Friday, July 3, 2026

 టెక్నాలజీ బంధాలను దూరం చేస్తున్నాయా ?!
************************************
ఏమండీ!  మీ అమ్మగారి పుట్టినరోజు వస్తోంది కదా ! మీ అమ్మగారికి ఒక సెల్ ఫోను కొనిద్దామా ?  మీరేమంటారు? " అంటూ శ్యామల తన భర్త శేఖర్ ను అడిగింది.

శేఖర్తనతండ్రిచనిపోయిన తరువాత, తన ఇద్దరి చెల్లెల్లకు పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలన్నీ నెరవేర్చి, అమ్మ చూసిన సంబంధం చేసుకున్నమంచిమనిషి ... 
శ్యామల కూడా మంచి అమ్మాయే ! తన చెల్లెళ్ళు ఇద్దరూ ఇంటికి 2 కి.మీ. దూరంలోనే ఉన్నారు.  శ్యామల,కూడా ఉద్యోగం చేస్తోంది.

శేఖర్ , శ్యామల ఇద్దరూ ఆఫీసుకువెళ్ళిపోయాక ...
శేఖర్ అమ్మగారు పక్కనే ఉన్న గుడికి వెళ్ళడం ... 
టీ.వీచూడటం ...ఇరుగుపొరుగుతోకాసేపుమాట్లాడటం ... అప్పుడప్పూడూ కూతుళ్ళు ...మనవళ్ళూ ...మనవరాలుతరచుగావచ్చిపలకరించిపోయేవారు

అమ్మకు ఫోను తీసి ఇద్దామన్న శ్యామల ఆలోచన ...శేఖర్ కు కూడా నచ్చి ఒక సెల్ ఫోనును కొనుక్కుని వచ్చి అమ్మకు పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు ... 
ఇస్తున్నప్పుడు ఆ అమ్మ కళ్ళల్లోసంతోషంకనపడింది ... ఆ సెల్ ఫోనును ఎలా వాడాలో... అన్నీ చెప్పి ...నెంబర్లన్నీ అందులోకి ఫీడ్ చేసి, అమ్మకు ఇచ్చాడు శేఖర్.

సెల్ ఫోను రాగానే, ఇక అమ్మకు మంచి టైంపాస్ అయింది. కూతురు ఫోను చేసి " అమ్మా ! నువ్వు చేసే పొదినా పచ్చడి నీ అల్లుడికి చాలా ఇష్టం ... ఎలా చేయాలో ఒకసారి చెప్పమ్మా ! " అని  అడగడం.

పిల్లలు అమ్మమ్మా! బాగున్నావా ... అని రోజూ మాట్లాడటం చాలా బాగా నచ్చింది ఆమెకు ... ఇలా రోజూఅందరితోమాట్లాడుతూచాలాసంతోషంగానే గడిపారు ఆవిడ.

ఒక నెల రోజులు గడిచాయి ... 
అమ్మ మొహం బాగా వాడిపోయిందన్న విషయం గమనించాడు శేఖర్. అమ్మతో ఇలా అన్నాడు."ఏమ్మా! అలా ఉన్నావు ... ఆరోగ్యం బాలేదా? డాక్టరు దగ్గరికి వెళదామా చెప్పు ? "

దానికి ఆవిడ " అలాంటిదేమీ లేదులేరా ? 
నువ్వు ప్రశాంతంగా ఆఫీసుకు వెళ్ళు "అని అంది.కానీ, శేఖర్ మాత్రం ఏదోఉందనిగ్రహించాడు ...ఆఫీసుకు వెళ్ళే ముందు మళ్ళీ అడిగాడు ...

" ఏమీ లేదని ఎందుకే అబద్ధం చెపుతావు ? 
నీ మొహమే చెపుతోంది.  ఫరవాలేదు చెప్పమ్మా !
"మరేమో ! ... మరేమో ! ... పెద్ద విషయం ఏమీ లేదుగానీ ... నాకు ఈ సెల్ ఫోను వద్దురా ! నువ్వే ఉంచుకో ! "అంది అమ్మ.

"ఎందుకలాఅంటున్నావు చెప్పు ... ఎవరైనా ఏమైనా అన్నారా ?"శేఖర్అడిగాడు.”ఎవ్వరూ ఏమీ అనలేదు కానీ ... ఈ ఫోను వచ్చాక,నన్నుచూడటానికి ఎవ్వరూ రావడంలేదు ... 
రోజూఫోనులోమాట్లాడుతున్నాగా అమ్మా ! అని కూతుళ్ళూ ...మనవళ్ళు ... మనవరాళ్ళుఅంటున్నారు.

ఈ సెల్ వచ్చాక వారు ఎవరూ రావడంలేదు ... 
ఇది నాకు వారిని దూరం చేస్తోంది ... నాకు ఈ వయస్సులోఆప్యాయంగా నాపక్కనకూర్చోనిమాట్లాడే నా బిడ్డలు కావాలి కానీ ... ఫోనులో అన్నీ మాట్లాడేసుకునికలవకుండా ఉండే బంధాలు వద్దురా ! నాకు ఈ సెల్ వద్దు ... 

అమ్మమ్మా ! అంటూ పరిగెత్తుకునివచ్చినామెడనుచుట్టుకునే బంధమే కావాలి ...నా మాటవిని ఈ సెల్ నాకు వద్దు. " అని అమ్మ అన్నారు. అది విన్న శేఖర్ కూడా నిజమే కదా !అనుకుని నవ్వుకున్నాడు.

పెద్దవారితోరోజూఫోనులో మాట్లాడినాసరే,దయచేసి మీ వీలును చూసుకుని వెళ్ళికలవండి ...బంధాలను బలపరచుకోండి !బంధాలనుబలపరచుకోవాలి !!అనుబంధాలను
పెంచుకోవాలి !!!

(వాట్స్ అప్ సందేశం)
🌳💐🪷🪷🪷🪷🪷💐🪷

No comments:

Post a Comment