నువ్వసలు నిజం నుండి ఎందుకు పారిపోతున్నావ్? | PSYCHOOGICAL DENIAL || Anukula Vedam
Author Name:Anukula Vedam
Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=cz3zI6J7ubY
Transcript:
(00:00) మీరు లైఫ్ లో ఇదే నిజం అని లోపల క్లియర్ గా తెలిసినా దాన్ని అంగీకరించకుండా మొండిగా వాదించిన సిచువేషన్స్ ఉండే ఉంటాయి. అవునా అంటే నిజాన్ని అంగీకరించకపోవడం సైకాలజీ పుస్తకాల పరిభాషలో దీన్ని సైకలాజికల్ డేనా ఎల్ అంటారు. ఇదేదో మనిషికి పట్టిన పెద్ద జబ్బు ఏం కాదు ఇది జస్ట్ నిజాన్ని చూసి భయపడే పిరికితనం ఎందుకంటే నిజాన్ని భరించే దమ్ము మనలో ఎవ్వడికీ లేదు.
(00:29) అందుకే మనిషి ఎప్పుడు కూడా ఆ పదునైన వాస్తవాన్ని పట్టుకోవడానికి ఇష్టపడడు. దానికి బదులుగా వాడు ఒక అందమైన అబద్ధాన్ని కొనుక్కుంటాడు. దానికి రంగులు వేస్తాడు, బట్టలు తొడుగుతాడు, దాన్ని పూజిస్తాడు. ఎందుకంటే అబద్ధం అనేది చాలా మెత్తగా, సుఖంగా ఉంటది. అది మిమ్మల్ని ఏ ప్రశ్నలు అడగదు. హాయిగా, జోలపడి నిద్రపూచ్చుతది. ఇది అర్థం అవ్వాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి.
(00:53) అమ్మాయిల్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసిన హంతుకుల తలులని పలకరించండి. వాళ్ళ కొడుకులు ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసి ఉండొచ్చు. ఆధారాలతో సహా వాళ్ళు దోషులు అని ప్రపంచం మొత్తానికి తెలుసు కానీ వాళ్ళ తల్లిని అడిగి చూడండి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ నా బిడ్డ చాలా మంచివాడు వాడు పసివాడు వాడికి ఏమి తెలియదు వాడు చీమకు కూడా హాని చేయడు ఎవరో కుట్రపన్ని వాడిని ఇరికించారు అని అంటది.
(01:20) కానీ ఎందుకు ఇలా అంటది ఆమె ఏమి కావాలని అబద్ధం చెప్పడం లేదు నమ్మించడానికి నాటకాలు కూడా అడటం లేదు. ఆమె నిజంగానే అలా నమ్ముతుంది. కానీ ఎందుకో తెలుసా నా కడుపున పుట్టిన బిడ్డ ఒక రాక్షసుడు వాడు ఒక కిరాతకుడు అని ఒప్పుకోవడం అంటే తను తాను ఒక రాక్షసుడికి జన్మనిచ్చిన పాపాత్మురాలుగా అంగీకరించడమే తన పెంపకం ఒక ఫెయిల్యూర్ అని ఒప్పుకోవడమే అండ్ ఆమె అహం దానికి ఒప్పుకోదు.
(01:43) ఆమె ఈగో ఆ నిజాన్ని ముట్టుకొనివ్వదు. అందుకే ఆమె మనసు ఆ హంతకుడిని ఒక అమాయకుడిగా మార్చేసి ఆమెకు చూపిస్తుంది. తన కొడుకు గురించి ఒక అబద్ధపు చిత్రాన్ని గీసుకొని ఆమె ఆ భ్రమలోనే బ్రతికేస్తుంది. ఇప్పుడు ఆ తల్లుల గురించి పక్కన పెట్టండి వాళ్ళక ఏదో మెంటల్ ప్రాబ్లం ఉందని వాళ్ళ స్థానంలో మీరు ఉంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తారని మీకు మీరు సర్టిఫికెట్లు ఇచ్చేసుకోకండి.
(02:02) సరిగ్గా మీ లోపలికి మీరు చూసుకోండి. మీరు చేస్తున్నది కూడా అక్షరాలా ఇదే. ఆ తల్లులు తమ కొడుకుల విషయంలో భ్రమలో ఉంటే మరి మీరు మీ మొత్తం జీవితం విషయంలోనే భ్రమలో ఉన్నారు. ఈ సైకలాజికల్ డినయల్ అనేది ఆ తల్లులకు మాత్రమే పరిమితం కాలేదు అది మీ ప్రతి అణువులోను జీతించకపోయింది. మీరు ఎప్పుడూ నిజాన్ని ఫేస్ చేయరు.
(02:24) మీరు దాన్ని మార్చేసి దానికి మేకప్ వేసి మీకు నచ్చినట్లు ఊహించుకుంటారు. మీరు ఒక పనికి మాలిని ఉద్యోగం చేస్తుంటారు. మీ బాస్ మిమ్మల్ని రోజు కుక్కను చూసినట్టు చూస్తుంటాడు అవమానిస్తుంటాడు. కానీ మీరు దాన్ని ఏమని సరిపెట్టుకుంటారు ఆ నేను లేకపోతే ఈ కంపెనీ నడవదు నా మీద చాలా బాధ్యత ఉంది కాబట్టే నన్ను ఇలా అంటున్నాడు అని ఒక బ్రమని క్రియేట్ చేసుకుంటారు.
(02:43) ఎందుకంటే మీరు అక్కడ దాగున నిజాన్ని తట్టుకోలేరు. ఇంతకే అక్కడ దాగున నిజం ఏంటో తెలుసా నాకు ఈ ఉద్యోగం తప్ప బ్రతకడానికి వేరే గతి లేదు వేరే దారి లేదు నా బ్రతికింతే నాకోసం నేను నిలబడలేని పిరికివాడిని ఇది నిజం. సపోజ్ మీకు పెళ్లిఅయింది. అది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఏదో ఒకటి అయితే మీ రిలేషన్షిప్ లో మీ హస్బెండ్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు.
(03:07) ఇన్ఫాక్ట్ వాడు మిమ్మల్ని ఒక పని మనిషిలాగా వాడుకుంటున్నాడు అన్న విషయం మీ కళ్ళ ముందు క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ మీరు ఆ నిజాన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆ అంటే తనకి పనొత్తుడు ఎక్కువ ఆ ఒత్తిడి వల్ల ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నాడు కానీ నేనంటే చాలా ఇష్టం నన్ను చాలా ప్రేమిస్తాడు అని మీకు మీరే ఒక అబద్ధాన్ని చెప్పుకుంటారు.
(03:27) ఎందుకో తెలుసా వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అనే నిజాన్ని గాని ఒప్పుకుంటే ఫస్ట్ అసలు వాడిని పెళ్లి చేసుకోవాలి అని మీరు తీసుకున్న నిర్ణయమే తప్పు అని ఒప్పుకోవాలి. మీ జీవితంలో ఒక భాగం వ్యర్థం అయిపోయింది అని అంగీకరించాలి. [సంగీతం] ఆ నిజం ఒక యసిడ్ లాంటిది అది మీ ఆహాన్ని నిలువునా కాల్చేస్తది. అండ్ ఆ మండని భరించే దమ్ము మీకు లేదు ఎందుకంటే నిజం ఎప్పుడు సల సల కాగుతున్న నిప్పులా ఉంటది.
(03:51) దాన్ని కౌగలించుకుంటే మనం ఏర్పరచుకున్న భ్రమలన్నీ ఎక్కడికక్కడ కాలి బూడిద అయిపోతాయి. [సంగీతం] కానీ భ్రమ మంచు లాంటిది అది కరిగిపోతుంది అని మీకు లోపల ఎక్కడో ఒక మూల తెలిసినా కనీసం కాసేపైనా చల్లగా ఉంటదిలే అని దాన్నే పట్టుకొని కూర్చుంటారు. అబద్ధంలో ఉన్న సుఖం నిజంలో ఎప్పుడూ ఉండదు. నిజం మిమ్మల్ని నిద్రలేపుతుంది మిమ్మల్ని నిలదీస్తుంది మీ బట్టలిప్పి మీ అసలు స్వరూపాన్ని అర్థంలో చూపిస్తది.
(04:18) మరి అబద్ధం అబద్ధం మీకు జోలపాట పాడుతుంది నువ్వు చాలా గొప్పవాడివి నీకు ఏమీ కాలేదు అంతా మంచే జరుగుతుంది అని వీపు తడుతుంది. అందుకే మీరు ఎప్పుడు భ్రమల్లో బ్రతకడానికే ఇష్టపడతారు. కళ్ళు తెరిచి వాస్తవాన్ని చూస్తే మీ కాలి కింద నేల కుంగిపోతుంది. మీరు నమ్ముకున్న సిద్ధాంతాలు మీరు పెట్టుకున్న ఆశలు మీరు కట్టుకున్న గాలి మెడలు అన్ని పేక మేడల్ల కుప్ప కూలిపోతాయి.
(04:40) అండ్ ఆ సిధిలాల కింద పడి నలిగిపోవడానికి మీరు సిద్ధంగా లేరు. ఒకసారి ఈ సమాజం వైపు చూడండి స్వర్గం నరకం పునర్జన్మ కర్మ ఇవన్నీ ఏంటి మనిషి చనిపోతాడనే నిజాన్ని చావు తర్వాత ఇక ఏమీ ఉండదనే శూన్యాన్ని తట్టుకోలేక వాడు సృష్టించుకున్న అతి పెద్ద భ్రమలివి. నేను చనిపోతాను మట్టిలో కలిసిపోతాను నా అస్తిత్వం కనుమరుగైపోతుంది అనే నిజాన్ని అంగీకరించే ధైర్యం లేక పైకి ఎక్కడికో వెళ్తానని అక్కడ రంభలో ఊరవసలు మేనకలో ఉంటారని ఒక అబద్ధపు ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు.
(05:10) సైకలాజికల్ డినయల్ అంటే ఇదే కానీ గుర్తుపెట్టుకోండి మీరు ఎంత గట్టిగా కళ్ళు మూసుకున్నంత మాత్రాన మీ ముందు ఉన్న అగాధం మాయమైపోదు. మీరు కళ్ళు మూసుకొని నడుస్తున్నంత మాత్రాన చీకటి వెలుగుగా మారిపోదు. మీ భ్రమలు ఏదో ఒక రోజు పగిలిపోక తప్పదు. ప్రకృతికి మీ ఈగోలతో పని లేదు అది ఏదో ఒక రోజు నిజాన్ని మీ మొహాన్ని కొడతది. అండ్ ఆ రోజు మీరు పడే బాధ నరకం అంతా ఇంత కాదు దీని నుండి బయట పడాలంటే ధ్యానం చేయాలంటారు చాలామంది కానీ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని చెట్ల కింద కూర్చోవడం కాదు మీ చుట్టూ మీరు అల్లుకున్న ఈ అబద్ధాల సాలిగూడిని మీ చేతులతో మీరే నిర్దాక్షణయంగా చించి అవతలిసేయడం. మీ
(05:47) భ్రమల్ని మీరే స్వయంగా అగ్నిలో కాల్చి బూడి చేయడం. ఆ బూడిదలో నుంచి మాత్రమే అసలైన స్వేచ్ఛ పుడుతుంది. ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం.
No comments:
Post a Comment