ప్రశాంతమైన నిద్రను కొనలేం.
(16:41) డబ్బుతో అద్భుతమైన పుస్తకాలను కొనగలం కానీ జ్ఞానాన్ని కొనలేం. డబ్బుతో ఖరీదైన మందులను కొనగలం కానీ ఆరోగ్యాన్ని కొనలేం. సరిగ్గా ఈ పరిమితిని గుర్తించకుండా మనుషులు మరింత డబ్బు సంపాదిస్తే మరింత సంతోషం వచ్చేస్తుంది అనుకొని కోట్లు వెనకేసే పరుగులో పడతారు. కానీ తీరా ఆ కోట్లు వచ్చాక కూడా లోపల శూన్యమే మిగులుతుంది. అయితే ఈ నిజాన్ని మన బుద్ధి ఒప్పుకున్నా మన మనసు మాత్రం ఎందుకు మళ్ళీ మళ్ళీ కొత్త కోరికల వెనక పరుగు తీస్తుంది.
(17:17) లోపల ఏదో వెలితి మనల్ని నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. దీనికి గౌతమ బుద్ధుడు వేల సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైన పదాన్ని ఉపయోగించారు. అదే తృష్ణ. సంస్కృతంలో తృష్ణ అంటే తీరని దాహం ఎడారిలో ఎండమావిని చూసి నీరు అనుకొని పరిగెట్టే జింకలాగా మనిషి కూడా కోరికల వెనక పరిగెడుతుంటాడని బుద్ధుడు చెప్పారు. అసలు ఈ తృష్ణ సిద్ధాంతం మన జీవితాలకు ఎలా వర్తిస్తుంది? మిత్రులారా ఎవరైనా సరే దాహం వేసినప్పుడు మంచి నీరు తాగుతారు.
(17:51) దాంతో దాహం తీరి ప్రశాంతత లభిస్తుంది. కానీ ఒకవేళ మనం దాహం వేసినప్పుడు సముద్రంలోని ఉప్పు నీటిని తాగితే ఏం జరుగుతుంది? ఆ నీరు మన దాహాన్ని తీరుస్తుందా? లేదు సరే కదా ఆ ఉప్పునీరు మన శరీరంలోని తడిని ఇంకా లాగేసి మనకు మరింత భయంకరమైన దాహాన్ని కలిగిస్తుంది. మనం [సంగీతం] ఎంత ఎక్కువ తాగితే అంత త్వరగా ప్రాణాలు కోల్పోతాం. మన కోరికల తృష్ణ కూడా సరిగ్గా ఈ ఉప్పు నీటి లాంటిదే.
(18:22) ఈ ఒక్క వస్తువు దొరికితే చాలు నా జీవితం ధన్యమైపోతుంది అనుకుంటాం. కానీ అది దొరకగానే మన లోపలి దాహం తీరదు. పైగా ఆ వస్తువు మనల్ని [సంగీతం] మరింత పెద్ద కోరిక వైపు లాగుతుంది. కొత్త ఇల్లు రాగానే పక్కింటి వాడి కంటే పెద్ద ఇల్లు కావాలనే తాపత్రయం మొదలవుతుంది. ఈ పరుగుకు ముగింపు ఎక్కడ? బుద్ధుడు చెప్పిన చతురార్య సత్యాలలో [సంగీతం] రెండవది ఇదే దుఃఖానికి మూల కారణం కోరికలే.
(18:46) మనం కోరికలను పూర్తిగా [సంగీతం] చంపేయాల్సిన అవసరం లేదు. కానీ ఏ కోరిక కూడా మనకు శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వలేదు అనే నిజాన్ని గ్రహించడమే జ్ఞానం. ఆ అవగాహన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం వస్తువుల వెనక పిచ్చిగా పరిగెత్తడం ఆపేస్తాం. మిత్రులారా కోరికల వెంట పరిగెట్టడం అంటే ఎండమావుల వెనుక పరిగెట్టడమేనని అర్థం చేసుకున్నాం.
(19:11) మరి ఈ రోగానికి అసలు మందు లేదా మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకునే ఆ రహస్యం ఏంటి? అక్కడే మనకు పరిచయంవుతుంది అత్యంత శక్తివంతమైన మానసిక స్థితి అదే సంతృప్తి సంతృప్తి అంటే చాలామంది ఏమనుకుంటారంటే సోమరిపోతుల్లా ఉండిపోవడం అసలు ఏ పని చేయకుండా ఉన్నదానితో సరిపెట్టుకోవడం అని కానీ అది చాలా తప్పు సంతృప్తి అంటే ప్రగతిని ఆపేయడం కాదు నువ్వు ఉన్న స్థితిని గౌరవిస్తూ నీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతతో ఉంటూనే ముందుకు సాగడం అసలు ఈ మానసిక స్థితి మనల్ని ఎలా కాపాడుతుంది? మిత్రులారా ఒక అద్భుతమైన సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి.
(19:54) సంతృప్తి లేని మనస్సు చిల్లులు పడిన పాత్ర లాంటిది అని ఆ పాత్రలో మీరు ఎన్ని గంగనీళ్లు పోసినా అది ఎప్పటికీ నిండదు. అలాగే మనసులో సంతృప్తి లేనప్పుడు మీరు ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఎన్ని లగ్జరీ కార్లు కొన్నా ఆ మనసు ఎప్పటికీ ప్రశాంతంగా మారదు. ఎందుకంటే ఆ మనసు ఎప్పుడూ లేని దాని గురించే ఆలోచిస్తూ ఏడుస్తుంది [సంగీతం] తప్ప ఉన్నదాన్ని అనుభవించలేదు.
(20:21) దీనికి విభిన్నంగా సంతృప్తి అనేది ఒక మానసిక కవచం లాంటిది. అది నీ దగ్గర ఉన్న వస్తువుల పరిమాణాన్ని బట్టి రాదు. నీ ఆలోచన విధానాన్ని బట్టి వస్తుంది. ఈరోజు నాకు తినడానికి మంచి ఆహారం ఉంది. ఉండడానికి ఇల్లు ఉంది నన్ను ప్రేమించే కుటుంబం ఉంది. నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు అని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటావో అప్పుడే నీ లోపల ఒక సరికొత్త ప్రశాంతత మొదలవుతుంది.
(20:54) ఆ క్షణం నుండి నీవు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడివ అయిపోతావు. మిత్రులారా రోమన్ ఫిలాసఫర్ శెనక అన్నట్లు పేదరికం అంటే తక్కువ వస్తువులు కలిగి ఉండడం కాదు ఇంకా కావాలని నిరంతరం తపించడమే అసలైన పేదరికం మీ వద్ద ఎంత ఉందనేది ముఖ్యం కాదు ఉన్నదాన్ని మీరు ఎంతలా ఆస్వాదిస్తున్నారు అనేదే ముఖ్యం. మిత్రులారా మరి ఆ సంతృప్తిని మన నిజ జీవితంలోకి తెచ్చుకోవడానికి ఈ అత్యాసల పరుగును ఆపడానికి ఒక ప్రాక్టికల్ మార్గం ఉందా? ఖచ్చితంగా ఉంది.
(21:28) ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తమ జీవితాలను ప్రశాంతంగా మార్చుకోవడానికి నేడు ఒక అద్భుతమైన జీవన విధానాన్ని ఆచరిస్తున్నారు. దాన్నే మినిమలిజం అంటారు. మినిమలిజం అంటే ఇల్లు వాకిలి వదిలేసి అడవుల్లోకి పోవడం కాదు మినిమలిజం అంటే మనకు ఏవైతే అత్యంత ముఖ్యమో మనకు నిజమైన సంతోషాన్ని ఇస్తాయో వాటిని మాత్రమే ఉంచుకుని మిగిలిన అనవసరమైన బరువును మన జీవితంలో నుండి తొలగించడం.
(21:56) అసలు ఈ విధానం మనల్ని అత్యాశ నుండి ఎలా కాపాడుతుంది? మిత్రులారా ఒక్కసారి మీ ఇంటిని గమనించండి. మీ ఇంట్లో కేవలం షో కోసం కొని ఎప్పుడూ వాడకుండా మూలన పడేసిన వస్తువులు ఎన్ని ఉన్నాయి? కేవలం ఆఫర్లలో వచ్చాయని కొని అల్మారాలో మూలుగుతున్న బట్టలు ఎన్ని ఉన్నాయి? సైకాలజీ ప్రకారం మన చుట్టూ వస్తువులు ఎంత ఎక్కువగా ఉంటే మన మనసులో ఒత్తిడి అంత ఎక్కువగా ఉంటుంది.
(22:24) ఆ వస్తువులను క్లీన్ చేయడంలో వాటిని [సంగీతం] కాపాడుకోవడంలోనే మన సమయం, శక్తి, వృధా అయిపోతుంటాయి. మినిమలిజం మనకుొక అద్భుతమైన పాఠం నేర్పుతుంది. నువ్వు కొనే వస్తువులు నిన్ను నిర్వచించవు. నువ్వు 10 జతల బట్టలు ఉంచుకున్న ప్రశాంతంగా ఉండగలవు. నీ ఇంట్లో వస్తువులను తగ్గించినప్పుడు నీకు సమయం మిగులుతుంది. నీ డబ్బు ఆదా అవుతుంది.
(22:49) అన్నింటికంటే ముఖ్యంగా ఇంకా కొనాలి ఇంకా చూపించుకోవాలి అని ఆ డోపమైన్ పరుగు ఆగిపోతుంది. వస్తువులను సేకరించడం కంటే ప్రయాణాలు చేయడం కుటుంబంతో సమయం గడపడం వంటి అనుభవాలకు నువ్వు విలువ ఇవ్వడం మొదలు పెడతావు. మిత్రులారా తక్కువ వస్తువులు కలిగి ఉండడం అంటే వెనకబడిపోవడం కాదు అది నీ జీవితంపై నీకున్న అద్భుతమైన నియంత్రణకు నిదర్శనం. మీ జీవితంలో అనవసరమైన భారాన్ని ఎంత తగ్గిస్తే [సంగీతం] మీ మనసు అంత తేలికగా మారి స్వేచ్ఛగా ఎగురుతుంది.
(23:21) మిత్రులారా కానీ మన మనసులో ఉండే అత్యాశయ అనే చీకటిని తరిమికొట్టే అత్యంత ప్రకాశవంతమైన దీపం ఒకటి ఉంది. ఆ దీపమే కృతజ్ఞతా భావం. మనకొక వింత అలవాటు ఉంది. మన జీవితంలో భగవంతుడు మనకు ఎన్నో అద్భుతమైన విషయాలను ఇచ్చాడు కానీ మనం వాటిని ఎప్పుడూ పట్టించుకోం. మనకు లేని ఆ ఒక్క శాతం కోసమే ఉన్న 99 %ాతన్ని మరిచిపోయి రోజు ఏడుస్తూ ఉంటాం. నాకు ఆ ఇల్లు లేదు నాకు ఆ జీతం లేదు నాకు ఆ అందం లేదు అని నిరంతరం మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఎదుటివారిని చూసి ఈర్ష పడుతుంటాం.
(23:58) కానీ ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మీరు తింటున్న మూడు పూటల తిండి మీరు ఉంటున్న ఈ ఇల్లు మీరు పీలుస్తున్న ఈ శ్వాస ఈ భూమిపై కోట్ల మందికి కేవలం ఒక కల మాత్రమే అసలు ఈ కృతజ్ఞతా భావం మన మెదడును ఎలా మారుస్తుంది? మిత్రులారా సైకాలజీ ప్రకారం ఎప్పుడైతే మనం మన జీవితంలో ఉన్న మంచి విషయాల పట్ల కృతజ్ఞతగా ఉంటామో అప్పుడు మన మెదడులో డోపమైన్ మరియు సెరటోనిన్ వంటి హ్యాపీ కెమికల్స్ సహజంగానే విడుదలవుతాయి.
(24:27) దీనికోసం ఒక అద్భుతమైన సైకలాజికల్ టెక్నిక్ ఉంది. దాన్నే గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అంటారు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈరోజు నా జీవితంలో జరిగిన మూడు మంచి విషయాలు ఏంటి అని ఆలోచించి ఒక పుస్తకంలో రాయండి. అది మీ స్నేహితుడు మీకు చేసిన చిన్న సహాయం కావచ్చు లేదా అమ్మ వండిన రుచికరమైన వంట కావచ్చు. ఎప్పుడైతే మీరు ఇలా రాయడం మొదలు పెడతారో మీ మెదడి యొక్క దృష్టి లేని వాటి నుండి ఉన్నవాటి వైపు మళ్ళుతుంది.
(24:58) ఎప్పుడైతే ఉన్నవాటి విలువ మీకు తెలుస్తుందో అప్పుడు మీలో అత్యాస చచ్చిపోతుంది. అంతులేని సంతృప్తి ప్రవహిస్తుంది. మిత్రులారా నీవు ఏడవడానికి వంద కారణాలు వెతికితే నవ్వడానికి 1000 కారణాలు నీ కళ్ళ ముందే కనిపిస్తాయి. దృక్పదాన్ని మార్చుకోండి. కృతజ్ఞతతో బ్రతకడం నేర్చుకోండి. మిత్రులారా ఇప్పటివరకు మనం అత్యాస వెనుక ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక కోణాలన్నింటిని విశ్లేషించుకున్నాం.
(25:26) అయితే ఇప్పుడు మనకు కావాల్సింది కేవలం సిద్ధాంతాలు కాదు ప్రాక్టికల్ సొల్యూషన్స్ మన మనసు ఏదైనా వస్తువును చూసి ఇది నాకు ఎలాగైనా కావాలి కొనే అని బలవంతం చేస్తున్నప్పుడు ఆ అత్యాసను లేదా లోభాన్ని ఆ క్షణంలోనే ఎలా అదుపు చేయాలి? మనసును మన అధీనంలోకి తెచ్చుకోవడానికి సైకాలజీ మరియు ఆధ్యాత్మికత అందించే మూడు అద్భుతమైన మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
(25:53) మిత్రులారా అత్యాసను జయించడానికి మొదటి సూత్రం 48 గంటల నియమం. మీరు ఆన్లైన్ లోనో లేదా బయటనో ఏదైనా ఖరీదైన వస్తువును చూసి దాన్ని వెంటనే కొనేయాలని మీ మనసు కొట్టుకుపోతున్నప్పుడు ఒక్క నిమిషం ఆగండి. దీన్ని నేను ఖచ్చితంగా కొంటాను. కానీ ఈ రోజు కాదు సరిగ్గా రెండు రోజుల తర్వాత అని మీ మనసుకు చెప్పి ఆ నిర్ణయాన్ని వాయిదా వేయండి.
(26:21) ఆశ్చర్యంగా ఆ 48 గంటలు గడిచేసరికి మీ మెదడులోని డోపమైన్ లెవెల్స్ పడిపోతాయి. ఆ వస్తువుపై ఉన్న వెర్రి ఆకర్షణ తగ్గిపోతుంది. అప్పుడు మీరు ఆలోచిస్తే అసలు ఆ వస్తువు మీకు ఎంతవరకు అవసరమో మీ బుద్ధికి స్పష్టంగా అర్థమవుతుంది. రెండవ సూత్రం ఇచ్చే గుణాన్ని అలవరుచుపోవడం. లోభాన్ని జయించడానికి దానం చేయడం కంటే పెద్ద ఆయుధం మరొకటి లేదు. నీ దగ్గర ఉన్నదానిలోనుంచి కొద్దిగా సమాజానికి ఇవ్వడం నేర్చుకో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అవసరంలో ఉన్నవాడికి సహాయం చేయడం వల్ల నీ మనసులో ఉండే స్వార్థం లోభం కరిగిపోతాయి.
(26:58) తీసుకోవడంలో ఉండే సంతోషం కంటే ఇవ్వడంలో ఉండే తృప్తి కొన్ని కోట్ల రెట్లు గొప్పదని నీకు అర్థమవుతుంది. మూడవ సూత్రం అవసరాల జాబిత ఏదైనా కొనే ముందు ఇది నా జీవితం సాగడానికి అత్యవసరమా లేక కేవలం నలుగురికి చూపించుకోవడానికి నేను పడుతున్న ఆశ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిత్రులారా మనసు ఒక అల్లరి కోతి లాంటిది. దానికి అడిగిందల్లా ఇస్తూ పోతే అది మనల్ని సర్వనాశనం చేస్తుంది.
(27:26) దానికి ఎక్కడ బ్రేక్ వేయాలో తెలిసినవాడే తన జీవితానికి అసలైన యజమాని. మిత్రులారా మనం లోభాన్ని ప్రాక్టికల్ గా ఎలా జయించాలో తెలుసుకున్నాం. కానీ ఇక్కడ మనం చాలా ముఖ్యమైన ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం రాత్రింబల కష్టపడుతున్నాం. నిద్ర లేకుండా పరిగెడుతున్నాం. మనశశాంతిని సైతం తాకట్టు పెడుతున్నాం. దేనికోసం? సంపన్నులం అవ్వడం కోసం కానీ అసలు సంపద అంటే ఏంటో మనకు తెలుసా? చాలా మంది దృష్టిలో ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం నగలు లగ్జరీ కార్లు పెద్ద పెద్ద బిల్డింగలు ఉండడమే సంపద.
(28:03) కానీ వాస్తవానికి ఈ భూమిపై వీటికంటే కోట్ల రెట్లు విలువైన అసలైన ఐశ్వర్యం ఒకటి ఉంది. దాన్ని మనం సంపాదన పరుగులో పడి పూర్తిగా మరిచిపోతున్నాం. అసలు ఆ నిజమైన సంపద ఏంటి? మొదటిది ఆరోగ్య సంపద. నీ జేబులో ఎన్ని కోట్లు ఉన్నా నువ్వు తినే ఆహారాన్ని నీ శరీరం అరిగించుకోలేకపోతే నీకు నచ్చిన వంటకాన్ని డాక్టర్లు వద్దని చెబితే ఆ కోట్లకు అర్థం ఏముంది? ఆరోగ్యంగా ఉండడం నీ కాళ్ళపై నువ్వు నడవగలగడం అన్నిటికంటే పెద్ద ఐశ్వర్యం.
(28:33) రెండవది సమయ సంపద. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో ముఖ్యం కాదు. నీకు నచ్చిన పని చేయడానికి నీ పిల్లలతో గడపడానికి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించడానికి నీకు సమయం ఉందా? ఆ సమయమే [సంగీతం] నీ అసలైన స్వేచ్ఛ మూడవది సంబంధాల సంపద నీకు కష్టం వస్తే భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పే మనుషులు నువ్వు ఇంటికి వెళ్ళగానే నిన్ను చూసి ప్రేమగా నవ్వే కుటుంబం నీకు ఉన్నాయా నువ్వు ఎంతో అదృష్టవంతుడివి.
(29:02) నాలుగవది మానసిక ప్రశాంతత రాత్రి బెడ్డుపై పడుకోగానే ఎలాంటి టాబ్లెట్లు లేకుండా కుళాయి తిప్పినట్లు ప్రశాంతంగా నిద్రపట్టే అదృష్టం ఉందే దాన్ని ఏ శతకోటీశ్వరుడు కూడా డబ్బు పెట్టి కొనలేడు. మిత్రులారా ఈ నాలుగు ఉన్నవాడే ఈ భూమిపై నిజమైన సంపన్నుడు. కేవలం డబ్బు మాత్రమే ఉండి ఈ నాలుగింటిని కోల్పోయినవాడు నిజానికి అత్యంత దరిద్రుడు.
(29:29) కాబట్టి డబ్బే సర్వస్వం అనుకొని మీ అసలైన ఐశ్వర్యాన్ని దూరం చేసుకోకండి. మిత్రులారా మనం ఒక అద్భుతమైన ప్రయాణం ముగింపుకు చేరుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పటికీ ఆ అత్యాస అనే వేగవంతమైన ట్రెడ్మిల్ మీద అలసిపోయేలా పరిగెడుతూనే ఉంటారా? లేక ఈ క్షణమే ఆ పరుగును ఆపి స్వేచ్ఛగా జీవిస్తారా? మిత్రులారా మనకు ఉన్న ఒకే ఒక్క జీవితంలో సంపాదన అనేది మన అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే కావాలి తప్ప అదే మన జీవిత పరమార్థం కాకూడదు.
(30:04) ఎప్పుడూ లేదనే వెలితితో బ్రతికేవాడు కోటీశ్వరుడైన దరిద్రుడే అదే ఉన్నదానితో తృప్తిగా బ్రతకడం తెలిసినవాడు పేదవాడైనా సరే ఈ భూమిపై పరమ సంతోషవంతుడే ఈ క్షణం నుండి మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి. మీ చేతుల్లో ఉన్న ఈ రోజును ఆస్వాదించండి. మీతో ఉన్న మనుషుల ప్రేమను అనుభవించండి. లేని వస్తువుల కోసం ఏడవడం ఆపేసి ఉన్నవాటితో జీవితాన్ని పండుగలా మార్చుకోండి.
(30:33) అప్పుడే మీ మనసులోని కోరికల తాకిడి కగి అంతులేని ప్రశాంతత మీ సొంతం అవుతుంది. ఆ రోజే మీ జీవితానికి నిజమైన సార్ధకత లభిస్తుంది. మిత్రులారా ఈ వీడియో యొక్క అసలు ఉద్దేశం కేవలం కొన్ని సైన్స్ విషయాలు చెప్పడం కాదు మీ మనసులోని నిరంతర ఆందోళనలను తుడిచివేసి మీ గుండెల్లో నిజమైన మనశశాంతిని నింపడం. ఏ రోజైతే మీరు అత్యాసను వదిలేసి ప్రశాంతంగా శ్వాస పీలుస్తారో ఆ రోజే ఈ వీడియో సార్థకమైనట్లు.
(31:00) ఈ వీడియో లో మీకు బాగా నచ్చిన భాగం ఏదో మీ ఆలోచనలను మార్చిన మాటేదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను నిరంతరం పరుగుల జీవితంలో పడి మానసిక ప్రశాంతతను కోల్పోతున్న మీ ఆత్మీయులకు షేర్ చేసి వారి జీవితాల్లో కూడా కాంతిని నింపండి. ఈ వీడియోను ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చే సరికొత్త వీడియోలో మరో అద్భుతమైన టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. జైహింద్

No comments:

Post a Comment