బంధాలు అంటేనే ఒక స్వార్థం | Why No One Loves You Truly | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oICaiXk28XY
Transcript:
(00:01) [సంగీతం] మీరు రోడ్డు మీద నిలబడ్డారు. జేబులో ఒక్క రూపాయి లేదు. మీరు నమ్ముకున్న మనుషులు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మీ పరువు మీ హోదా, మీ సామ్రాజ్యం అన్ని కళ్ళ ముందే బూడిదైపోయాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? [సంగీతం] నిజం ఏంటంటే చాలామంది ఇక్కడితో వాళ్ళ జీవితాన్ని ఆపేస్తారు శారీరకంగా కాదు మానసికంగా అయిపోయింది నా జీవితం ముగిసిపోయింది అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు.
(00:32) కానీ చాణిక్యుడు ఒక మాట అంటారు రాజ్యం పోతే రాజు భిక్షగాడు కాడు కేవలం సమయం మారిన ఒక యోధుడు మాత్రమే అని మీరు సర్వస్వం కోల్పోయినా మీ శ్వాస ఆగనంతవరకు మీరు ఓడిపోలేదు. [సంగీతం] మీకు తెలుసో లేదో సమస్య మీరు రోడ్డు మీద పడటం కాదు సమస్య అదంతా చూసి మీ మైండ్ సెట్ కూడా మోకాళ్ళ మీద పడిపోవడమే సమస్య డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు మనుషులు పోతే కొత్త వాళ్ళు వస్తారు కానీ నేను మళ్ళీ లేవలేను అనే భ్రమలో మీరు చిక్కుకుపోవడం ఉందే అది అసలైన సమస్య.
(01:04) మీరు నడుస్తున్న దారిలో గోతుని చూసి భయపడుతున్నారు కానీ మీ కాళ్ళలో ఉన్న బలాన్ని మాత్రం మర్చిపోతున్నారు. సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుందో తెలుసా మీ దగ్గర పైసా ఉన్నప్పుడు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటుంది. అవే డబ్బులు మీ దగ్గర నుంచి పోయాయి అనుకోండి మీరు ఎవరో తెలియనట్టు పక్కకు తప్పుకుంటుంది. ఈ రోజుల్లో మనుషుల బంధాలు, ప్రేమాభిమానాలు అన్నీ మీ జేబు బలాన్ని బట్టే డిసైడ్ అవుతున్నాయి.
(01:28) ఇది వినడానికి క్రూరంగానే ఉంటుంది కానీ ఇదే పరమ సత్యం. చాణిక్యుడు ఎప్పుడో చెప్పాడు డబ్బు లేని వాడికి మిత్రులు ఉండరు [సంగీతం] అలాగే బంధువులు కూడా ఉండరు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే అంతా కోల్పోయినప్పుడు [సంగీతం] ఏడవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆ ఏడుపు మిమ్మల్ని ఇంకా బలహీనపరుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళకి మిమ్మల్ని చూసి జాలిపడే అవకాశాన్ని ఇస్తుంది.
(01:51) ఈ ప్రపంచంలో జాలి కంటే దరిద్రమైనది ఇంకొకటి లేదు. ఎవరి దగ్గర జాలిని ఆశించకండి. మీరు కింద పడ్డప్పుడు మిమ్మల్ని తొక్కడానికి 100 మంది రెడీగా ఉంటారు కానీ లేపడానికి ఒక్కడు కూడా రారు. మీరు అనుకుంటున్నారు నాకు అంతా అయిపోయింది నేను మళ్ళీ సున్నా నుంచి మొదలు పెట్టాలా అని కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు సున్నా కాదు అనుభవంతో కూడిన ఒక శక్తి మీరు ఒకప్పుడు ఏమి తెలియకుండా గెలిచారు ఇప్పుడు మీకు ప్రపంచం అంటే ఏంటో తెలుసు మనుషుల బుద్ధులు తెలుసు సమస్య మీ పరిస్థితుల్లో లేదు నేను ఓడిపోయాను అని మీరు నమ్ముతున్న మీ ఆలోచనల్లో ఉంది. చాలామంది ఐడెంటిటీ
(02:26) క్రైసిస్ లో బ్రతుకుతున్నారు. నా కారు పోయింది నా ఇల్లు [సంగీతం] పోయింది నా బ్రాండ్ పోయింది ఇప్పుడు నేను సమాజానికి ఏ మొహం చూపించాలి అని మీకు తెలుసో లేదో మీ బ్రాండ్ మీ వస్తువులో లేదు మీ బుర్రలో ఉంది. సింహం అడవిలో ఉన్న బోన్లో ఉన్న సింహమే దాని రాజసం మారదు. మీరు వస్తువులను చూసి మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకుంటున్నారు.
(02:48) అక్కడే తప్పు చేస్తున్నారు. చాణక్యుడు కాలంలో సామ్రాజ్యాలు కోలిపోయేవి. రాజులు అడవులు పాలయ్యేవారు కానీ బుద్ధి బలం ఉన్నవాడు మళ్ళీ సైన్యాన్ని కూడగట్టి కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించేవాడు. మీరు కోల్పోయిన డబ్బు మనుషులు కేవలం మీ జీవితంలో వచ్చిపోయే పాత్రలు మాత్రమే వాళ్ళు లేకపోతే మీ ఉనికి లేదనుకోవటం అంతా మీ భ్రమ.
(03:11) నిజం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదీ పర్మనెంట్ కాదు మీ పతనం కూడా పర్మనెంట్ కాదు. మీరు రోడ్డు మీద పడ్డప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. గమనించారో లేదో మీ చుట్టూ ఉన్న ఫేక్ మనుషులందరూ వాళ్ళ వాళ్ళ నిజ స్వరూపాన్ని చూపిస్తూ ఉంటారు. ఎవరు మీ వారో ఎవడు పరాయివాడో క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అలాంటప్పుడు బాధపడటం ఎందుకు మరి నిజానికి మీరు ఒక చెత్తని వదిలించుకుంటున్నారు.
(03:32) ఇప్పుడు క్లీన్ మైండ్ తో కొత్త విజన్ తో మళ్ళీ గేమ్ మొదలుపెట్టే టైం వచ్చింది. మనం ఎందుకు అంతా కోల్పోతాం. [సంగీతం] ఎందుకు ఒకరోజు అకస్మాత్తుగా రోడ్డు మీద నిలబడతాం అంటే మాత్రం దానికి వేరే ఎవరో కారణం కాదు మనమే ఎందుకంటే మనం మన కళ్ళకి నమ్మకమనే రంగులు అద్దాలు తగిలించుకొని తిరుగుతాం. ఎదురుగా ఉన్నవాడు వెన్నుపోటు పడవడానికి కత్తి నోరుతుంటే మనం వాడిని కౌగలించుకుంటాం.
(03:54) చాణక్యుడు ఒక పవర్ఫుల్ మాట చెప్పాడు అతిగా ఎవరిని నమ్మకూడదు. అతి వినయం దూర్త లక్షణం అని మీకు తెలుసో లేదో మనం కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయినప్పుడు మన పతనం మొదలవుతుంది. నాకు అంతా ఉంది కదా నా సామ్రాజ్యం సేఫ్ కదా అని మీరు ఎప్పుడైతే రిలాక్స్ అవుతారో అప్పుడే శత్రువు మీ కోట గోడల్ని తవ్వడం మొదలు పెడతాడు. అక్కడ శత్రువు అంటే ఎవరో కాదు మీ అలసత్వమే.
(04:18) కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ మనం మాత్రం ఈరోజు ఉన్న డబ్బు ఈరోజు ఉన్న మనుషులు రేపు కూడా ఇలాగే ఉంటారని భ్రమపడతాం. నిజం ఏంటంటే మనం మనుషుల మీద డిపెండ్ అవ్వడం వల్లే ఈ దరిద్రం [సంగీతం] వస్తుంది. మీ బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు మీరు ఇష్టపడిన వాళ్ళు అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు వీళ్ళఎవర మీ జీవితాన్ని మోయడానికి రాలేదు.
(04:39) ప్రతి ఒక్కడు వాడి స్వార్థం కోసమే మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆ స్వార్థం తీరిపోగానే లేదా మీ దగ్గర సరుకు అయిపోగానే వాడు పక్కకు తప్పుకుంటాడు. వాడు వెళ్ళిపోయాడని మీరు ఏడవటం మీ అమాయకత్వం కానీ వాడు అసలు మీ వాడు కాదు అనేదే కఠినమైన [సంగీతం] వాస్తవం. మనం దెబ్బ తినడానికి ఇంకో ముఖ్యమైన బ్లైండ్ స్పాట్ ఉంది అదేంటంటే మన ఈగో అంటే మన అహంకారం నాకంటే తోపు లేడు నా సామ్రాజ్యాన్ని ఎవడు పగలగొట్టలేడు అని చెప్పేసి ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడే ప్రకృతి మన నెత్తి మీద ఒక మొట్టగా వేస్తుంది.
(05:12) చాణిక్యుడు అంటారు విషం ఉన్న పాము అయినా సరే అది విషం లేనట్లే నటిస్తేనే దానికి రక్షణ. కానీ మనం ఏం చేస్తాం? మన ప్లాన్స్ అన్ని ఊరంతా చాటింపేస్తాం. మన లూప్ హోల్ సెంటో శత్రువుకి మనమే ప్లేట్లు పెట్టి అందిస్తాం. మీకు తెలుసో లేదో చాలా మంది తమ మైండ్ సెట్ అప్డేట్ చేయరు. పాత పద్ధతుల్లోనే కొత్త ప్రపంచాన్ని ఏలాలి అని చెప్పేసి చూస్తారు. టెక్నాలజీ మారుతుంది.
(05:32) మనుషుల మైండ్స్ మారిపోతాయి. మార్కెట్ స్ట్రాటజీస్ మారిపోతాయి. కానీ మీరు మాత్రం నేను 15 నెలల క్రితం ఇలాగే గెలిచాను ఇప్పుడు కూడా అలాగే గెలుస్తాను అని చెప్పి కూర్చుంటారు. కాలం చాలా క్రూరమైంది. దాని వేగాన్ని అందుకోకపోతే మిమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. నిజం ఏంటంటే మనం సర్వస్వం కోల్పోవడానికి మూలం మన ఎమోషనల్ వీక్నెస్ బిజినెస్ లో ఎమోషన్స్ పనికిరావు.
(05:56) రిలేషన్స్ లో అతిగా ఆశించడం పనికి రాదు. కానీ మనం మాత్రం ప్రతి విషయంలోనూ సెంటిమెంట్లు ఎమోషన్లని నమ్ముకొని డిసిషన్ తీసుకుంటాం. ఆ డిసిషన్స్ తల కిందులు అయినప్పుడు బిల్డింగ్ ముక్కలై కూలిపోయినట్లు మన జీవితం కూల్పోతుంది. పరిస్థితులను ప్రాక్టికల్ గా చూడకపోవడమే మనం చేసే అతి పెద్ద తప్పు. సరే అంతా అయిపోయింది మీరు కింద పడ్డారు అందరూ చూశారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మాత్రం మొదటి స్టెప్ ఆ ఏడుపు ఆ జాలిని పక్కన పెట్టేయండి.
(06:21) చాణక్యుడు ఒక అద్భుతమైన స్ట్రాటజీ చెప్తాడు. శత్రువు మిమ్మల్ని గమనిస్తున్నప్పుడు మీరు మరింత ప్రశాంతంగా మరింత ధైర్యంగా కనిపించాలి. మీ [సంగీతం] మొహంలో ఆందోళన కనిపిస్తే వాడు మిమ్మల్ని సగానికి సగం చంపేసినట్లే మీకు తెలుసో లేదో మైండ్సెట్ మార్చుకోవాలి. మైండ్సెట్ మార్చుకోవడం అంటే ఏదో రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవడం కాదు మీరు ఏ స్థితిలో ఉన్నా మీ ఆలోచనలపై మీకున్న కంట్రోల్ కోల్పోకుండా ఉండడం ఇదే మైండ్ సెట్ మార్చుకోవడం అంటే రోడ్డు మీద నిలబడ్డా సరే మీ కళ్ళల్లో ఆ మెరుపు [సంగీతం] ఉండాలి.
(06:53) ఆ కాన్ఫిడెన్స్ మాత్రం అలాగే ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర పోయింది కేవలం డబ్బు మాత్రమే మీ చేతులు కాదు కదా మనుషులు వెళ్ళిపోయారు మీ బుద్ధి [సంగీతం] మీతోనే ఉంది కదా ఏదైతే మిమ్మల్ని సున్నా నుండి హీరోని చేసిందో ఆ నాలెడ్జ్ ఎక్కడికి పోలేదు కదా నిజం ఏంటంటే గతాన్ని తలుచుకొని కుమ్ములిపోవడం వల్ల ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు.
(07:12) జరిగిపోయింది ఒక బ్యాడ్ డ్రీమ్ అనుకోండి. ఇప్పుడు మీ ముందు ఉన్నది ఒక ఖాళీ పేపర్ దానిపై మీ కొత్త హిస్టరీ మీరే రాయాలి. చానిక్యూల్ లాగా ప్రాక్టికల్ ప్లాన్ వేయండి. చిన్న చిన్న అడుగులు వేయండి శబ్దం చేయకుండా పని ముగించండి మీరు మళ్ళీ గెలిచే వరకు మీ ప్లాన్స్ ఎవరికీ తెలియకూడదు. మీకు తెలుసా మళ్ళీ నిలబడాలంటే మొదట మీ చుట్టూ ఉన్న నెగిటివిటీ కట్ చేయాలి.
(07:36) మిమ్మల్ని కించపరిచే వాళ్ళకు మీ పతనాన్ని చూసి నవ్వుకునే వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళతో వాదించకండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని చెప్పేసి ట్రై కూడా చేయకండి వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర కేవలం మౌనం అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించండి. ఎందుకంటే మౌనం అనేది ఒక గొప్ప ఆయుధం. చానిక్యుడు అంటారు మూర్ఖలతో వాదించడం కంటే మౌనంగా ఉండడం ఉత్తమం. మీరు ఇచ్చే బెస్ట్ రిప్లై మీ సక్సెస్ మాత్రమే మీ మాటలు కాదు.
(08:02) నిజం ఏంటంటే ఈ రీఎంట్రీలో మీరు పాత తప్పులు అస్సలు రిపీట్ చేయకూడదు. ఎవరిని నమ్మి దెబ్బ తిన్నారో అలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ మీ లైఫ్ లోకి రాకుండా చూసుకోవాలి. బిజినెస్ అయినా రిలేషన్ అయినా ప్రతి దాంట్లో ఒక స్ట్రిక్ట్ బౌండరీ లైన్ గీయండి. మనుషులు మారరు. కేవలం వాళ్ళ అవసరాలు మాత్రమే మారుతాయి. ఆ విషయం గ్రహించి ప్రతి ఒక్కరిని వాళ్ళ పరిమితుల్లోనే ఉంచడం నేర్చుకోండి.
(08:24) మీ మైండ్ సెట్ ని ఒక యోధుడిలా మార్చుకోండి. యోధుడు యుద్ధంలో దెబ్బ తింటే వెనక్కి పారిపోడు. కాసేపు ఆగి రక్తాన్ని తుడుచుకొని మళ్ళీ కత్తి పట్టుకొని యుద్ధానికి బయలుదేరుతాడు. మీకు జరిగిన నష్టం ఒక లెసన్. ఆ లెసన్ నేర్పినందుకు మీ శత్రువులకు థాంక్స్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నాశనం చేయలేదు. మిమ్మల్ని మరింత స్ట్రాంగ్ గా మార్చారు.
(08:45) మళ్ళీ నిలబడటం అనేది ఒక ఎత్తు అయితే ఆ నిలబడిన స్థానాన్ని పదిలిం చేసుకోవడం [సంగీతం] ఇంకొక ఎత్తు నిజమైన ఎదుగుదల అంటే కేవలం బ్యాంక్ బాలెన్స్ పెంచుకోవడం కాదు మీ ఆలోచనా విధానాన్ని మీ లైఫ్ స్టైల్ ని పూర్తిగా రీడిజైన్ చేసుకోవడం చాణక్యుడు ఒక అద్భుతమైన సూత్రం చెప్తాడు. సింహం వేటాడేటప్పుడు తన శక్తినంతటినీ ఒక్కసారిగా ఉపయోగిస్తుంది.
(09:09) మీరు కూడా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే మీ ఫోకస్ మొత్తాన్ని ఒకే ఒక లక్ష్యం మీద పెట్టాలి. చాలా మంది గెలిచిన తర్వాత మళ్ళీ పాత అలవాట్లలోకి జారిపోతారు. మళ్ళీ అదే కంఫర్ట్ జోన్, మళ్ళీ అదే పాత అహంకారం, అదే విలాసాలు ఇక్కడే ప్రకృతి మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. ఒకసారి దెబ్బ తిన్న తర్వాత కూడా బుద్ధి రాకపోతే ఈసారి వచ్చే పతనం అంతకంటే దారుణంగా ఉంటుంది.
(09:31) జీవితాన్ని మార్చుకోవడం అంటే మీ చుట్టూ ఉన్న వస్తువులను మార్చడం కాదు. మీ లోపల ఉన్న క్రమశిక్షణను పెంచడం. నిజం ఏంటంటే ఈ ప్రపంచంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవాలి. అది ఎలాంటి సామ్రాజ్యం అంటే రేపు మళ్ళీ భూకంపం వచ్చినా సరే మీ పునాదులు కదలకుండా ఉండాలి. మీ నాలెడ్జ్, మీ స్కిల్ మీ క్యారెక్టర్ ఇవే మీ నిజమైన పునాదులు కానీ మీలో ఉన్న సరుకు మీ బ్రెయిన్ పవర్ ఎప్పుడూ మీతోనే ఉంటాయి.
(09:56) మిమ్మల్ని మీరు ఒక అధ్యయమైన శక్తిగా మార్చుకోవడమే జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అంటే. మీకు తెలుసో లేదో నిజమైన సక్సెస్ అంటే 100 మంది మీ చుట్టూ చేరడం కాదు. మీరు ఒంటరిగా ఉన్నా సరే మీ గుండెల్లో భయం లేకపోవడం ఈ సమాజంలో చాలామంది బంధాల వెనుక గ్రూపుల వెనక తాకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒంటరిగా నిలబడే ధైర్యం లేదు కాబట్టి కానీ ఛాన్క్యుడు ఫిలాసఫీ ప్రకారం ఒంటరితనం అనేది ఒక శాపం కాదు అది మీ అసలైన బలాన్ని తెలుసుకునే ఒక అద్భుతమైన అవకాశం.
(10:27) మిమ్మల్ని మీరు నమ్ముకున్న రోజున మీకు వేరే ఎవరు సపోర్ట్ అవసరం లేదు. నిజం ఏంటంటే మీరు పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి తిరిగి వస్తుంది. [సంగీతం] డబ్బు అంతకంటే రెట్టింపు వస్తుంది. మనుషులు మీ సక్సెస్ చూసి మళ్ళీ క్యూ కడతారు. కానీ ఈసారి వచ్చే వాళ్ళని చూసి మీరు మోసపోకూడదు. వాళ్ళని కేవలం మీ అవసరాల కోసం వాడుకోలే తప్ప మీ గుండెల్లో పెట్టుకోకూడదు.
(10:50) రిలేషన్స్ అయినా బిజినెస్ అయినా [సంగీతం] ఒక అటాచ్మెంట్ లేని డిటాచ్మెంట్ మెయింటైన్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు చివరిగా ఒక మాట. రేపు పొద్దున్న మీరు నిద్ర లేచేసరికి పరిస్థితులు మారకపోవచ్చు. కానీ మీ ఆలోచన మారాలి. మీరు రోడ్డు మీద ఉన్నారా సింహాసనం మీద ఉన్నారా అన్నది ముఖ్యం కాదు మీ తల ఎప్పుడూ పైకే ఉండాలి. ఈ మైండ్సెట్ గెలిచినంత కాలం ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు.
(11:13) వెళ్లి మీ సామ్రాజ్యాన్ని మళ్ళీ నిర్మించుకోండి. ఆల్ ది బెస్ట్ అంతేకాకుండా మీరు నిజంగా మీ సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను అనుకుంటే మాత్రం నిర్మిస్తాను అని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. [సంగీతం] [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment