Tuesday, May 12, 2026

ఈ "ఒక్క" సమయంలో Om Namah Shivaya జపిస్తే ఏం జరుగుతుంది? | My 90 Days Experience

​ఈ "ఒక్క" సమయంలో Om Namah Shivaya జపిస్తే ఏం జరుగుతుంది? | My 90 Days Experience

Author Name:Telugu Talks with VRS

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguTalkswithVRS

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LZvzQqr9T9E



Transcript:
(00:00) ఓం నమః శివాయ ఇది కేవలం గుడికే పరిమితమైన మంత్రం అనుకుంటే అంతకంటే పెద్ద అజ్ఞానం మరొకటి లేదు ఎందుకంటే రేపటి గురించి మీ మనసును తొలిచేస్తున్న భయాన్ని మూలాలతో సహా భస్మం చేసి మీరు కోరుకున్న అత్యున్నతమైన జీవితంలో మిమ్మల్ని నిలబెట్టగల ఒక శక్తివంతమైన అదృశ్య నాదాస్త్రం ఇది. ఓం నమఃశివాయ అసలు ఈ నాదం మిమ్మల్ని ఎవరితో మమేకం చేస్తుందో తెలుసా సాక్షాత్తు ఈ సృష్టికి మూలమైన ఆ పరమ శివుడితో ఆ శివుడంటే ఎవరో కాదు ఈ విశాలమైన విశ్వం అంతుచిక్కని ఒక
(00:48) మహా శూన్యం ఆ నిశశబ్ద శూన్యంలోనే రగులుతున్న అదృశ్యమైన మూల ప్రాణశక్తే ఆ మహాదేవుడు ఆ సృష్టి మూలా లాన్ని మనం చేరుకోవడానికి మన ప్రాచీన ఋషులు మానవాళకి అందించిన ఆ విశ్వ చైతన్యపు నాద రూపమే ఈ పంచాక్షరి ఈ మహామంత్రం వెనుక మనిషి దేహాన్ని ఆ శివ తత్వాన్ని ఏకం చేసి ఒక సాధారణ మనిషిని సాక్షాత్తు శివ స్వరూపంగా మార్చగలిగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రం దాగి ఉంది.
(01:24) అంతటి మహిమాన్వితమైన నాదం కాబట్టే సమస్త వేదాలకే హృదయం లాంటి యజుర్వేదంలో శ్రీ రుద్రానికి సరిగ్గా మధ్యలో ఒక నిధిలా భద్రపరిచారు మన ఋషులు ఎంతో మంది తపస్వులు సాధకులు ఈ మంత్రం జపించి తమ జీవితాలను ఊహించని ఆధ్యాత్మిక శిఖరాలకు తీసుకెళ్లారు. సరిగ్గా నా జీవితంలోనూ అదే జరిగింది. నాకు ఎదురైన ఆ అద్భుతం గురించి చెప్పే ముందు అసలు ఈ మహా మంత్రానికి అంతటి శక్తి ఎలా వస్తుంది? ఋషులు చెప్పినట్లు ఈ మంత్రాన్ని నాభిలోంచి జపించినప్పుడు మోడర్న్ సైన్స్ సైతం ఆశ్చర్యపోయేలా మన మెదడులో జరిగే మార్పులు ఏంటి? అలాగే ఈ జప సాధనలో చాలామంది తెలియక చేస్తున్న తప్పులు
(02:08) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ నాద విజ్ఞానం ఎన్నో ఏళ్లుగా శివనామస్మరణ చేస్తున్న తపస్వులు ఏనాడో మనకు అందించిన పరమ సత్యం శ్రద్ధగా వినండి ఈ సత్యం మీ అంతరంగాన్ని మేలుకొలుపుతుంది. ఓం నమః శివాయ సాధారణంగా దీని అర్థం శివుడికి నా నమస్కారం అని మాత్రమే అందరూ అనుకుంటారు. కానీ వేదాంతపరంగా చూస్తే నమః అంటే నమస్కారం మాత్రమే కాదు న మ అంటే నాది కాదు అని అర్థం అనగా ఈ దేహం ఈ అహంకారం ఈ కోరికలుఏవి నావి కావు అంతా ఆ పరమశివుడిదే
(02:58) అని మనల్ని మనం ఆ విశ్వ చైతన్యానికి పూర్తిగా అప్పగించుకోవడం ఇక్కడ మనం గమనించాల్సిన ఒక యోగ రహస్యం ఉంది. అనంతమైన విశ్వానికి ప్రతీక ఓంకారం అయితే మన దేహానికి ప్రతీక ఈ మిగిలిన ఐదు అక్షరాలు అసలు ఈ మంత్రం యొక్క ప్రధాన భాగంలో సరిగ్గా ఐదు అక్షరాలే ఎందుకున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఈ న, మ షీ, వ, య లోని ప్రతి ఒక్క అక్షరం మన దేహాన్ని నిర్మించిన ఆ పంచభూతాలను మేల్కొల్పే ఒక దివ్యమైన నాదస్పందన.
(03:38) నా ఈ నాదం నీ దేహంలోని పృథ్వీ తత్వాన్ని జాగృతం చేస్తుంది. నీ శరీరానికి ఆధారమైన ఎముకలు కండరాలతో మమేకమై నీలో అచంచలమైన స్థిరత్వాన్ని నింపుతుంది. మా ఈ నాదం అనంతమైన జలతత్వాన్ని స్పృశిస్తుంది. నీ శరీరంలో ప్రాణమై ప్రవహిస్తున్న రక్తంలో కలిసిపోయి నీ దేహమంతటా అంతులేని జీవశక్తిని విస్తరిస్తుంది. షీ ఇది సాక్షాత్తు అగ్నితత్వం నువ్వు తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే నీ లోపలి జఠరాగ్నిని ఇది చైతన్య పరుస్తుంది.
(04:16) నమఃశివాయ వా ఇది వాయువు నీ ప్రతి ఉచ్వాస నిశ్వాసంలో ప్రాణాన్ని నిలబెట్టే గాలికి ఇది సంకేతం ఇక ఆకాశం పరమ నిశశబ్దం నీ మెదడిలోని అనంతమైన ఆలోచనా శక్తికి ఆ ఆలోచనల వెనకున్న నిశశబ్దానికి ఇది ప్రతీక అంటే దీని అర్థం ఏంటో తెలుసా నువ్వు కళ్ళు మూసుకొని నమఃశివాయ అని జపిస్తున్నప్పుడు నువ్వు కేవలం కేవలం ఒక దేవుడి పేరు పలకట్లేదు నీ దేహంలోని పంచభూతాలను ఒక్కటి చేసి ఆ మహావిశ్వం మొత్తాన్ని నీలోకి ఆహ్వానిస్తున్నావు అంటే ఇది కేవలం ఒక జపం కాదు ఒక అద్భుతమైన అంతర్ముఖ యాత్ర అందుకే ఈ మంత్రాన్ని కేవలం
(05:05) పెదవులతో యాంత్రికంగా కాకుండా ఆ శివయ్యపై పూర్తి శరణాగతితో నాభి లోతుల నుంచి జపించు అప్పుడు నీలో పుట్టే ఆ నాదతరంగా ాలు ముందుగా నీలోని భయాన్ని ఆందోళనను సమూలంగా దహించేస్తాయి. ఆ నిశశబ్దంలో నీలోని ఆ శివ చైతన్యం మేల్కొంటుంది. ఇది కేవలం పుస్తకాల్లో రాసిన థియరీ కాదు నా అనుభవంలో నేను స్వయంగా చూసిన సత్యం ఈ మంత్రం నా కటిక చీకటిలో ఉన్న జీవితాన్ని ఎలా వెలుగులోకి తెచ్చిందో ఇప్పుడు చెబుతాను వినండి.
(05:41) కొన్ని ఏళ్ల క్రితం నా డిగ్రీ పూర్తయ్యాక నా జీవితంలో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా నా అర్హతకు తగిన కొలువు దొరకలేదు. ఏదో ఒకటి చేయాలి కదా అని ఒక చిన్న ఆఫీస్ లో నెలకు కేవలం 6వేల రూపాయల జీతానికి చేరాను. కానీ భవిష్యత్తు అంధకారం అనిపించి ఆ పని వదిలేశను. ఒక పక్క కెరీర్ ఏమవుతుందో అన్న భయం మరో పక్క నిరాశ.
(06:07) మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. కన్నీళ్లు పెట్టుకొని స్వామి నాకు ఏ కోట్రో వద్దు బ్రతకడానికి ఒక దారి చూపించు అని ఆ శివుణని వేడుకున్న ఆ తీవ్రమైన మానసిక క్షోభ నాకు ఇంకా గుర్తుంది. ఆ స్ట్రెస్ ని తట్టుకోవడానికి ఉదయాన్నే వాకింగ్ కి వెళ్ళేవాడిని నా నడక దారిలో ఒక పురాతన శివాలయం ఉండేది. ఆ గుడిని దాటుకొని వెళ్ళేటప్పుడు అప్రయత్నంగానే నా నోటి వెంట ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అనే నాదం రావడం మొదలైంది అలా ఆ మంత్రం నాకు పరిచయమయింది దాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నాను రోజు ఉదయం వాకింగ్ చేస్తూ కాస్త బయటకు వినపడేలాగా స్పష్టంగా జపించడం మొదలుపెట్టాను ఒకరోజు
(06:47) కాదు రెండు రోజులు కాదు కనీసం అరగంట పాటు ఏకదాటిగా మూడు నెలలు క్రమం తప్పకుండా జపించాను ఆ అరగంట జపంలో మొదటి 20 నిమిషాలు నా మనసంతా ఆ నాదం మీదే లగ్నం చేసి చివరిలో నా భవిష్యత్తుపై ఉన్న భారాన్నంతా ఆ శివయ్య పాదాల దగ్గర వదిలేసేవాడిని. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ మూడు నెలలు నేను నా ప్రయత్నాలు ఆపలేదు కానీ నా ఆలోచనా విధానంలో నాకే తెలియని ఒక శుద్ధి మొదలైంది.
(07:18) శాస్త్రాలు చెప్పే కర్మ ప్రక్షాళన అంటే ఏంటో నాకు అప్పుడు ప్రాక్టికల్ గా అర్థమయింది. అప్పటివరకు నా మదడును తొలిచేస్తున్న ఆందోళన నెగటివిటీ అంతా మాయమైపోయింది. నేను తీసుకునే నిర్ణయాల్లో ఒక స్పష్టత వచ్చింది. ఆ క్లారిటీతోనే ఒకరోజు నా స్నేహితుడికి ఫోన్ చేసి ఏదైనా అవకాశం ఉంటే చూడమని అడిగాను. వాడు ఆన్లైన్ లో వెతకమని సలహా ఇచ్చాడు. అందులో నాకు ఒక సరికొత్త దారి కనిపించింది.
(07:43) అది శారీరక శ్రమతో కూడిన పని కాదు నాలోని ఆలోచనలకు నా సృజనాత్మకతకు ప్రాణం పోసే ఒక గౌరవప్రదమైన అవకాశం. అప్పటివరకు నాకు ఆ ప్రపంచం కొత్త. కానీ లోపల ఆ మంత్రం రగిలించిన ఆత్మవిశ్వాసం స్పష్టత నన్ను ముందడుగు వేయ్యేలా చేశాయి. డెమో టెస్ట్ రాశాను, పాస్ అయ్యాను. ఒక చిన్న జీతంతో నా కెరీర్ మొదలైంది. ఇక్కడే మనం ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాలి. మంత్రం చలవగానే రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోయి ఆకాశం నుంచి సిరి సంపదలు రాలిపడవు కానీ ఆ మంత్రం మనలో ఉన్న కర్మదోషాలను అడ్డంకులను తొలగించి సరైన సమయంలో సరైన వ్యక్తుల ద్వారా ఒక మార్గాన్ని చూపిస్తుంది.
(08:22) నా స్నేహితుడి రూపంలో ఆ అవకాశం రూపంలో ఆ మహాదేవుడు నాకు ఒక దారి చూపించాడు. అలా ఒక చిన్న జీతంతో మొదలైన నా ప్రయాణం ఆ పరమశివుడి దయ వల్ల అంచలంచలుగా ఎదుగుతూ దాదాపు 10ఏళ్ల పాటు ఏరోజు పని ఆగకుండా నా ఇంటి బాధ్యతలన్నీ నా భుజాలపై మోసే స్థాయికి నన్ను ఎదిగేలా చేసింది. ఇదంతా ఆ శివుడు కల్పించిన ఉపాధి ఆ భోశంకరుడికి నా పట్ల ఉన్న కరుణ. గురువులు ఒక మాట చెబుతారు జపతః సిద్ధి అని అనగా బలమైన సంకల్పంతో పూర్తి నమ్మకంతో ఈ మంత్రాన్ని జపిస్తే ప్రకృతి కూడా మనకు అనుకూలంగా మారుతుంది.
(09:04) అయితే ఇక్కడే చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఉద్యోగం డబ్బు ఆరోగ్యం లాంటి భౌతిక కోరికలు తీరాలని ఈ మంత్రం జపించొచ్చా అని ఖచ్చితంగా జపించొచ్చు. శాస్త్రంలో దీన్నే సకామ జపం అంటారు. స్వచ్ఛమైన భక్తితో వేడుకుంటే ఆ భోలా శంకరుడు మీ ప్రయత్నాలకు ఖచ్చితంగా తోడుగా నిలుస్తాడు. కానీ ఈ మంత్రంలో ఉన్న అసలైన మహిమ ఏంటో తెలుసా? మొదట మీ కోరికలను తీర్చే ఈ మంత్రం క్రమంగా మీ కోరికల స్వభావాన్నే మార్చేస్తుంది.
(09:37) మీ మనసును శుద్ధి చేసి మిమ్మల్ని నిష్కామ స్థితి వైపు నడిపిస్తుంది. అప్పుడు నాకు ఇది కావాలి అనే ఆతృత కంటే ఆ శివుడిపై శరణాగతే ముఖ్యమని మీకే అనుభవపూర్వకంగా అర్థమవుతుంది. అప్పుడు మీరు కోరుకున్నదే కాదు మీ జీవితానికి ఏది శ్రేయస్కరమో ఆ శివుడే మీకు ఆ దారి చూపిస్తాడు. అసలు లయబద్ధంగా ఓం నమఃశివాయ అని జపిస్తున్నప్పుడు మన శరీరంలో మెదడులో ఏం జరుగుతుందో తెలుసా? దీన్ని అర్థం చేసుకోవడానికి ఆధునిక సైన్స్ పదాల కంటే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
(10:13) మీరు ఒక పాత రేడియోలో అద్భుతమైన పాట వింటున్నారు. ఒక సైంటిస్ట్ వచ్చి ఆ పాట ఈ రేడియోలో ఉన్న వైర్లు మాగ్నెట్ల వల్ల పుడుతుంది అంటాడు. ఆ వైర్లు లేకపోతే పాట రాదు అన్నది వాస్తవమే కానీ ఆ రేడియో ఆ పాటను పుట్టించడం లేదు అది కేవలం ఎక్కడో ఉన్న బ్రాడ్కాస్ట్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యి ఆ శబ్దాన్ని గ్రహిస్తోంది అంతే ఇక్కడ మన శరీరం మన మెదడు ఆ రేడియో లాంటివి.
(10:41) ఈ ఓం నమఃశివాయ అనే మంత్రం ఆ రేడియో పైన ఉన్న ట్యూనింగ్ నాబ్ నువ్వు ఆ నాదంతో నీ దేహాన్ని పర్ఫెక్ట్ గా ట్యూన్ చేసినప్పుడు నీకు కనెక్ట్ అయ్యే ఆ అత్యున్నతమైన బ్రాడ్కాస్ట్ స్టేషన్ పేరే కాస్మిక్ కాన్షియస్నెస్ అనగా శివతత్వం మన దేహంలో జరిగే ఈ ట్యూనింగ్ ప్రాసెస్ నిజమేనని ఈరోజు ఆధునిక సైన్స్ సైతం నిర్ధారిస్తుంది. యోగులు చెప్పినట్లుగా ఈ పంచాక్షరీ మంత్రాన్ని ఓంకారంతో కలిపి లోతైన శ్వాసతో జపించినప్పుడు ఒక శక్తివంతమైన నాదం పుడుతుంది.
(11:18) ఆ నాదం మన మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? నిమహాన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు చేసిన ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లలో సైతం ఈ సత్యం బయటపడింది. ఆ శబ్ద తరంగాలు మన మెదడులోని భయాన్ని స్ట్రెస్ ని పుట్టించే అమిగ్డాలా తీవ్రతను క్రమంగా తగ్గించి దాన్ని సహజ సిద్ధంగా శాంతింప చేస్తాయి. అంతేకాదు ఆ ధ్వని వల్ల మన మెదడు నుంచి ఛాతి మీదుగా పొట్ట వరకు విస్తరించి ఉన్న వేగస్నా వ్యవస్థ ఉత్తేజితమవుతుంది.
(11:48) ఇది జరగగానే మీ దేహం అల్లకల్లోలమైన స్థితి నుంచి బయటపడి అత్యంత ప్రశాంతమైన ఏకాగ్రత మూడ్లోకి వెళ్ళిపోతుంది. సైన్స్ ఈ ప్రాసెస్ లో జరిగే భౌతిక రసాయన మార్పులను గమనించగలదు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన పరమ సత్యం ఒకటి ఉంది. ఈ మంత్రం అనే నాబ్ తో ట్యూన్ అయ్యేది మన దేహమే కావచ్చు కానీ అప్పుడు నీలోకి ప్రసారమయ్యే ఆ మహాశక్తి మాత్రం ఆ అనంతమైన శివ చైతన్యం నుంచే వస్తుంది.
(12:19) ఆ శూన్య స్థితిలో నీ ఆలోచనలకి ఈ సృష్టికి మధ్య జరిగే ఒక మ్యాజిక్ ఉంటుంది చూసావా మన భాషలో దాన్నే శివాజ్ఞ అంటారు. ఆధునిక సైన్స్ అయినా ఆ స్కాన్లు అయినా ఈ ప్రాసెస్ లో జరిగే భౌతిక రసాయన మార్పులను మాత్రమే కొలవగలవు. కానీ ఆ నిశ్శబ్దంలో ఒక సాధారణ మనిషికి ఆ విశ్వ చైతన్యానికి మధ్య జరిగే అనుసంధానాన్ని కొలిచే యంత్రం ఈ భూమి మీద ఇంకా తయారు కాలేదు.
(12:47) ఇక్కడ చాలామంది సాధకులకు ఒక అతి పెద్ద ధర్మ సందేహం వస్తుంది. అసలు ఈ మంత్రాన్ని ఎలా పలకాలి స్వరాలు అనగా హెచ్చు తగ్గులు లేకుండా పలికితే పాపమా అని మన శాస్త్రాలు దీనికి అత్యంత స్పష్టమైన వివరణ ఇచ్చాయి. మీరు ఈ మంత్రాన్ని వేద మంత్రంగా పటిస్తారా లేక నామజపంగా చేస్తారా అనే దానిపై పఠన విధానం ఆధారపడి ఉంటుంది. ఇది కృష్ణ యజుర్వేదంలోని శ్రీ రుద్రంలోని మంత్రం ఒకవేళ మీరు దీన్ని వేద మంత్రంగా జపించాలనుకుంటే ఖచ్చితంగా వేద స్వరాల నియమాలు పాటించాలి.
(13:24) ఇది అత్యంత నిష్టతో గురు సమక్షంలో నేర్చుకోవలసిన పద్ధతి కానీ ఈ మహామంత్రం మనకఇచ్చే అతి పెద్ద వరం ఏంటంటే సామాన్యులు తమ కష్టాల నుండి గట్టెక్కడానికి ఆ దేవుడితో అనుసంధానం అవ్వడానికి దీన్నొక నిత్య నామజపంగా కూడా చేసుకోవచ్చు. నామజపానికి ఎలాంటి స్వర నియమాలు లేవు స్వచ్ఛమైన భక్తి శ్రద్ధ అక్షర స్పష్టత ఉంటే చాలు ఎవ్వరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జపించవచ్చు అయితే ఇక్కడ ఒకే ఒక చిన్న ఉచ్చారణ రహస్యాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాలి చాలామంది ఓం నమఃశివాయ అని ఒకే పదంగా వేగంగా కలిపి చదివేస్తారు అది తప్పు
(14:10) మధ్యలో నమః అన్నప్పుడు అక్కడ విసర్గ ఉంది కాబట్టి పలికేటప్పుడు నమః అని ఒక చిన్న గాలిని వదులుతూ నాభిలోంచి ఆ శబ్దం రావాలి. ఓం నమః శివాయ ఇలా స్పష్టంగా పలికినప్పుడే మీ శ్వాసకోస వ్యవస్థ పర్ఫెక్ట్ గా అనుసంధానమై మీ దేహంలోని నాడీ కేంద్రాలు పూర్తిగా ఉత్తేజితం అవుతాయి. నా జీవితంలో ఈ మంత్రం అంత వేగంగా నా మనసుని మార్చడానికి గల అతి పెద్ద రహస్యం నేను దీన్ని బ్రహ్మ ముహూర్తంలో జపించడమే ఎందుకంటే ఆ సమయంలో పగలు రాత్రికి సంబంధించిన ఆలోచనలు డిస్టర్బెన్సులు ఉండవు సూర్యోదయానికి ముందుండే ఆ కొద్ది గడియల్లో ప్రకృతి అంతా
(14:57) ఒక మహా నిశ్శబ్దంలో శివ ధ్యానంలో ఉంటుంది. ఆ వాతావరణంలోని ప్రాణ వాయువు అత్యంత స్వచ్ఛమైన స్థితిలో ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా యోగశాస్త్రం ప్రకారం ఆ సమయంలో మన దేహంలోని సూర్య నాడి అనగా కుడి నాసిక చంద్ర నాడి అనగా ఎడమనాసిక పర్ఫెక్ట్ బ్యాలన్స్ లోకి వచ్చి మన వెన్నెముకలోని కేంద్ర నాడి అయిన సుషుమ్న నాడి సహజంగా ఓపెన్ అవుతుంది.
(15:27) అలా సుషుమ్న ఉత్తేజితమైన ఆ అమృత ఘడియల్లో మీరు ఓం నమఃశివాయ అని జపిస్తే మీ మనసుపై దాని ప్రభావం మామూలు సమయాల్లో కంటేవెయి రెట్లు బలంగా ఉంటుంది. కానీ చాలామంది నేను రోజు జపిస్తున్న నాకు ప్రశాంతత లేదు ఎలాంటి ఫలితం లేదు అంటుంటారు. దానికి కారణం వాళ్ళు తెలియక చేసే మూడు మహా దోషాలే అవేవో చూద్దాం. మొదటి దోషం కేవలం 108 అనే సంఖ్యను పూర్తి చేయాలనే ఆరాటంతో వేగంగా ఒకే శ్వాసలో 10 సార్లు జపించేస్తుంటారు.
(16:02) కానీ గుర్తుపెట్టుకోండి జపం అంటే లెక్క పూర్తి చేయడం కాదు మంత్రం అంటే ధ్వని ధ్వని అంటే ప్రాణం ఆ అక్షరాల మధ్య ఒక లయం ఉండాలి. మనసుపెట్టి భక్తితో ఒక పది సార్లు చదివినా చాలు అది లక్ష సార్లు యాంత్రికంగా చదివిన దానికంటే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది రెండవ దోషం పెదాలతో శివుడి నామాన్ని జపిస్తూ మనసులో మాత్రం ఆఫీస్ పాలిటిక్స్ అప్పుల టెన్షన్లు లేదా వంటగదిలో ఏం జరుగుతుందా అని ఆలోచిస్తుంటారు శాస్త్రం ప్రకారం మంత్రం అనే మాటకు అర్థం మననాత్ త్రాయతే ఇతి మంత్రః అనగా ఏదైతే నీ మనసును రక్షిస్తుందో అదే మంత్రం కానీ మీ మనసే వేరే చోట ఉంటే ఆ నాదం మిమ్మల్ని ఎలా
(16:47) రక్షిస్తుంది అందుకే జపం చేసేటప్పుడు మీ ఏకాగ్రత పూర్తిగా ఆ నాదం మీదే లగ్నం అవ్వాలి. ప్రతి అక్షరం పుట్టిస్తున్న ఆ వైబ్రేషన్ ని మీ దేహంలోని అణువణువున మీరు అనుభూతి చెందాలి. మూడవ దోషం ద డిజిటల్ డిస్ట్రాక్షన్ ఇది ఈ కాలంలో అందరూ చేసే అతి పెద్ద తప్పు. పక్కన ఫోన్ పెట్టుకొని మధ్యలో నోటిఫికేషన్లు చూసుకుంటూ జపించడం లేదా YouTube లో మంత్రాన్ని ప్లే చేసి దానికి కోరస్ లాగా గొంతు కలపడం గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రానిక్ గా రికార్డ్ అయిన శబ్దాన్ని వినడం జపం అనిపించుకోదు.
(17:25) జపం చేసేటప్పుడు మీ దేహమే ఒక దేవాలయం అవ్వాలి. మీ గొంతు నుంచే ఆ నాదం పుట్టాలి. అందుకే ఆ జప సమయంలో మీ ఫోన్ ని పూర్తిగా దూరంగా పెట్టండి. ఎందుకంటే ఆ మంత్రానికి ప్రాణం పోసేది మీ ఫోన్ స్పీకర్ కాదు ఆ శివుడిపై మీకున్న శరణాగతి మాత్రమే ఆ శరణాగతికి ఎంతటి అపారమైన శక్తి ఉందో తెలుసా? శివపురాణంలో ఎందరో సామాన్యులు వారికి వేదస్వరాలు తెలియవు కఠినమైన కర్మకాండలు అస్సలు తెలియవు.
(17:56) పాల కోసం పరితపించిన బాల ఉపమన్యుడు తన కళ్ళనే తీసి అర్పించిన భక్త కన్నప్ప వీరికి పండితుల్లా శాస్త్రాలు చదవడం రాకపోవచ్చు కానీ వాళ్ళ మనసులో ఉన్న నిష్కల్మసమైన ఆర్తి ఆ పరిపూర్ణ శరణాగతే ఆ శివనామానికి ప్రాణం పోసింది. వాళ్లకు మంత్రం పెదవుల ఉచ్చరణలో లేదు వాళ్ళ ప్రతి శ్వాసలో ఉంది. అందుకే ఆ భోశంకరుడు వారిని తనలో లీనం చేసుకొని అత్యున్నతమైన శివ సాయుజ్యం ప్రసాదించాడు.
(18:26) మిత్రులారా ఓం నమఃశివాయ అనేది ఒక మతం కాదు కేవలం ఒక దేవుడి పేరు మాత్రమే కాదు నీలోని అహంకారాన్ని దహించి నీ సామర్థ్యానికి ఉన్న పరిమితులను చెరిపేసి నిన్ను ఆ అనంతమైన విశ్వ చైతన్యంతో కలిపే ఒక నాదవంతన రేపటి తెల్లవారు జామున ఆ మహా నిశశబ్దంలో నిద్ర లేవండి ప్రశాంతంగా కూర్చోండి మీలో ఉన్న సమస్త భారాన్ని ఆ మహాదేవుడి పాదాల దగ్గర వదిలేసి మీ గొంతు సవరించుకొని నాభిలోంచి ఆ నాదాన్ని పలకండి మీరు జపిస్తున్నది కేవలం శబ్దం కాదు అది సాక్షాత్తు ఆ శివుడితో మీ కనెక్షన్ ఓం నమఃశివాయ అని మీరు పలికే ప్రతి అక్షరం మీలోని భయాలను పారద్రోలాలి మీ ఆలోచనలను
(19:12) స్ఫటికంలా మార్చాలి ఎప్పుడైతే మీలో అహంకారం తొలగిపోయి ఆ శూన్య స్థితికి చేరుకుంటారో అప్పుడు మీ మనసుకు దొరికే స్పష్టత మీలో రగిలే ఆ మహాశక్తి సామాన్యమైనవి కావు ఎందుకంటే అప్పుడు పని చేసేది మీరు కాదు మీలో ఉన్న ఆ శివ తత్వం ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే పూర్తి విశ్వాసంతో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.
(19:40) ఈ వీడియో ద్వారా మీకు పొందిన స్పష్టత ఈ పాజిటివ్ వైబ్రేషన్ మీకు నిజంగా విలువైనది అనిపిస్తే దీన్ని మీ ఆత్మీయులతో పంచుకోండి. మరొక రహస్యంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శివమయం.

No comments:

Post a Comment