🦚జ్ఞానప్రసూనాలు🚩
30/06/2026
1) ధ్యానించేవాడు, ధ్యానవస్తువు ఒక్కటే అని తెలుసుకోవటమే ధ్యానలక్ష్యం.
2) గమ్యాన్ని అహంకారంతో చేరాలని చూస్తాము. కానీ గమ్యం అహంకారం పుట్టుటకు పూర్వమే ఉంది.
3) భ్రాంతి ఎందుకు కలిగింది? అని ప్రశ్నించడం కంటే, భ్రాంతి ఎవనికి కలిగింది? అని ప్రశ్నించుకోవడమే సబబు.
4) కర్మలను నశింపచేసే బీజాలు కర్మలోనే ఉన్నాయి.
5) ఆత్మ మనమేదో చేయుటవలనగాక, మనమేదియు చేయకుండుట (సుమ్మా ఇరు) వలన లభ్యమగుచున్నది.
No comments:
Post a Comment