Elon Musk vs India | The Starlink Controversy Explained! | By Naresh Bukya
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=KFTr-MLKCPs
Title: Elon Musk vs India | The Starlink Controversy Explained! | By Naresh Bukya
Author Name: NB Show Telugu
Description: Elon Musk vs India | The Starlink Controversy Explained! | By Naresh Bukya
#ElonMusk #Starlink #IndiaVsElonMusk #ElonMuskVsAmbani #MukeshAmbani #NarendraModi #StarlinkIndia #SpaceX #JioVsStarlink #IndiaUSRelations #DigitalIndia #NationalSecurity #SatelliteInternet #TechWar #Geopolitics #IndiaNews #TechNews #DataSecurity #NBShowTelugu #TeluguNews
#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #nbshow
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-104104548042000
Insta : / naresh_bukya
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
Elon Musk, Elon Musk India, Elon Musk vs India, Starlink India, Starlink controversy, Elon Musk vs Ambani, Mukesh Ambani, Jio vs Starlink, Starlink satellite internet, SpaceX, Elon Musk latest news, India USA relations, Modi Elon Musk, Starlink national security, India data security, digital sovereignty, techno imperialism, satellite spectrum India, Starlink Ukraine war, India geopolitics, Elon Musk Telugu, Starlink Telugu, Indian telecom industry, NB Show Telugu, Telugu news, geopolitics Telugu
Transcript:
(00:04) ఒకప్పుడు ఏదైనా దేశాన్ని ఆక్రమించుకోవాలంటే పెద్ద పెద్ద సైన్యాలతో వెళ్ళేవాళ్ళు యుద్ధ నౌకలు ఫిరంగిలు తీసుకెళ్లి ఆ దేశం పైన దాడి చేసేవాళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాను ఎలా ఆక్రమించుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు మొదట వ్యాపారం పేరుతో మన దేశంలోకి అడుగు పెట్టారు. తక్కువ ధరలకు వస్తువులు అమ్ముతాం.
(00:24) మీ దేశాన్ని డెవలప్ చేస్తామంటూ వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లమెల్లగా మన దేశంలో ఉన్న రాజుల మధ్య గొడవలు ఉపయోగించుకొని చివరికి మన దేశం మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తీసుకుంది. ఇప్పుడు నేను ఈ హిస్టరీ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మళ్ళీ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
(00:44) కాకపోతే ఇప్పుడు ఒక దేశాన్ని కంట్రోల్ చేయడానికి సైన్యాన్ని పంపించాల్సిన అవసరం లేదు. సాటిలైట్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా డేటా నెట్వర్క్స్ ని ఉపయోగించి కూడా ఒక దేశంపై చాలా పెద్ద ప్రభావం చూపించవచ్చు. నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థం కావాలంటే రీసెంట్ గా ఇలాన్ మాస్క్ చేసిన ఒక ట్వీట్ గురించి తెలుసుకోవాలి. తన స్టార్లింగ్ కంపెనీని ఇండియాలో ఆపరేట్ చేయకుండా కొంతమంది పెద్ద బిజినెస్ మెన్లు అడ్డుకుంటున్నారని ఇలాన్ మాస్క్ ఆరోపించారు.
(01:12) తమకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారని స్టార్లింగ్ వస్తే తమ టెలికాం బిజినెస్ కి పోటీ పెరుగుతుందనే భయంతో ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీన్ని భారత ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరంగా కూడా ఆయన అభివర్ణించారు. ఇప్పుడు ఈ విషయం వింటే ఇలాన్ మాస్ మన దేశానికి మంచి చేయాలని చూస్తున్నాడు.
(01:32) గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకు తక్కువ ధరలో హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ మన దేశంలో ఉన్న పెద్ద బిజినెస్ మన్లు ఆయన్ని అడ్డుకుంటున్నారు అనిపిస్తుంది కదు కానీ కాదు ఇక్కడ ఇలాన్ మాస్క్ అతి పెద్ద గేమ్ ఆడుతున్నాడు. ఇక్కడ అసలు సమస్య కేవలం ఇలాన్ మాస్క్ కి ముకేష్ అంబానికి మధ్య జరుగుతున్న బిజినెస్ పోటీ మాత్రమే కాదు.
(01:52) స్టార్లింక్ జియోఎయిటల్ మధ్య జరుగుతున్న ఇంటర్నెట్ పోటీ కూడా కాదు. మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశం తన ఇంటర్నెట్ వ్యవస్థను కమ్యూనికేషన్ నెట్వర్క్ ని అత్యంత కీలకమైన డేటాను ఒక విదేశీ కంపెనీ చేతిలో పెట్టాల. రేపు ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఆ కంపెనీ ఓనర్ ఇలాన్ మాస్క్ ఒక్క నిర్ణయం తీసుకుంటే మన దేశ కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది.
(02:18) అప్పుడు పరిస్థితి ఏంటి? ఇది నేను ఊరికే మిమ్మల్ని భయపెట్టడానికి అడుగుతున్న ప్రశ్న కాదు. ఇలాంటి పని రష్యా యూక్రైన్ యుద్ధంలో ఇలాన్ మాస్క్ ఆల్రెడీ చేశాడు. రష్యా యూక్రైన్ పైన దాడి చేసినప్పుడు అక్కడ చాలా ప్రాంతాల్లో సెల్ టవర్స్ ఫైబర్ కేబుల్స్ ధ్వంసంయ్యాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీకి పెద్ద సమస్య వచ్చింది. అలాంటి సమయంలో ఇలాన్ మాస్క్ వేల సంఖ్యలో స్టార్లింగ్ టర్మినల్స్ ని అందించి యూక్రైన్ కు సాాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చాడు.
(02:46) దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆయన్ని అభినందించారు. కానీ తర్వాత ఒక సంఘటన జరిగింది. యూక్రైన్ మిలిటరీ రష్యాకు చెందిన బ్లాక్ సీ నేవల్ ఫ్లేట్ మీద డ్రోన్స్ తో దాడి చేయడానికి ప్లాన్ చేసింది. ఈ డ్రోన్స్ ని ఆపరేట్ చేయాలంటే స్టార్లింగ్ కనెక్టివిటీ అవసరం. కానీ ఇలాన్ మాస్క్ ఆ ప్రాంతంలో స్టార్లింగ్ పని చేయకుండా ఆపేశడు.
(03:07) ఇప్పుడు ఒకసారి ఆలోచించండి యూక్రైన్ ఒక స్వతంత్ర దేశం. దానికి సొంత ప్రభుత్వం ఉంది సొంత మిలిటరీ ఉంది. కానీ తన మిలిటరీ ఆపరేషన్ కు అవసరమైన ఇంటర్నెట్ ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఉండడంతో ఆ కంపెనీ నిర్ణయం యుద్ధం పైన ప్రభావం చూపించింది. అంటే ఒక దేశం తన మిలిటరీ ఆపరేషన్స్ కోసం ఒక విదేశీ బిజినెస్ మెన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.
(03:32) మన ఇండియాకు కూడా 1999 కార్గిల్ యుద్ధం సమయంలో జిపిఎస్ కు సంబంధించిన సమస్య ఎదురైంది. ఆ సమయంలో మన శత్రువైన పాకిస్తాన్ మిలిటరీ లొకేషన్ తెలుసుకోవడానికి మనం అమెరికా జిపిఎస్ యక్సెస్ ని అడిగితే అమెరికా మన ముఖం మీద రిజెక్ట్ చేసింది. అందుకే దేశభద్రతకు సంబంధించిన టెక్నాలజీ కోసం పూర్తిగా విదేశీ కంపెనీల మీద ఆధారపడడం చాలా రిస్క్ పైగా ఇలాంటి విషయాల్లో అమెరికాను అమెరికన్ కంపెనీస్ ని నమ్మడం అంతకన్నా పెద్ద రిస్క్.
(04:01) ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే స్టార్లింక్ అనేది కేవలం సాధారణ ఇంటర్నెట్ కంపెనీ మాత్రమే కాదు. దాని మాతృ సంస్థ అయిన స్పేస్ఎక్స్ అమెరికా మిలిటరీ ఇంటెలిజెన్స్ తో కలిసి పనిచేస్తుంది. స్పేస్ఎక్స్ కి స్టార్ షీల్డ్ అనే ప్రాజెక్ట్ ఉంది. దీని ద్వారా అమెరికా మిలిటరీకి అవసరమైన సాటిలైట్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఒకే కంపెనీ సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ అందిస్తుంది.
(04:22) అదే సమయంలో మిలిటరీ అవసరాల కోసం టెక్నాలజీ తయారు చేస్తుంది. ఇలాంటి కంపెనీ మన దేశంలో ఆపరేట్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా కాశ్మీర్ నార్త్ ఈస్ట్ లాంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో ఆ టెక్నాలజీని ఎవరు ఉపయోగిస్తున్నారు డేటా ఎక్కడికి వెళ్తుంది అనే విషయాల్లో మన దేశానికి పూర్తి కంట్రోల్ ఉండాలి. ఇక్కడే టెక్నో ఇంపీరియలిజం అనే కాన్సెప్ట్ వస్తుంది.
(04:44) సింపుల్ గా చెప్పాలంటే టెక్నాలజీని ఉపయోగించి మరో దేశం పైన ఆధిపత్యం సాధించడం. ఒకప్పుడు సముద్ర మార్గాల్ని కంట్రోల్ చేసిన దేశాలు ప్రపంచ వ్యాపారాన్ని కంట్రోల్ చేశాయి. ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్స్ డేటా నెట్వర్క్ సాటిలైట్ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ మీద కంట్రోల్ ఉన్న కంపెనీలకు కూడా అంత పెద్ద పవర్ ఉంటుంది.
(05:04) ఇప్పుడు ఇలాన్ మాస్క్ ని తీసుకోండి ఆయనకుఎక్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఉంది. స్టార్లింగ్ ద్వారా సాటిలైట్ ఇంటర్నెట్ అందించే సామర్థ్యం ఉంది. ఇలా అనేక ముఖ్యమైన రంగాల్లో ఒకే బిజినెస్ గ్రూప్ యొక్క కంట్రోల్ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రభుత్వ నిర్ణయాల మీద ఒత్తిడి తీసుకురాగల సామర్థ్యం కూడా పెరుగుతుంది.
(05:25) ఉదాహరణకి స్టార్లింగ్ కి పర్మిషన్ ఇవ్వకపోతే టెస్లా ఇన్వెస్ట్మెంట్ ని ఇండియాలోకి తీసుకురాము అని చెప్పవచ్చు. అలాగే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ అసలు లక్ష్యం కేవలం ఇంటర్నెట్ అమ్మడం మాత్రమే కాకుండా తనకు అనుకూలంగా ప్రభుత్వ రూల్స్ ని మార్చుకోవడం కూడా కావచ్చు.
(05:45) దీన్నే రెగ్యులేటరీ ఆర్బిట్రేజ్ అంటారు. ఇక ఇప్పుడు స్టార్లింగ్ లాంటి కంపెనీల విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు కఠినమైన రూల్స్ పెడుతుందో చూద్దాం. దీనికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి నేషనల్ సెక్యూరిటీ, రెండవది సాటిలైట్ స్పెక్ట్రం. ముందుగా నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. కొంతకాలం క్రితం మణిపూర్ లో కొన్ని తిరుగుబాటు గ్రూప్లు స్టార్లింగ్ టర్మినల్స్ ని అక్రమంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
(06:11) ఇలాన్ మాస్క్ ఆరోపణలని రిజెక్ట్ చేశాడు. కానీ ఈ సంఘటనతో సాటిలైట్ ఇంటర్నెట్ కు సంబంధించిన ఒక పెద్ద సెక్యూరిటీ సమస్య చర్చకు వచ్చింది. సాధారణంగా మన మొబైల్ లో ఇంటర్నెట్ ఉపయోగించినప్పుడు మన ఫోన్ సెల్ టవర్ కి కనెక్ట్ అవుతుంది. కానీ స్టార్లింక్ లాంటి సాటిలైట్ ఇంటర్నెట్ లో మన ఇంటి మీద ఉండే డిష్ యాంటెనా నేరుగా ఆకాశంలో ఉన్న సాాటిలైట్ తో కమ్యూనికేట్ చేస్తుంది.
(06:37) దీంతో సెల్ టవర్స్ లేని ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అందించవచ్చు. కానీ అదే టెక్నాలజీని తప్పుగా ఉపయోగిస్తే సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. ఉదాహరణకి కాశ్మీర్ లేదా నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అనుమతి లేని సాటిలైట్ ఇంటర్నెట్ పనిచేస్తే దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతుంది అనే విషయాలు మన గవర్నమెంట్ కి తెలుసుకోవడం కష్టంగా మారుతుంది.
(06:57) కొన్నిసార్లు దేశంలో అల్లర్లు జరిగినప్పుడు హింస మొదలైనప్పుడు ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ ని నిలిపేస్తుంది. కానీ సాటిలైట్ ఇంటర్నెట్ పని చేస్తుంటే సాధారణ మొబైల్ నెట్వర్క్ ఆపినంత మాత్రాన ఆ కనెక్షన్ ఆగదు. అందుకే డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది ఎవరు యక్సెస్ చేయగలరు అనే విషయాల్లో కఠినమైన రూల్స్ తప్పనిసరి. ఇక రెండో సమస్య స్పెక్ట్రం.
(07:20) మన మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ నెట్వర్క్ సిగ్నల్స్ పంపించడానికి కొన్ని రేడియో ఫ్రీక్వెన్సీస్ ని ఉపయోగిస్తాయి. వాటినే స్పెక్ట్రమ్స్ అంటారు. ఇండియాలోజియోఎటల్ లాంటి కంపెనీలు స్పెక్ట్రమ్స్ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. కానీ స్టార్లింక్ ఎటువంటి బిడ్డింగ్ లేకుండా మాకు ఫ్రీగా అడ్మినిస్ట్రేటివ్ అలకేషన్ స్పెక్ట్రం కేటాయించాలని అడుగుతుంది.
(07:40) ఇక్కడే పెద్ద చర్చ మొదలైంది. ఒకవైపు సాధారణ టెలికాం కంపెనీలు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నాయి. మరోవైపు సాటిలైట్ కంపెనీలు వేరే పద్ధతిలో స్పెక్ట్రం పొందాలని కోరుతున్నాయి. దీంతో స్థానిక కంపెనీలకు నష్టం జరుగుతుందా? మార్కెట్లో పోటీ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాదు ఒక పెద్ద విదేశీ కంపెనీ ప్రారంభంలో చాలా తక్కువ ధరలో ఇంటర్నెట్ అందించి స్థానిక కంపెనీల్ని వీక్ చేస్తుంది.
(08:07) భవిష్యత్తులో మార్కెట్ కొద్దిమంది చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ధరలు పెంచినా కూడా వినియోగదారులకు వేరే ఆప్షన్ ఉండదు. అలాంటి వ్యూహాన్ని ప్రిడేటరీ ప్రైసింగ్ అంటారు. ఇప్పటివరకు మనం సాటిలైట్స్ ఇంటర్నెట్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. అదే సోషల్ మీడియా అల్గరిథం. మీరుఇస్గ ఓపెన్ చేసినప్పుడు ఏ రీల్ కనిపించాలి Facebook లో ఏ పోస్ట్లు వైరల్ అవ్వాలి ఎక్స్ లో ఏ వార్త ఎక్కువ మందికి చేరాలి ఇవన్నీ కూడా అల్గరిథం డిసైడ్ చేస్తుంది.
(08:37) అంటే ప్రజలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నారు అనే అంశాలపై సోషల్ మీడియా కంపెనీలకు కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ అమెరికా హౌస్ జుడిషరీ కమిటీకి రాసిన లేఖలో అమెరికా ప్రభుత్వ అధికారులు కొన్ని రకాల కంటెంట్ ని డిలీట్ చేయమని కొన్ని రకాల కంటెంట్ ని రెస్ట్రిక్ట్ చేయమని కేవలం కొన్ని రకాల కంటెంట్ ని ఎక్కువగా పుష్ చేయమని తమపైన ప్రెజర్ చేశారు అని ఒప్పుకున్నాడు.
(09:05) అమెరికాలోనే సోషల్ మీడియా కంపెనీలపై ప్రభుత్వ ఒత్తిడి ఉంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఈ ప్లాట్ఫార్మ్స్ ప్రభావం ఎంత పెద్దదిగా ఉంటుందో ఆలోచించండి. అమెరికా ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ అయినా Facebookఇగ ఎక్స్ YouTube ద్వారా వాళ్ళకు నచ్చిన వీడియోస్ ని వైరల్ చేయగలరు. రేపు మన దేశంలో అల్లలు క్రియేట్ చేయడానికి ప్రభుత్వానికి అగైన్స్ట్ గా మాట్లాడే వీడియోస్ ని ఎక్కువగా బూస్ట్ చేసి మన దేశ ప్రజల్ని సొంత ప్రభుత్వానికి అగైన్స్ట్ గా మార్చగలరు.
(09:37) అంటే ఇంటర్నెట్ నెట్వర్క్ మీద కంట్రోల్ ఒక రకమైన పవర్ అయితే ప్రజలు చూసే సమాచారాన్ని కంట్రోల్ చేయడం కూడా మరో రకమైన పవర్ ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి కోల్డ్ వార్ సమయంలో యూరి అనే ఒక మాజీ కేజీబి ఏజెంట్ ఒక దేశాన్ని లోపల నుంచి ఎలా డెస్ట్రాయ్ చేయాలో ఒక మెథడ్ ని వివరించారు. ఆ మోడల్ లో నాలుగు స్టేజెస్ ఉన్నాయి.
(10:00) మొదటిది డమోరలైజేషన్ అంటే ప్రజలకు తమ దేశం మీద తమ సంస్థల మీద నమ్మకం తగ్గిపోయేలా చేయడం దీనికి 10 నుంచి 15 సంవత్సరాలు పట్టవచ్చని ఆయన వివరించారు. సోషల్ మీడియాలో మతాలు, కులాలు ప్రాంతాల మధ్య గొడవలు పెంచే కంటెంట్ ని ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తే సమాజంలో విభేదాలు పెరుగుతాయి. ఆ సమయంలో తమకు విరుద్ధంగా మాట్లాడే వారి వీడియోస్ ని న్యూస్ ఆర్టికల్స్ ని షాడో బ్యాన్ చేయడం తమ ఆలోచనలకు తమకు సపోర్ట్ చేసే వాళ్ళ వీడియోస్ ని ప్రమోట్ చేయడం ద్వారా ప్రజల ఆలోచనల్ని కంట్రోల్ చేయవచ్చు.
(10:32) ఇక రెండవది డస్టెబిలైజేషన్ [సంగీతం] అంటే దేశ ఎకానమీని డిఫెన్స్ కెపాసిటీని ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ని వీక్ చేయడం దీనికి రెండు నుంచి ఐదు సంవత్సరాలు పట్టవచ్చని ఈ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఉదాహరణకి అదాని గ్రూప్ లాంటి పెద్ద కంపెనీస్ హైఫా నుంచి కొలంబో వరకు పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ సోలార్ మానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది.
(10:54) ఇలాంటి కంపెనీస్ పైన ఫారెన్ లీగల్ కేసెస్ షార్ట్ సెల్లర్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు వాటి ఇన్వెస్ట్మెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫండ్ రైస్ చేసే కెపాసిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాంటి డెవలప్మెంట్ ని కొందరు ఎకనామిక్ లా అఫెర్ అనే యాంగిల్ లో చూస్తారు. మూడవది క్రైసిస్ అంటే దేశంలో పెద్ద లెవెల్లో క్రైసిస్ రావడం ఉదాహరణకి దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ జరిగినప్పుడు గవర్నమెంట్ మొబైల్ ఇంటర్నెట్ ని షట్ డౌన్ చేసిన సాాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా కమ్యూనికేషన్ ని కంటిన్యూ చేయవచ్చు.
(11:22) ఇరాన్ లో ప్రొటెస్ట్ జరిగినప్పుడు స్టార్లింగ్ డిషెస్ ని ఇల్లీగల్ గా దేశంలోకి తీసుకెళ్లి యూస్ చేసిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. అంటే అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇలాన్ మాస్క్ తన స్టార్లింగ్ సాటిలైట్స్ ని ఇరాన్ ప్రభుత్వానికి అగైన్స్ట్ గా ఉపయోగించాడు. అక్కడి ప్రజల్ని మరింత రెచ్చగొట్టడంలో పాత్ర పోషించాడు. నాలుగవది నార్మలైజేషన్ అంటే దేశంలో పెద్ద క్రైసిస్ తర్వాత కొత్త పొలిటికల్ సిస్టం ని స్టేబుల్ చేసే స్టేజ్ ఈ సమయంలో ఫారెన్ కంట్రీస్ తమకు అనుకూలమైన లీడర్ ని పవర్ లోకి తీసుకొస్తాయి.
(11:54) దేశంలోని డేటా, కమ్యూనికేషన్, ట్రేడ్ రూట్స్ మీద ఫారెన్ ఇన్ఫ్లయెన్స్ పెరిగే రిస్క్ ఉంటుంది. మొత్తంగా ఇవి యూరి ఎక్స్ప్లెయిన్ చేసిన మోడల్ లోని నాలుగు స్టేజెస్. ప్రెజెంట్ మన ఇండియాలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే మన దేశం పైన ఇదే మోడల్ ని ఉపయోగిస్తున్నారు అనిపిస్తుంది. ఇక ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే వరల్డ్ పాలిటిక్స్ లో ఇండియా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా మారింది ఎందుకంటే మన దేశం ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మార్కెట్ లో ఒకటి.
(12:19) కోట్ల మంది ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారు. అంతేకాదు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో కూడా ఇండియా తన డిసిషన్ ని ఇండిపెండెంట్ గా తీసుకుంటుంది. ఉదాహరణకి రష్యా యూక్రైన్ వార్ మొదలైన తర్వాత వెస్టర్న్ కంట్రీస్ ప్రెజర్ ఉన్నప్పటికీ ఇండియా రష్యాతో ఎనర్జీ ట్రేడ్ కంటిన్యూ చేసింది. వెస్టర్న్ కంట్రీస్ ఎంత ప్రెజర్ చేసినా మనం రష్యా నుంచి మనకు కావలసిన ఆయిల్ ని కొన్నాము.
(12:43) అలాగే ఒకే గ్రూప్ కి పూర్తిగా సపోర్ట్ చేయకుండా అనేక కంట్రీస్ తో రిలేషన్ ని మెయింటైన్ చేస్తుంది. దీన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు. మరోవైపు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యక్ట్ అంటే ఎఫ్సిఆర్ఏ ద్వారా ఫారెన్ కంట్రీస్ నుంచి ఇండియాలోకి వచ్చే ఫండ్స్ పై గవర్నమెంట్ కంట్రోల్ ఉంచుతుంది. న్యూక్లియర్ ప్లాంట్స్, పోర్ట్స్, హైవేస్ లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ కి వ్యతిరేకంగా జరిగే కొన్ని యాక్టివిటీస్ కి ఫారెన్ ఫండింగ్ ఉపయోగిస్తుందనే ఆరోపణ కూడా గతంలో వచ్చాయి.
(13:11) ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం తన డిజిటల్ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి మూడు ఇంపార్టెంట్ విషయాలపైన ఫోకస్ చేయాలి. మొదటిది ఓన్ సాటిలైట్ టెక్నాలజీ ఇస్రోఎన్ఎస్ఐ లాంటి ఆర్గనైజేషన్స్ ఇండియన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ తో కలిసి దేశానికి అవసరమైన సాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నాయి. ముఖ్యంగా డిఫెన్స్ బార్డర్ సెక్యూరిటీ లాంటి విషయాల్లో ఫారెన్ కంపెనీస్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు.
(13:35) రెండవది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి మన దగ్గర మంచి ఎగ్జాంపుల్ యూపిఐ ఒకప్పుడు డిజిటల్ పేమెంట్ విషయంలో వీసా మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీస్ ఇన్ఫ్లయెన్స్ ఎక్కువగా ఉండేది. కానీ ఇండియా యూపిఐ అనే సొంత డిజిటల్ పేమెంట్ సిస్టం ని డెవలప్ చేసింది. అలాగే ఈ కామర్స్ సెక్టార్ లో పెద్ద కంపెనీస్ యొక్క డామినేషన్ తగ్గింది. స్మాల్ బిజినెస్సెస్ కి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఓఎన్డిసి తీసుకొచ్చింది.
(13:59) ఇదేవిధంగా టెలికాం సెక్టార్ లో కూడా మనకు ఓన్ టెక్నాలజీ ఉండాలి. మూడవది స్ట్రిక్ట్ రూల్స్ ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఏ ఫారెన్ కంపెనీ అయినా సరే మన దేశం యొక్క రూల్స్ ని ఫాలో అవ్వాలి. అది ఇలాన్ మాస్క్ కి చెందిన స్టార్లింగ్ అయినా మార్క్ జుకర్బర్గ్ చెందిన మెటా అయినా సరే మన దేశ డేటా ప్రొటెక్షన్ టెలికాం సెక్యూరిటీ రూల్స్ ని ఫాలో అవుతూ ఇక్కడ బిజినెస్ చేయాలి.
(14:23) ఈరోజు ఇంటర్నెట్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగంగా మారిపోయింది. చదువు, ఉద్యోగాలు, బ్యాంకింగ్, బిజినెస్ ఇలా ప్రతి రంగం ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందాలి. కానీ అదే సమయంలో మన దేశ ఇంటర్నెట్ వ్యవస్థ మీద మనకు కంట్రోల్ ఉండాలి.
(14:43) ఎందుకంటే ఈరోజు తక్కువ ధరలో ఇంటర్నెట్ అందించే కంపెనీ రేపు మన దేశానికి అత్యంత కీలకమైన కమ్యూనికేషన్ వ్యవస్థలో భాగం కావచ్చు. అప్పుడు ఆ కంపెనీ తీసుకునే నిర్ణయాలు మన దేశం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒకసారి యూపిఐ గురించి ఆలోచించండి. అమెరికా లాంటి టెక్నాలజీ సూపర్ పవర్ లో కూడా క్రెడిట్ కార్డ్ ఇతర పేమెంట్ నెట్వర్క్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి.
(15:05) కానీ ఇండియా యూపిఐ లాంటి అద్భుతమైన డిజిటల్ పేమెంట్ సిస్టం ని డెవలప్ చేసింది. అంటే మనం కూడా ప్రపంచానికి ఉపయోగపడి గొప్ప టెక్నాలజీని తయారు చేయగలమని ప్రూవ్ చేశాము. అలాంటప్పుడు మన డిజిటల్ ఫ్యూచర్ కోసం పూర్తిగా ఫారెన్ కంపెనీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫారెన్ టెక్నాలజీని యూస్ చేసుకోవచ్చు. ఫారెన్ కంపెనీస్ కి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కానీ మన దేశానికి ఓన్ టెక్నాలజీ ఓన్ కమ్యూనికేషన్ సిస్టం స్ట్రాంగ్ సెక్యూరిటీ రూల్స్ ఉండాల్సిందే.
(15:33) ఎందుకంటే ఒక కంట్రీకి ఇండిపెండెన్స్ అంటే కేవలం బార్డర్ ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు. తన డేటా కమ్యూనికేషన్ సిస్టం తన డిజిటల్ ఫ్యూచర్ మీద కూడా ఇండిపెండెంట్ గా డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. ఇక చివరగా మీరు చెప్పండి స్టార్లింక్ ని అమెరికా అండ్ ఇలాన్ మాస్క్ ఇతర దేశాల పైన ఒక వెపన్ గా ఉపయోగిస్తున్నారు అని తెలిసి కూడా మన దేశంలో ఆ కంపెనీకి ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ లేకుండా బిజినెస్ చేసుకునే అవకాశం ఇవ్వాలా? లేదా మన దేశ నేషనల్ సెక్యూరిటీ డేటా ప్రొటెక్షన్ కోసం స్ట్రిక్ట్ రూల్స్ తప్పనిసరిగా ఉండాలా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా
(16:07) ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అని మిషన్ తో పని చేస్తున్నాము. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్ లో మీరు భాగంఅవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై.

No comments:
Post a Comment