Friday, August 7, 2026

 🌺🚩 *#మంత్రపుష్పం — దివ్యార్చనలో చదివే పవిత్ర మంత్రములు* 🚩🌺
♦ #రాజాధిరాజాయ_ప్రసహ్యసాహినే
నమోవైయంవై శ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామకామాయ మహ్యం
కామేశ్వరో వై శ్రావణౌ దధాతు
కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః

🚩🚩 రాజులకు రాజైన దేవుడోయి
పరులకు లాభాలీయునోయి
వైశ్రవణునకు వందనమోయి
సకల కోరికల యజమానోయి
మా కోరికలన్ని తీర్చునోయి
అతడే కుబేరుడు వైశ్రవణుడోయి
ఆ మహారాజుకు వందనమోయి 🙏

♦ #ఓం_తద్‌బ్రహ్మ, ఓం తద్వాయు,
ఓం తదాత్మా ఓం తత్సత్యమ్
ఓం తత్సర్వం , ఓం తత్పురోమ్ నమః

🚩🚩 అతడే బ్రహ్మ మతడే వాయువు
అతడే సత్య మతడే ఆత్మ
అతడే సర్వ మతడే ఆదిదైవం 🙏

♦ #అంతశ్చరతి_భూతేషు
గుహాయామ్ విశ్వమూర్తిషు

🚩🚩 జీవులందున్నవాడు
బయట వున్నవాడు
తెలియని వాడు
విశ్వమంతా వున్నవాడు 🌌

♦ #త్వం_యజ్ఞస్త్వం వషట్కారస్త్వం
ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం
బ్రహ్మత్వం ప్రజాపతిః
త్వం తదాప ఆపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ
భూర్భువస్సువరోమ్

🚩🚩 నీవే యాగము యాగమంత్రము
నీవే విష్ణువు బ్రహ్మ ఇంద్రుడవు
నీవే జలము తేజము రసము
నీవే శాశ్వతము విశ్వరూపము
నీవే ఓంకారబ్రహ్మవు 🔱

♦ #ఈశానః_సర్వవిద్యానాం
ఈశ్వరః సర్వభూతానామ్
బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోఽధిపతిః
బ్రహ్మశివో మే అస్తు సదాశివోమ్

🚩🚩 సకల విద్యలకు ఈసుడవు
సకల జీవులకు ఈసుడవు
నీవే బ్రహ్మ యజమాని
నీవే బ్రాహ్మల యజమాని
నీవే బ్రహ్మ సదాశివుడవు 🕉️

♦ #తద్విష్ణోః_పరమం పదగ్o
సదా పశ్యంతి సూరయః
దివీవ చక్షురాతతమ్

🚩🚩 ఆ విష్ణులోకము నోయి
ఆ పరమపధమునోయి
జ్ఞానులు సదా చూచేరోయి
ఆకాశమంతా చూచేరోయి ✨

♦ #తద్విప్రాసో_విపన్వవో
జాగృవాంసః సమిన్దతే
విష్ణోర్యత్ పరమం పదమ్

🚩🚩 కోరికలు దోషాలు లేని వారు
జాగృతి చలనాలు కలవారు
విష్ణులోక కాంతులు పెంచేరు
పరలోక ప్రకాశము 🌠

♦ #ఋతంసత్యం_పరంబ్రహ్మ
పురుషం కృష్ణపింగళమ్
ఊర్ధ్వరేతం విరూపాక్షం
విశ్వరూపాయ వై నమో నమః

🚩🚩 ముక్తినాధుడు సత్యరూపుడు
బ్రహ్మ రూపుడు నల్లనివాడు
పైకి వెలుగు తేజోవంతుడు
విరూపనేత్రుడు విశ్వరూపుడు
దేవదేవునకు మరల వందనము 🙏🌺

♦ #నారాయణాయ_విద్మహే
వాసుదేవాయ ధీమహి
తన్నో విష్ణుః ప్రచోదయాత్

🚩🚩 నారాయణుని ఉహించెదను
వాసుదేవుని ధ్యానించెదను
విష్ణు చైతన్యము కలుగు గాక 🌼

♦ #ఆకాశాత్‌పతితం_తోయం
యథా గచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి

🚩🚩 ఆకాశ ధారాల నీరులు
ఎలా సాగరమే చేరునో
సకలదేవ వందనాలు
ఆ పరందామునే చేరును 🌊

🌺🌺 #మంత్రపుష్పం_సంపూర్ణం 🌺🌺

సర్వం భగవదర్పణం స్వాహా 🙏✨.         *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment