అష్టావక్ర గీత: మౌనంగా ఉండటం ఎందుకు నేర్చుకోవాలి?
Author Name:Lakshmi Lok Yatra
Youtube Channel Url:https://www.youtube.com/@LakshmiLokYatra75
Youtube Video URL:https://www.youtube.com/watch?v=JXHIfQSwCQs
Title: అష్టావక్ర గీత: మౌనంగా ఉండటం ఎందుకు నేర్చుకోవాలి?
Author Name: Lakshmi Lok Yatra
Description: అష్టావక్ర గీత: మౌనంగా ఉండటం ఎందుకు నేర్చుకోవాలి?
🌿 మౌనంగా ఉండటం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటమేనా? లేక దాని వెనుక మరింత లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉందా?
మన జీవితంలో ప్రతి మాటకు సమాధానం ఇవ్వాలని, ప్రతి విషయాన్ని వివరించాలని, మన ఆలోచనలను ఇతరులకు అర్థమయ్యేలా చెప్పాలని అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండటం, మన ఆలోచనలను గమనించడం, మనలోని అంతరంగాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమే.
📖 అష్టావక్ర గీతలోని ఆత్మజ్ఞాన దృక్పథంతో మౌనం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
ఈ వీడియోలో మౌనం, ఆత్మపరిశీలన, ఆలోచనల పట్ల అవగాహన, అంతరంగ ప్రశాంతత వంటి విషయాలను ఆధ్యాత్మిక కోణంలో పరిశీలిస్తాము. మౌనం అంటే ఏమిటి? మనం ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి? మనలోని ఆలోచనలను గమనించడం ద్వారా మన గురించి మనం ఏమి తెలుసుకోవచ్చు? వంటి ప్రశ్నలపై ఆలోచించడానికి ఈ వీడియో మీకు ఒక అవకాశాన్ని అందిస్తుంది.
✨ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోగలిగే విషయాలు:
🔹 అష్టావక్ర గీత దృక్పథంలో మౌనం యొక్క ప్రాముఖ్యత.
🔹 అవసరమైనప్పుడు మాట్లాడటం, అవసరమైనప్పుడు మౌనంగా ఉండటం మధ్య ఉన్న తేడా.
🔹 మన ఆలోచనలు, భావోద్వేగాలను గమనించడం యొక్క ప్రాముఖ్యత.
🔹 ఆత్మపరిశీలన ద్వారా మనల్ని మనం అర్థం చేసుకునే విధానం.
🔹 రోజువారీ జీవితంలో ఆలోచనాపూర్వకమైన మాటలు, ప్రశాంతమైన వైఖరిని అలవాటు చేసుకోవడం గురించి ఆలోచనలు.
🙏 ఒక చిన్న ఆధ్యాత్మిక సందేశం
ప్రతి సందర్భంలో మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అవసరం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు శ్రద్ధగా వినడం, ఆలోచించి మాట్లాడటం, మన అంతరంగాన్ని గమనించడం ఎంతో విలువైనవి. అయితే మౌనం అంటే మన భావాలను అణచుకోవడం లేదా అవసరమైనప్పుడు మాట్లాడకుండా ఉండటం కాదు. సరైన సమయంలో, సరైన విధంగా మనసులోని మాటను వ్యక్తపరచడం కూడా అంతే ముఖ్యం.
అష్టావక్ర గీతలోని ఆత్మజ్ఞాన భావనలను అర్థం చేసుకుంటూ, మన జీవితం గురించి మనమే ప్రశ్నించుకుందాం.
🔔 ఈ వీడియో మీకు నచ్చితే:
👍 వీడియోను లైక్ చేయండి.
📲 ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్న మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి.
🙏 ఇలాంటి ఆధ్యాత్మిక, తాత్విక వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.
💬 మౌనం గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్‌లో తెలియజేయండి.
మీ జీవితంలో శాంతి, అవగాహన, ఆత్మపరిశీలన పెంపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
Transcript:
(00:00) ముని అష్టావక్రుడు జనక రాజుతో ఇలా అంటారు ఓ జనక ఆత్మ తప్ప ఇక్కడ ఇంకేమీ లేదు జ్ఞాత లేడు జ్ఞేయము లేదు ఆత్మను నిజమైన అర్థంలో తెలుసుకున్నప్పుడు జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అనే ఈ మూడు కేవలం కల్పనలే అని తెలుస్తుంది. ఆత్మ మాత్రమే మిగులుతుంది. ఇందులో సాధకుడు ద్వైతాన్ని కోల్పోతాడు. ఇక వేరేదీ లేదు ప్రయోజనం లేదు ఏ అభ్యాసము మిగలదు.
(00:39) సాధకుడు జీవితం సహజంగా శాంతంగా స్వతంత్రం అవుతుంది. ఇదే అద్వైతపు పరమావస్థ. ఇక్కడ ఎలాంటి బంధనాలు మిగలవు. అన్ని సంబంధాలు, కర్తృత్వ భావం, కోరికలన్నీ ముగిసిపోతాయి. ఆత్మబోధలో మనస్సు తలపులు ఇంద్రియాలు సమస్తం దానిలోనే లీనమైపోతాయి. ఇక భయం ఉండదు మోహం ఉండదు ఏ సాధన కాంక్ష ఉండదు. ఈ స్థితి ఏ తపస్సు వల్లనో రాదు. సచేతన అంతర్దృష్టితో వస్తుంది.
(01:14) ఇదే సత్యానుభవం జనక. స్వస్థితిలో నిలవడమే మోక్షం అంటారు అష్టావక్రుడు జనక. ఎటూ వెళ్లొద్దు మోక్షం గమ్యం కాదు ఇది స్వస్వరూపంలో విశ్రాంతి స్థితి సాధకుడు తనే పూర్ణుడని గ్రహించినప్పుడు అతనికి ఏ తీర్థయాత్ర ఏ సాధన లేదా ఏ సిద్ధిపై కోరిక ఉండదు. అంతరంగ శాంతిలో లేనమవుతాడు. ఆత్మస్థితి పొందడమే ఆధ్యాత్మిక ప్రయాణ లక్ష్యం.
(01:48) దీనికి బాహ్య సాధన అక్కర్లేదు కేవలం అంతర్దృష్టి చాలు నేనేమీ చేయట్లేదని అంతా ప్రకృతే చేస్తోందని తెలుసుకోవడమే ఆత్మలో స్థిరపడడం అంటే ఇదే ఈ స్థితిలో సాధకుడు బయట అలజడులకు దూరంగా ఉంటాడు. లోకంలో ఉంటూనే దానికి అతీతంగా ఉంటాడు. ఇదే జీవన్ముక్త స్థితి జనక. జనక జరుగుతున్నదంతా ఆత్మ కాదు కేవలం దృశ్యం ప్రతి అనుభవం సంఘటన ఆలోచన జనక కేవలం దృశ్యాలు ఆత్మ కాదు ఆత్మ సాక్షి అందులో ఏదీ తగ్గదు మారదు ఇది గ్రహించి సాధకుడు ఇది గ్రహించి సాధకుడు ప్రతి అనుభవాన్ని
(02:35) కేవలం ఒక సాక్షిగా చూడటం నేర్చుకుంటాడు. మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు అందులోని పాత్రల కష్టాలను చూసి చలించిపోయినా ఆ బాధ మనది కాదని మనకు స్పష్టంగా తెలిసినట్లే తన నిజ జీవితంలో జరిగే సంఘటనలను కూడా అతను ఒక ప్రేక్షకుడిలా గమనిస్తాడు. ఇక తను దుఃఖం కాదంటాడు. ఇక తను దుఃఖం కాదంటాడు. సుఖంలో మునిగిపోడు.
(03:06) ఈ దృష్టితో తను ప్రశాంతంగా ఉంటాడు. అనుభవాలు వస్తాయి పోతాయి కానీ ఆత్మ స్థిరంగా ఉంటుంది. ఇదే వైరాగ్య మూలం జనక ఆత్మను తెలుసుకున్నాక సాధకుడిని బంధించగలిగేది ఏదీ మిగలదు అతను అంతా చూస్తాడు తెలుసుకుంటాడు కానీ ఎక్కడా బంధింపబడడు దేహం, మనసు, బుద్ధి అన్ని మారేవే సాక్షి మాత్రమే స్థిరమైనది. తనువు, మనసు, బుద్ధి ఇవి మూడు మారుతూనే ఉంటాయి.
(03:41) వీటికి స్థిర రూపం లేదు నేడున్న శరీరం అది రేపు ఉండదు ఇప్పుడే ఉన్న ఆలోచన మరుక్షణంలో పోతుంది. కానీ వీటిని చూసేవాడు అచలంగా ఉంటాడు అదే ఆత్మడు అదే ఆత్మ. ఈ సాక్షి స్థిరతనిస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత ఏ బాహ్య మార్పు కూడా సాధకుడిని చలింపచేయలేదు. శరీర మరణం కూడా అతన్ని భయపెట్టదు ఎందుకంటే ఆత్మ చనిపోదని అతనికి తెలుసు బుద్ధి చిక్కులు కూడా అతన్ని ఇబ్బంది పెట్టవు ఎందుకంటే అతను దాని నుండి వేరయ్యాడు ఇదే స్వేచ్ఛ యొక్క మూలం జనక
(04:27) జనక మనసు మౌనంలోనే ఆత్మ స్వరూపం తెలుస్తుంది. మనసు తన అన్ని గతులను ఆపేసి ఆలోచించకుండా ఊహించకుండా ఉన్నప్పుడు ఆత్మ స్వయంగా వెల్లడవుతుంది. ఈ ఈ మౌనం కళ్ళు మూసుకుని మనసును బలవంతంగా అణచివేయడం వల్ల తెచ్చుకునేది కాదు ఎందుకంటే ఆలోచనలతో ఎంత పోరాడితే అవి అంతగా బలపడతాయని సాధకుడికి తెలుసు. ఇది కేవలం ఎరుకతో తనను తాను లోతుగా గమనించడం వల్ల సహజంగా కలిగేది.
(05:06) సాధకుడికి తెలుసు అవగాహనతో కలిగేది. సాధకుడికి తెలుసు మనసులోని ప్రతి మాట తనని ఆత్మకు దూరం చేస్తుందని అందుకే సహజ మౌనంలో ఉంటాడు. ఆ మౌనంలో ఏ శబ్దము ఏ పేరు ఉండవు. కేవలం ఉనికే ఉంటుంది. ఇదే ఆత్మదర్శనం ఇదే నిజమైన ధ్యానం జనక ఇందులో సాధకుడు బయటికి మామూలుగా కనిపిస్తాడు కానీ లోపల అతను అంతులేని ఆనందంలో ఉంటాడు. ఎలాంటి కోరిక లేనప్పుడు అప్పుడే నిజమైన విశ్రాంతి లభిస్తుంది.
(05:50) కోరికలే సంసారానికి మూలబంధం మనసు ఏదైనా పొందాలనుకున్నంతవరకు అది అస్థిరంగానే ఉంటుంది. కానీ అష్టావక్కుడు చెప్పినట్టు మనసు ఏ కోరిక లేకుండా స్థిరపడగానే అది విశ్రాంతిని అనుభవిస్తుంది. ఈ విశ్రాంతే ముక్తి ఇది కేవలం త్యాగంతో కాదు పూర్ణ జ్ఞానంతో వస్తుంది. బయట వస్తువులు వ్యక్తులు లేదా విజయాలు ఏవి తనకు శాశాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేవని సాధకుడికి తెలిసినప్పుడు అప్పుడు కోరిక సహజంగానే నశిస్తుంది.
(06:23) దీని అర్థం అతను జీవితాన్ని వదిలేస్తాడని కాదు కానీ ఆ వస్తువులపై ఆధారపడే తత్వాన్ని ఆరాటాన్ని వదిలేస్తాడు. అప్పుడు అతడు పరిపూర్ణమైన అంతరంగ శాంతిలో మునిగిపోతాడు. తెలిసినప్పుడు అప్పుడు కోరిక నశిస్తుంది. అప్పుడు అతడు అంతరంగ శాంతిలో మునిగిపోతాడు. ఇదే సంతోషం ఇదే సమాధి ఈ స్థితిలో ఇక ఏ ప్రయత్నము మిగలదు సహజ ఉనికే ఉంటుంది.
(06:56) ఈ సంసార గతి అంతా భ్రమ అని అష్టావక్రుడు అంటారు. ఆత్మ అనేది అచంచలమైనది. జగత్తు చలన ప్రతీక. కానీ అది మనోకల్పన మాత్రమే. ఆత్మను తెలుసుకున్న వ్యక్తికి కదలిక దృశ్య జగత్తులోనే ఉందని తెలుసు. అది నిజానికి అస్తిత్వమే లేనిది. ఆత్మ ఎక్కడికి రాదు పోదు. ఈ ఎరుక సాధకుడిని చంచలత్వం నుండి బయటకి తెస్తుంది. ఇక అతను కదలికలో ఉన్న లోపల స్థిరంగా ఉంటాడు. సముద్రం లోతుల్లో అలలు ఎలాగైతే ఉండవో అలాగే ఆత్మ లోతుల్లో కూడా ఏ అలజడి ఉండదు.
(07:33) ఈ స్థిరత్వం అతనికి సంసారం మధ్యలో పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. పేరు రూపం క్రియలు ఇది ఆత్మ కాదు ఇది నేను ఇది నాది అని మనం అనేదంతా కూడా పేరు రూపాలతో ముడిపడి ఉంటుంది. కానీ ఆత్మ పేరు కాదు రూపము కాదు. ఏ క్రియా కాదని అష్టావక్రులు అంటారు. అదొట్టి అస్తిత్వం శుద్ధం నిర్వికల్పం ఆకాశం అంతటా ఒకేలా ఉన్నట్టే ఆత్మ కూడా సర్వప్రాణుల్లో సమానంగా ఉంటుంది.
(08:09) ఇది తెలిసి సాధకుడు సమతను పాటిస్తాడు. ఇక అతను ఎవరిపైనా ఈర్ష పడడు ఎవరిని తక్కువగా చూడడు. అతను అందరిలోనూ అతను అందరిలోనూ తనలో ఉన్న అదే చైతన్యాన్ని చూసినప్పుడు ప్రేమ సహజమైపోతుంది. తన కుడి చెయ్యి ఎడమ చేతికి సాయం చేసినప్పుడు అందులో ఎలాంటి అహంకారం ఉండదో ఎదుటి వారికి సాయం చేసేటప్పుడు కూడా అతనికి అది తన బాధ్యతగా అనిపిస్తుంది.
(08:37) ఇది కేవలం భావోద్వేగం కాదు ఆలోచన కూడా కాదు. ఇది కేవలం భావోద్వేగం కాదు ఆలోచన కూడా కాదు ఇది నిజమైన అనుభవం అద్వైతానికి పరాకాష్ట ఇదే దీని నుంచే కరుణ అహింస నిజమైన సేవాభావం పుడతాయి. ఇక సాధకుడికి అన్ని తానైపోతాడు. ఇదే బ్రహ్మ దృష్టి సమస్తం బ్రహ్మమే కదా ఆత్మ సదా ముక్తం బంధం అనేది కేవలం మన నమ్మకం కలిగించే బ్రమ ఆత్మ బంధింపబడదు. అది ఎప్పుడూ ముక్తంగానే ఉంది.
(09:15) బంధం కేవలం మనసు ఆరోపణే. నేను దుఃఖితుడిని చిక్కుకుపోయాను అని మనసు అన్నప్పుడే బంధం ఏర్పడుతుంది. కానీ నేను సాక్షిని కర్తను కాను భోక్తను కాను అని తెలిసిన వెంటనే ఆ బంధనాలన్నీ మాయమైపోతాయి. ఈ ఎరుక సాధకుడికి సహజ ముక్తిని ఇస్తుంది. ఇక బంధాన్ని తెంచే ప్రయత్నం చేయడు. తెంచడానికి ఏమీ లేదని అర్థమైంది కాబట్టి తప్పుడు భావనను తొలగిస్తే చాలు ఎలాంటి పోరాటం లేకుండానే ముక్తిని ఇచ్చే జ్ఞాన శక్తి ఇదే ప్రయత్నం లేని ముక్తే అష్టావక్రుని మార్గం సాక్షి భావంతో జీవించేవాడేనని అష్టావక్రుడు అంటారు నిజమైన జ్ఞాని అయ్యేది.
(10:02) ఎవరైతే ప్రతి పరిస్థితిలో చూస్తున్నాననే ఈ స్థితిలో ఉంటారో ఆయనే నిజమైన జ్ఞాని. ఆయన ఘటనలో భాగం కారు కేవలం సాక్షిగా ఉంటారు. సుఖం వస్తుంది చూస్తుంటారు దుఃఖం వస్తుంది చూస్తుంటారు. ఇదే సాక్షి భావం ఉదాసీనత కాదు విక్షేపము కాదు పూర్తి జాగరూకత. మనసు ఏ భావననైనా సరే నాది అనుకోనప్పుడు అది సహజంగానే విముక్తమవుతుంది. సాధనతో కాదు జ్ఞానంతో వస్తుంది.
(10:39) ఈ జ్ఞానమే మోక్షం. సాక్షి భావమే సాధనకు శిఖరం. ఇదే ఆత్మ యొక్క జీవనం. కర్మల గురించి చెప్పాలంటే ఆత్మ కర్మలతో బంధించబడదు. అది నిరంతరం స్వతంత్రంగా ఉంటుంది. కర్మలు కేవలం దేహం మనసు వరకే. ఆత్మ వీటికి అతీతం. ఆత్మ కర్తా కాదు భోక్తా కాదు. ఇది తెలిస్తేనే సాధకుడికి నిజమైన ముక్తి దక్కుతుంది. అప్పుడు అతను పుణ్య పాప కర్మలకు భయపడడు. వాటిలో ఇరుక్కోడు.
(11:15) కర్తృత్వ భ్రాంతిని వదిలేస్తాడు. అంటే నేనే ఈ పని చేస్తున్నాను నా వల్లే ఇదంతా జరుగుతోంది అనే అహంకారాన్ని పూర్తిగా పక్కన పెడతాడు. ఇప్పుడు అతను కేవలం సాక్షి దేహం తన పని తాను చేస్తుంది మనసు తలుస్తుంది కేవలం సాక్షి దేహం చేస్తుంది మనసు తలుస్తుంది. ప్రకృతి పని చేస్తుంది. నేను కేవలం చూస్తున్నాను. ఈ స్థితి ఎంతో లోతును తెస్తుంది.
(11:47) ఇప్పుడు అతను కర్త కాదు స్వరూపంలో ఉంటాడు. భావాల ఉదయ విలయాలు ఆత్మను తాకలేవు భావాలు వస్తాయి పోతాయి. ఆయి ఆకాశంలో మేఘాలు వచ్చి వెళ్ళిపోయినట్టు కానాని ఆకాశం అలాగే ఉంటుంది. ఆత్మ కూడా అలాగే ఆలోచనలకు అంటకుండా ఉంటుంది. ఇది తెలుసుకున్న సాధకుడు ఆలోచనలతో పోరాడడు వాటిని అణచడు చూస్తాడు అంతే ఈ చూపే పరిష్కారం ఆ చూడటం మరింత లోతయ్యే కొద్దీ ఆలోచనలు వాటంతటా అవే ఆగిపోతాయి.
(12:24) వాటిని పట్టే నేను ఉండదు కాబట్టి ఈ స్థితియే నిర్వికల్ప సమాధి వైపు నడిపిస్తుంది. పట్టుదల లేని చోటికి. కేవలం మౌనమే మిగులుతుంది ఆత్మ. అది ఎప్పుడూ పుట్టదు చావదు. ఆత్మ అజన్మ. శరీర జనన మరణాలు ఆత్మను ప్రభావితం చేయవు. వస్త్రాలు పాతబడితే కొత్తవి ఎలా ధరిస్తామో అలాగే ఆత్మ శరీరాన్ని మారుస్తుంది. కానీ తాను ఎప్పుడూ మార్పు లేకుండా ఉంటుంది.
(12:57) సాధకుడు ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మరణ భయం పూర్తిగా పోతుంది. ఇక జీవితాన్ని అతను సహజంగా స్వీకరిస్తాడు. జన్మ గర్వం ఉండదు. మృత్యు చింత ఉండదు. ఈ సమత్వమే జీవితాన్ని దివ్యం చేస్తుంది. ఇదే నిర్వికల్ప శాంతి తెలుసుకోవలసింది ఏమీ లేనప్పుడు అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. సాధారణ జ్ఞానంలో వస్తువుని తెలుసుకుంటాం. కానీ ఆత్మజ్ఞానంలో జ్ఞానం అంతా రాలిపోతుంది అప్పుడు జ్ఞాత జ్ఞేయం జ్ఞానం ఈ మూడు కూడా అదృశ్యమైపోతాయి కేవలం ఉనికి మిగులుతుంది.
(13:40) ఇదే శుద్ధ చైతన్యం ఈ బోధ ఏ తర్కంతో రాదు మనలోకి మనం చేరితేనే వస్తుంది. సాధకుడు అన్నింటిని తెలుసుకొని అలసిపోయి తన ఉనికిని తన అహంకారాన్ని మర్చిపోతాడో అప్పుడే ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఇదే చివరకు మౌనం బ్రహ్మ స్వరూప స్థితి. చూడండి ఆత్మలో ఏ గుణము ఉండదు. ఆత్మకు గుణాలు ఉండవు. జ్ఞానం ప్రేమ ధైర్యం దయ లాంటి గుణాలన్నీ ఇవి ఆత్మ వ్యక్తీకరణలు కావచ్చు కానీ ఆత్మ స్వయంగా గుణ రహితం ఇది తెలిసాక సాధకుడు గుణాలకు అంటుకోడు వాటిని దాటి వెళ్తాడు. ఆత్మ శుభము కాదు అశుభము
(14:28) కాదని తెలుసుకుంటాడు. అది కేవలం అంతే ఇది సాధకుడిని నిష్పక్షపాతం చేస్తుంది. ఇక తన గుణాలతో తనను గొప్పగా అనుకోడు ఇతరుల లోపాలను బట్టి తక్కువ చేయడు ఈ నిర్వికార స్థితే ఆత్మ స్వరూపం ఏదైతే చూడబడుతుందో అది ఆత్మ కాజాలదు ఏదైతే చూడబడుతుందో అది ఎన్నటికీ చూసేది కాలేదు. శరీరాన్ని మనం చూడగలం మనసుని ఆలోచనల్ని కాబట్టి ఇవన్నీ ఆత్మ కాలేవు.
(15:05) ఆత్మ అంటే చూసేటటువంటిది కానీ దాన్ని స్వయంగా చూడలేం. ఈ సూత్రం సాధకుడిని పదే పదే అంతర్ముఖుడిని చేస్తుంది. ఏదైనా అనుభవమైనప్పుడల్లా ఎవరు చూస్తున్నారు? అని అడుగుతాడు. ఇక చివరకు ఆత్మ అనే ఆ మౌన నిర్లిప్త సాక్షిని చేరుతాడు. ఓ జనక ఆత్మ బంధం పెట్టుకోదు, తెంచుకోదు. అది కేవలం సాక్షి ఆత్మ తల్లి తండ్రి కొడుకు అని మనం అనుకుంటాం కానీ ఆత్మకి దేనితోనూ సంబంధం లేదంటారు అష్టావక్ర అన్నిటికీ అది కేవలం సాక్షి అంతే ఇది తెలిసి సాధకుడు ఇది తెలిసిన సాధకుడికి బాహ్య బంధాలపై ఒక సహజమైన విరక్తి
(15:51) వస్తుంది. కానీ దాని అర్థం తన కుటుంబ బాధ్యతల నుండి పలాయనం చిత్తగించడం కాదు. ఇప్పుడు తను అందరినీ మరింత స్వచ్ఛంగా ప్రేమిస్తాడు సేవిస్తాడు. కానీ వారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిరీక్షణ లేకుండా చేస్తాడు. పలాయనం కాదు ఇప్పుడు తను ప్రేమిస్తాడు సేవిస్తాడు కానీ నిరీక్షణ లేకుండా ఈ నిష్కామ భావమే ఆత్మకి దగ్గర చేస్తుంది.
(16:23) సంబంధాలు ఉంటాయి కానీ బంధనం ఉండదు. అష్టావక్ర ఈ అధ్యాయంలో మరింత లోతుకెళ్తారు. ఆత్మ ఏ ఉద్దేశ్యానికి లోబడి ఉండదని ముందు చెప్తారు. ఏ దిశలోనూ కదలడం లేదు ఆత్మ ఏ లక్ష్యాన్ని సాధించడానికి వెళ్లడం లేదు. ఏ గమ్యం వైపు కూడా సాగడం లేదు. అది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. పూర్ణమైనది పరిపూర్ణ తృప్తి కలది. ఏదైతే పొందాలనుకుంటున్నామో అది కేవలం మనసు ఆకలి మాత్రమే.
(16:55) ఆత్మకు అసంపూర్ణమైనది ఏదీ లేదు. ఇది తెలుసుకున్న సాధకుడు ఏ ఫలితాన్ని ఆశించి సాధన చేయడు. సహజంగానే తన నిజ స్వరూపంలో స్థిరపడతాడు. సముద్రం అలల వల్ల ఎలాగైతే చలించదో అలా అలాగే ఆత్మ ప్రతి ఒడిదుడుకులకి మారకుండా అలాగే ఉంటుంది. దీంతో లోలోపల ఒక ఇక సాధకుడికి జీవితం ఆటవుతుంది. నాటకమే గాని పోరాటం కాదు. చివరికి ఇది అతన్ని సహజ ముక్తి వైపు తీసుకెళ్తుంది.
(17:31) జనక ఈ చైతన్యపు ఆటే సంసారం ఆత్మ దానికి అంటదు. లోకంలోని అన్ని పనులు చైతన్య లీలలే మనస్సు బుద్ధి అహంకారం ఇంద్రియాలు ఇవన్నీ కేవలం శక్తి తరంగాలే కానీ ఆత్మ వీటికి అతీతం అది స్వయం ప్రకాశం లీలల్లో పాత్రవి కాదన్న ఎరుకలో సాధకుడు స్థిరంగా ఉండాలి. లీలల సాక్షివి. ఎలాగంటే ఒకరు కలకంటారు కానీ అది కల అని వాళ్ళకు తెలుసు అలాగే ఈ ప్రపంచ అనుభవం కూడా ఈ దృక్పథం సాధకుడిని లోపల నుంచి నిర్లిప్తం చేస్తుంది. అయినా
(18:16) మెలుకువగా ప్రేమతో ఉంచుతుంది. ఇక జీవితాన్ని సీరియస్ గా కాక పూర్తి ఉనికితో గడుపుతాడు. ఆత్మ అనుభవం బుద్ధికి మాటలకి అతీతం బుద్ధి ఒక హద్దు వరకే దారి చూపగలదు ఆత్మ సాక్షాత్కారం మాత్రం దాని పరిధికి మించినది ఈ అనుభవం శబ్దాతీతం ఆలోచనకు అతీతం సాధకుడు తెలుసుకోవాలనే తాపత్రయాన్ని విడిచి లేనమై పోయినప్పుడు అప్పుడే ఆత్మబోధ కలుగుతుంది.
(18:51) ఇది మౌనం నుంచే పుడుతుంది. ప్రయత్నంతో కాదు కాబట్టి అష్టావక్ర మార్గం కర్మ భక్తులతో కాక జ్ఞానం వైరాగ్యంతోనే సుగమం అవుతుంది. ప్రశ్నలు ఆగిపోతే అక్కడే జవాబు కనిపిస్తుంది. ఆ జవాబు సరైనది కాదు కేవలం ఉనికి యొక్క అనుభూతి ఎంత ఎక్కువ సమయం శ్రమ ఉంటే అంత ఎక్కువ దూరం ఆత్మ శ్రమతో కాదు ఎరుకతో లభిస్తుంది. ఇది ఎక్కడి నుంచో తెచ్చే వస్తువు కాదు ఆత్మ నీలోనే ఉన్న లోతు గుర్తించాల్సింది అంతే కన్ను తనని తాను చూసుకోలేనట్టుగా కానీ అద్దం దొరికిన వెంటనే దర్శనం అవుతుంది. అలాగే దృష్టా
(19:39) దృశ్యాల భేదాన్ని గ్రహించిన వెంటనే ఆత్మ ప్రత్యక్షమవుతుంది. అతి ప్రయత్నం మనసు అలజడిని పెంచుతుంది అంతే కానీ లోతైన జ్ఞానం [గొంతు సవరించుకోవడం] దాన్ని ఆపుతుంది. మనసు శాంతించిన చోటే ఆత్మ ప్రకాశం ఆత్మ నెరిగినవాడు బతుకులో సహజమైపోతాడు. ఎలాంటి కృత్రిమత్వం ఉండదు. ఆత్మను తెలిసినవాడు ఎలాంటి మతపరమైన ముసుగు వేసుకోడని అష్టావక్ర చెప్తారు.
(20:12) ఎవరికీ ఏదీ నిరూపించడు. సహజం సరళం మౌనం ప్రామాణికంగా ఉంటాడు. లోపల ఎలానో బయట అంతే మాటల్లో తీపి కాదు నిజం ఉంటుంది. తన సమక్షంలో శాంతి కలుగుతుంది. ఏ మతం, భావజాలం, సంస్థతో బంధించబడడు. అతనికి ఎలాంటి చిహ్నం ఉండదు. తను ఎలాంటి దావాలు చేయడు. అతను కేవలం ఉంటాడు అంతే. ఇదే ఆత్మ ప్రకాశం ఇందులో మెరుపులు ప్రదర్శనలు ఉండవు. ఇదే సమక్షం ఇతరులను కూడా ఆత్మ వైపు ఆకర్షిస్తుంది.
(20:50) అష్టావక్ర మహర్షి పలికిన ఈ అద్భుతమైన అమృత వాక్కులు మనల్ని ఒక అగాధమైన మౌనంలోకి నిశశబ్దమైన ఆత్మ స్థితిలోకి తీసుకెళ్తాయి. ఈ కథనం పూర్తయ్యేసరికి మీ మనసులో ఏ ఆలోచనలు లేని ఏ కోరిక లేని ఒక ప్రశాంతమైన శూన్యం ఆవరించి ఉన్నట్లయితే గుర్తుంచుకోండి అదే మీ నిజమైన ఆత్మ స్వరూపం మన దైనందిన జీవిత ప్రయాణంలో మనం ఎన్నెన్నో బంధాలను బాధలను అంతులేని బాధ్యతలను మన భుజాలపై వేసుకుని ఏదో సాధించాలనే తపనతో నిరంతరం పరిగెడుతూ ఉంటాం బయట ఎక్కడో సుఖం దొరుకుతుందని ఎవరి
(21:35) ప్రేమలోనో ఏ వస్తువులోనో శాంతి లభిస్తుందని ఎండమావుల వెంట పరుగెత్తే జింకల్ల మనం అలసిపోతుంటాం. కానీ జనక మహారాజుకు అష్టావక్రుడు బోధించిన మహా సత్యం ఒక్కటే నీవు వెతుకుతున్నదంతా నీలోనే ఉంది. నీవే ఆ అనంతమైన శాంతివి నీవే ఆ స్వచ్ఛమైన చైతన్యానివి. ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగమని అందులో జరిగే ప్రతి సంఘటన ఆకాశంలో వస్తూ పోయే మేఘం లాంటిదని గ్రహించిన నాడు మనసులో పేరుకుపోయిన భారమంతా ఇట్టే కరిగిపోతుంది.
(22:15) ఆనందం కోసం గుర్తింపు కోసం ఇతరులను ఆమోదం కోసం మనం చేసే ఆరాటాలన్నీ కేవలం మన భ్రమ వల్ల పుట్టినవే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి పరిస్థితిలోనూ కన్నీళ్లు తెప్పించే దుఃఖంలోనూ ఉప్పొంగే సుఖంలోనూ అహంకారాన్ని పెంచే విజయంలోనూ క్రుంగదీసే అపజయంలోనూ వీటన్నింటికీ అతీతంగా కేవలం ఒక సాక్షిగా మిగిలిపోవటమే మనిషిగా మనం నేర్చుకోవలసిన అత్యున్నత పాఠం నది ఎంత ఉరకలేస్తూ ప్రవహించినా సముద్రం తన అట్టడుగు లోతుల్లో ఎలాగైతే నిశ్చలంగా గంభీర థిరంగా ఉంటుందో అలాగే బయటి ప్రపంచంలో ఎన్ని అలజడులు ఎన్ని
(23:02) తుఫానులు చెలరేగినా మన లోపలి ఆత్మ ఎప్పటికీ చలించదు ఏ కర్మకి అంటదు ఆ చలించని తత్వాన్నే మోక్షం అంటారు. మోక్షం అంటే మరణం తర్వాత ఎక్కడికో వెళ్లి సాధించేది కాదు బతికుండగానే ఈ క్షణంలో ఇక్కడే మన అసలైన స్వరూపంలో మనం సంపూర్ణంగా విశ్రమించడం తెలుసుకోవలసినది ఏమీ లేనప్పుడు పొందవలసినది ఏది లేనప్పుడు మిగిలే ఆ పరిపూర్ణమైన తృప్తిని ఆస్వాదించడం ఈ మహా జ్ఞానాన్ని విన్న తర్వాత ఇకపై మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ప్రతి వ్యక్తి వ్యక్తిని కొత్త కోణంలో చూడడం మొదలు పెట్టండి. కష్టాలు మిమ్మల్ని
(23:48) చుట్టుముట్టినప్పుడు నేను కష్టాలు మిమ్మల్ని నాలుగు వైపుల నుండి చుట్టుముట్టినప్పుడు సమస్యలన్నీ మీపైనే పడుతున్నాయని భావించి నేను దుఃఖితుడిని అని కుంగిపోకండి. దానికి బదులుగా ఈ దుఃఖాన్ని ఈ శరీరాన్ని ఈ మనసును కేవలం ఒక ప్రేక్షకుడిలా చూస్తున్న సాక్షిని నేను అని ప్రతిక్షణం మీకు మీరు గుర్తు చేసుకోండి.
(24:17) అలా చూసిన మరుక్షణం ఆ సమస్య తాలూకు భారం మీ మనసు మీద నుంచి మాయం అవ్వడం మీరే స్వయంగా గమనిస్తారు. ఈ శరీరాన్ని ఈ మనసును చూస్తున్న సాక్షిని నేను అని ప్రతిక్షణం మీకు మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు మీలోని మృత్యుభయాలు మాయమైపోతాయి. అహాలు రాలిపోతాయి. ఎవరిపై ఎవరిపైనా ద్వేషం ఉండదు దేనిపైన పనికిరాని మోహం మిగలదు. సమస్తం బ్రహ్మమయంగా అందరిలోనూ ఒకే ఆత్మతత్వం ఉన్నదన్న ఎరుకతో మీ బతుకు ప్రేమమయంగా మారుతుంది.
(24:56) ఇక మీకు ఏ ముసుగులు అవసరం లేదు. ఎలాంటి కపట ప్రదర్శనలు అవసరం లేదు. దేనికోసమో ఆరాటపడకుండా ఉన్నదాంట్లోనే ఒక అద్భుతమైన ఉనికిగా అత్యంత సహజమైన స్వచ్ఛమైన జీవితాన్ని మీరు జీవిస్తారు. ఇక్కడిదాకా ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు అడుగులు వేసిన మీ అందరిలో నివసిస్తున్న ఆ ఆత్మ చైతన్యానికి, ఆ పరమాత్మ స్వరూపానికి, నా హృదయపూర్వక నమస్కారాలు.
(25:31) అష్టావక్రగీతలోని ఈ సారాంశం మీ అంతరంగంలో ఒక అఖండ జ్ఞాన జ్యోతి ల నిరంతరం వెలుగుతూనే ఉండాలని మీ రాబోయే జీవితం సదా ప్రశాంతంగా అచంచలమైన ఆత్మ విశ్వాసంతో ఆనందమయంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నువ్వు.

No comments:
Post a Comment