Thursday, May 14, 2026

దేన్నీ పట్టుకోకు, అన్నీ నీ దగ్గరికే వస్తాయి | The Power Of Letting Things Go | Satyagrahi

దేన్నీ పట్టుకోకు, అన్నీ నీ దగ్గరికే వస్తాయి | The Power Of Letting Things Go | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p6V_hvcq7YE



Transcript:
(00:01) [సంగీతం] ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. ఈ ప్రపంచంలో అందరికీ తెలిసిన ఖచ్చితంగా జరగబోయే ఒకే ఒక్క నిజం ఏంటో తెలుసా మరణం కానీ విచిత్రం ఏంటంటే మనందరికీ అత్యంత భయం కలిగించే విషయం కూడా అదే. అసలు మనకి చావు అంటే ఎందుకు అంత భయం? ఎప్పుడైనా దీని గురించి లోతుగా ఆలోచించారా? మనం ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు దూరమవుతారనా లేక మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అంతస్తులు ఇక్కడే వదిలేసి వెళ్ళాలనా ఈ భయం మనల్ని మనశశాంతిగా బతకనివ్వదు.
(00:36) ఆ భయం వల్లే రేపు ఏమవుతుందో అన్న ఆందోళన వల్లే ఈరోజు మనం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. నీమ్ కరోలి బాబాగారు ఒక అద్భుతమైన మాట అనేవారు మరణం అనేది ఒక పాత బట్టను తీసేసి కొత్త బట్టను వేసుకున్నంత సహజమైనది అని కానీ మనం మాత్రం ఆ పాత బట్టనే గట్టిగా పట్టుకొని కూర్చుంటాం. ఈ భయం వల్ల మీరు మీ జీవితంలో చేయాల్సిన గొప్ప పనులు మర్చిపోయి కేవలం రక్షణ కోసం భద్రత కోసం పాకులాడుతున్నారు.
(01:05) అదే మనందరిలో ఉన్న అసలైన సమస్య. ఈ భయం మనల్ని ఎంతగా బలహీన పరుస్తుందంటే చివరికి మన ఉనికిని కూడా మనం గుర్తుపట్టలేని స్థితికి తీసుకెళ్తుంది. మనం ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు అది మనతోనే శాశ్వతంగా ఉంటుంది అనుకుంటాం. కానీ కాలం గడిచే కొద్దీ అది పాడవుతుందని మనకు తెలుసు. అలాగే ఈ శరీరం కూడా శరీరానికి వచ్చే మార్పులని ముసలితనాన్ని అంగీకరించలేకపోవడమే మనల్ని వేధించే పెద్ద జబ్బు.
(01:32) మీరు గమనించారా పక్కింట్లో ఎవరో మరణిస్తే మనక అంత భయం వేయదు కానీ మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా లేకపోతే మనక ఏదైనా రోగం వస్తే మాత్రం వనికిపోతాం ఎందుకంటే అక్కడ నాది అనే ఒక అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఈ అటాచ్మెంట్ వల్లే మీరు మరణాన్ని ఒక శత్రువులా చూస్తున్నారు. అసలు ఈ భయం మనలోకి ఎప్పుడు ప్రవేశించిందో తెలుసా? [సంగీతం] ఎప్పుడైతే మీరు నేనంటే ఈ శరీరమే అని బలంగా నమ్ముతారో అప్పుడే సమస్య మొదలవుతుంది.
(02:01) నీమ్ కరోలి బాబా గారు దీన్ని చాలా సున్నితంగా విడుమర్చి చెప్పారు. మనిషికి ఒక చిన్న పాపకి మధ్య ఉన్న తేడా ఏంటో గమనించండి. ఒక చిన్న బాబుకి ఐసయు లో ఉన్నా సరే చేతికి ఏదైనా బొమ్మ ఇస్తే నవ్వుతూ ఆడుకుంటాడు. ఆ బాబుకి ఇంకా నేను ఫలానా అనే ఒక అహంకారం లేదు అందులోనూ ఐడెంటిటీ అనేది ఏర్పడలేదు కాబట్టి. కానీ మనం పెరిగి పెద్దయ్యే కొద్దీ మన చుట్టూ ఉన్న వస్తువులతో మనుషులతో ఒక అదృశ్యమైన బంధాన్ని పెంచుకుంటాము.
(02:28) ఆ బంధమే మనల్ని భయపెడుతూ ఉంటుంది. బాబాగారు తరచు ఒక విషయం గుర్తు చేసేవారు. మనం భూమ్మీదకి ఏమి తీసుకురాలేదు ఏది తీసుకొని వెళ్ళము కూడా అని కానీ మనం మాత్రం ఇక్కడ ఉన్న ప్రతిది నాది నాకే కావాలని చెప్పేసి పట్టుకుంటాం. మనం మరణానికి భయపడటం లేదు. నిజానికి మనం సంపాదించిన హోదాని పేరుని ఆస్తుల్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఉన్నాం.
(02:53) ఉదాహరణకి మీరు ఒక ప్లాట్ కొన్నారనుకోండి ఆ భూమి కొన్ని కోట్ల ఏళ్లుగా అక్కడే ఉంది. కానీ దాని మీద రిజిస్ట్రేషన్ చేయించుకోగానే అది మీద అయిపోయిందని ఒక భావన మనసులో నాటుకుపోతుంది. ఒకవేళ ఆ భూమి మీ పర్మిషన్ లేకుండా మీ పిల్లలు తీసుకోవాలన్నా సరే మీరు బాధపడతారు. ఎందుకంటే మీ మనసులో ఆ భూమి నాది అనే అటాచ్మెంట్ ఏర్పడింది. మరో ముఖ్యమైన కారణం మన మనసు, వయసు మీ శరీరానికి 60 ఏళ్ళు వచ్చిన మీ మనసు ఇంకా చిన్న పిల్లల స్థాయిలో ఉండిపోవచ్చు.
(03:23) బాబాగారు చెప్పినట్లు శరీరం వృద్ధాప్యానికి చేరుకున్న మనసు ఇంకా ఆశలతో కోరికలతో నిండి ఉంటే మరణం ఒక భయంకరమైన శిక్షలా కనిపిస్తుంది. మీరు మీ శరీరాన్ని ఒక కప్పులా చూడటం లేదు. కప్పులో టీ ఉన్నంతసేపు అది అవసరమే. కానీ టీ తాగడం అయిపోయాక కప్పుతో పని ఉండదు. అలాగే మీ ప్రయాణం ముగిసాక ఈ శరీరాన్ని వదిలేయడం కూడా అంతే సహజం కానీ ఆ కప్పునే నేను అనుకోవడం వల్ల ఇది ఎక్కడ పగిలిపోతుందో అని చెప్పేసి మీరు నిరంతరం ఆందోళన చెందుతారు.
(03:54) మరణ భయాన్ని పోగొట్టుకోవడానికి నీమ్ కరోలి బాబాగారు చూపించిన మార్గం చాలా సరళమైనది. కానీ అత్యంత శక్తిమైనది. ఆయన ఎప్పుడూ ఒకే మాట చెప్పేవారు. అందరికీ ప్రేమను పంచండి అందరికీ సేవ చేయండి. భగవంతుని స్మరించండి. సో మీరు ఎప్పుడైతే ఇతరుల కోసం బ్రతకడం మొదలు పెడతారో అప్పుడు మీ దృష్టి మీ శరీరం మీద నుండి మీ అహంకారం మీద నుండి మల్లుతుంది.
(04:20) సేవలో ఉన్న ఆనందాన్ని అనుభవించే వ్యక్తికి తన గురించి తాను భయపడాల్సిన అవసరం ఉండదు. భయం ఉన్నచోట ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్నచోట భయం ప్రవేశించలేదు. మరో అద్భుతమైన సూత్రం ఏంటంటే సాక్షిగా ఉండటం. బాబాగారి జీవితంలో ఒక చిన్న సంఘటన ఉంది. ఒకసారైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండేవారట. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన తన శరీరాన్ని తాను కాదని చెప్పేసి గుర్తించారు.
(04:46) మీరు కూడా మీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు లేదా మనసు బాధగా ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆగి గమనించండి. ఈ నొప్పి నా శరీరానికి కలిగింది. నేను దీన్ని గమనిస్తున్నాను అని చెప్పేసి మనసులో అనుకోండి. మీరు వేరు మీ శరీరం వేరు అని గుర్తించిన మరు క్షణం సగం భయం మాయమైపోతుంది. ఈ విడదీసి చూసే గుణమే మిమ్మల్ని మరణ భయం నుంచి విముక్తులను చేస్తుంది.
(05:11) అటాచ్మెంట్ ను వదలడం అంటే అడవులకు వెళ్ళడం కాదు బాబాగారు చెప్పినట్లు మీరు ఈ ప్రపంచంలోనే ఉండాలి. మీ బాధ్యతలను మీరు నిర్వహించాలి. కానీ ఒక అతిథిలా ఉండాలి. హోటల్ రూమ్ కి వెళ్ళినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో బయటికి వచ్చేటప్పుడు అంతే ప్రశాంతంగా తాళం ఇచ్చేసి వచ్చేస్తాం కదా అలా కాకుండా నా రూము ఇది నాది అని చెప్పేసి మనం కూర్చోం కదా ఎందుకంటే అది మీది కాదని మీకు తెలుసు.
(05:35) ఈ జీవితం కూడా అంతే మీ పిల్లలు మీ ఆస్తి మీ హోదా అన్ని మీరు వాడుకోవడానికి ప్రకృతి ఇచ్చిన తాత్కాలిక బహుమతులు ఈ సత్యాన్ని మీరు ప్రతిరోజు గుర్తు చేసుకుంటే మీకు వస్తువుల మీద మమకారం తగ్గుతుంది కానీ బాధ్యత మీద గౌరవం పెరుగుతుంది. అదే నిజమైన స్వేచ్ఛ. ఈరోజు నుంచే మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడటం మొదలు పెట్టండి. నీమ్ కరోలి బాబా గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పేవారు. గాలి అందరికీ వస్తుంది.
(06:02) కానీ ఎవరు కిటికీలు తీరి ఉంచుతారో వారికే చల్లదనం అందుతుంది. మీరు కూడా మీ మనసునే కిటికీ తెరచి ఉంచండి. మరణం గురించి భయపడటం మానేసి బ్రతికున్న ప్రతి క్షణాన్ని ఎలా అర్థవంతంగా మార్చుకోవాలో ఆలోచించండి. మీరు ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వగలరు. మీ మాటలతోనో మీ చేతలతోనో లేకపోతే మరొకరి ముఖంలో చిరునవ్వు ఎలా తీసుకురాగలరో దీనిపై దృష్టి పెడితే మీ జీవితం అద్భుతంగా మారుతుంది.
(06:28) ముఖ్యంగా మీ ప్రొడక్టివిటీ మరియు మైండ్ సెట్ మార్చుకోవడానికి స్వతంత్ర విచారణ అలవాటు చేసుకోండి అంటే సెల్ఫ్ అనాలసిస్ అన్నమాట. ఎవరో ఏదో అన్నారని సమాజం ఏదో చెప్తుందని చెప్పేసి భయపడి బ్రతక్కకండి. నీమ్ కరోలి బాబాగారు ఎప్పుడూ తన భక్తులతో ఒక మాట అనేవాడు. సబ్ ఏక్ అంటే అంతా ఒకటే. మీరు వేరు పక్కవాడు వేరు కాదు.
(06:51) మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ దైవత్వాన్ని చూడండి. పనిని భారం కాకుండా ఒక సేవల భావిస్తే ఒత్తిడి మాయం అయిపోతుంది. మీ పనుల్లో క్లారిటీ వస్తుంది. రేపు రాబోయే మరణం గురించి ఆలోచించి ఈ రోజును వృధా చేయకండి. ఇక్కడ మరణం ఒక్కటే ప్రాబ్లం కాదు. ఒకవేళ నా ఉద్యోగం పోతుందో లేకపోతే నాకు ఏదైనా అయిపోతుందో నేను సంపాదించిన డబ్బులు ఎవడనా కొట్టేస్తాడో అని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో మనిషి అనేవాడు భయపడుతూనే ఉంటాడు.
(07:19) అలా కాకుండా రేపు రాబోయే ఆపద గురించి ఇప్పుడే తలుచుకొని ఇప్పుడున్న ఈ క్షణాన్ని దయచేసి వృధా చేసుకోకండి. ఎందుకంటే నువ్వు ఎంత ఆపినా సరే ఆ బాధలు వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా పోతూనే ఉంటాయి. ఎందుకంటే మీరు ఇక్కడిదాకా వచ్చారంటే మీరు ఎన్ని కష్టాలు చూసి ఉంటారు వాటన్నిటిని దాటుకొని కూడా వచ్చేసి ఉంటారు కాబట్టి ఆల్రెడీ మీరు చాలా కష్టాల్ని దాటుకొని వచ్చారు కాబట్టి రాబోయే కష్టాలను కూడా చాలా సింపుల్ గా దాటేస్తారు కాబట్టి రాబోయే కష్టాలను తలుచుకొని భయపడకండి మీ చేతుల్లో ఉన్న ఈ సమయాన్ని ఆనందంగా మలుచుకోండి మీ దగ్గర ఉన్న వస్తువులను వాడుకోండి కానీ వాటిని
(07:57) ప్రేమించకండి మనుషులను ప్రేమించండి కానీ వారిని బంధించకండి బంధించడం అంటే వాడు నేను చెప్పినట్టు చేయాలి వాడు నేను అనుకున్నట్లు ఉండాలి. వాడు ఇలా ఉండాలి అలా చేయాలి అని చెప్పేసి మీరు రెస్ట్రిక్షన్స్ పెడితే అవతలి వాళ్ళని మీరు ప్రేమించినట్లు కాదు అవతలి వాళ్ళని మీరు బానిసలుగా చూసినట్లు కాబట్టి మనుషులని ప్రేమించండి అంతే మరణం అనేది మీ ప్రయాణంలో ఒక మజిలి మాత్రమే తప్ప ముగింపు కాదు.
(08:25) బాబాగారు తన శరీరాన్ని వదిలేసిన ఆయన ఆలోచనలు నేటికి కోట్ల మందికి ధైర్యాన్ని ఇస్తున్నాయి. మీరు కూడా అటువంటి గొప్ప ముద్రను వేయాలంటే ఈ క్షణమే మీ భయాన్ని వదిలేయండి. నేను కేవలం ఈ శరీరాన్ని కాదు అంతులేని చైతన్యాన్ని అనే అవేర్నెస్ తో జీవించండి. అప్పుడే మీరు నిజమైన విజేతలు అవుతారు. ఈ వీడియో విన్న తర్వాత కూడా మీలో ఏదో ఒక మార్పు మొదలైందని నేను నమ్ముతున్నాను.
(08:50) బాబాగారు చెప్పినట్లు ఈ ప్రపంచంలో మనం ఒక పర్యాటకులం మాత్రమే. ప్రయాణం ముగిసాక అందరం ఇంటికి వెళ్ళాల్సిందే. ఆ వెళ్ళు లోపు ఎంతమంది హృదయాలు మీరు గెలుచుకున్నారు అనేది ముఖ్యం గుర్తుంచుకోండి భయం మిమ్మల్ని బంధిస్తుంది జ్ఞానం మిమ్మల్ని విముక్తులను చేస్తుంది. ఈ రోజు నుంచి ఒక కొత్త మనిషిగా మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి.
(09:13) ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను [సంగీతం] బాయ్. [సంగీతం] హ [సంగీతం]

No comments:

Post a Comment