Gurucharanam:
*శ్రీ రమణ మహర్షి బోధనలు49
*ప్ర: అందరి పట్లా సమత్వంలో ఉంటాడు జ్ఞాని అంటారు*
*అవును.*
*స్నేహం, దయ, సంతోషం వంటివి జ్ఞానికి సహజమవుతాయి. మంచి వారి పట్ల అప్యాయత, నిస్సహాయుల పట్ల దయా, మంచి పనులు చేయటంలో ఆనందమూ, దుష్టుల పట్ల క్షమా ఇవన్నీ జ్ఞానికి సహజ లక్షణాలు*
*(పతంజలి, యోగ సూత్రాలు 1:37) జ్ఞానులకి సత్యమేమిటో తెలుసుకాబట్టి వాళ్లు అన్ని అవస్థలలో, పరిస్థితులలో ఒకే విధంగా ఉంటారు.*
*వారు నిత్య కృత్యాలు అంటే, భోజనం చేయటం, తిరగటం వంటివి ఇతరుల కోసమే చేస్తారు. తమకోసమంటూ ఒక్కపనీ చేసుకోరు.*
*ఎవరైనా చనిపోయినప్పుడు డబ్బు ఇస్తే అక్కడికి వెళ్లి శోకాలు పెట్టే వృత్తి కొందరికుంది. అట్లాగే జ్ఞాని కూడ.*
*జ్ఞాని ఏ అనురక్తీ లేకుండా, ఏ విధంగానూ ప్రభావితం కాకుండా, ఇతరుల కోసం పనులు చేస్తాడు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను.*
*జ్ఞాని ఏడ్చేవాళ్లతో ఏడుస్తాడు. నవ్వేవాళ్లతో నవ్వుతాడు, ఆడే వాళ్లతో ఆడుతాడు, పాడే వాళ్లతో పాడుతాడు - పాడుతూ తాళం వేస్తాడు. అతనికి వచ్చిన నష్టమేమిటి? నిర్మలమైన, శుభ్రమైన అద్దం వంటిది అతని ఉనికి.*
*బింబాన్ని ఉన్నద్దున్నట్టు చూపుతుందది. జ్ఞాని కేవలం అద్దమే కాబట్టి చేసే పనుల వల్ల అతని పై ఏ ప్రభావమూ ఉండదు. ప్రతిబింబం కాని ఈ లోకంలోని వల్ల అద్దానికే మవుతుంది? అతనినేమీ చేయదది పాత్రధారులు అంటే అన్నీ చేసేవాళ్లు,*
*అజ్ఞానులు మాత్రం ఏ పాటపాడాలి,*
*ఏ పని చెయ్యాలి, ఏ పనిచేస్తే లోకానికి*
*మంచిది, ఏది*
*శాస్త్రసమ్మతమవుతుంది. ఏది సాధ్యం - ఇవన్నీ నిర్ణయించుకోవలసి వస్తుంది.*
🙇♀️🙏🙇♀️🙏🙇♀️🙏🙇♀️🙏🙇♀️🙏🙇♀️
🦚జ్ఞానప్రసూనాలు🚩
01/07/2026
1) కర్మఫలాలు ఆ వ్యక్తిని భాధించకపోతే ఆ వ్యక్తి ఆ కర్మలనుండి విముక్తుడే అని అర్థం.
2) ఆత్మజ్ఞాని మాత్రమే చక్కని కర్మయోగి కాగలడు.
3) నేను' అనేది పోవడం ప్రధానం. దేహం మాయమవడం కాదు.
4) మనోబలం అంటే లోకంతో సంగమును విడిచే శక్తి.
5) అభ్యాసం అంటే అహంకారానికి మూలమైన "నేను"ను నిరంతరం వెతకడం.
6) ఆత్మలబ్ధికి మార్గం ఆర్తి.
No comments:
Post a Comment