Thursday, May 14, 2026

The Questions Vishwak Datta Gets Asked Every Single Day

The Questions Vishwak Datta Gets Asked Every Single Day

Author Name:Vishwak Datta

Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9is8fSIYPa8



Transcript:
(00:00) నన్ను ఎన్నో రోజులుగా అడుగుతూ ఉన్న కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ కి సమాధానాలు మొదటి ప్రశ్న దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతారా కచ్చితంగా నమ్మను ఎందుకంటే దేవుడు అంటే ఏంటో నాకు తెలియని ఆ వయసులో నమ్మేవాడిని కానీ ఈరోజు ఈ క్షణం ఏదైతే దేవుడు అని అందరూ అంటున్నారో అది నాకు ప్రతి నిమిషం తెలుస్తూ ఉంది. ఒక విషయం మనకు తెలుస్తూ ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ నమ్మాల్సిన పని లేదు.
(00:31) సరే మేము ఎలా తెలుసుకోవాలి ఐ మీన్ తెలుసుకోవచ్చా అని కొందరు అడుగుతున్నారు కచ్చితంగా తెలుసుకోవచ్చు ఎన్నో వందల వేల మార్గాలు అవకాశాలు మీకు ప్రతిరోజు కలుగుతూనే ఉంటుంది. తెలుసుకోవడానికి మీరు గమనించట్లేదు అంతే క్వశ్చన్ నెంబర్ టూ వీడియోస్ ఎందుకని లేట్ గా వస్తూ ఉన్నాయి. నేను ఈ ఎపిసోడ్స్ తో పాటు కొన్ని లోతైన అంశాల మీద సాధన చేసి వాటిని సరైన విధంగా మీకు చెప్పాలని మీకోసం కొన్ని పనులు చేస్తున్నాను కొన్ని కాదు చాలానే చేస్తున్నాను.
(01:10) ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ లో కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి బహుశా అందుకనే ఎపిసోడ్స్ ని లేట్ గా రిలీజ్ చేస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం మనకు స్క్రిప్ట్ రాయడానికి ఒక వ్యక్తి ఎడిటింగ్ కి ఇంకొక వ్యక్తి లేరు. ఏ టు జెడ్ మన ఛానల్ కి మొత్తం మనమే చేస్తాం. నేను కొందరిని అప్రోచ్ అయ్యాను ఎడిటింగ్ కోసం అండ్ స్క్రిప్టింగ్ కోసం బట్ నాకు అంత సాటిస్ఫాక్షన్ గా లేదు.
(01:35) నా ఆలోచనకి నా విజన్ కి తగ్గా వాళ్ళు నాకు డెలివరీ చేయలేకపోయారు. సో మొత్తం నేనే చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎపిసోడ్స్ ఏదైతే చేస్తున్నానో ప్రతి ఎపిసోడ్ లో నేను ఎక్కడే కానీ కాంప్రమైజ్ అవ్వను నేను ఒక ఎపిసోడ్ కోసం ఒక లెవెల్ ఏదైతే అనుకుంటానో దానికన్నా అదనపుగానే నేను వీడియోలో ఇస్తున్నాను. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ ఎపిసోడ్స్ ని వేగవంతం చేయడానికి నేను నా సమయాన్ని నా యొక్క పనితనాన్ని నేను అప్గ్రేడ్ చేసుకుంటున్నాను.
(02:11) కచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత వేగంగా వీడియోస్ వస్తాయి. కేవలం స్పిరిచువాలిటీఏ కాదు సైన్స్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ హిస్టరీ ఎకనామిక్స్ కూడా రాబోతున్నాయి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. మూడవ ప్రశ్న వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ చాలా పెద్ద ప్రశ్న ఒకానొక సందర్భంలో నా జీవితంలో చాలా డిప్రెషన్ ఒంటరితనం నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడు ఈ YouTube లో ఉండే ఒక వీడియోనే నన్ను ఆ స్థితి నుండి బయట పడేసింది.
(02:48) నిజం చెప్పాలంటే నన్ను కాపాడింది. ఆ వీడియో ఏంటనేది నేను చెప్పలేను కానీ ఒక వీడియో ఒక మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తుందా అని నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని చాలా కాలం తర్వాత నేను ఎప్పుడైనా సరే ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని ఆ రోజు వీడియో ఆ వీడియో నాకు కనిపించకుండా ఉండి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉండేవాడినా అని అదే సందర్భంలో నేను కొందరిని చూశాను వాళ్ళు కూడా ఇదే విధంగా వండర్తనంతో డిప్రెషన్ తో ఇన్ఫర్మేషన్ లేక నాలెడ్జ్ లేక ధైర్యం లేక లేక కన్ఫ్యూషన్ లో ఒక కేస్ లో ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. వాళ్ళందరితో
(03:27) నేను వెళ్లి ఎన్నో విషయాలు మాట్లాడేవాడిని నేను వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ప్రతిసారి వాళ్ళు నాకు చెప్పే ఒకే ఒక రెస్పాన్స్ ఏంటంటే నీ మాట వింటూ ఉంటే ఏదో తెలియని ధైర్యం కలుగుతుంది. ఏదో నమ్మకం వస్తుంది. నేను చేయగలను అని అనిపిస్తూ ఉందని నేను మాట్లాడిన ప్రతి ఒక్కరు నాకు చెప్పారు. నా మాట ఒక వ్యక్తికి ఇంతగా స్ఫూర్తిని ఇస్తుందా అని ఆలోచిస్తూ ఉండేవాడిని.
(03:54) అసలు నాకు అర్థమయ్యేది కాదు ఇదంతా ఎలా జరుగుతుంది అని కానీ ఆ టైంలో ఒక YouTube్ ఛానల్ చేయాలి అనే ఆలోచన అయితే నాకు లేదు. నాలో నేను ఎంతగానో శోధించుకోవడం జరిగింది. ఆ శోధన అనేది అంత సులభంగా జరగలేదు కొన్ని సంవత్సరాల పాటు నా జీవితంలో నేను ఊహించని ఎన్నో మలుపులని నేను చూశాను. ఎన్నిటినో ప్రశ్నించాల్సి వచ్చింది సమాధానాల కోసం మదన పడాల్సి వచ్చింది.
(04:19) నేను చేసేది సరైనదా కాదా అని అర్థం కాని కన్ఫ్యూషన్ లో మునిగిపోవాల్సి వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి అని అనిపిస్తూ ఉండే సందర్భాల్లో ఏదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటులోనే నిజం ఉంటుంది. ఆ నిజం నేను చూడడం కోసం అబద్ధాలుగా కనిపిస్తూ ఉన్న నా సొంత వాళ్ళని ఎందరున వదులుకోవాల్సి వచ్చింది. నా మనసుకి ఆ అబద్ధాలలో బ్రతకడం చాలా కష్టంగా అనిపించేది.
(04:43) నిజానికి అటువంటి సందర్భాలలో మన ఫ్రెండ్స్ తోనో రిలేటివ్స్ తోనో తోటి వాళ్ళతోనో ఉండటం అనేది ఒక కంఫర్టబుల్ ఫీలింగ్ ని ఇస్తుంది. ఒక సేఫ్టీని ఇస్తుంది. కానీ ఆ కంఫర్టబుల్ జోన్ లో ఆ సేఫ్టీ జోన్ లో నిజం లేదు. అది నాకు బాగా తెలుస్తూ ఉండేది. ఇలా ఈ బూటకంలో ఉంటూ ఈ వీళ్ళలాగా మాట్లాడుతూ జీవితాన్ని ఏదో అలా గడిపేయడం అనే ఆలోచనే నన్ను భయపెట్టేది.
(05:07) నాకు వీటన్నిటి కోసం సమయం లేదు అని అనిపిస్తూ ఉండేది. నేను వింటూ ఉన్న ప్రతి మాటలో స్వార్థమే కనిపించేది అబద్ధాలే వినిపించేవి. అవన్నీ నన్ను నన్నులాగా ఉండించేవి కావు ఎన్నో సంవత్సరాల పాటు ఇటువంటి వాటిల మధ్య ఒక బందీగా ఉండాల్సి వచ్చింది. ఇవన్నీ కేవలం నా మానసిక స్థితి మీదే కాదు. నా కెరీర్ మీద నా లక్ష్యాల మీద నా యొక్క ఆర్థిక స్థితుల మీద నా స్పిరిట్ మీద దెబ్బ తీస్తూ ఉండేది.
(05:35) సమస్తానికి కారణం ఆ పరమేశ్వరుడే అయితే ఇవాళ నా ఈ స్థితికి కూడా పరమేశ్వరుడే కారణం. దానికి ఇప్పుడు అతను నా జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నాడు అని తెలుసుకోవడానికి నేను ప్రతి క్షణాన్ని ప్రతి ఒక దాన్ని గమనిస్తూ వచ్చాను ప్రతిదాన్ని గమనిస్తూ ఉన్నాను మాటని మనిషిని ఆలోచనని పరిస్థితులని నా ఎదురుగా జరిగే సందర్భాలని నా వెనుక జరిగే సందర్భాలని ఇలా ప్రతిదాన్ని గమనిస్తూ వచ్చాను నాకు వచ్చే ప్రతి కష్టం ప్రతి సుఖం ప్రతి అవకాశం ప్రతి ప్రతికూలత నేను మాట్లాడే ప్రతి మాట నేను వినే ప్రతి మాట నేను తగ్గిన క్షణం నేను పోరాడిన క్షణం ఇవన్నీ ప్రతిదీ భగవంతుడే చేయిస్తున్నాడు అని నేను నమ్మాను
(06:22) నన్ను నడిపిస్తూ ఉన్నది నా ఎదురుగా ఉన్న పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నది. నా నోట ఈ మాట పలికిస్తూ ఉన్నది నా చేత ఈ పనిని చేయిస్తూ ఉన్నది భగవంతుడే అని నేను సంపూర్ణంగా నమ్మాను. ఆ విధంగా నమ్ముతూ నేను చేయాల్సిన పనులు చేస్తూ నేను ప్రతిదీ గమనిస్తూ వస్తూ ఉన్నాను. ఇది కొన్ని సంవత్సరాలుగా నాకు తెలియకుండానే ఒక సాధనలాగా మారింది.
(06:44) అలాగే నేను బాగా నలిగిన సంవత్సరాలన్నీ ఏది వృదాగా పోలేదు. ఆ సమయంలో నాతో తోడుగా ఉన్నది కేవలం పరమశివుడు మాత్రమే ఎడారిలో దాహంతో ఎండిపోయిన శరీరానికే నీటిలో ఉన్న ప్రాణం కనిపిస్తుంది. అలాగా కోల్పోవడానికి ఏమీ లేని నాకు నిరంతరం ఆ భగవంతుడు కనిపిస్తూ వచ్చాడు. ఆ సందర్భంలోనే ఒక సందర్భంలో నేను నా సర్వస్వాన్ని భగవంతుడికి అర్పించేశాను.
(07:16) కట్టు బట్టలతో అన్నిటిని వదిలేసి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాను ఇటువంటి సందర్భాల్లో చనిపోవటం చాలా సులభంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది చాలా పెరికితనం ఈ భయాలుఏంటో బాధలుఏంటో బంధాలు ఏంటో బాధ్యతలు ఏంటో బరువు ఏంటో సంపద ఏంటో సామర్థ్యాలు ఏంటో శక్తి ఏంటో సాధన ఏంటో నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి మోసం ఏంటి ఇవన్నీ నాకు ఏవి తెలియదు.
(07:45) మొత్తం నువ్వే చూసుకోవాలి నన్ను నడిపించాలి నేను నీ దగ్గరికే వస్తున్నాను అని ఆ క్షణం నేను బయలుదేరాను కోల్పోవడానికి ఇంకా ఏమీ లేదు అనే ఒక వ్యక్తి అగ్నిలో అయినా సరే ఎలా నడుస్తాడో అలా నేను వెళ్ళాను అప్పటి నుండి నా జీవితంలో మరింత స్పష్టత పెరుగుతూ వచ్చింది. స్పష్టత అంటే మీకు వివరిస్తాను ఒక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి అని ఒకవేళ నా ఎదురుగా వస్తే దానిని సులభంగా లోతుగా నేర్చుకోగలిగే స్పష్టత అది ఒక సంగీతం అయినా ఒక హిస్టరీ అయినా ఒక మథమేటిక్స్ అయినా ఒక ఎకనామిక్స్ అయినా ఒక టెక్నాలజీ అయినా ఏదైనా సరే అంతే కాదు ఒక మనిషితో 10 నిమిషాలు కూర్చొని మాట్లాడితే
(08:27) అతని లోపల ఉన్న అంతరార్థాలు తెలుసుకునే అంత స్పష్టత సమాజం మీద మనుషుల మీద స్పష్టత విషయాల మీద స్పష్టత పెరుగుతూ వచ్చింది. అలా ఎన్నో వాటి మీద స్పష్టత కలుగుతూ వచ్చింది. మనుషులు ఈ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే పురుషార్థాలను దాటాలి. ఐ మీన్ ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి చూడాలి. ఈ విధంగా ఒక్కొక్క దాని మీద ధర్మం అంటే ఏంటి కామం అంటే ఏంటి ఈ మోక్షం అంటే ఏంటి ఇవన్నీ అర్థమవుతూ వచ్చాయి స్పష్టత కలుగుతూ వచ్చింది.
(09:00) అంతేకాకుండా ఈ యోగం అని అంటాం యోగం అనేది ఆ ఎన్నో మార్గాల్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్మ మార్గం క్రియాయోగం జ్ఞానంతో భక్తితో ఇలా రకరకాల నాలుగు మార్గాల ద్వారా యోగాన్ని చేరుకుంటాం. నేను ఈ నాలుగటిలోనే ఉన్నాను అని నాకు అర్థంవుతూ వచ్చింది. ఏ పుస్తకాలు ఇతిహాసాలు చదవకుండానే ధర్మం అంటే ఇది అని అర్థమవుతూ స్పష్టత కలుగుతూ వచ్చింది.
(09:30) అండ్ ఆ స్పష్టత వలనే నేను ఎన్నో అవరోధాలను దాటాను. ఎన్నో విజయాలను చూశాను. ఆ స్పష్టతే ఈ YouTube ఛానల్ ని స్టార్ట్ చేయాలని ప్రేరేపించింది. అండ్ తర్వాత మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ని చూసి మరింతగా చేయాలి అని నాలో కలిగింది. నిజానికి కొందరు అడుగుతున్నారు నేను ఇంత లోతుగా రీసెర్చ్ ఎలా చేస్తాను అని నా ఈ లోతైన రీసెర్చ్ కి కారణం ఈ జర్నీలో వచ్చిన స్పష్టతే నాకు పూర్తి స్పష్టత వచ్చింది ఉంది అని నేను చెప్పట్లేదు కానీ ఆ స్పష్టత వలనే నేను లోతుగా వెళ్ళగలుగుతున్నాను.
(10:07) అదంతా ఒక్క రోజులో జరగలేదు అందుకే మీరు మన ఛానల్లో విషయాలని తెలుసుకోవడమే కాదు అనుభూతిని చెందుతారు. అందుకే ఒక చిన్న రిక్వెస్ట్ ఎప్పుడైనా వీడియోలు లేట్ గా వస్తే తప్పుగా అనుకోకండి క్వశ్చన్ నెంబర్ఫోర్ మీరు బ్రాహ్మణులా కాదు నేను బ్రాహ్మిణి కాదు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మీరు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ నేను వెజిటేరియన్ గా ఉండాలనుకునే నాన్ వెజిటేరియన్ ని అంటే సంవత్సరంలో కొన్ని స్పెసిఫిక్ నెలల్లో నేను పూర్తిగా సాత్విక భోజనాన్ని తీసుకుంటాను కొన్ని స్పెషల్ అకేషన్స్ లో అండ్ ఒకవేళ నేను ధ్యానం చేసుకుంటూ అలానే ఉండాలి అనుకుంటే మంచి నీళ్లు కూడా సరిపోతాయి.
(10:54) కానీ ఈ ప్రస్తుత ప్రపంచంలో పోరాడాలి అంటే మనకు రజోగుణం ఖచ్చితంగా అవసరం. అలానే నేను మాంసం తినొచ్చు తినకూడదు అని నేను రికమెండ్ చేయట్లేదు ఏది కూడా అది ఎవరి వాళ్ళ పర్సనల్ ఛాయిస్ అండ్ ఆ ఫెసిలిటీ చిన్నప్పటి నుండి నా శరీరం దీనికే అలవాటు పడింది. మానలేను అని కాదు ఆ నాకు అది పెద్ద విషయం కాదు అని అనిపిస్తుంది. ఆ ఇకపోతే ఒక విషయం మాత్రం నిజం మాంసాహారం అనేది మాత్రం స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి కాస్త డిలే అయితే ఇస్తుంది.
(11:34) ఇది మాత్రం నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ సిక్స్ మీది రియల్ వాయిస్ లేదా ఏఐ తో జనరేట్ చేస్తారా? ఇది ఏఐ వాయిస్ కాదు. లైఫ్ లో డెప్త్ పెరిగితే గొంతులో బేస్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఒరిజినల్ వాయిస్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ నేను వేసుకున్న స్పెట్స్ ని ఎక్కడ కొన్నాను అది ఒకరోజు ఎయిర్పోర్ట్ లో వస్తూ ఉన్నప్పుడు కనిపించింది నచ్చింది కొన్నాను దట్స్ ఇట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మీరు వాడే మైక్ బ్రాండ్ ఏంటి? ఓ ఇప్పుడు ఫ్రీగా ఒక మైక్ బ్రాండ్ కి ప్రమోట్ చేయాల్సి వస్తుంది చేయమంటారా నాకుఇగ లో మెసేజ్ చేయండి డైరెక్ట్ మెసేజ్ చేయండి నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను.
(12:19) క్వశ్చన్ నెంబర్ 10 మీరు ఫ్లో స్టేట్ లోకి ఎలా వెళ్తారు? నా ఫ్లో కి ఏ స్టేట లేదు ఐ మీన్ మన లక్ష్యం బలంగా ఉన్నప్పుడు ఫ్లో స్టేట్ అనేది నాచురల్ గా కలుగుతుంది. ఐ మీన్ నేను ఆల్రెడీ చెప్పిన కొన్ని మెథడ్స్ ని ఫాలో అయితే మీరు ఆ స్టేట్ లోకి వెళ్ళగలరు. కానీ ఈ ఫ్లో స్టేట్ ని దాటి కూడా ఎన్నో స్థితులు ఉన్నాయి.
(12:45) వాటిని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము వాటి కోసం నేను కొన్ని ఎపిసోడ్స్ ని ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ మహాభారతంలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఎవరు? నిజానికి అందరికంటే ఎక్కువ ఇష్టం శ్రీకృష్ణుడే కానీ వాసుదేవుడు కాకుండా ఇంకెవరు అని అడిగితే అది యదిష్టురుడే నిజానికి అర్జునుడికి ఉన్నంత కర్ణుడికి ఉన్నంత భీముడికి ఉన్నంత శక్తులు యదుష్టురుడికి లేకపోవచ్చు.
(13:16) కానీ నేను శక్తిని చూసి అతని గొప్పతనాన్ని కొలవట్లేదు. నిజానికి ఎందరో గురువులు దేవతలు యక్షులు అసురులతో సహా ఐ మీన్ రాక్షసులు అసురులతో సహా ఆ పలికిన ఒకే ఒక పదం ఏంటంటే యుధిష్టురుడు ధర్మాన్ని ఎప్పటికీ తప్పడు అబద్ధాన్ని చెప్పలేడు అని సో అతన్ని ఓడించాలంటే ఈ ధర్మాన్నే ఒక ఉచ్చులాగా బిగించాలి అతనికి అని ఎందరో కోరుకున్నారు.
(13:50) ఎంతటి ధర్మం అతని లోపల ఉంటే అంతమంది నోట ఆ మాట పలుకుతుంది చెప్పండి పాండవుల మీద కుట్రలు పన్ని ఒక్క మనిషి కూడా జీవించలేని కాండవ ప్రస్థను ఇచ్చినప్పుడు యుధిష్ఠిరుడు దానిని గౌరవించి తీసుకుంటాడు. ధర్మాన్ని నమ్ముకుంటే అది నరకమైన స్వర్గంగా మారుతుందని నిరూపించి చూపించాడు. కురుక్షేత్ర యుద్ధంలో అందరికీ అస్త్రాలు శస్త్రాలు కావాల్సి వచ్చింది. కానీ యుధిష్టురుడి నోట మాట కూడా ఒక శస్త్రం లాగా పనిచేసింది.
(14:16) ద్రౌపది కంటే కుంతీదేవి కంటే కర్ణుడి కంటే ఎన్నో వందల రెట్లు ఎక్కువగా వేదనని యుధిష్టురుడు చిన్నప్పటి నుండి అనుభవిస్తూ వచ్చాడు. సముద్రంంత బాధని బరువుని మోసాడు. కానీ ఏనాడు ఆ బాధని ఒక అస్త్రం లాగా వాడలేదు. చివరి శ్వాస వరకు ఎటువంటి కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడువలేదు. అతన్ని చూస్తూ ఉంటే నాకు కలియుగం మొదటిలో పుట్టిన శ్రీరాముడి లాగా కనిపిస్తూ ఉంటాడు.
(14:40) కానీ చాలా తక్కువ మంది అతని గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇది మాత్రం నిజం కలియుగంలో కనుక మనం యదుష్టురుడి లాగా ఉంటే మనం ప్రతి చోట ఓడిపోతాం. మనం కలియుగంలో కచ్చితంగా శ్రీకృష్ణుడి లాగే ఉండాలి. సో యుధిష్ఠిరుడు నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు రీసెర్చ్ లో ఇన్ని పాయింట్స్ ని ఎలా కనెక్ట్ చేస్తారు? మీరు ఏ పుస్తకాలు చదువుతారు? మీ సోర్స్ ఏంటి? ఇది సింపుల్ గా ఒక లైన్ లో చెప్పే ఆన్సర్ అయితే కాదు ఒక విషయం మీద తీవ్రమైన మనసుని నిలిపినప్పుడు నాకు వాటి లోతులో ఉన్న స్పష్టత నాకు తెలుస్తూ ఉంటుంది.
(15:16) ఆ ఇంకా కొన్ని తెలియని విషయాలని గురువుల దగ్గర లేదా పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకొని వాటిని మళ్ళీ శోధించి స్పష్టత తెచ్చుకొని మీకు అవి చెప్పడం జరుగుతుంది. ఇలా ఒక విషయంలో ఎన్నో డాట్స్ ని కనెక్ట్ చేయడం అనేది ఆ చాలా కష్టంతో కూడిన పని అది ఒక లైన్ లో ఇది ఇలా చేశాను అలా చేశాను అని చెప్పే విషయం అయితే కాదు సరే బ్రో ఈ పోస్ట్ల సంగతి పక్కన పెట్టి నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో చెప్పు ఆ నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందంటే

No comments:

Post a Comment