🦚జ్ఞానప్రసూనాలు🪷
1. తాను ఈశ్వరుడిని పొందడం అంటే తాను ఈ దేహాన్ని కాదని తెలుసుకోవడమే.
2. జీవుడు - దేవుడు ఈ ఇద్దరూ కలిసి సహజీవనం చేయలేరు.
ఒకరుంటే మరొకరు ఉండరు.
3. వ్యక్తికి ఎవడు సాక్షిగా ఉన్నాడో సమిష్టికి కూడా వాడే సాక్షిగా ఉన్నాడు.
4. సముద్రం నుండి లేచిన అలే నాకు సముద్రాన్ని చూపగలవా అని ప్రశ్నిస్తుంటే ఏమని సమాధానం చెప్పేది?
5. మాటకు..మతికి అందని 'మర్మం' ఏదయితే ఉన్నదో ఆ మర్మానికే వ్యవహార సౌలభ్యం కోసం మానవుడు పెట్టుకున్న అందమైన పేర్లే దేవుడు..ఆత్మ పరతత్త్వం.. పరబ్రహ్మము మొదలైనవి.
6. నేను కొత్తదారు వేయలేదు కొత్త మార్గాలు చూపలేదు. ఎప్పుడూ ఉన్న దారే అది.. తానొచ్చిన దారిని గుర్తుచేస్తున్నానంతే.
7. దైవం కానిది ఒక్క అణువు కనిపించినా సరే నీవు దైవానుభవాన్ని పొందనట్లే.
8. పాత్రకే పరిమితమవ్వకు పాత్రధారిని తెలుసుకో.
9. సీన్ మీద దృష్టి ఉంటే నీవు జీవుడవు.స్క్రీన్ మీద దృష్టి ఉంటే నీవు దేవుడవు.
10. ఆత్మను పొందినా పొందినట్లు కాదు. ఎందుకంటే, అది ముందే' ఉన్నది ' కాబట్టి.
11. హక్కుల సంఘాలు ఉన్నాయి గాని, బాధ్యతల సంఘాలు లేవేమి?
No comments:
Post a Comment