కాఫీ కబుర్లు సంఖ్య 1230 (జూలై 02 - 2026) -- విటమిన్ సప్లిమెంట్స్.. ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని బలాన్ని నిజంగానే ఇస్తాయా.. ఏ మేరకు ఇస్తాయి.. వాడాలా వాడకూడదా.. పరిశోధక నిపుణులు, వైద్యులు, ఫార్మా వాళ్ళు ఏమంటున్నారు.. వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. విటమిన్ లలో ఉన్న ఐదు రకాలు ఎ బి సి డి ఇ మన శరీరానికి మెదడుకు అవసరమైన శక్తిని ఇస్తాయి. మనం రోజువారి తీసుకునే ఆహారంలో అన్నీ లభ్యం కావు. దీనికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో అన్ని విటమిన్ సప్లిమెంట్స్ కేప్స్యూల్స్ మాత్రల రూపంలో విరివిగా లభిస్తున్నాయి. చాలామంది విటమిన్, కాల్షియమ్ సప్లిమెంట్స్ రెగ్యులర్ గా వాడుతుంటారు.. ముఖ్యంగా 50-60 వయసు దాటిన వారు. విటమిన్లు అనేవి అత్యంత సూక్ష్మ పరమాణువుల సముదాయం. ఇవి మన ఆరోగ్యానికి చాలా కీలకం. తొలుత కాష్మిర్ పంక్ అనే ఓ విదేశీ సైంటిస్ట్ వీటిని కనుగొన్నారు. ఈ విటమిన్ సప్లిమెంట్స్ రసాయనిక పరిశోధన శాలలో రసాయనిక సంయోగం ద్వారా ఉత్పత్తి చేయబడినవే. ఇవి రెండు మూడు సంవత్సరాల నిల్వ ఉండాలంటే కెమికల్స్ (రసాయనాలు) మిక్స్ చేయక తప్పదు. గనుక విటమిన్ సప్లిమెంట్స్ లో ఆరోగ్యానికి ఇచ్చే శక్తి కంటే కీడు కలిగించే కెమికల్సే అధికంగా ఉంటాయి అనేది వాస్తవం. ఈ విషయం తెలియక చాలామంది ఈ సప్లిమెంట్స్ నెలలు సంవత్సరాలు తరబడి వాడేస్తూ వివిధ అనారోగ్యాల పాలవుతున్నారు. గనుక విటమిన్లు లభించే ఆహారమే మనం తీసుకోవడం శ్రేయస్కరం. సప్లిమెంట్స్ లో ఉండే విటమిన్ ద్వారా మనకి అందే శక్తి కేవలం పది పదిహేను శాతం మాత్రమే ఆహారం ద్వారా అందే విటమిన్ తో పోలిస్తే. విటమిన్ సప్లిమెంట్స్ అనేవి సప్లిమెంటరీ గానే చూడాలి తప్ప రోజూ వాడే మెడిసిన్ గా కాదు. అందుకే వైద్యులు మరీ అవసరమైతే ఐదు లేదా పది రోజులు రోజుకొకటి చొప్పున సప్లిమెంట్స్ వేసుకుని ఆపేయమంటారు. జనరల్ హెల్త్ కోసం రెగ్యులర్ గా ఈ సప్లిమెంట్స్ వేసుకోవాలంటే నెలా రెండు నెలలు వాడి రెండు నెలలు గ్యాప్ ఇచ్చి వేసుకుంటుండాలి. ఏదైనా సరియైన ఫిజీషియన్ సలహా లేకుండా మనం వాడేయకూడదు ప్రకటనలు యాడ్స్ చూసి. కాల్షియం సప్లిమెంట్ సంవత్సరాల తరబడి వాడుతున్నా కూడా కాళ్ళ మోకాళ్ళ నొప్పులకి ఆసుపత్రి పాలవుతున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. విటమిన్లు కాల్షియం.. ఆకుకూరలు, గ్రీన్ వెజిటెబుల్స్, తాజా పండ్లు, పాలు పెరుగు వెన్న, పాల ఉత్పత్తులు ద్వారా.. మనకి పుష్కలంగా లభిస్తాయి. గనుక విటమిన్లు కోసం ఆహారాన్నే ఆశ్రయించాలి.. సప్లిమెంట్స్ ను కాదు. ఈ విటమిన్ సప్లిమెంట్స్ ఎక్కువగా అవసరం ఉండేది గర్భిణీ మహిళలకు, డెలివరి ఐన మహిళలకి మాత్రమే. వీరికి చాలా శక్తి అవసరం ఉంటుంది గనుక మూడు నాలుగు నెలల పాటు వేసుకోమని వైద్యులు సూచిస్తారు. -- రెగ్యులర్ గా సప్లిమెంట్స్ వాడుతున్న వారు, వృద్ధులు (50-60 +) ఈ విషయంలో సరియైన అవగాహన తో వైద్యుల సలహా మేరకు అవసరం ఉన్నమేరకే సప్లిమెంట్స్ వాడటం శ్రేయస్కరం. సహజ సిద్ధమైన ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే విటమిన్ల ప్రయోజనం మరింత అధికం. క్రమం తప్పకుండా లభ్యమవుతున్న వాటిలో రోజుకో రకమైన పండు తీసుకుంటూ ఎప్పటికప్పుడు తాజా ఆకుకూరలు, ఇతర ఫ్రెష్ గా ఉండే గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకో గలిగితే ఈ విటమిన్ సప్లిమెంట్స్ వైపు మనం చూడాల్సిన అవసరమే ఉండదు.. ---- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....
No comments:
Post a Comment