*🧘♂️ నాలుకను జయించినవాడే నిజమైన విజేత 🧘♂️*
*మనిషి జీవితాన్ని తీర్చిదిద్దేది అతని నాలుక.*
*అది రుచిని* *ఎంచుకుంటుంది...* *మాటను పలుకుతుంది.*
*రుచిలో మితి లేకపోతే శరీరం రోగాల బారిన పడుతుంది.*
*మాటలో మితి లేకపోతే బంధాలు దెబ్బతింటాయి.*
*మంచి ఆరోగ్యం కోసం మితాహారం అవసరం.*
*మంచి సంబంధాల కోసం మధురమైన మాట అవసరం.*
*తినే ముందు ఆలోచించు...*
*మాట్లాడే ముందు మరింత ఆలోచించు.*
*ఎందుకంటే... ఆహారం శరీరాన్ని నిర్మిస్తుంది.*
*మాటలు మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి.*
*నాలుకపై నియంత్రణ ఉన్నవాడు*
*ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆత్మశాంతిని సులభంగా పొందగలడు.*
*🌿 మితాహారం – హితభాషణం –* మనిషి జీవితానికి రెండు అమూల్యమైన ఆభరణాలు.
*🏃♂️ఆరోగ్య జీవన యాత్ర*
*✍🏻 — వేల్పుల బోస్*
*🌱 మంచితనమే నా పరిచయం...*
No comments:
Post a Comment