Friday, July 3, 2026

 [6/29, 13:22] +91 92478 36995: 🦚జ్ఞానప్రసూనాలు🚩

1) తన్మయం అంటే తాను తానుగా ఉంటూనే దానిని అనుభవించడం కాదు, అదే తానైపోవడం తన్మయం.

2) ఏ మతమైనా అది కేవలం ఏ కొద్దిమంది ప్రయోజనం కొఱకో ఏర్పడింది కాదు. అది సకల జీవ కోటి సుఖం కొఱకు ఏర్పడిందే. 'పొరుగు వారిని ప్రేమించు' అంటే, తన మతాన్ని అవలంబించే పొరుగువాణ్ణి ప్రేమించు అని కాదు.
పొరుగువాడు ఏ మతస్తుడైనా సరే ప్రేమించగలిగే విశ్వ ప్రేమికుడిగా నీవు కాగలగాలి. అప్పుడే నీ మత ఉద్దేశాన్ని నీవు నెరవేర్చిన వాడివి అవుతావు.

3) * ఒకరు : తాను పుట్టిన లగ్న ప్రభావం తన జీవితంపై ఉంటుందా? మనిషిని శాసించి నడిపే శక్తి గ్రహ నక్షత్రాదులకు ఉంటాయా?

సద్గురు : గ్రహ నక్షత్రాదులు కూడా ఈశ్వరాధీనమై ఉంటాయి. వాటిపై ఆధారపడి జీవించే సకల జీవులు కూడా పరాధీనులే. సందేహం లేదు.
ఈశ్వరునికి శరణాగతి చెందిన ఒక్క భక్తుని విషయంలో మాత్రం అది చెల్లదు. భక్తుడు దేహ తాదాత్మ్యతను వొదిలి, ఈశ్వరునితో తాదాత్మ్యతను పొంది ఉంటాడు. అందువలన దేహమనుభవించే సుఖదుఃఖాలు అతన్ని “అంటవు” అంతేగాని అతనికి "ఉండవు" అని కాదు.

ప్రపంచం దృష్టిలో తాను, తనకు సుఖదుఃఖాలు ఉన్నట్లు కనబడుతుందే గాని నిజానికి తన దృష్టిలో తానే ఉండడు. రమణ భగవానులకు క్యాన్సర్ రావడం అనేది ప్రపంచం దృష్టిలోనే గాని భగవాన్ అనుభవంలో భగవానే లేడు. 

4) ఉన్నదాంట్లో లేని దానిని వెతకడం లేనిదాంట్లో ఉన్న దానిని వెతకడం వేదాంత సాధన.

5) తాను పొందవలసిన దానిని ఇంకా పొందలేదు అనటానికి గుర్తేమంటే
ప్రపంచమైనా దైవమైనా తనకు అన్యంగా తోచటమే.
[6/29, 13:22] +91 92478 36995: 🦚జ్ఞానప్రసూనాలు🚩

1) 'మేలుకొన్నాను' అంటావు.
ఇది సరికాదు.
మెలకువ అనేది నీకు సంబంధం లేకుండా జరిగేది.
మెలకువ వచ్చిన తరువాత మేలుకొన్నాను అంటున్నావు.
అంటే జరిగిపోయిన తరువాత నేను చేస్తున్నాను అన్న కరృత్వాన్ని ఆపాదించు కుంటున్నావు.
'శ్వాసిస్తున్నాను' అంటావు, ఇది సరిగాదు.
శ్వాసక్రియ అనేది నీకు సంబంధం లేకుండా జరిగేది.
మన జీవితానికి అత్యత ప్రధానమైన అంశాలైన మెలకువ - శ్వాస అనేవే నీకు సంబంధం లేకుండా జరుగుతున్నప్పుడు ఈ రెంటినీ ఆధారంగా చేసుకొని నడిచే మిగతా జీవితం కూడా నీకు సంబంధం లేకుండా నడిచేదే.
నేనే మేలుకొన్నాను నేనే శ్వాసిస్తున్నాను.
అని అన్నావా సూర్యుణ్ణి నేనే ప్రకాశింపచేస్తున్నాను భూమి నేనే త్రిప్పుతున్నాను.
సకలాన్ని నేనే నడిపిస్తున్నాను అనైనా ఉండు ఏ లెక్కలో నైనా ఉండు.
ఆ లెక్కలోనే ఉండు.

2) తత్త్వం తగ్గింది తతంగం పెరిగింది. తత్త్వం - సనాతన ధర్మం. తతంగం - మతం.

3) ప్రత్యక్షం కావా, ప్రత్యక్షం కావా అని ఏడుస్తున్నావావు. బాగానే ఉంది. కానీ నా ఏడుపు ఏమంటే, ప్రత్యక్షమయితే ప్రపంచమంటావు. కాకుంటే పరమాత్మ నంటావు. నేనెవరితో చెప్పుకొనేది?

No comments:

Post a Comment