అరుణాచలం:
🙏 *రమణోదయం* 🙏
*అన్ని వస్తువులకి ఆకాశమే ఆధారమైనట్లు జగజ్జీవేశ్వరుల మూడింటికి ఉనికి మాత్రమైన ఆత్మ స్వరూపమే ఆధార వస్తువు, పరంధామము. పరశివతత్త్వము అదే. అక్కడికి చేరిన వారికి రాకపోకలుండవు.*
కరతల_భిక్ష :
మనుష్యునకు జ్ఞానం కలిగిన వెనుక
ఈ శరీరం మీద లక్ష్యం ఉండదు.
ఎంత చక్కని విస్తరిగానీ,
భోజనాంతరం విసరిపారవేసినట్లు
ఈ భౌతిక శరీరం జ్ఞానోదయానంతరం
ఎప్పుడు పారవేద్దామా అని చూస్తాడు.
🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.1057)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🌹🌷🙏🌷🌹
🦚జ్ఞానప్రసూనాలు🌿
1) ముక్తి అంటే పునర్జన్మ లేకపోవడం కాదు.నిత్య ఎఱుకతో ఉండడం.
రాముడు కృష్ణుడిగా పుట్టలేదా?
ముక్తుడు ఎరుకతో జీవిస్తాడు ఎరుకతో మరణిస్తాడు. ఎరుకతో తిరిగి జన్మిస్తాడు. అముక్తుడు ఎరుకలేకుండా జీవిస్తాడు.ఎరుక లేకుండా మరణిస్తాడు.ఎరుక లేకుండానే తిరిగి జన్మిస్తాడు.
2) ఆధ్యాత్మికం అనేది బహిరంగ రహస్యం
3) రవివర్మ: ఆత్మలో నిలకడగా ఉండలేకపోతున్నాను ລໍ!....రామకృష్ణులు, రమణులు మొదలైన వారు సదా ఆత్మ నిష్ఠలో ఉండేవారు కదా!... అలా ఉండాలని నా కోరిక.సద్గురు : వారు ఉండలేదు. ఉంచబడ్డారు.'పొందినవారంతా ప్రయత్నపూర్వకంగా పొందినవారే అనేది ఇతరుల లెక్క పొందినవారికి మాత్రమే అసలు విషయం తెలుసును -'పొందలేదు పొందబడ్డాం' అని.వారు ఈ సత్యాన్ని ప్రకటించినప్పుడు దానిని సత్యవాక్కు క్రింద తీసుకోకుండా అది వారి యొక్క 'నిరాడంబరత'గా లోకంలో కీర్తింపబడుతుంది. ఆ 'పొందటం'లోను తమ ప్రమేయం లేదు. ఈ 'కీర్తి'లోను తమ ప్రమేయం లేదు. అని తెలిసి, చేసేదేమీ లేక ఊరక ఉండి పోతారు పాపం.
4) 'కిలో పంచదార' అంటాం. కిలో అనేది పంచదార కాదు. పంచదార అనేది కిలో కాదు. 'నేను బాబు' అంటావు. నేను అనేది బాబు కాదు. బాబు అనేది నేను కాదు. నేను - బాబు ఇద్దరూ వేఱు వేఱు. ఇద్దరూ కలిసి ఉండటం వల్ల ఒకరుగానే లెక్కకు వస్తోంది. నీకు నీవు ఒక్క అడుగు ఎడంగా ఉండటం అలవాటు చేసుకో. దీని వలన ఇతరులకు నీవు, బాబు ఒకటిగా కనిపించినా నీకు నీవు విడిగా ఉండటం అనేది అనుభవంలోకి వస్తుంది.నీకు నీవు విడిగా ఉండటమే మోక్షమంటే.
5) ప్రశ్న: ఆత్మ స్వరూపమంటే?
సద్గురు : మెలకువ రాక పూర్వం ఉన్న తన స్వరూపమే.
No comments:
Post a Comment