ఈ ఉదయం కాసేపు''కాఫీ ''గురించి ముచ్చటించు కుందాం.''కాఫీ''
రుచి ముందు అమృతంకాని,అధరామృతంకాని.సాటి
రావని ఓ కవీశ్వరుడు సెలవిచ్చాడు.
వెనకటి కాలంలో ఈ కాఫీ ని బాగా వాడుకలోకి తెచ్చినది.అరవఅయ్యర్లుట!
''కాఫీ''ప్రియుడైన.ఓ కవి ఓ అయ్యరు
హాటల్ లో కూర్చుని ఓ పద్యమే విసిరే
సాడు ఎంతో చమత్కారంగా :
తరుణుల మోవి పానకము త్రాగకపోయి
నేమిగాక,యా
సురపతి వీటియందు సుధ జుర్రక పోయి
న నేమిగాక, మా
కరుణ గభస్తి బింబ ముదయాచలమెక్కక
మున్నె.వెచ్చనై
గరగరలాడు కాఫీ యొక.కప్పిదిగోనని
అయ్యరిచ్చినన్
ఆహా!కాఫీ గురించి ఎంత కమ్మటి పద్యం
ఇలాంటి అపురూపమైన సాహిత్యం
తెలుగు వారికి ఎంతో శ్రమ కోర్చి అందించిన.కీ..శే..ఆచార్య తిరుమల
గారికి ఇంతటి సాహిత్యంలోకానికి
అందించిన వదాన్యులు శ్రీ కె.ఐ.వర
ప్రసాదరెడ్డిగారికి తెలుగు జాతి ఎంతో
ఋణ పడిఉందనటంలో సందేహం లేదు.
...........
జె.ఎల్. నరసింహం,హైదరాబాద్
No comments:
Post a Comment