👍మనుషుల మధ్య మన పరస్పర ప్రవర్తనలో కేవలం, కేవలం ప్రేమ మాత్రమే ఉండాలి. మనం దీని కోసమే పుట్టాము, మనలో మనం ఒకరికొకరు మంచి లేదా చెడు చేయడం కోసం పుట్టలేదు. మనం ఇతర వ్యక్తుల మధ్య సోదరభావంలో భాగమై జీవించాలి, అవసరమైనప్పుడు సహాయం చేయాలి మరియు అవసరమై నప్పుడు సహాయం తీసుకోవాలి. సహాయం చేసేటప్పుడు గర్వాన్ని ప్రదర్శించకూడదు, సహాయం తీసుకునేటప్పుడు దీనత్వాన్ని చూపించకూడదు మరియు సిగ్గుపడకూడదు. జీవితమనే ఈ ఆటలో ఇవన్నీ సహజం. నేను నా ఆహారంలో చిటికెడు ఉప్పు మాత్రమే తీసుకున్నప్పటికీ, నేను ఉప్పుకు కృతజ్ఞుడను. నేను ఇంత అన్నం తింటున్నాను, నేను అన్నానికి కృతజ్ఞుడను. మీరు ఇలా అనలేరు, "కానీ చారీ గారూ, మీరు అన్నంతో సమానంగా ఉప్పు తినలేరు కదా. మరి మీరు మొదట అన్నం పట్ల కృతజ్ఞత చూపించాల్సింది కదా? కృతజ్ఞతను కొలిచే ప్రమాణం ఏదీ లేదు, అలాగే ప్రేమను కొలిచేది కూడా లేదు.".......
.-చారీజి 🙏
దిల్ కీ ఆవాజ్ 2012 (పేజీ 73)
No comments:
Post a Comment