MVN Kasyap : ఎవరిని నమ్మాలి? |How to Identify Fake People |Best Moral Video |SumanTV Anchor Nagaraju
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FeciN6Igquo
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. హలో ఎమఎన్ కశ్యప్ గారు హలో నాగరాజు గారు ఎదుటివారిని ఎలా నమ్మాలి ఎలా నమ్మకూడదు మ్ అసలు దాన్ని ఎలా గుర్తించాలి? వాళ్ళు సరైన వ్యక్తులా కాదా అని ఎలా గుర్తించాలి గోల్డ్ ఏంటి రోల్డ్ గోల్డ్ ఏంటి [నవ్వు] మెరిసేవన్నీ బంగారం బంగారం కాదు ఎందుకంటే అండి మీరు ఇప్పుడు మీరు బాగా నష్టపోయేది ఎవరి దగ్గర ఒకటి మీ శత్రువు దగ్గర మీరు బాగా నష్టపోతారా మీ మిత్రుల దగ్గర బాగా నష్టపోతారా లేకపోతే మీరు ఎంతో నమ్మిన
(00:44) వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తే మీరు బాగా నష్టపోతారా నమ్మిన వ్యక్తి మోసం చేస్తే మాత్రం ఇప్పుడు ఓ శత్రువు ఉన్నాడండి ఎనిమీ ఉన్నాడు శత్రువే కాబట్టి ఏదో ఒక రోజు ఇబ్బంది పెడతాడని మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి ఇబ్బంది పెడితే కొలాటరల్ డామేజ్ ఉంటుంది అంటే ఫైనాన్షియల్ గా ఏదో ఇబ్బంది పడ్డం పరువు పోయింది అంతే తప్ప నమ్మిన వ్యక్తి మోసం చేసినప్పుడు అటు టాంజిబుల్ ఇటు ఇంటాంజిబుల్ రెండు పోతాయి ఏయ్ టాంజిబుల్ అంటే ఇటు డబ్బులు వగైరా పోయినాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మానసిక ప్రశాంతత పోతుంది మనసుకు గాయాలు అవుతాయి ఫిజికల్ గాను మెంటల్ గాన
(01:17) అబ్బా చాలా బాగా చెప్పారు ఫిజికల్ కల్గా మెంటల్గా ఎమోషనల్ గా అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా ఇబ్బంది పడతాంండి మనకి డెంట్స్ సొట్టలు పడతాయి అబ్బా కారుకి గనుక సొట్టలు ఎట్ట పడతాయో అలా మన మనసుకి గాయాలు అవుతాయి అందుకని ఒక వ్యక్తిని నమ్మే ముందు కొన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందండి నాలుగు క్వాలిటీస్ ఉంటాయి ఈ నాలుగు గనక మనం ఐడెంటిఫై ప్రాపర్ గా చేయగలిగితే ఈ నాలుగు క్వాలిటీస్ గనక అవతల వ్యక్తిలో ఉంటే వాళ్ళని మనం మనం నమ్మొచ్చు ఆ నాలుగు చెప్పే ముందు నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మెటాఫర్ ఇస్తా ఇప్పుడు ఇక్కడ తాళం ఉంది
(01:57) మ్ ఏవండీ ఒక ఏడు ఎనిమిది తాళం చేతులు ఉన్నాయి ఇది మీ మనసు రైట్ మీరు మీ మనసుతో మీ హార్టు తో ఎవరు సింక్ అవుతారు ఎవర్ని ట్రస్ట్ చేయొచ్చు అనేది మీరు ఇప్పుడు ఏ తాళం ఇది ఓపెన్ చేస్తుందో తెలియదు రైట్ కరెక్ట్ గా ఏ తాళం ఓపెన్ చేస్తుందో తెలిసిందా చాలా సింపుల్ అండి సింపుల్ ఇబ్బంది లేదు తెలవలేదా ప్రతి ఒక్కదాన్ని ప్రయత్నించొచ్చు ఆ అక్కడ జరిగే ఇబ్బంది ఏంటంటే ఒక రాంగ్ పర్సన్ ని ఫస్ట్ ఒక రాంగ్ కీ సెలెక్ట్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి చూడటానికి మంచిగా షైనింగ్ ఉంది అబ్బా భలేగా ఉన్నాడే వ్యక్తి మంచిగా మాట్లాడుతున్నాడు టిప్ టాప్ గా ఉన్నాడు
(02:36) ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఉంది ఆ రూపురేఖలు కూడా బాగున్నాయి ఆ రూపురేఖలు కూడా బాగున్నాయని ట్రై చేస్తే నో ఇది ఫిట్ అవ్వదు అవును ఇది ఫిట్ అవ్వదు దీంతో మన మైండ్ మన మైండ్ మన మనసు ఓపెన్ అవ్వదు. కానీ ఆ కశ్యపు ఓకే ఇది కాకపోతే ఇంకోటి ట్రై చేస్తాం నష్టం ఏంటి నష్టం ఏంటంటే 10 ట్రై చేసేటప్పటికీ ఈ లోపల ఉన్న మెకానిజం పాడైపోతుంది.
(02:58) ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క గాయం చేసుకొని మనం అతిగా నమ్మేసి గాయపడిపోయిన తర్వాత ఏమవుతుందంటే రైట్ కి ఎదురుంగా ఉన్నా గాని నమ్మ బుద్ధి కాదు ఇప్పుడు అందులో ఏ రైట్ కి ఉందో తెలియదు ఏ రైట్ కి ఉందో తెలియదు సో ఫస్ట్ ది ఏంటంటే మెరిసేవన్నీ బంగారం కాదు [నవ్వు] పోనీ ఇది చూద్దాం ఇది పొడుగ్గా స్ట్రాంగ్ గా భలేగా ఉందిరా పోనీ ఇది ట్రై చేద్దామా ఇది వర్కవుట్ అవ్వదు మరి కరెక్ట్ కి ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయండి మీరు ఇప్పుడు ఇప్పుడు ఇది చూశారు అనుకోండి ఇది చూడంగానే చెప్పేయొచ్చు ఇది చాలా బుల్లిగా ఉంది చాలా చిన్నగా ఉంది. ఇంత
(03:30) పెద్ద తాళం ఇది ఎక్కడ ఓపెన్ అవుతుంది దీన్ని ఎలిమినేట్ చేసేయొచ్చు అలానే మిగతా కీస్ చూస్తే సైజుని చూసి వాటి స్పెసిఫికేషన్స్ చూసి చెప్పేయొచ్చు. నౌ మీరు కొంచెం గమనిస్తే కొంచెం గమనిస్తే మీరు ఈ కీ గనుక తీసుకున్నాం అనుకోండి ఇది ఇప్పుడు ఈ ఈ బ్రాండ్ తో ఈ బ్రాండ్ మ్యాచ్ అవుతుంది. [నవ్వు] అంటే అవతల వాళ్ళ వైబ్ తో మన వైబ్ మ్యాచ్ అవుతుంది.
(03:56) వైబ్ మ్యాచ్ అయితే వాళ్ళు మన ట్రైబ్ అన్నమాట. ఏయ్ [నవ్వు] మనం దీన్ని పెట్టి ఓపెన్ చేస్తే ఎమ్మటే లాక్ ఓపెన్ అవుతుంది. ఏయ్ అయితే కరెక్ట్ కి తెలియకుండా లాక్ ఓపెన్ చేద్దామని ట్రై చేసి గాయపడి ఫస్ట్ అది ఏందో తెలవకుండా పైపైనవి చూసి మనం మనం నమ్మేసి మోసపోవడం కంటే కొన్ని క్యారెక్టర్స్ గనక మనం చూడగలిగితే. ఎందుకంటే అన్ని మంచిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి బాగానే ఉంటాడు బానే ఉంటాడు కానీ కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఒక మొక్క ఉందనుకోండి సీజన్ అంతా మంచిగా ఉన్నప్పుడు ఇబ్బంది ఏమ లేదు ఆకులు ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటాయి కానీ గట్టి గాలివాన తుఫాన్ లాంటిది వచ్చింది అనుకోండి
(04:38) అప్పుడు దాంట్లో ఆ రూట్స్ ఎంత స్ట్రాంగో అప్పుడు తెలుస్తుంది అప్పుడు నిలబడగలిగిందా అంటే మన లైఫ్ లో లాభాలు లేనప్పుడు ఏవండీ లేదా నష్టాలు వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు అవతల వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు అది చూసి మనం చెప్పేయచ్చండి సో ఆ క్వాలిటీస్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగు క్వాలిటీస్ అండి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సేఫ్ అని గుర్తుపెట్టుకోండి అంటే ఒక వ్యక్తితో ఈ వ్యక్తితో రిలేషన్షిప్ సేఫ్ అయినా సేఫ్టీ ఇస్ ద టాప్ ప్రయారిటీ అండి ఆ సేఫ్టీ ఎమోషనల్ సేఫ్టీ ఉండాలి.
(05:16) సో ఎస్ అంటే ఏంటి ఎస్ ఫర్ స్టెబిలిటీ స్టెబిలిటీ అంటే స్టడీగా ఉండడం కాదు [నవ్వు] వాళ్ళ బిహేవియర్ లో ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. అంటే ఇవ్వాళ ప్రేమ చూపించి రేపు ద్వేషం చూపించే రకాలు కాదు. ఆ వెదర్ లాగా కాలాల్లాగా వాళ్ళు మారిపోరంట వాళ్ళు చాలా నికాస అయిన వ్యక్తులు రంగులు మార్చే రకాలు కాదు వాళ్ళ బిహేవియర్ మీరు కష్టాల్లో ఉన్నా ఒకే రకంగా ఉంటుందే మీరు లాభాల్లో ఉన్నా ఒకే రకంగా ఉంటుంది.
(05:45) అసలు అద్భుతమైన క్వాలిటీ వాళ్ళ స్టెబిలిటీలో ఏముంటుందంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎవరితో అయితే ఉపయోగం ఉంటుందో వాళ్ళతో బ్రహ్మాండంగా ఉంటారు. ఎవరితో అయితే ఉపయోగం లేదో వాళ్ళని అసలు దగ్గర రానీరు చాలా చులకన చేసి మాట్లాడుతుంటారు అంటే వాళ్ళ బిహేవియర్ లో స్టెబిలిటీ లేదన్నమాట వాళ్ళ క్యారెక్టర్ లో స్టెబిలిటీ లేదు కానీ ఏ వ్యక్తి దగ్గర అయితే స్టెబిలిటీతో స్టెబిలిటీ అయితే ఉంటుందో ఆ వ్యక్తి అవతల వ్యక్తితో ఉపయోగం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ప్రవర్తిస్తాడు కష్టం వచ్చినప్పుడు ఎంత ఇబ్బందులు వచ్చినా గాని మన వెన్నంటి నించుంటాడే తప్ప
(06:23) వెన్నుపోటు చేసే వ్యక్తి కాదంటే ఏ ఆ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఏంటంటే ఎస్ఏఎఫఈ లో ఏ ఫర్ అకౌంటబిలిటీ అకౌంటబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఈ రోజుల్లో మనం డబ్బులు దాచుకోవాలంటే బ్యాంకులు ఉన్నాయి లాకర్లలో పెట్టుకుంటున్నాం ప్రతిఒక్కదానికి పాస్వర్డ్లు పెట్టి చాలా సేఫ్ గా ఉంచుకుంటున్నాం కానీ మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోతుంది అంటే ఒక మనిషిని నమ్మి మనకఎంతో ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పంగానే ఇక అంతే ఇక ప్రపంచం మొత్తం బ్రాడ్కాస్ట్ అవుతుంది [నవ్వు] అంటే వాళ్ళకి అకౌంటబిలిటీ లేదన్నమాట వాళ్ళ దగ్గర మనం నమ్మి ఒకటి షేర్ చేయలేం అంటే
(07:08) మీరు ఒక వ్యక్తి దగ్గర నమ్మి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు వాడు పోయి 10 మందికి చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి రైట్ కీ కాదు పక్కన పడేయాలి పక్కన పడేయాల్సిందే అంటే మరీ పెద్ద విషయాలు కాకుండా చిన్న విషయాలు మీరు గనుక చెప్పి టెస్ట్ చేస్తే ఆ వ్యక్తి దగ్గరే ఉంచుకుంటే ఆ కరెక్ట్ కి అండి మీ లాక్ ఓపెన్ అవుతుంది లేదా బ్లాక్ చేయడం మంచిది [నవ్వు] బట్ ట్రూ అండి ఆ ఇది ఎట్లా ఉంటుందంటే అండి పిక్చర్ ప్లాంట్స్ అని ఉంటాయి పిక్చర్ అంటే ఒక సంచి లాగా ఉంది కదా అది ఏం చేస్తుందంటే ఆ ప్లాంట్ ఏం చేస్తుందంటే ఆ పైన చాలా రంగు రంగులుగా చాలా అట్రాక్టివ్ మెటీరియల్
(07:49) తయారు చేస్తుంది తయారు చేస్తే ఇన్సెక్ట్స్ వస్తాయి ఉ ఇన్సెక్ట్స్ వచ్చి అబ్బా ఇదేదో చూడటానికి బాగుంది కదా అని చెప్పి దాని మీద వాల్తాయి కొంచెం ఆ పైన కొంచెం షుగర్ కోటింగ్ లాంటి మంచి తీయటి సబ్స్టెన్స్ ఒకటి రిలీజ్ చేస్తుంది అది ఆ తీయటిది నాకుతూ కూర్చుంటుంది నాకుతూ కొంచెం అబ్బా ఇంకా లోపల ఎంత ఉందో అని చెప్పి కొంచెం లోపల దిగుతుంది లోపల దిగంగానే ఏమవుతుంది అంటే అక్కడ గమ్ లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది అతుక్కోబోతుంది కేల్కతం దుకాన్ బంద్ అతుక్కోపోంగానే ఏం చేస్తుంది అంటే ఇ అదే ఎక్కడికి కదలలేదు ఇది ఏదో కత్తులు పెట్టి కోసి చంపేదు.
(08:27) అనిమల్స్ గనుక చీల్చి చంపేసినట్టు ఇది ఇన్సెక్షన్ చంపదు అది ఏం చేస్తుందంటే అతుక్కొని కూర్చుంటుంది అబ్బా అతుక్కొని కూర్చుంటే ఎక్కడికి కదలలేదు కాబట్టి రోజుక కొంచెం రోజుకు కొంచెం ఆ ఎంజైమ్స్ లాంటివి రిలీజ్ చేసి కెమికల్స్ రిలీజ్ చేసి చిన్నగా ఆ పురుగుని కరిగించేసి తనలో కలిపేసుకుంటుంది సో అకౌంటబిలిటీ లేని వ్యక్తులు అసలు మీరు చెప్పింది వాళ్ళ దగ్గర క్షణం ఆగదు వాళ్ళఏమనా న్యూస్ ఛానల్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో గనీ [నవ్వు] అట్లా నమ్మి మోసపోయినవాళ్ళు ఎంతమంది ఉంటారు చాలా మంది అండి ఇటువంటి న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ అంటే అర్థం ఏంటంటే మీరు చెప్పిన దాన్ని 10
(09:08) మందికి ఒక న్యూస్ లాగా చెప్పేవాళ్ళని గనుక నమ్మితే మీ రిలేషన్షిప్ మీ లైఫ్ న్యూసెన్సే [నవ్వు] నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని మొత్తం ఎగిరిపోతుంది వికెట్ అంతా సో స్టెబిలిటీ అకౌంటబిలిటీ థర్డ్ వన్ ఏంటంటే అండి చాలా ఇంపార్టెంట్ ఫ్రీడమ ఫ్రీడమ్ అంటే ఏంటంటే మనకి ఆ వ్యక్తిని నమ్మటం మనకి కరెక్ట్ వ్యక్తి అని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ దగ్గర మీరు నటించాల్సిన అవసరం ఉండదు.
(09:41) వాళ్ళ దగ్గర మీ వీక్నెస్ ని దాచుకోవాల్సిన అవసరం ఉండదు. మీలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ని హైడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకు అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే బాస్ నాలోనూ నెగిటివ్స్ ఉన్నాయి నాలోనూ పాజిటివ్స్ ఉన్నాయి ఎదుటి వ్యక్తిలో కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి నెగిటివ్ ఉన్నంత మాత్రాన ఆ మనిషి క్యారెక్టర్ ని వాళ్ళు జడ్జ్ చేయరు.
(10:05) మీరు చేసిన తప్పుల్ని పట్టుకొని వాళ్ళు బ్లేమ్ చెయ్యరు. ఇన్సల్ట్ చేయరు. తక్కువ చేసి మాట్లాడరు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి బ్లేమ్ చేయటం ఇన్సల్ట్ చేయటం లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ కొంతమంది ఉంటారండి ఒక్క ఒక్క తప్పు చేస్తే ఇక ఆ తప్పునే 365 రోజులు చూపిస్తుంటారు [నవ్వు] స్లో మోషన్ వేసి కొన్ని కొన్ని సినిమాలు కావచ్చు సీరియల్ కావచ్చు ఒకటే రియాక్షన్ని 10 సార్లు చూపిస్తారు కదా [నవ్వు] అలానే వీళ్ళు కూడా చూపించిందే చూపించి ఆ తప్పునే పట్టుకొని జీవితాంతం టార్చర్ పెడుతుంటారు బ్లేమ్ చేస్తుంటారు తక్కువ చేసి మాట్లాడుతుంటారు వాళ్ళ దగ్గర మీరు ఫ్రీడమ ఉండదండి. అది ఎట్లా ఉంటుందంటే అండి
(10:51) అదిఒక బంధించే బంధించేయడం లాంటిది కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే అటువంటి వాళ్ళతోనే తిరుగుతుంటారు. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి ఇల్లు కలర్ఫుల్ గా ఉన్నంత మాత్రాన ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటుందన్న లాజిక్ ఏం లేదు ఇల్లు స్ట్రాంగ్ ఉంటుందా నిలబడుతుందా లేదా ఎలా తెలుస్తుంది కింద పునాదుల మీద బేస్ అయి ఉంటుంది.
(11:14) మనకి బయటికి కనిపించే బిహేవియర్ ఏదో ప్రేమ చూపించాడులే మన మీద శ్రద్ధ చూపించాడులే ఒక ఐదు నిమిషాలు మనతో టైం స్పెండ్ చేశాడులే అన్నంత మాత్రాన నమ్మటానికి లేదు అతనితో ఉంటే బాగుంది నాకు అతనితో ఉంటే మంచి ఫీల్ అనిపిస్తుంది. అతను నన్ను కేర్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అనుకునేటువంటి ఉండి ఏమో మంచోడేమోలే అని అనిపిస్తుంది అనుకునటువంటి వాళ్ళు పైపైన చూసి ఐదు రోజులు టెస్ట్ మ్యాచ్ ని రెండు ఓవర్లు చూసి నమ్మేస్తారు వీళ్ళ [నవ్వు] లేకపోతే సినిమా ఎంట్రీ కార్డు చూసేసి సినిమా అంతా రివ్యూ ఇవ్వలేం కదండీ [నవ్వు] సినిమా చూడాల్సిన అవసరం ఉంది ఏం చూడాలి స్టెబిలిటీ చూడాలి అకౌంటబిలిటీ చూడాలి
(11:55) ఫ్రీడమ్ ఉందో లేదో చూడాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి రెండు గంటలు నటించగలిగినవాడు రెండేళ్ళు నటించలేడండి ఆ నటన బయట పడిపోతుంది ఎందుకంటే నటించేటప్పుడు ఏంటంటే ప్రతిసారి టెంపరరీ ఫిక్స్ చేయడానికి ఏం చేస్తారంటే వాళ్ళ అబద్ధాలు లేదా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వచ్చేసి ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మకం ఏర్పరచడానికి నేను మీకుేదో అబద్ధం చెప్పా ఆ అబద్ధాన్ని కప్పచ్చుకోవడానికి తెల్లారి ఇంకేదో అబద్ధం చెప్పాలి ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే అబద్ధాలు చెప్పి చెప్పి నేను ఎక్కడో చోట దొరికిపోతాగా అవును ఆ దొరికిపోయినప్పుడు చాలా మంది ఏం
(12:30) చేస్తారంటే అంతకుముందు చాలా మంచి చేశలేన వదిలేస్తా అబ్బా అంటే మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నామఅండి [నవ్వు] మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం బౌండరీస్ పెట్టుకోకుండా ఆ ఫ్రీడమ ని మనం కోల్పోతున్నాం స్టెబిలిటీ అకౌంటబిలిటీ ఫ్రీడమ ఈ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈని మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఎలివేషన్ అని గుర్తుపెట్టుకోండి ఎలివేషన్ అంటే అర్థం ఏంటయ్యా అంటే వాళ్ళతో మీరు టైం స్పెండ్ చేస్తే మీరు వాళ్ళతో ఓ రెండు రోజులు టైం స్పెండ్ చేస్తే బయటికి వచ్చిన తర్వాత మనం ఎదిగామన్న భావన కలుగుతుంది.
(13:07) వాళ్ళు మీలో ఉన్న పాజిటివ్స్ ని ఎలివేట్ చేస్తారు, మీలో ఉన్న స్ట్రెంత్స్ ని ఎలివేట్ చేస్తారు, మీకు మీరు చూడలేని గోల్ ని చూపించి మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. అయితే ఈ ఎలివేషన్ ఇవ్వగలిగిన వాళ్ళతో ఉంటే లైఫ్ లో అత్యద్భుతంగా ఎదగగలరంట కానీ మనం చాలామంది ఎవరితో ఉంటున్నారు అంటే ఎలివేషన్ ఇచ్చే వాళ్ళతో ఉండట్లే ఎలిమినేషన్ చేసే వాళ్ళతో ఉంటున్నాం.
(13:34) [నవ్వు] వాళ్ళతో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు గొప్ప అని చెప్పటానికి మనల్ని తక్కువ చేసేస్తుంటారు మన ఎమోషన్స్ తో ఆడుకుంటారు మన ఎమోషన్స్ తో ఆడుకుంటారు మన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు మనల్ని తక్కువ చేస్తున్నారు వాళ్ళతో ఉండంగా ఉండంగా ఏమనిపిస్తుంది అంటే అదేంది అసలు నేను మంచోని కాదా అన్న భావన కలుగుతుంది వాళ్ళు మంచోడు వీడే [నవ్వు] అసలు మంచోడు వీడే కానీ బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళు ఎలివేట్ చేయకుండా మనలో ఉన్న మంచినంతా ఎలిమినేట్ చేసేస్తారు ఎస్ ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్ మేడిపండు చూడ మేలిమైయుండు పొట్టవిప్పి చూడ
(14:08) పురుగులు పురుగులుండు అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమ చాలా గొప్పదండి కానీ ప్రేమ అనే ముసుగులో ప్రేమ అనే ముసుగులో మనని ఉపయోగించుకోవడానికి లేని పోనివన్నీ క్రియేట్ చేసి అంటే వాళ్ళు చూపించే నటన చాలా అందంగా ఉంటుంది. ఆ అందానికి పడిపోయామా మనం అంధకారంలోకి పోతాం [నవ్వు] అదరగొడి సార్ థాంక్యూ సో చాలా మంది అంటే మీ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడండి అవకాశం ఉండొచ్చు బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి జూన్ లో తీసుకుంటే రిలేషన్షిప్ మాస్ట్రీ అనే ప్రోగ్రాం్ ఉంది ఎక్స్క్లూసివ్లీ ఫర్ కపుల్స్ దీంట్లో రిలేషన్షిప్ యొక్క సైన్స్ నేర్పిస్తామండి
(14:51) ఏదో రిలేషన్షిప్ అంటే జస్ట్ ఏదో ఎక్స్పెక్టేషన్స్ ని మనేజ్ చేయడం కాదు దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్ అది నేర్పి చడం జరుగుతుంది జూలైలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెకోరేటెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్స్ విచ్ ఈస్ ఎమోషనల్ మాస్ట్రీ మన మీరు గనుక మీ ఎమోషన్స్ ని మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డామేజ్ చేస్తాయి.
(15:13) సో వాటిని ఎలా మేనేజ్ చేయాలో నేర్పించే ప్రోగ్రాం ఎమోషనల్ మాస్ట్రీ ఈ రెండు కాకుండా జులై లోనే సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు జరిగే ప్రోగ్రాం మాత్రమే ఆ ప్రోగ్రామే కోచ్ ద కోచెస్ ఈ ప్రోగ్రాం ఉంది నాలాగా కోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి సిక్స్ మంత్స్ కోచింగ్ ఎలా ఇవ్వాలి అనేది నేర్పించడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ యు కెన్ కాంటాక్ట్ అస్ వెరీ గుడ్ ఇన్ఫో అంటే చాలా మంది కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎనీవే థాంక్యూ థాంక్యూ సో మచ్ కష్యప్ గారు థాంక్యూ థాంక్యూ [సంగీతం]
No comments:
Post a Comment