Friday, August 7, 2026

 నిశ్శబ్ద నిశీధిలో నిలిచి 
నింగిని వెలుగుకై వేచి 
నేలను రాలిన పూలు నింపి 
నీ రాకకై  ఎదురుచూసే దారి!

నిన్నటి కలతలు మరచి 
రేపటికై కలలు కనక 
నేటి కమ్మని జారే క్షణము 
సాటిలేక జీవించే కోరిక!

ఎవరితోనూ పోటీ లేదు 
దేనిపైనా పగ లేదు 
దొరికినదే  సొంతమనే 
ఎరుక గలిగిన తృప్తితో 

షరతులు లేని మమతలు 
ఫలితం కోరని పనులు 
లాభం కోరని సాయాలు 
లోభం లేని త్యాగాలతో 

కాలం తెచ్చే మార్పులన్నీ 
సంతోషంగా ఆహ్వానించి 
మోసం చేయని ఋతువుల
మానవాళి మనుగడకిచ్చే...

తరువులే సంపదగా 
తరగని సంతోషముతో 
తనకని ఏమీ దాచక 
తిరుగులేని దాతగా మిగిలే..

వనమును వెలిగించే వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment