🦚జ్ఞానప్రసూనాలు🚩
1) ఆత్మస్ఫురణలో తెలివితో ఉండు. నీడలను గురించిన ఆలోచన నీకెందుకు? అవి ఆత్మను ఏమీ చేయలేవు.
2) నేనెవడను? అనే ఆత్మశోధన కన్నా గొప్ప కర్మగాని, గొప్ప భక్తిగాని 'మరేదీ లేదు. 'నేను'ను తెలుసుకొంటే ఏకకాలంలో అన్నీ తెలుసుకున్నట్లే.
3) బుద్ధి ప్రయోజనం ఏమంటే ఆ శక్తి సహాయం లేకుండా తానేమీ చేయలేనని తన అశక్తతను గుర్తించడం.
4) ప్రపంచంలో ఏముందో, దేహంలోనూ అదే ఉంది. దేహంలో ఏముందో, ప్రపంచంలోనూ అదే ఉంది.
5) ఎప్పుడూ ఉండేది ఆనందం. వచ్చిపోయేదంతా మనఃకల్పితం.
No comments:
Post a Comment