అరుణాచలం:
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
"ఎవరో చనిపోయారు" అన్న వార్తను మహర్షికి చెప్పారు ఒక భక్తుడు; మహర్షి ఇలా సెలవిచ్చారు .....
మంచిదే. చనిపోయిన వారే సుఖపడ్డవారు. దుబారాగా పెరిగిన తంటాలమారి దేహాన్ని వదల్చుకొన్నారు. చనిపోయిన వారికి ఎటువంటి దుఃఖమూ లేదు. ఉన్నదంతా ఆ మిగిలియున్న వారికే.
నిద్ర అంటే ఎవరైనా భయపడతారా! నిద్ర, ఆ సమయానికి మరణంతో సమానం. అందరూ నిద్ర కోసం ఎదురు చూచేవారే. మేల్కొన్న పిదప ఎంత హాయిగా నిద్ర పోయాను అనేవారే. సుఖనిద్ర కోసం పడకను చక్కగా అమర్చు కొనేవారే. నిద్ర తాత్కాలిక మృతి(చావు).
చావు ఒక దీర్ఘనిద్ర. బ్రదుకులోనే చావును భావించేవారు, ఒకని చావుకై శోకించడు. దేహం ఉన్నా లేకున్నా, మూడు అవస్థల(జాగ్రత్, స్వప్న, సుషుప్తి)లోనూ తన ఆత్మస్థితి స్పష్టమే. అటువంటప్పుడు, శరీర బంధం సాగాలి అనే ఆశ ఎందుకు? చావులేని ఆత్మను కనుగొని, ఆ తరువాత చచ్చి, అమరుడు ఆనందమయుడూ కావడం సరి.
🪷 జ్ఞాన ప్రసూనాలు 🪷
1) సామాజిక పరివర్తన అనే ఇంజనుకు ఇంధనం - వేదాంతం
2) ఆస్తికుడను కపటవేషం వేసేకన్నా బాహాటంగా నాస్తికుడు కావడమే మంచిది.
3) ఎలా సంపాదించాలో పాశ్చాత్యులు నేర్పారు. ఎలా త్యాగం చేయాలో భారతీయులు నేర్పారు.
4) ఒకప్పుడు సంభవమైనది సర్వదా సంభవమై ఉంటుంది.
5) ఏక వస్తువును దాటి ఏమీ లేదు. పుట్టడాలు పోవడాలు అన్నీ అందులోనివే.
No comments:
Post a Comment