ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🏻
తమిళ మాణిక్యవాచకర్ పాడిన పాటను మహర్షి ఇలా వివరించారు...
దైవం ఒక వ్యక్తి కాదు. ఒక వస్తువూ కాదు. కానీ దైవం లేకుండా ఏమీ లేదు. ఎందుకంటే దైవమే సర్వస్వము, సకలము కూడా.
వ్యక్తికి, ఆత్మ దర్శనమైనప్పుడు సమస్త విశ్వంలో ఆ ఆత్మనే చూస్తాడు. ఆత్మను చూడటం అంటే దైవాన్ని చూడటమే అని అర్థం.
గృహస్థ భక్తుడు :
భగవాన్! నాకు భార్యాపిల్లలు ఉండటం వల్ల ఎన్నో సంసార సమస్యలు ఉన్నాయి. వీటి నించి నేను తప్పించుకోలేను. ఏమి చెయ్యాలి?
మహర్షి :
బాహ్య సంసారం, దైనందిన(రోజువారి) కార్యకలాపాలూ నిన్నేమీ చెయ్యలేవు. విడిచి పెట్టాల్సింది - అంతరంగం లోపల ఉన్న సంసారాన్నే.
గృహస్థ భక్తుడు :
కానీ ఇదంతా ఒక అయిదు నిముషాల పాటు బాగానే ఉంటుంది. తర్వాత మారిపోతుంది. ఏమి చెయ్యాలి?
మహర్షి :
(కొంతసేపు మౌనంగా దాల్చి) మొదట ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. ఈ ఆలోచనలు ఎవరికి అని ప్రశ్నించాలి?
No comments:
Post a Comment