Friday, July 3, 2026

 _[విశ్వనాథ్ పటేల్ గారి “జీవితం జీవించడానికే” అనే పుస్తకం లోని అందరూ తప్పకుండా చదవాల్సిన ఒక చిన్న, మంచి విషయం...]_ 
*_అనుభవం - జ్ఞానం_* 
🎯🎯🎯🎯🎯🎯🎯 

*_జ్ఞానం వేరు—* 
*అనుభవం వేరు—* 
*_జ్ఞానం అనేది ఇతరులు చెప్పింది విని, మరియు పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకునేది._*

*_మరి అనుభవం అలా కాదుకదా!_* 

*ఈ ప్రపంచం ఎంతో విచిత్రమైంది. ఎవరికి ఎంత ఎక్కువ జ్ఞానముంటే... ప్రపంచం వాళ్ళని అంతగా గౌరవిస్తుంది. నోరున్నవాడిదే రాజ్యం. తెలిసిన పన్నీ తెలివితేటల్తో కలిపి చెప్పేవాణ్ణి మనుషులు నోరు వెళ్లబెట్టుకుని చూస్తారు. అడుగులకు మడుగులొత్తుతారు.* 

*జ్ఞానం ఎక్కువయ్యే కొద్దీ మనిషికి అహంకారం పెరుగుతుంది. ఇతరులపట్ల నిర్లక్ష్యం పెరుగుతుంది. అధికారధోరణి పెరుగుతుంది. అమాయకుల్ని మోసపుచ్చడం వాళ్ళు అలవరచు కుంటారు.*
—••0••—
*ఒక పేదవాడికి చిన్న పడవ ఉండేది. అతను రోజూ మనుషుల్ని ఏరుదాటించడం. దాంతో వచ్చిన కొద్దిపాటి డబ్బుతో జీవనం కొనసాగించే వాడు. అదే అతని వృత్తి. అతని పడవలో రకరకాల మనుషులు ఎక్కుతూంటారు. అందర్నీ పరిశీలిస్తూ, అందరూ చెప్పే మాటల్ని వింటూ ఉండేవాడు. పడవ ఎక్కడానికి ఒక్కో మనిషి దగ్గర ఒక్కో రూపాయి మాత్రమే తీసుకునేవాడు.*

*ఒక రోజు ఒక పండితుడు అతని పడవ ఎక్కాడు. పడవలో పడవ ఆ నడిపే వ్యక్తి మరియు ఈ పండితుడూ తప్ప వేరెవరూ లేరు. ఆ పేదవాడు ఎవరన్నా వస్తారేమో కొంతసేపు ఎదురు చూశాడు. అహంకారి అయిన పండితుడు _“ఎంతసేపయ్యా ఇంకా..! తొందరగా పోనీ. అవతల నాకు చాలా పనులున్నాయి."_ అన్నాడు.* 

*_"అయ్యో స్వామీ! ఇంకెవరయినా వస్తే, నాకూ కొద్దిగా గిట్టుబాటు అవుతుంది కదా! అందుకే..."_ అన్నాడు.* 
*దానికి ఆ పండితుడు _"ఇంకా ఎంతసేపు ఎదురుచూడమంటావు?"_ అన్నాడు చిరాకుగా.*

*ఆ స్వరంలో నిర్దయ కనిపించింది. పేదవాడు సరేలే అనకుని పడవకు తెడ్డు వేశాడు. పడవ ఏటిలో వెళుతోంది. పండితుడేవో లెక్కలు వేసుకుంటున్నాడు. పేదవాడు ఉత్సాహంగా _"స్వామీ! మీరేం చేస్తున్నారు?”_ అని అడిగాడు. పండితుడు నిర్లక్ష్యంగా _“నేను ఇప్పుడు గణిత సంబంధమైన ఒక సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాను. గణితశాస్త్రమే కాదు, నేను ఇంకా ఎన్నిట్లోనో ప్రావీణ్యమున్న వాణ్ణి. నీకు గణిత శాస్త్రం గురించి తెలుసా?"_ అన్నాడు.*

*పేదవాడు _"స్వామీ! నాకు గణిత శాస్త్రమంటే ఏమిటో తెలియదు. నేను అజ్ఞానిని"_ అన్నాడు.* 

*అప్పుడు పండితుడు _"గణితశాస్త్రం గురించి తెలీని జన్మ ఎందకయ్యా! జీవితంలో గణితం యొక్క ఆవశ్యకత ఎంతో గొప్పది"_ అన్నాడు. పేదవాడు _"మీలాగా చదువుకునే అదృష్టం ఉండాలి. కదా స్వామీ! నాకు చదువురాదు"_ అన్నాడు.*

*పండితుడు _“చదువుకోకపోవడం వల్లనే జనం ఇలా ఉన్నారు. ప్రపంచంలో ఇంకా ఎన్నో శాస్త్రాలున్నాయి. అవన్నీ నేను వీలయినంతవరకు చదువుకున్నాను. వాటితో జ్ఞానం సంపాదించాను. జ్యోతిశ్శాస్త్రంలో నాతో పోటీపడేవాళ్ళు ఎవరూ లేరు"_ అన్నాడు. గర్వంగా.* 

*ఆ పేదవాడు _"మీరు మహానుభావులు, అదృష్టవంతులు"_ అన్నాడు. పడవ సాగుతోంది. "పోనీ... జ్యోతిశ్శాస్త్రం గురించి నీకు తెలుసా?" అని అడిగాడు. పండితుడు. పేదవాడు చదువూ సామూ లేని వాణ్ణని చెప్పాను కదా స్వామీ! ఆపేరే నేను వినలేదు"_ అన్నాడు. _"ఏమీ తెలియని అజ్ఞానుల్తో వచ్చిన చిక్కే యిది. ఇవన్నీ తెలియకుంటే నీ జన్మ వ్యర్థం"_ అన్నాడు. పేదవాడి మనసు చివుక్కుమంది. _'తనకు తెలియని వాటిని వేలెత్తి చూపి ఈ పండితుడు తనను కించపరుస్తున్నాడే....'_ అనుకున్నాడు.*

*అంతలో ప్రవాహ ఉధృతి పెరిగింది. ఎక్కడో కొండల్లో పడిన వర్షం వల్ల ఏట్లోకి నీళ్లు విపరీతంగా వచ్చాయి. గాలి ఎక్కువైంది. పడవ ఇటూ అటూ ఊగుతోంది. పండితుడికి పైప్రాణాలు పైనే పోయేట్లున్నాయి, _"బాబ్బాబు! నన్ను ప్రాణాలతో రక్షించు"_ అని వేడుకున్నాడు.* 

*అప్పుడు ఆ పేదవాడు _"స్వామీ! ఏటి ప్రవాహం ఉధృతిగా ఉంది. ఏక్షణంలోనైనా పడవ తలకిందులుగా అయ్యే అవకాశం ఉంది. ఇన్ని విషయాల్లో ఇంత పరిజ్ఞానమున్న వాళ్ళు మీరు... మీకు తెలియంది ఏమీ ఉండదనుకుంటాను. ఇంతకూ మీకు ఈత వచ్చా?"_ అన్నాడు.*

*పండితుడు భయంతో... _"నాకు ఈతరాదు బాబూ! నన్ను కాపాడు"_ అన్నాడు. పేదవాడు _"మీకు ఈతరాకుంటే నేనేమీ చెయ్యలేను. నాకు ఈతవచ్చు. నా ప్రాణాల్ని కాపాడుకోవడమే నాకు కష్టం"_ అని ఏట్లోకి దూకేశాడు.* 
°°°🟢°°°°

*_♦️ఈత గురించి పుస్తకాలు చదివినంత మాత్రాన ఈతరాదు. నీళ్లలోకి దూకి నేర్చుకుంటేనే వస్తుంది._*

*_⚛️ సత్యం గురించి పుస్తకాలు చదివినంత మాత్రాన అనుభవానికి రానిదే దాన్ని గురించి తెలీదు._*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
*_•—{అందుకే.. ఎవరినీ తక్కువగా చూడకూడదు...: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు & స్టూడెంట్ మోటివేటర్, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా}—•_*

No comments:

Post a Comment