Friday, July 3, 2026

 భగవానుడు కృతయుగంలో చతుర్భుజములతో తెల్లని రంగు కలవాడై, త్రేతాయుగంలో ఎర్రని మేని ఛాయతో చతుర్బాహుడై, ద్వాపరయుగంలో శ్యామల వర్ణముతో పీతాంబరధారియై రెండు బాహువులతో శత్రుసంహార దీక్షలో నిమగ్నుడై బ్రహ్మవిద్య, యోగశాస్త్రము అయిన తన అమృతవాణిని, శ్రీకృష్ణావతారంలో అర్జునుని ద్వారా విశ్వజనులకు అందించిన గీత అమూల్యమైనది. 

దశావతారములలో విశిష్టమైనది కృష్ణావతారం. మహావిష్ణువు క్షీరసముద్ర నివాసి. సాగరంలో మహాలక్ష్మితో కలసి నివసించేవాడు. హిరణ్యాక్షుడనే రాక్షసుని వరాహావతారమెత్తి సంహరించి భూమినిపైకి తీసుకువచ్చాడు. తర్వాత నరసింహావతార మెత్తి హిరణ్యకశిపుని సంహరించాడు. వామనావతారమెత్తి బలిచక్రవర్తిని ఖండించాడు. పరశురామావతారమెత్తి దుష్టచక్రవర్తులను తన పరశువుతో శిక్షించాడు. శ్రీరామవతారమెత్తి రావణ, కుంభకర్ణ రాక్షసులను సంహరించాడు. కృష్ణావతారమెత్తి కంసాది దుష్టులను పరలోకాలకు పంపేడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో విశ్వవాసులకు శ్రీమద్భగవద్గీతను అందించిన మహావిష్ణువే శ్రీకృష్ణభగవానుడు. కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుడు, మధుసూదనుడు, త్రివిక్రముడు, హృషీకేశుడు, పురుషోత్తముడు, వాసుదేవుడు, నారసింహుడు, జనార్దనుడు, ఉపేంద్రుడు, శంఖచక్ర గదాధరుడు.

No comments:

Post a Comment