అరుణాచలం:
ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🏻
'శ్రవణం, మననం, నిదిధ్యాసనములు' అవసరములని పుస్తకాల్లో చదువుతారు. ఆత్మసిద్దికి ముందు సవికల్ప, నిర్వికల్ప సమాధిలను పొందవలెను అనుకొంటారు.
అందుచేతనే అనేక ప్రశ్నలు ఉత్పన్నం కావడం. ఆ చక్రంలో పడి తిరగడం ఎందుకు? దానివల్ల చివరకు ఒరిగేది ఏమంటే 'ఆత్మ విచారణ' అనే సూటిమార్గాన్ని తప్పించుకొనే ఉపాయమే తప్ప, మరొకటిగాదు.
'ఆత్మ నిత్యము, స్వయం సిద్ధము' అని తెలిసినదే కదా! పెద్ద చదువులు చదువని సరళచిత్తుడు జపంతోగాని, అర్చనతోగాని తృప్తి పడుతాడు. కానీ కష్టమంతా పాండిత్యకారులకే. సరే మంచిదే. వారూ కాలం వెళ్ళ దీయవలెను కదా!!
🦚జ్ఞానప్రసూనాలు🚩
1) నేను చేస్తున్నాననే అహంభావం ఉన్నంతవరకు దేనికది అనుభ వించాల్సిందే
2) నీకిష్టమున్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తయ్యే తీరుతుంది
3) ఏ శక్తి అయితే ఈ శరీరానికి ఉనికి కలిగించిందో, ఆ శక్తే ఈ శరీరం చేయాల్సిన పనులన్నిటినీ చేసేలా చూస్తుంది.
4) ఏ కర్మలను అనుభవించడం కోసంగా ఈ దేహం లభించిందో, వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలివేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాల మీద ఏ మాత్రమూ ఆధారపడి ఉండదు
5) భగవంతుని అనుగ్రహజ్యోతిప్రసారము లేకుండా అల్పులైన జీవులు | మాయాబంధ విముక్తులు కాలేరు. శుధ్ధస్థితిని పొందలేరు.
No comments:
Post a Comment