Friday, July 3, 2026

అసలు పుణ్యం అంటే ఏమిటి? What Does Mean By PUNYA?

అసలు పుణ్యం అంటే ఏమిటి? What Does Mean By PUNYA?

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=i9H-dijKWTk



Transcript:
(00:01) ఇవాళ ఉదయం యధావిధిగా పూజకి ఉపక్రమించానండి నాలుగున్నర కలలు లేచేస్తాను కాబట్టి [గొంతు సవరించుకోవడం] ఐదు ఐదు బౌ మధ్యన పూజ అయిపోతుంది. ఇది రోజు జరిగే ప్రక్రియ సో ఇవాళ కుందులు అవి కడుగుతూ ఉంటే మతనం కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే అంత పొద్దున ఎవరు లేస్తారో చెప్పండి. అలా కడుక్కుంటూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే ఇన్ని ఏడబట్టి చేస్తున్నాను కదా ఓ 10 నిమిషాలు పూజ అసలు ఎందుకు చేస్తున్నాను ఇదంతా అని ఒకసారి అలా ఆలోచనలు వస్తాయండి ఎందుకు వస్తాయి అనేది మనకు తెలియదు వస్తాయి అక్కడి నుంచి ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది
(00:44) అన్నమాట సరే మళ్ళీ నాకు నేనే ఆన్సర్ చెప్పుకున్నా పుణ్యం కోసం కదా అని చెప్పేసి నిజమే గానీ పుణ్యాన్ని నేను చూశనా అసలు అది ఎలా ఉంటుంది ఏంటి కంటి అంటే కనపడేది కాదు కదా అసలు దీని మీద ఆలోచన ఎందుకు చేయకూడదు అని అనిపించిందంటే ఇంకొంచెం ఆలోచించా మరి రకరకాల ఆధ్యాత్మిక ప్రక్రియలు మానవులందరూ చేస్తున్నారు కదా కాబట్టి ఇది అందరికీ సంబంధించిన విషయం కాబట్టి ఒక పట్టు పడదాం అని ఒక ఆలోచన వచ్చిందండి అందుకనే ఇలా మీ ముందు కూర్చున్నాను అన్నమాట సో విషయంలో గనక వచ్చినట్లయితే పుణ్యం అంటూ ఉంటుంటారు కదా మంచి పని
(01:32) చేస్తే పుణ్యం వస్తుంది అంటారు సరే దానికోసం గొళ్ళు గోపురాలు కొలుతూ ఉంటారు జపాలు చేస్తారు. ఉపవాసాలు ఉంటారు వ్రతాలు నోమలు కూడాను నోచుకుంటూ ఉంటారు. చెప్పాను కదా ప్రశ్న ఏంటంటే ఇలా చేస్తే నిజంగా పుణ్యం వస్తుందా దీని మీద కొంత విశ్లేషణ అండి. ఇప్పుడు పుణ్యం అనేది బ్యాంకులో జమయ్యే డబ్బు లాంటిది కాదు కదా అలాగనే కంటికి జన్మించే వస్తువు కూడా కాదు మరేంటి అంటే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చైతన్యంలో అంటే చైతన్యం అనేది పాజిటివ్ వర్డ్ అండి అచేతనం అంటే మీకు తెలుసు కదా కాబట్టి చైతన్యంలో కర్మలో ఈ జీవిత గమనంలో ఏర్పడే ఒక సూక్ష్మ శక్తి
(02:21) లేదా క్రియాశీలక మార్పు ఇంకా బాగా చెప్పాలి అంటే పరివర్తన ఇప్పుడు భారతీయ వాంగ్మయం ప్రకారం ప్రతి కర్మకి రెండు ఫలితాలు ఉంటాయండి ఒకటి కనిపించే ఫలితం రెండు కనిపించని ఫలితం ఇప్పుడు ఆకలితో ఉన్న వ్యక్తికి మీరు భోజనం పెట్టారు అనుకోండి అతను ఆకలి తీరుతుంది నమస్కారం [గొంతు సవరించుకోవడం] పెట్టి వెళ్ళిపోతాడు ఇది కంటికి కనిపించని ఫలితం అతని ఆకలి తీరింది అన్నది మనం విశ్వసిస్తున్నాం కానీ అది కంటికి కనిపించడ ఫలితం కదా అంటే ఈ కర్మ ద్వారా మీకు కలిగేది ఏంటి సంతోషం కదా అలాగే కరుణ కూడా పెరుగుతుంది కదా
(03:07) సో దీన్ని గనుక అంటే ఈ ప్రక్రియను గనుక మీరు కంటిన్యూ చేస్తూ పోయారు అనుకోండి అంటే ఒక విధంగా చెప్పాలంటే జీవన విధానంగా మార్చుకుంటూ పోయారు అనుకోండి అది మీలో ఏమవుతుందంటే ఒక సంస్కారంగా మారుతుంది ఇది మీకు తెలియదు అంటే మీకు తెలియవస్తుంది కానీ మీరు చూడలేరు అంటే అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఇతరులు కూడా చూడలేరు. కాబట్టి ఇది కనిపించని కవితం ఇప్పుడు అట్లాగే కొన్ని మంచి పనులకి ఇన్స్టెంట్ పుణ్యం అంటూ ఉండదు వాటికి కొంత టైం పడుతూ ఉంటుంది.
(03:42) అది ఎప్పుడు అన్నది చెప్పలేం. ఇప్పుడు ఉదాహరణకి రైతు విత్తనం నాటాడండి కొన్ని నెలల తర్వాత అది ఏమవుతుందంటే పంటగా మారుతుంది కదా మరి దానికి కూడాను వాతావరణం అనుకూలించాలి అందుకనే ఒకచోట రైతు విత్తనం వేస్తే అది పంటగా మారడానికి మినిమం టైం పడుతుంది ఇంకొక రైతు ఇంకో చోట గనక వేస్తే ఎక్కువ టైం పడుతుంది కదా కాబట్టి దానికి టైం లిమిట్ అంటూ ఉండదు అంతే ఇప్పుడు ఒక అనాధ ఆశ్రమానికి ప్రతి నెల మీరు కొంత డబ్బు పంపుతున్నారండి.
(04:21) వాళ్ళు ఏం చేశరంటే మీ ఫోటో చూపించి ఈ పెద్దాయన ప్రతి నెల మనకి డబ్బు పంపుతున్నాడు కాబట్టి మనం ఏదో కొంత తినగలుగుతున్నాము అని చెప్పాడు అనుకోండి కొంత కాలం తర్వాత మా ఆశ్రమంలో ఒక అనాధ వ్యక్తి పెరిగి పెద్దవాడై జీవితంలో స్థిరపడ్డాడు అనుకుందాం. పొద్దో గొప్పో సంస్కారవంతుడు అయ్యాడు అనుకుందాం. కృతజ్ఞత కూడా ఆయనలో ప్రవేశించింది అని అనుకుందాంండి ఇలా ఆయన జీవన గమనంలో కొన్నేళ్ళ తర్వాత అతను మిమ్మల్ని ఎక్కడో చూస్తాడు రైల్వే ప్లాట్ఫామ్ మీదనో లేకపోతే ఒక ఊళలోనో చూస్తాడు.
(04:58) మరి ఆ రోజు మీ ఫోటో చూపెట్టింది కదా అనాధాశ్రమం మిమ్మల్ని గుర్తుపెట్టి మీకు సకల మర్యాదలు చేసి మిమ్మల్ని గౌరవించాడు అనుకుందాంండి ఆ కర్మ ఫలితం అప్పుడు కనిపిస్తుంది అంతేగాన నెల నెల పంపుతున్నారు కాబట్టి నెల నెల అది కనపడదండి కదా అయితే అల్టిమేట్ గా మీలో ఏం జరుగుతుందిఅంటే ఈ సేవా తత్పరత అనేది ఇంకొంచెం చిక్కపడుతుంది ఇంకొంచెం బలపడుతుంది అంటే ఇద్దరిలో కూడాను పుణ్యం వర్కవుట్ అవుతున్నది అని అర్థం అలాగే పాపం కూడాను అలాగే పాపం కూడాను పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపైన పీడితం కదా శాస్త్రం చెప్పింది కదా అంటే పాపము
(05:48) ఇక్కడ వ్యాధి ఆ పాపం కోసం మీరు దున్న పెట్టండి అంటే డిసీజ్ కాస్త ఈస్ సంతోషం అవుతుంది. అంతే కదా కాబట్టి ఫలితాలు ఉంటాయి అది మానసికంగా ఒక పరివర్తనన్ని పట్టుకొస్తాయి. పట్టుకొచ్చినప్పుడు ఆ పుణ్యాన్ని మనం అనుభవిస్తున్నాం అని అర్థం అలాగే గుడికి వెళ్తావు దేవుడా నాకు ఇది ఇవ్వు అని అంటావు అది భక్తి కాదు మరేంటి మీరు ఏ పైన పెట్టుకోండి దాన్ని ఇంకొకతను దేవుడా నాలో అహంకారాన్ని తగ్గించు నేను మంచి మనిషిగా మారేటట్టు చెయి అనే
(06:34) ప్రార్థన చేశాడు అనుకోండి అసలు ఆ సంస్కార బలం అతనికి ఎందుకు వచ్చింది పశ్చాత్తాపం వల్ల రావచ్చు అది వేరు వాస్తవాన్ని తెలుసుకోవడం వల్ల రావచ్చు అది వేరు కదా రాబోయే పుణ్యానికి ఈ ప్రార్థన కారణం అవుతుందండి అలాగే జపం గురించి మాట్లాడుకుందాం జపాలు చేస్తూనే ఉంటారు కదా కొంతమంది మరి జపం చేసినప్పుడు మనసు ప్రశాంతం అవ్వాలి కోపం తగ్గాలి ఆర్తి తి ఏకాగ్రత పెరగాలి కదా ఇవన్నీ పుణ్యఫలాలే కాకపోతే కనపడవు అనుభవించేవి ఎరుకలోకి వచ్చావఅన్నమాట సరేటు జపం గురించి మాట్లాడుకున్నాం
(07:18) కాబట్టి మన భారతీయులు ఎక్కువగా ఉపవాసలు కూడా ఉంటుంటారు కాబట్టి ఉపవాసం గురించి కూడా మాట్లాడుకుందాం ఆకలితో ఉండటం ఉపవాసం కాదండి ఉపవాసం వల్ల ఇంద్రియాలు అదుపులోకి రావాలి అది గనుక నిజంగా జరిగింది అనుకోండి నువ్వు పుణ్య మార్గంలో ఉన్నట్టున్నమాట అంటే నీకు పుణ్యం వచ్చేసినట్లే అట్లాగే వ్రతం వ్రతం అంటే ఏం లేదండి ఒక విలువకి కట్టుబడి ఉండటం ఒక ఉన్నతమైన లేదా ఒక అద్భుతమైన ఆ దాన్ని ఏమంటారు దృక్పదానికి కట్టుబడి ఉండటం అన్నమాట
(08:03) అలా జీవించడం అది సత్యవ్రతం కావచ్చు అహింసా వ్రతం కావచ్చు మౌన వ్రతం కావచ్చు దయావ్రతం కూడా కావచ్చు మౌన వ్రతం అంటే ఏం లేదండి అలా మౌనంగా ఉండటం నీకు సంబంధం లేని విషయాలను పట్టించుకోకుండా ఉండటం పట్టించుకొని నిన్ను దుఃఖానికి కేదానికి గురి చేస్తున్నాయి అనుకోండి అది అసలు వ్రతమే కాదు [ఆశ్చర్యం] కాదు కదా అది అంటే కేవలం పూజ చేసి బయటకి వచ్చి అందరిని బాధ పెడితే భార్యని పిల్లల్ని బాధ పెడితే అసలు అది వ్రతం ఎట్లా అయితుందండి దాని ఫలితం ఉంటుంది కానీ ఆ ఫలితం ఎటువంటిది అంటే మీ నర్వస్ సిస్టాన్ని వీక్ చేస్తుంది అది
(08:48) మీరు చేసిన తప్పు మిమ్మల్ని ఏ విధంగా శిక్షిస్తూ ఉందన్నమాట ఇప్పుడు దేవుడు కూడాను పూజల సంఖ్యని ప్రదక్షణ సంఖ్యలను పెట్టి చూడడండి. అంతరాత్మ రూపంలో లోపల ఉండే హృదయ పరివర్తన చూస్తూ ఉంటాడు ఆ పరివర్తనే పుణ్యం ఆ పరివర్తనే పుణ్యం అండి ఈ సబ్జెక్ట్ లో ఎక్కువ ఉదాహరణలు ఇస్తే తప్ప సబ్జెక్ట్ అర్థం కాదండి ఇంకొకటి ఏంటంటే ఈ పుణ్యం అనేది దేవుని సంతోష పెట్టే పని కాదండి మరేంటి దేవుడు మనలో నాటిన దైవత్వాన్ని మేలుకొలిపే ఒక ఆలో ఆలోచన ఒక మాట ఒక కర్మ లేకపోతే క్రియ
(09:33) ఈ మూడు ఏకమయ్యాయి అనుకోండి దాన్ని త్రకరణ శుద్ధి అంటాం కదా లేకపోతే అంత శుద్ధి అని అంటూ ఉంటాం. ఒక్కటండి గుడికి వెళ్ళడం మంచిదే కానీ గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన అంటే బేసికల్గా ఉండవలసిన నీ ప్రవర్తన అది పరివర్తనగా మారకపోతే నీ పూజ ఇంకా కాలేదు ఒక్కొకసారి కాదు కూడా ఆ తర్వాత నువ్వు కొన్ని వేల సార్లు వెళ్లొచ్చు నీ జీవిత కాలంలో కానీ పరివర్తన గనుక లేకపోతే వచ్చే జన్మలో కూడా ఇలాగే తిరుగుతూ ఉంటావు గుళ్ళ ఎంబడి మెకానికల్ గా తిరుగుతూ ఉంటావు లేదు భయంతో తిరుగు తూ ఉంటాం కదండీ ఇక్కడ అదృష్టమైన విషయాన్ని కూడాను మాట్లాడుకోవాలి.
(10:18) అంటే పుణ్యానికి కొంచెం బై ప్రాడక్ట్ గా దీన్ని చెప్పుకోవచ్చు. అదృష్టం కూడాను ఆటోమేటిక్ గా వరించదండి అదృష్టం పట్టిన వ్యక్తి ఒక్కసారి గతాన్ని తిరగవేసుకుంటే అతనికి తెలుస్తుంది అతను ఏం చేశడు అనేది అది ఎవరికి వాళ్ళకి అనుభవేక వైద్యం కాబట్టి ఆటోమేటిక్ గా అది వర్తించదు వివరించదు అలాగే ఆటోమేటిక్ గా మారదండి నువ్వు ఎప్పుడో చేసిన పనికి ఒక మంచి ఫలితం అన్నమాట మంచి ఫలితం అంతే ఇప్పుడు రెండు గంటలు పూజ చేశవు నీ ఇంట్లోనే దేవుడి మందిరం నుంచి లేచావు ఏదో ఐదు పైసలు తప్పేదో జరిగింది.
(11:02) మీరు భార్య మీద పిల్లల మీద గయ్యమన్నావు నీలో పరివర్తన ఏం జరిగింది పుణ్యం ఎందుకు వస్తుంది అద అసలు పుణ్యమే కాదండి ఆ మాటక వస్తే అది పూజ కాదు మనం అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు చేసింది అసలు పూజే కాదు అదండి ఎన్ని పూజలు చేస్తే పుణ్యం వస్తుంది అంటే నీలో పరివర్తన రానంత కాలం ఎన్ని పూజలు చేసినా రాదండి అంటే మంచి ఉదాహరణ చెప్తాను దీన్ని పట్టుకోడానికి ప్రయత్నిద్దాం.
(11:35) పుణ్యఫలం అంటే అద్దం మీద దువ్వు తొలగిపోవడమేనండి మీరు తొలగించుకుంటారా లేకపోతే కష్టాల రూపంలో అది ప్రకృతి ఎలా తొలగిస్తుందా మనకు తెలియదు ఏదైనా [గురకలు] సరే బాగా మసిపట్టిన లేకపోతే దుమ్ము పెరిగిపోయినా అద్దం మీద దుమ్ము తొలగిపోవడం అంటే మనలో [గొంతు సవరించుకోవడం] అరిషడ్ గోరగాలు కరిగిపోవడమే మనసు ప్రశాంతత చెందటమే నేను ఇందాక అన్నాను కదా ఒక మాట ఎన్ని పూజల తర్వాత పుణ్యం వస్తుందని ఇది [నవ్వు] అజ్ఞానానికి సూచికండి ఈ ప్రశ్న ఎన్ని పూజల తర్వాత నువ్వు మంచి మనిషివ అయ్యావు నీలో మానవత్వం మేలుకుంది అన్నదే
(12:21) అసలు ప్రామాణికం అండి ఇప్పుడు పూజ గాన వ్రతం గాన నోము గాన లేకపోతే ప్రదక్షణాలు గాన లేకపోతే తీర్థయాత్రలు చేయడం గాన ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి కదా పుణ్యానికి ఇవన్నీ గనుక నిన్ను వినయవంతుడిని చేస్తే అది పుణ్యంఅండి ప్రశాంత చిత్తుని చేస్తే అది పుణ్యం మానవత్వాన్ని మేలుకొలిపితే అది పుణ్యం కదా చివరిగా ఒక మాట అండి పూజ చేస్తావు హాయిగా వచ్చి కుర్చిలో కూర్చుంటావువాట్ ఓపెన్ చేస్తావు నీకు నచ్చని ప్రతిదాన్ని ఖండిస్తూ ఉంటావు దానివల్ల నీకు ఉపయోగం లేదు అయినా ఖండిస్తూ
(13:05) ఉంటావు మెసేజ్లు పెట్టేస్తూ ఉంటావు నీకు తెలియకుండా కొంత వ్యతిరేకతను పోగు చేసుకుంటూ ఉంటావు మరి పావు గంట క్రితం పూజ చేశవు కదా అది పూజ కాదు కదా కాదు కదండి కాబట్టి [గొంతు సవరించుకోవడం] మళల మార్పు రానంత కాలం ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని నోములు వ్రతాలు ఆచరించినా ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఏమి ఉపయోగం లేదండి ఏం ఉపయోగం లేదు ఎందుక ఇవాళ పొద్దునే ఆలోచన వచ్చింది దాని మీద రెండు గంటలు కూర్చున్నాను.
(13:39) అది మాత్రం నేను చెప్పగలుగుతున్నానండి అసలు ఆలోచన నాకఎందుకు రావాలి అంటే తెలియదు నాకు ఎందుకు రావాలో ఈ 11800 మంది సబ్స్క్రైబర్స్ లో 7 800 మంది చూడటానికేమో మరి నేను వీడియో చేస్తున్నది. సో ఇదండి వీడియోలో ఉన్న సంగతి అవినందుకు కృతజ్ఞతలు కొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 డిస్క్రిప్షన్ లో నేను ఇస్తానండి నా ఛానల్ లింక్ బెల్ ఐకాన్ లేకపోతే లైక్ బటన్ ఈ రెండు మీరు నొక్కేస్తారు.
(14:15) నాకైతే అనుమానం ఏమ లేదు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కామెంట్ బాక్స్ లో మంచి మెసేజింగ్ పెట్టండి. మీరు ఎలా పెట్టినా పర్వాలేదు నిజమే కిరణ గారు ఏదో మేము జీవితాంతం అంతా అడు తిరుగుతున్నాం ఇడు తిరుగుతున్నాం కానీ మాలో ప్రశాంతత రావట్లేదు మీరు చెప్పిన విషయాల గురించి కొంచం సీరియస్ గా ఆలోచిస్తాం అసలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తాం చూద్దాం భగవంతుడు దేవలో మాలో ఏది కదలా అది కదులుతుందేమో అని మీరు అనుకున్నారు అనుకోండి ఈ వీడియోకి [గొంతు సవరించుకోవడం] ఇంతకంటే కృతజ్ఞత లేదో ఇంతకంటే ఫలితం లేదండి సో ఇదండి వీడియో సంగతి నమస్కారం

No comments:

Post a Comment