[7/29, 07:43] +91 94924 83092: 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*గురు పౌర్ణమి విశిష్టత*
➖➖➖✍️
```
అనాది కాలం నుంచి "ఆషాడ శుద్ధ పౌర్ణమిని, గురుపౌర్ణమి" అంటారు.
దీనినే "వ్యాస పౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహోత్సవాలు నిర్వహిస్తుంటారు.
ఆ రోజు మునిశ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కనుక ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలోనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతోంది.
ఈ ఆషాడ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్ఠత గురించి ఒక చక్కని ప్రాచీన కధ ఉంది.
పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయస గోత్రము గల ఆ బ్రాహ్మణుని యొక్క పేరు 'వేదనిధీ. ఆయన భార్య వేదవతీ. వీరిద్దరు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తున్నారు. వారు సంతానము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి సంతానము మాత్రం కలుగలేదు.
ఇలా ఉండగా; ఒకనాడు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుంటారని వార్త తెలుసుకుని ఎలా అయినాసరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతకనారంభిస్తాడు. ఒక రోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు.
వెనువెంటనే వేదనిధి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు.
అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము వదలకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు.
ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసి, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికీ తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలో కోరుకో అంటాడు.
మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అని చెప్తాడు.
అందులకు మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.
అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యకి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు.
మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని ఆ దంపతులు ఎంతో ఆదరాభిమానాలతో వారిని పూజిస్తారు. అనంతరం వారు దేవతార్చనకు సాలగ్రామం, తులసి దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు.
వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు.
అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు.
వారి అతిథ్యానికి ఎంతో సంతుష్టులైన
ఆ ముని శ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరంకావాలో కోరుకోండి అంటారు.
మేము నోయని నోము లేదు, చేయని వ్రతం లేదు, అయినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు.
ఓ ఆదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ అంత్యమున విష్ణుసన్నిధాన్ని పొందగలరు, అని ఆశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమ దర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని వేదనిధి ప్రశ్నిస్తాడు.
దానికి వ్యాస మహర్షి బదులుగా 'ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచూ ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించాను. అందులకు నన్ను మీరు ఎలా దర్శించగలరో చెప్తాను, వినండి…
ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేదవేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఉంటారో అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైన వ్యక్తిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను.
అదేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విశ్వం యొక్క పూర్వవృత్తాంతం; పురాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే వారికి నా అనుగ్రహము లేనిదె చేప్పలేరు. కావున అట్టి పౌరాణికునికి ఆషాఢ శుద్దపాడ్యమి నాడు వారికి గురుపూజ చేసి పూజించవలెనని చెప్పారు.
నాటి నుండి నేటివరకు అదే ఆచారము కొనసాగడం మనం చూస్తున్నాం!.
అది విన్న వేదనిధి మరోమారు వ్యాసభవానుని “మహాత్మా! తమను ఏయే రోజుల్లో ఏవిధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పండి” అని ప్రశ్నిస్తాడు.
```
*"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః*
*ఆషాఢ శుక్ల పక్సేతు పూర్ణిమాయాం గురౌతథా*
*పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః*
*దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్*
*ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం*
*భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."*```
ఓ బ్రాహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను శ్రద్ధాభక్తులతో చేయాలి.
ఆ రోజు కనుక గురువారము అయితే, అది మరింతగా శ్రేష్టమైనది. వస్త్ర, ఆభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువారికి నా స్వరూప సాక్షాత్కారం లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారు.
అప్పటి నుంచి వ్యాసపౌర్ణమి, నేటికీ సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ కధ పూర్వము నారదుడు వైశంపాయనుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ స్వధర్మసింధు అనే గ్రంధములోను వివరంగా చెప్పబడి యున్నది.```
*"వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం*
*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం*
*వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే*
*నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః.*✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
`🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
[7/29, 07:43] +91 94924 83092: 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀`
#######################
*గురువు లేకపోతే...*
*అంతా చీకటే..!*
➖➖➖✍️
#######################
```
*‘గురువులేనివాడు అంధుడితో సమానం!’ అనే నానుడి ఉంది..!
*వ్యక్తికి తొలి గురువు అమ్మే, కానీ గురువు మాత్రం రెండో తల్లి.
*మనిషి రెండు సార్లు జన్మిస్తాడని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
తల్లిదండ్రుల కలయికతో తొలిసారి..! విశ్వసనీయమైన గురువును అంగీకరించడం ద్వారా రెండోసారి జన్మిస్తాడు.
*గాయత్రి మాత సహకారంతో వేద విజ్ఞానం,వ్యక్తిత్వం అలవరుచుకోవడంలో గురువు తండ్రి పాత్రను పోషిస్తాడు.
*జీవితంలో సరైన మార్గంలో నడిపించడానికి గురువు బోధనలు ఉపయోగపడతాయి.
*గురువే లేకపోతే అజ్ఞానం అనే చీకటిలోనే మనిషి కూరుకుపోతాడు.
*ఆచార్యుడు ప్రమాదం నుంచి మనల్ని కాపాడే వ్యక్తి కూడా.
*ఉపనిషత్తులలో కఠోపనిషత్తుకు విశిష్ట స్థానం ఉన్నది. ఇది హృదయోపాసన ద్వారా ముక్తిని సాధించే విద్యను ప్రవచించింది. దీనిలో మృత్యువే గురువు. ఇది మృత్యుంజయ విద్యను ఉపదేశించింది.
*శంకరాచార్యులు భాష్యం రాసిన పది ఉపనిషత్తులతో ఇది కూడా ఒకటి.
*వ్యక్తి తనకు తోచిన విధంగా ప్రయాణం చేసి దానికి సంబంధించిన అనుభవం పొందుతాడు. మార్గంలో సూచనలు లేకపోతే ప్రయాణం దారి తప్పే అవకాశాలు ఎక్కువ.
*జ్ఞాన బోధ వల్ల జీవితానికి మార్గనిర్దేశం కలుగుతుంది. అది గురువు వల్లే సాధ్యం!
*అస్పష్టమైన ఆలోచనలుండే వ్యక్తి పొగమంచులాంటి వాడు. పొగమంచులో ప్రయాణం, అంధుడి ప్రయాణం లాంటిది. గురువు సమాచారం అందించి, మద్దతు ఇచ్చి సహాయం చేస్తాడు.
*గురువులు, పరమ గురువులు లేరని
కొందరు వాదిస్తారు. తన గురించి తెలుసుకోవాలనే తపించువారికి గురువు దర్శనమిస్తాడు.
*ప్రతి సద్గురువు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. తన చుట్టూ చేరిన శిష్యులకు వారి నిజ స్వరూపాన్ని గుర్తుచేసి, అమరులని, వెలుగు స్వరూపులని ఎవరికి వారు అనుభవం ద్వారా తెలుసుకొనేటట్టు మార్గదర్శకత్వం చేస్తాడు.
*గురువు యొక్క సాన్నిధ్యం శిష్యుడిలో మార్పునకు శ్రీకారం చుడుతుంది. అది అయస్కాంతం వద్ద ఇనుప ముక్కలో కలిగిన మార్పు లాంటిది.
*మానవజాతి మొదలైనప్పటి నుంచి గురుశిష్య పరంపర ఆరంభమైంది.
*యోగశాస్త్రం ప్రకారం ‘సమస్త జీవుల హృదయాలలో ఉన్న దైవమే
గురువులందరికీ గురువు. సమస్త జ్ఞానానికి, పరిపూర్ణతకు అతడే బీజం’.
*గురువు అనే తత్త్వం(లేక) సిద్ధాంతం గురువు రూపం ద్వారా పనిచేస్తుంది.
*పూర్వ కాలంలో శిష్యులకు గురువు బాధ్యతలను అప్పగించేవాడు. ఇక్కడ గురువు చెప్పిన పనిని, ప్రశ్నించకుండా శిష్యుడు చేయాలి. కాని నేటి తరంలో శిష్యులకు స్వతంత్రం ఎక్కువైంది.
*వేదకాలంలో గురువులను శిష్యులు నిత్యం ప్రసన్నం చేసుకునేవారు. విద్యాభ్యాసం పూర్తయినంత వరకూ శిష్యుడు గురువు సంరక్షణలో ఉండేవాడు. గురువులను గౌరవించి, ఆరాధించే నిజమైన శిష్యుడు విద్యలో పురోగమించేవాడు.```
*లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి ఆయన జన్మ తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం భారతీయ సంప్రదాయం.* ```
*మామూలు రోజులలో కన్నా గురు పూర్ణిమ నాడు గురువు నుంచి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా లభిస్తాయి. అందుకే ఈ రోజు గురుపూజోత్సవంలో పాల్గొని గురువు కరుణా కటాక్షాలు పొందుతారని నమ్ముతారు.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
`🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment