అరే మామా... ఎంజాయ్ O Dude...Enjoy
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=j6Wy5t_XnUs
Transcript:
(00:01) యువత నోట రెగ్యులర్ గా వినిపించే పదం అండి ఎంజాయ్మెంట్ అంతే ఎంజాయ్ చేయాలి లైఫ్ ని మిత్రులు మాట్లాడుకుంటున్నప్పుడు కూడాను ప్రతి ఐదు నిమిషాలకు వినపడే మాట ఎంజాయ్ చేయాలిరా ఆ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి ఎవరనా పక్కన పిలిచి నాన్న అసలు ఎంజాయ్మెంట్ ఏంటిరా అని అడిగామ అనుకోండి ఎవడి దగ్గర నుంచి కరెక్ట్ సమాధానం ఉండదు. వాడు పోనీ ఇచ్చాడు అనుకోండి అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ సమాధానం దాని గురించే వీడియో అన్నమాట యువత ఏమన్నా చూసి కొంచెం అర్థం చేసుకుంటుందేమో అని చెప్పేసి అంటే ఇంగ్లీష్లో అసలు ఎంజాయ్ అంటే సరదాగా గడపడం కాదండి ఒక అనుభవాన్ని
(00:48) సంపూర్ణంగా ఆస్వాదించడం అంతే ఒక మ్యూజిషియన్ ఉన్నాడుఅనుకోండి సంగీతాన్ని ఆస్వాదిస్తాడు ఒక తల్లి బిడ్డ నవ్వుని ఆస్వాదిస్త స్తుంది ఒక సైంటిస్టు తన ప్రయోగ ఫలితాన్ని ఆస్వాదిస్తాడు. అంటే ఎంజాయ్మెంట్ అంటే కేవలం ఈ పార్టీలు ట్రిప్పులు సినిమాలు బ్లా బ్లా బ్లా అది కాదండి మీకు తెలుసు అవన్నీ నాటమ చెప్పకూడదు. [ఆశ్చర్యం] ఎంజాయ్మెంట్ అంటే మనసు పూర్తిగా అనుభవంలో లీనమై ఒక గొప్ప సంతృప్తిని పొందటం అంటే ఇప్పుడు మరింత స్పష్టంగా చెప్పాలి అంటే బాధ్యతల నుంచి తాత్కాలిక [గొంతు సవరించుకోవడం] విముక్తి అంతే ఒక విధమైన ఆటవీడుపు ఇది బేసిక్ స్టేజ్ అండి ఎంజాయ్మెంట్ లో
(01:36) దీనికి మించి ఇంకో స్టేజ్ ఉంది అదేంటంటే ఇద్దరు మేధావుల నోటి నుంచి వచ్చిన మాటలు చెబితేనే మీకు బాగా అర్థమవుతుంది. రాక్ఫెల్లర్ అని 1950 60స్ లో అమెరికాలో ఒక గొప్ప మిలియనర్ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఆయన జీవితాన్ని చదవండి మీరు కూడా చాలా స్ఫూర్తిని పొందుతారు అన్నమాట. తన 86వ పుట్టిన రోజున ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే పనిని ఆటల్ని సమానంగా ఆస్వాదించిన నా జీవితం ఇప్పటివరకు ఒక ఆహ్లాదకరపు సెలవ దినం అని చెప్పేసి [నవ్వు] అంటే లైఫ్ ని గొప్పగా ఎంజాయ్ చేశడండి ఒకానొక స్టేజ్లో ఆయన మళ్ళీ జీరో లెవెల్ కి వచ్చాడు. ఏది బిజినెస్ పరంగా అట్లాగే
(02:22) ఒకానొక దశలో మరణంచుకు కూడా వెళ్ళాడు ఈ రెండిటిలోన లేచి నిలబడ్డాడండి మళ్ళీ నిలబడి జీవితాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేశడు అన్నమాట ఇక్కడే స్వామి వివేకానంద కొటేషన్ ఒకటి నాకు గుర్తుకవస్తున్నది అదేంటంటే నీకు ఇష్టమైన ఉపాధిని ఎన్నుకో జీవితంలో ఒక్కరోజు కూడా నువ్వు పని చేయవలసిన అవసరం రాదు అన్నాడంట ఎంత గొప్ప మాట అంటే ఇదండి ఎంజాయ్మెంట్ అంటే పని చేస్తున్నప్పుడు అసలు [గొంతు సవరించుకోవడం] అది పని అని తెలవకూడదు.
(02:53) అంటే నువ్వు అలిసిపోతున్నావ అంటే అది నీ పని కాదు అది నీ ఆట కాదు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు తక్షణ ఆనందం ఇచ్చేది ఎంజాయ్మెంట్ కాదండి మోమెంటరీ ప్రెషర్ ఇస్ నాట్ అన్ ఎంజాయ్మెంట్ అట్ ఆల్ ఒక అద్భుతమైన పని చేస్తున్నప్పుడు మనసు శరీరం అలసిపోయినప్పుడు ఆటవిడుపుగా విశ్రాంతి కోసం ఏదో ఒక పని చేయడం లాంటిది అన్నమాట మంచి మ్యూజిక్ వినటం మంచి పుస్తకం చదవటం కూడాను మనం ఉదాహరణగా చెప్పొచ్చు అలాగే లాంగ్ డ్రైవ్ లో ఉన్నారు అనుకోండి కార్ని పక్కన ఆపి ఒ మంచి షాయి తాగటం అన్నమాట మీకు ఇంకా గొప్ప ఉదాహరణ ఇస్తారు ఎందుకంటే
(03:39) ఉదాహరణలు ఇస్తే తప్ప ఈ ఎంజాయ్మెంట్ అనే పదానికి అర్థం అర్థం కాదండి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆ రోజు ఎక్కువ వరకు చదువుతూ ఉంటాడు ఆయన రాసుకుంటూ ఉంటాడు. ఆయన ఫిలాసఫీ మీద రాసిన పుస్తకాలు ఇప్పటికీ కూడాను ఇతర దేశాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి చాలామంది మేధావులు ఆ పుస్తకాలు చదువుతున్నారు అన్నమాట చెప్పాను కదా ఎక్కువగా రాసుకుంటూ చదువుతూ కనిపిస్తారున్నమాట హి ఇస్ ది సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ మదర్ ఇండియా రాజకీయవత్త ఫిలాసఫర్ స్టేట్స్మెన్ కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా చేశారు అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఆయన వైస్
(04:23) ఛాన్సలర్ గా చేశారు ఆయన బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ఎవరో ఒకతనండి పేరు గుర్తులేదు ఆయన అడిగారట మీరు రోజులు ఎక్కువ భాగం చదువుతూనే ఉంటారు రాసుకుంటూనే ఉంటారు అలిసిపోరా అసలు మీరు విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటారు అని అసలు ఆయన సమాధానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆయన ఏమన్నాడఅంటే [గొంతు సవరించుకోవడం] ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు నేను అలసిపోయాను అని గనుక ఫీల్ అయితే వెంటనే ఇంకో సబ్జెక్ట్ మారిపోతాను మళ్ళీ మనసు వేగాన్ని గుంజుకుంటుంది అదే నా విశ్రాంతి అదే నా ఆనందం అన్నాడండి మహానుభావుల నోట వచ్చే మాటల్ని మనం రాసి పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకోవాలన్నమాట
(05:07) అవసరమైతే ఈ కొటేషన్స్ ని మనం జేబులో పెట్టుకొని రైలు ప్రయాణమో బస్సు ప్రయాణమో చేస్తున్నప్పుడు లేకపోతే ఒక బస్ కోసమో రైలు కోసమో వెయిట్ చేస్తున్నప్పుడు ఇటువంటివన్నీ చదువుకోవాలండి. ఇటువంటివన్నీ చదువుకోవాలి. టైం వేస్ట్ కాదు బోర్ ఫీల్ అవ్వడం అంటూ ఉండదండి బోర్ ఫీల్ అవ్వడం అంటూ ఉండదు. అంటే యువత అలాగే చాలామంది అంటే యువత అంటే అందరినీ ఒక గాటన మనం కట్టేయలేదు లేండి యువత చాలా మంది ఎంజాయ్మెంట్ ను ప్రెజర్ కు అంటే శారీరక సుఖానికి అంటే ఒక విధంగా శరీరాన్ని ముడిపెడుతున్నారండి అది తప్పండి తప్పది అసలు శిసలైన ఎంజాయ్మెంట్ ఎప్పుడూ కూడాను మీనింగ్ఫుల్ లివింగ్ కి
(05:52) సంబంధించిందండి అర్థవంతమైన జీవితానికి గడపడానికి ఈ ఎంజాయ్మెంట్ తప్పనిసరి అన్నమాట అసలు ఈ ఎంజాయ్మెంట్ లో టైం వేస్ట్ అంటే ఉండదు కదా ఏదైనా ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారు అనుకోండి ఈ ఎంజాయ్మెంట్ అనేది కెటలిస్ట్ గా పనిచేస్తుంది అంటే మీ చర్యని వేగవంతం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ ఎంజాయ్మెంట్ అనేది మానసిక ఉల్లాసానికి ప్రతీక అండి అంతకంటే ఏం లేదు చాలామంది ఒక వయసు వచ్చిన వాళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అంటే ఇంకా బాధ్యతల మధ్యలో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు నా బాధ్యతలు పూర్తఅయిన తర్వాత లైఫ్ ని ఎంజాయ్ చేస్తానయ్యా అంటారు. రాంగ్ కాన్సెప్ట్
(06:33) అండి రాంగ్ కాన్సెప్ట్ అది అసాధ్యం బాధ్యతలు ఎప్పటికీ పూర్తి కావు కాబట్టి జీవితంలో ప్రతి దశను కూడాను మనం ఎంజాయ్ చేయగలిగి ఉండాలండి. ఇప్పుడు విద్యార్థి చదువుని ఎంజాయ్ చేయాలి కదా ఉద్యోగి జాబ్ ని ఎంజాయ్ చేయాలి. తండ్రి తన తండ్రి తనాన్ని ఎంజాయ్ చేయాలి పిల్లలతో భార్యతో కూడా అట్లాగే వృద్ధుడు ప్రశాంతతని ఎంజాయ్ చేయాలండి.
(06:58) ప్రశాంతతని ఎంజాయ్ చేయాలి. ఏకాంతంలో రహించగలగాలి ఒంటరితనం ఆవరించిన కూడాను ఒంటరితనానికి ఏకాంతానికి చాలా తేడా ఉందనుకోండి ఒంటరితనంలో ఎంజాయ్మెంట్ ఉండదు ఏకాంతంలో ఎంజాయ్మెంట్ ఉంటుంది మళ్ళీను [నవ్వు] [ఆశ్చర్యం] అంటే నేను ఇంతకుముందు చాలా రోజుల క్రితం ఒక వీడియో చేశనండి దాంట్లో ఎంజాయ్మెంట్ కి గొప్ప ఉదాహరణ ఇచ్చాను.
(07:22) ఇది గనుక మీరు పట్టుకుంటే ఇది కదా జీవితం ఇది కదా ఎంజాయ్మెంట్ అని మీకు అర్థం వుతుంది. నేను ఏం చెప్పానంటే బాధ్యతలన్నీ అయిపోయి నువ్వు నాటిన మామిడి టెక్క ఉంది చూసారా అది మహా వృక్షం అయినప్పుడు దాని కొమ్మలకి నువ్వు కట్టిన ఉయ్యాళ్ళలో కూర్చొని నీ మనవళ్ళు కేరంతలు కొడుతూ ఆరుతూ ఉన్నప్పుడు దాని కింద పడకుర్చి వేసుకొని వాళ్ళ ఎంజాయ్మెంట్ ని నువ్వు ఎంజాయ్ చేస్తే అదే అసలు శిసలైన ఎంజాయ్మెంట్ అని నేను చెప్పానండి అంతే నాకు ఎందుకో ఆ రోజు కలం అలా పరిగెత్తింది నేను అలా చెప్పగలిగాను అన్నమాట అంటే ఒకటండి ఎంజాయ్మెంట్ అనేది జీవితానికి విరామం కాదండి
(08:07) జీవితాన్ని జీవించే విధానం ఇట్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నమాట అంటే జీవితానికి ఒక విధంగా చెప్పాలిఅంటే ఈ ఎంజాయ్మెంట్ అనేది శక్తిని ఇచ్చే ప్రక్రియ ఇప్పుడు ఉదాహరణకి సెలవల్లో కుటుంబంతో విహారం చేయటం స్నేహితులతో సత్కాలక్షేప చేయటం నీ హావిలు ఏమన్నా ఉంటే వాటిలో నిమగ్నం అవ్వటం మంచి ప్రయాణాలు చేయటం అదండి అసలు సిసలైన ఎంజాయ్మెంట్ అంటే అంటే కర్తవ్యాలను నిర్లక్ష్యం చేయటం అప్పులు చేసి విలాసాలు చేయటము అట్లాగే ఇంకేం చెప్పాలి వ్యసనాలకి వ్యసనాలకి బానిస కావడం ఇవన్నీ కూడా నువ్వు ఎంజాయ్మెంట్ కాదండి
(08:53) జీవిత చరమాంకల్లో మిమ్మల్ని కూలిపోయేటట్టు చేస్తాయి అనారోగ్యంతో కూలిపోయేటట్టు చేస్తాయి. ఒకసారి గతాన్ని తలుచుకుంటే మీకు అనిపిస్తుంది నేను చేసింది ఎంజాయ్మెంట్ కాదు కేవలం స్వార్థానికి పోయి కుటుంబాన్ని పట్టించుకోకుండా నా సుఖం నేను చూసుకున్నాను అని అనిపిస్తుందండి అంటే రేపటి జీవితాన్ని దెబ్బతీయకుండా అంటే రేపటి జీవితాన్ని దెబ్బతీయకుండా నేటి ఆనందాన్ని ఆస్వాదించగలిగితే అదే ఆరోగ్యకరమైన ఎంజాయ్మెంట్ అండి అంతే అందుకని బాధ్యత నుంచి పారిపోవడం ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్ కాదండి అవి చాలామంది మందు పార్టీ ఏదో పెద్ద ఎంజాయ్మెంట్ అనుకుంటారు. మందు పార్టీ
(09:33) ముగిసిన తర్వాత మిగిలేది కేవలం ఒక చిన్న జ్ఞాపకం మాత్రమే కానీ అర్థవంతంగా జీవించిన జీవితంలో మిగిలే ఒక గొప్ప తృప్తి ఉంది చూసారా అది తలుచుకున్నప్పుడల్లా ఎంజాయ్మెంట్ నండి సో ఎంజాయ్మెంట్ అంటే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించే కళండి అంతకంటే ఏం లేదు ఒ చిన్న కొటేషన్ చెప్పేసి వీడియో ముగిస్తానండి మంచి బ్రిలియంట్ కొటేషన్ ఇఫ్ యు వాంట్ ఎంజాయ్మెంట్ ఫర్ ఆన్ అవర్ టేక్ ఏ నాప్ ఇఫ్ యు వాంట్ ఎంజాయ్మెంట్ ఫర్ ఏ డేగో ఫర్ ఫిషింగ్ ఇఫ్ యు వాంట్ ఎంజాయ్మెంట్ ఫర్ ఏ ఇయర్ ఇన్హరిట్ ఏఫార్చూన్ ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్
(10:20) ఏ వండర్ఫుల్ మెమరీ ఫర్ ఏ లైఫ్ టైం హెల్ప్ someవన్ టు రైస్ ఇదండి అద్భుతమైన కొటేషన్ ఇది [ఆశ్చర్యం] కాబట్టి నా ఆశ ఏంటంటే యువత గనుక చూసినట్లయితే ఆలోచనలో పడుతుందన్న గొప్ప నమ్మకం అండి అందుకంటే ఏం లేదు. సో ఇదండి వీడియోలో సంగతి వినంత కృతజ్ఞతలు చాలా మందికి షేర్ చేయండి అవసరమైతే ఏమత కూర్చోబెట్టి నాన్న 10 నిమిషాలు నాకు ఇవ్వండిరా మీరేం మాట్లాడొద్దు తర్వాత ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ యు కెన్ ఎంజాయ్ లైఫ్ బట్ యు జస్ట్ లిజన్ దిస్ వీడియో అని చెప్పేసి వాళ్ళ కూర్చోబెట్టి చెప్పేసి ఏం మాట్లాడకుండా పెడుకోండి.
(10:56) ఆ 10 మందిలో ఒక్కడన్నా ఆలోచనలో పడతాడండి. సో నా ఛానల్ కూడాను మీరు సబ్స్క్రైబ్ చేయండి. నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడొచ్చు. నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ ఇంటి పేరు పోలూరి YouTube లోకి వెళ్లి ఎంఆర్ టిహ్ఐ స్పేస్ కే ఐఆర్ఏఎన్ అని టైప్ వేస్తే పిఆర్ యు ఆర్ఐ అని నా ఛానల్ ఓపెన్ అవుతుందండి. కామెంట్ బాక్స్ లో మంచి మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్ని చూసి నేను ఎక్కడున్నానో తెలుసుకుంటాను అన్నమాట లైక్ బటన్ అంటారా బెల్ ఐకాన్ అంటారా తప్పకుండా మీరు నొక్కుతారు నాకు తెలుసు [నవ్వు] అంటానండి నమస్కారం
No comments:
Post a Comment