I Met Bairaagi When I Wasn't Looking for Him 🕉️ ఆ రాత్రి ఏం జరిగిందో ఇప్పటికీ మిస్టరీనే😱 #bairaagi
Author Name:Jagamantha Kutumbam Naadi
Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZjKQEU8oWgU
Transcript:
(00:00) మన జీవితంలో కొన్ని పరిచయాలు ఉంటాయి. మనం ఎప్పటికీ మర్చిపోలేం ఎందుకంటే ఆ మనిషి వచ్చాక మన జీవితంలో మనం చూసే చూపే మారిపోతుంది కనుక సంస్కారంతో నమస్కారం మిత్రమా నా పేరు వంశీ ఆత్రేయస నా జీవితంలో అటువంటి పరిచయం ఒకటి జరిగిందండి. అది ఎవరి పరిచయమో మీకు ఇప్పటికే అర్థమయి ఉంటుంది. ఆ పరిచయం అది ఎక్కడ జరిగిందో చెప్తే మీరు నమ్మకపోవచ్చు.
(00:23) ఎప్పుడు జరిగింది వగైరాలు చెప్తుంటే అసలు నేనే నమ్మలేకపోవచ్చు. కానీ ఆయనతో నేను మాట్లాడిన కొన్ని మాటలు మాత్రం ఇప్పటికీ నాలో చెరగకుండా ప్రింట్ అయిపోయి ఉన్నాయి. ఆయన పేరు [సంగీతం] బైరాగి మిత్రమా ఇవాళ మీకో విషయం చెప్పబోతున్నాను ఎప్పుడు చెప్పను అనుకున్న విషయం అది ఇప్పటివరకు బైరాగిని మీరు చూశారు బైరాగి మాటలు విన్నారు. ఆయన ఆదేశాలతో కొన్ని విషయాలు నేను మీకు చెప్తూ వచ్చాను.
(00:48) మెడిటేషన్ సృష్టి చేసి మీకు అందించాను. కానీ బైరాగి ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? నాకు ఎలా పరిచయం అయ్యారు, ఆయన గురించి నాకు ఎంత తెలుసు? నిజం చెప్పాలంటే నాకు కూడా అన్ని తెలియవండి. అసలు మీకు ఆయన గురించి వివరాలు చెప్పడానికి ఇంత సమయం పట్టడానికి కూడా ఓ కారణం ఉంది. మిత్రమా నేను బైరాగిని మొదటిసారి కలిసినప్పుడు అదో సాధారణమైన పరిచయం కాదు.
(01:11) ఆ రోజండి ఓ పని మీద ట్రావెల్ చేస్తున్నాను. సాయంత్రం దాటి చీకటయింది. వర్షం మొదలైంది. ఎప్పుడూ లేనిది కార్లో నాకు నిద్ర పట్టేసింది. అలా కార్ వెళ్తోందా మధ్యలో ఓ కుదుపు వచ్చిందండి. కారు ఆగిపోయింది సో మాకు ఒక చోట ఆగాల్సి వచ్చింది ఆ కుదుపుకు కళ్ళు తెరిచాను అదేదో పెద్ద ప్రాచీన దేవాలయం కాదు ఆశ్రమము కాదు గుహ కాదు హిమాలయాలు కాదు ఓ సాధారణమైన చోట అండి అక్కడండి అసలు ఎవ్వరు బైరాగిని వెతకరు నేను కూడా వెతకలేదు నిజానికి అటువంటి ఒక మనిషి ఉన్నారని ఆయన కనిపిస్తారని నాకు తెలియనే తెలియదు కూడా అదో హైవే ఓ పురాతన చెట్టు దూర దూరాల వరకు ఓ చాయబట్టి ఈ బడ్డీ కొట్టు ఏమీ లేదు లైట్
(01:46) కూడా లేదండి అక్కడే ఆయన ఉన్నారు మొదట ఆయన ఒక మామూలు మనిషిలాగే కనిపించారు నాకు కానీ రెండు విషయాలు మాత్రం విచిత్రంగా అనిపించాయండి. మొదటిది చుట్టుపక్కల ఉన్న శబ్దాలన్నిటి మధ్య ఆయన దగ్గర మాత్రం ఒక రకమైన నిశశబ్దం ఉందండి. రెండోది ఆయన నన్ను చూసినప్పుడు ఆ చూపులో పరిచయం ఉంది. నేను కూడా ఆయన్ని మొదటిసారి చూస్తున్నాను కానీ ఆయన నాకు కచ్చితంగా ముందే పరిచయం ఉంది అనిపించిందండి.
(02:11) ఆయన కూడా నన్ను మొదటిసారి చూస్తున్నట్టు నాకు అనిపించలేదు. వచ్చావా బాబా అన్నారు ఆయన. మీకు తెలుసు కదా ఆయన స్టైల్. ఆ ఒక్క మాట ఆ మాట వెనుక ఉన్న అథారిటీ మాటల్లో ఉన్న మిస్టరీ అందులో ఉన్న ఒక ఆప్యాయత నన్ను తెగ ఆశ్చర్యపరిచేయండి ఎదురుగా నిలబడి ఉన్న అంత ఎత్తు విగ్రహాన్ని కళ్ళు ఇంతవి చేసి చూశానండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని నేను అడగలేదు ఎవరు మీరు అని కూడా అడగలేదు నేను అడిగింది ఒకటే నేను మీకు తెలుసా అన్నాను తెలుసు అన్నారు ఎలా అని అడిగాను నువ్వు ఇంకా తెలుసుకోవలసింది ఉంది నాన్న కాబట్టి నాకు నువ్వు ఎలా తెలుసో చెప్తే నీకు ఎలా తెలుస్తుంది రా అన్నారు ఆ మాట అండి నాకు
(02:45) అర్థం కాలేదు కానీ వింతగా విపరీతమైన అట్రాక్షన్ అనిపించింది ఎదురుగా నించున్న ఆ స్ట్రేంజర్ లా కనిపించని అపరిచిత పర్సనాలిటీని చూస్తుంటే ఆయన మాట వినగానే ఏదో ధైర్యం వచ్చినట్టు అనిపించింది గుండెల్లో ఆ మాటల్లో ఓ విచిత్రమైన ప్రశాంతత ఉందండి కొంతమందిని కలిసినప్పుడు మనసు వెంటనే అనలైజ్ చేయడం మొదలు పెడుతుంది.
(03:04) ఈయన ఎవరు ఈయన ఉద్దేశం ఏంటి? ఈయన్ను నమ్మాలా వద్దా ఈయన మాటలు నిజమేనా వగేరా కానీ మిత్రమా బైరాగిని చూసినప్పుడు నా మైండ్ ఖాళీ అండి లోపల ఒక్క ప్రశ్న లేదు అది భక్తి కాదు భయము కాదు అది గౌరవం అండి ఎందుకో తెలీదు. జనరల్ గా నాకు బాబాలు నాగా సాధువులు అఘోరీలు వీళ్ళంటే చాలా ఇష్టం అండి ఆసక్తి గౌరవం కూడా కానీ బైరాగిని చూస్తే వచ్చిన గౌరవం ఆ డెప్త్ మరెవ్వరి దగ్గర ఇంతకుముందు నేను ఫీల్ అవ్వలేదు.
(03:28) ఆయన కూడానండి నన్ను ఏదో ప్రత్యేక వ్యక్తిలా చూడట్లేదు ఓ క్యాజువల్ పరిచయస్తుడులా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు చాలా నార్మల్ గా అదే నాకు ఇంకా విచిత్రంగా అనిపించింది తర్వాత తర్వాత రోజుల్లో తెలిసిందండి బైరాగి ఎనర్జీ ఫీల్డ్ లోకి మనం ఎంటర్ అయితే మన మనసు ఆటోమేటిక్ గా అనలైజ్ చేయడం వాగడం మానేసి సెంటర్డ్ గా ఒక స్టిల్నెస్ లోకి వచ్చి నిలబడుతుంది అని నువ్వు మరీ ఎక్కువగా వెతుకుతున్నావు అన్నారు ఆయన ఏంటి అని అడిగాను సమాధానాలు బాబా అన్నారు అంటే అది తప్పా అని అడిగాను కాదు బాబా కానీ సమాధానం కోసం వెతికేయమని మనిషి ఆ మొమెంటం పడి కొట్టుకుపోతూ అసలు దేనికోసం
(04:01) వెతుకుతున్నాడో ఆ ప్రశ్ననే చూడడం మర్చిపోతే అప్పుడేంటి అని అడిగారు బైరాగి ఈ మాట మాత్రం నాకు వెంటనే అర్థమయిందండి ఎందుకంటే మనలో చాలా మందికి అదే జరుగుతుంది ఒక ప్రశ్న వస్తుంది వెంటనే సమాధానం కావాలి ఎవరినైనా అడుగుతాం పుస్తకాలు తెలుస్తాం వీడియో చూస్తాం ఫోన్ తీసుకుంటాం అసలు ఈ వెతుకులాట ఓ పిచ్చిలా సాగిపోతూ ఉంటుంది. కానీ ఆ ప్రశ్న మనలో ఎలా పుట్టిందో ఎక్కడ మొదలైందో అంతా మరిచిపోయి ఈ వెతుకులాటలోనే పడి కొట్టుకుపోతూ ఉంటాం.
(04:27) సరే నేను ఆయన్ని అడిగాను అయితే ఏం చేయాలి అని అలా అడగగానే ఆయన నన్ను కొద్దిసేపు అలా చూశారు. ఆ తర్వాత అన్నారు ఏం చేయాలా ఏమి చేయకురా ఏంటి ఏం చేయొద్దా అని అడిగాను. బాబా మూడు శ్వాసలు తీయి చాలు అన్నారు అంతేనా అంతే నీకు కోపం వచ్చినప్పుడు మూడు శ్వాసలు భయం వేసినప్పుడు మూడు శ్వాసలు ఎవరైనా వెంటనే నీకు సమాధానం చెప్పాలనిపించినప్పుడు మూడు శ్వాసలు ఏదైనా నిర్ణయం వెంటనే తీసుకోవాలి అనిపించినప్పుడు మూడు శ్వాసలు అన్నారు బైరాగి చాలా క్యూరియస్ గా అనిపించింది ఎందుకలా అని అడిగాను అప్పుడు బైరాగి ఇలా చెప్పారండి శ్వాస లోపలకు శ్వాస బయటకు మధ్య
(05:03) సూక్ష్మమైన గ్యాప్ ను పట్టుకుంటూ మొదటి శ్వాస తీయి నీకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రెండో శ్వాస తీయ్యి నువ్వు దానికి ఎలా స్పందించబోతున్నావో ఎరుకలో ఉండడానికి మూడో శ్వాస తీయ్యి నువ్వు స్పందించాలా లేదా కేవలం చూడాలా అనేది నిర్ణయించుకోవడానికి మిత్రమా నేను ఆయన చెప్పినట్టే చేశాను శ్వాసల మధ్యలో గ్యాప్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ మొదటి శ్వాసలో నా బుర్రలో ఉన్న గజిబిజి అలాగే ఉందండి రెండో శ్వాసలో నేను ఆ గజిబిజిని గమనిస్తున్నాను అని తెలిసింది విచిత్రంగా మూడో శ్వాసలో అండి ఓ చిన్న తేడా కనిపించింది.
(05:36) ఇన్నేళ్లుగా నేను పిచ్చివాడిలా చేస్తున్న సత్యాన్వేషణ మాయం ఏమి అవ్వలేదు గజిబిజి కూడా పోలేదేమో కానీ నేను వేరు ఆ అహర్నిసల అన్వేషణ వేరు ఆ మధ్యలో ఉన్న ఓ చిన్న గ్యాప్ ఫీల్ అయ్యాను అంతే కానీ ఆ గ్యాప్ అండి ఎంత శక్తివంతమైందో ఎంత మార్పు తేగలదో తెస్తుందో నాకు క్లియర్ గా అర్థమైందండి. మిత్రమా ఆ రోజు బైరాగి చెప్పింది చాలా చిన్నగా అనిపించొచ్చు కానీ దాని లోతు అక్కడే ఉంది.
(06:02) మనకి ఆలోచన వస్తే సాధారణంగా రెండు మార్గాలే కనిపిస్తాయి. దాన్ని నమ్మడం లేదా దాన్ని ఆపడానికి ప్రయత్నించడం అంతే కదా కానీ మూడో మార్గం కూడా ఉందండి గమనించడం ఆలోచన వచ్చింది సరే శరీరంలో ఏమవుతోంది శ్వాస ఎలా ఉన్నప్పుడు ఛాతిలో ఏమవుతోంది ఇటువంటివన్నీ గమనికలోకి రావడం మూడు సహజమైన శ్వాసలు శ్వాసకు శ్వాసకు మధ్య గ్యాప్ ను గమనిస్తూ శ్వాసను మార్చాల్సిన అవసరం లేదు లోతుగా తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
(06:27) మనసును కంట్రోల్ చేయడం కూడా అక్కర్లేదు. కేవలం గమనించాలండి. అదే ఆ హైవే మీద ప్రాచీన వృక్షం కింద కొద్ది కొద్దిగా ఇద్దరం తడుస్తుండగా బైరాగి నాకు చెప్పిన మొదటి మాట ఆ తర్వాత నేను అడిగాను మీరు ఎవరు అని దానికి ఆయన నవ్వారు మొదటిసారి ఎంచాంటింగ్ స్మైల్ అసలు నవ్వి అన్ని తెలుస్తాయి బాబా ముందు మనం కలిసి ఇంకొంత దూరం ప్రయాణించాలి అన్నారు.
(06:49) ఎక్కడికి అని అడిగాను నీకు తెలియని చోటుకి కాదులే నీకు తెలిసినా కానీ నువ్వు ఎప్పుడూ చూడని చోటుకి అన్నారు. ఈ పొడుపు కథలు విప్పడం నా వల్ల కాదు అనుకున్నానండి మళ్ళీ అడిగాను అదెక్కడండీ అని మళ్ళీ నవ్వారు బైరాగి అదేనండి సమాధానం ఇంకేం చెప్పలేదు మిత్రమా ఇక్కడే నా కథలో నాకు పూర్తిగా అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఆ రాత్రి నేను ఆయనతో ఎంతసేపు మాట్లాడానో నాకు కచ్చితంగా గుర్తులేదు నేను అక్కడికి ఎలా వెళ్ళాను కారు అక్కడ ఎందుకు ఆగింది ఎప్పుడు నేను తిరిగి బయలుదేరాను వెనక్కి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఆలోచిస్తే ఒకదానితో ఒకటి పూర్తిగా సరిపోవండి కానీ కొన్ని మాత్రం చాలా
(07:21) స్పష్టంగా గుర్తున్నాయి. ఆయన స్వరం ఆయన చూపు ఇంకా ఆయన లాస్ట్ కి చెప్పిన మాట ఏమన్నారో తెలుసా నన్ను వెతక్కు బాబా నేను వెతుకుతున్నది ఏంటో నువ్వు కూడా వెతుకుదువు గాని అంతే చెల్తే మనో బైరాగి అన్నారు. ఆ మాటండి అప్పట్లో నాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడా ఇప్పుడు కూడా పూర్తిగా అర్థం కాలేదు. మిత్రమా ఆయన్నను మళ్ళీ కలిసే వరకు ఆ రోజు అది కల ఊహా దర్శనమా ఏంటో తెలీదు.
(07:43) నేను ఇప్పటికీ పూర్తిగా చెప్పలేనండి. ఒక్కటి చెప్పగలను ఆయన నిగూఢ అన్వేషణ సాగుతోంది. దాని గురించి ఈ సిరీస్ లో వచ్చే వీడియోస్ లో మీకు ఇంకా ఎంతో కొంత తెలుస్తూ ఉండొచ్చు. అంతే కాదండీ ఆయన మాటలు వినే అవకాశం మనకు లభించింది. ఆయన చెప్పిన కొన్ని విషయాలు మనకు మనమే పరీక్షించుకోవచ్చు కూడా రాబోయే కొన్ని ఎపిసోడ్స్ లో ఈ రోజు నుంచి నేను మీతో మీరు బైరాగితో ఓ ప్రయాణం మొదలు పెడుతున్నాం.
(08:06) బైరాగి వెతుకుతున్న దాని గురించి ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మొదటి అడుగుగా ఓ చిన్న పని చేయాలి మీరు చాలా చిన్నది. ఈ రోజు నుండి మరో మూడు రోజుల పాటు ఎప్పుడైనా మీకు కోపం వచ్చినప్పుడు ఎవరైనా మీకు బాధ కలిగించినప్పుడు మీరు వెంటనే ఏదైనా చెప్పాలి అనిపించినప్పుడు ఏదైనా నిర్ణయం వెంటనే తీసుకోవాలని తోచినప్పుడు మూడు శ్వాసలు తీసుకోండి.
(08:27) శ్వాసకు శ్వాసకు మధ్య గ్యాప్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తూ శ్వాసను మార్చకండి కేవలం గమనించండి. మొదటి శ్వాస నాలో ఏం జరుగుతోంది? రెండో శ్వాస నేను ఎలా స్పందించబోతున్నాను? మూడో శ్వాస నాకు నిజంగా స్పందించాల్సిన అవసరం ఉందా? అంతే ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు నేను ఇందాక చెప్పిన ఆ గ్యాప్ తెలుస్తుంది. అది తెలిస్తే మిత్రమా లైఫ్ వేరే విధంగా మారుతుంది నమ్మండి.
(08:50) మిత్రమా ఆ రాత్రి వానలో చెట్టు కింద బైరాగి నాకో విషయం చెప్పారు. మీ శరీరం గురించి నీకు తెలిసింది చాలా తక్కువ అన్నారు. అప్పుడండి నాకు సాధారణమైన మాటలా అనిపించింది అది ఇప్పుడు మాత్రం అలా అనిపించట్లేదు. ఎందుకంటే తర్వాత నేను తెలుసుకున్న ఒక విషయం వల్ల అది నా శరీరం గురించి అనుకునేరు కాదండి నా శరీరంలో నేను చూడలేని ఇంకేదో గురించి అరె నేను కూడా ఇప్పుడు పొడుపు కథలు వేస్తున్నట్టున్నాను కదా సాంగత్యం అండి మరి మిత్రమా [సంగీతం] బైరాగి వయసుఎంత ఆయన ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఎక్కడో ఏదో యుగంలో ఏదో డిమెన్షన్ లో ఉండేవంటి పర్సనాలిటీ
(09:21) అసలు ఇక్కడ మనతో కనెక్ట్ లోకి ఎందుకు వచ్చారు ఆయన తలుసుకున్నప్పుడే మనకి కనెక్ట్ అవుతారు. మరి మిగతా టైంలో ఏం చేస్తుంటారు? బోలెడు ప్రశ్నలండి. సమాధానాలు తెలుసుకుంటామా తెలుసుకోగలమా? ఎనీవే ఒకటి మాత్రం తెలుసు ఆ రాత్రి నుండే బైరాగి యాత్ర మొదలైంది. జగమంత కుటుంబం నాది ఆ యాత్రలో భాగమైంది. మరి బైరాగి యాత్ర సిరీస్ లో తర్వాత అడుగు వస్తుంది.
(09:41) నెక్స్ట్ క్లూ ఆయన గురించి ఎక్కడ దొరుకుతుంది? చూద్దాం. మిత్రమా త్వరలో వస్తున్న బైరాగి లోకం సరికొత్త మెంబర్స్ ఏరియాలో సరికొత్త డైలీ ధ్యానం ఉంటుంది. దాన్ని అలవాటుగా మార్చుకోండి. 20 25 మినిట్స్ే ఎందుకంటే ధ్యానం ఒక్కటేనండి వైరాగికి కనెక్ట్ చేసే హైవే మరి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఇక వంశీకి [గొంతు సవరించుకోవడం] సెలవించండి వీడియోని లైక్ షేర్ హైప్ చేయండి మళ్ళీ త్వరలో కలుస్తాను.
(10:04) జై శ్రీరామ్ జై భారత్ జై శివశంభో జై గురుదేవదత్త
No comments:
Post a Comment