Saturday, October 10, 2026

🫵మీ Realityనే మీరు అనుమానించేలా చేస్తున్నారా? | 🎭Gaslighting Psychology🤯 @MrAKPrime

🫵మీ Realityనే మీరు అనుమానించేలా చేస్తున్నారా? | 🎭Gaslighting Psychology🤯 @MrAKPrime

Author Name:Mr AK Prime

Youtube Channel Url:https://www.youtube.com/@MrAKPrime

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Id-Jl46gEvU





Title: 🫵మీ Realityనే మీరు అనుమానించేలా చేస్తున్నారా? | 🎭Gaslighting Psychology🤯 @MrAKPrime

Author Name: Mr AK Prime

Description: ​మీకు తెలియకుండానే మీ Realityని ఎవరో మారుస్తున్నారా? ఒక సంఘటన స్పష్టంగా గుర్తున్నా, ఎదుటివారు "అది జరగలేదు, నీకేదో పిచ్చి, నువ్వే ఊహించుకుంటున్నావు" అని పదే పదే అంటే? దీన్నే సైకాలజీలో 'Gaslighting' అంటారు.
​Mr AK Prime ఛానెల్‌‌లోని ఈ వీడియోలో, ఒక వ్యక్తి మన జ్ఞాపకాలను, ఆలోచనలను కంట్రోల్ చేసి మనల్ని ఎలా సెల్ఫ్-డౌట్‌లోకి నెట్టేస్తాడో డీప్ సైకలాజికల్ అనాలిసిస్‌తో వివరించడం జరిగింది. గ్యాస్‌లైటింగ్ ప్యాట్రన్స్ ఎలా గుర్తించాలి? మానిప్యులేషన్ నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలను సులభమైన తెలుగులో తెలుసుకోండి.

#GaslightingInTelugu #MrAKPrime #PsychologyInTelugu #HumanBehavior #MentalHealthTelugu #Manipulation #SelfImprovementTelugu

Gaslighting in telugu, gaslighting psychology telugu, Mr AK Prime, emotional manipulation telugu, psychology in telugu, human behavior telugu, signs of gaslighting, toxic relationship signs telugu, mental health awareness telugu, cognitive bias telugu, reality manipulation, how to spot a gaslighter, narcissist behavior telugu, self doubt psychology, thinking skills telugu, behavioral psychology telugu, manipulative people, psychological facts in telugu, personality development in telugu, mental peace telugu.

⚠️ Disclaimer:
The content provided in this video is for informational and educational purposes only. We aim to provide accurate and up-to-date information, but we do not guarantee the completeness or accuracy of the information presented. Viewers are advised to verify details from official sources before making any decisions. The creator is not responsible for any actions taken based on this video.
Copyright Disclaimer:
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
Images & Video Clips Credit:
The images and video clips used in this video belong to their respective owners. They are used strictly for educational and news reporting purposes under Fair Use. If you are the owner of any content and wish for it to be removed or credited differently, please contact us at:
Music Credit:
Music provided by YouTube Audio Library / NCS Source Pixbuy
🤖 AI & Safety Disclosure:
Transparency matters to us! Please note that the voiceover and certain visual elements (like 3D images and thumbnails) in this video were generated using advanced Artificial Intelligence (AI) tools to provide you with the highest quality audio and visual experience. However, the core script, research, and concept are entirely original and crafted for educational and motivational purposes only.

Safety & General Disclaimer
ఈ ఛానెల్‌లో అందించే సమాచారం కేవలం ప్రజల అవగాహన కోసం మాత్రమే. మేము ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని, హింసను ప్రేరేపించాలని లేదా తప్పుదారి పట్టించాలని అనుకోము. ఈ సమాచారాన్ని స్వీకరించే ముందు మీ స్వంత విచక్షణను ఉపయోగించగలరు.

Transcript:
(00:10) నమస్కారం ఒకసారి ఈ సిచువేషన్ ఊహించుకోండి. మీకు ఒక సంఘటన చాలా స్పష్టంగా గుర్తుంది. మీరు కళ్ళతో చూశారు మీ చెవులతో విన్నారు. అక్కడ ఏం జరిగిందో మీకు 100 శాతం తెలుసు. కానీ మీరు ఆ విషయం గురించి ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు వారు చాలా కాన్ఫిడెంట్ గా మీ కళ్ళలోకి చూస్తూ ఇలా అంటారు. అది అసలు జరగలేదు. నువ్వేదో తప్పుగా గుర్తుపెట్టుకున్నావు నువ్వు అనవసరంగా ఊహించుకుంటున్నావు నీకు ప్రతి చిన్న విషయం మీద డౌట్ ఎందుకు మొదటిసారి వాళ్ళు అలా అన్నప్పుడు మీకు వాళ్ళ మీద కోపం వస్తుంది.
(00:39) ఇంత స్పష్టంగా జరిగితే అబద్ధం చెబుతారఏంటి అని వాళ్ళని అనుమానిస్తారు. కానీ ఇదే పరిస్థితి మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే ప్రతిసారి మీరు చూసింది అబద్ధంని వాళ్ళు చెప్పిందే నిజమని వాళ్ళు బలంగా వాదిస్తుంటే కొంతకాలం తర్వాత మెల్లగా ఒక మార్పు వస్తుంది. మీరు ఎదుటి వారిని అనుమానించడం మానేసి మిమ్మల్ని మీరే అనుమానించడం మొదలు పెడతారు. నిజంగానే నాకేమైనా మతిమరపా నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా నా మెదడు సరిగ్గానే పనిచేస్తుందా అని మీకు మీరే ప్రశ్నించుకోవడం మొదలు పెడతారు.
(01:04) ఇది సాధారణమైన గొడవ కాకపోవచ్చు. మీ జీవితంలో ఎవరైనా మీ ఆలోచనలను మీ జ్ఞాపకాలను పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఆడుతున్న ఒక సైకలాజికల్ గేమ్ కావచ్చు. సైకాలజీలో దీన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. ఇలాంటి సైకాలజీ థింకింగ్ స్కిల్స్ లెర్నింగ్ టెక్నిక్స్ మన రోజువారి జీవితంలో ఎలా పనిచేస్తాయో మనుషుల ప్రవర్తన వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో సులభమైన తెలుగులో తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(01:29) అసలు ఈ గ్యాస్ లైటింగ్ అంటే ఏమిటి? చాలా మంది గ్యాస్ లైటింగ్ అంటే కేవలం అబద్ధాలు చెప్పడం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అబద్ధం చెప్పడం అంటే ఒక వాస్తవాన్ని దాచడం. కానీ గ్యాస్ లైటింగ్ అంటే మీ కళ్ళ ముందున్న వాస్తవాన్ని మీరే నమ్మలేని విధంగా మీ మెదడుతో ఆడుకోవడం గ్యాస్ లైటింగ్ లో ఒక వ్యక్తి పదే పదే మీ మెమరీ అంటే మీ జ్ఞాపక శక్తి మీ పర్సెప్షన్ అంటే మీరు విషయాలను చూసే కోణం మీ ఇంటర్ప్రిటేషన్ అంటే మీరు అర్థం చేసుకునే విధానం చివరగా మీ ఫీలింగ్స్ అంటే మీ భావోద్వేగాలు ఇవన్నీ తప్పే అని మీకు నమ్మించే ప్రయత్నం చేస్తాడు.
(01:58) కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చిన్న గొడవ ప్రతి భేదాభిప్రాయం ప్రతి అబద్ధం గ్యాస్ లైటింగ్ కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక పాటర్న్ ఉంటుంది. దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అసలు ఈ గ్యాస్ లైటింగ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది 1938 లో గ్యాస్ లైట్ అనే ఒక స్టేజ్ ప్లే వచ్చింది. ఆ తర్వాత దాని ఆధారంగా సినిమాలు కూడా వచ్చాయి.
(02:21) అందులో కథ ఏంటంటే ఒక భర్త ఇంట్లో ఉన్న గ్యాస్ లైట్స్ యొక్క వెలుతురును కొద్దిగా తగ్గిస్తూ ఉంటాడు. భార్య ఆ లైటింగ్ తగ్గుతోంది అని గమనించి అడిగినప్పుడు లేదు వెలుతురు బాగానే ఉంది నువ్వేదో ఊహించుకుంటున్నావు నీకేదో పిచ్చి పడుతోంది అని పదే పదే చెబుతాడు. ఆ భర్త మాటలు నమ్మి ఆ భార్య నిజంగానే తనకు మతిస్థిమితం తప్పుతోందేమో అని భయపడటం మొదలు పెడుతుంది.
(02:38) తన స్వలాభం కోసం ఎదుటి వ్యక్తి రియాలిటీని అంటే వాస్తవాన్ని నమ్మకుండా చేయడాన్ని అప్పటి నుంచి సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అని పిలవడం మొదలు పెట్టారు. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారేది ఇక్కడే. ఎందుకంటే చాలా మందికి ఒక నార్మల్ ఆర్గ్యుమెంట్ కి గ్యాస్ లైటింగ్ కి మధ్య ఉన్న తేడా అర్థం కాదు. ఉదాహరణకు ఒక నార్మల్ గొడవ లేదా ఆర్గ్యుమెంట్ లో ఎలా ఉంటుందంటే నాకు ఆ సంఘటన అలా గుర్తుంది అని మీరు అంటారు.
(02:59) లేదు [సంగీతం] నాకైతే వేరేలా గుర్తుంది అని ఎదుటి వ్యక్తి అంటాడు. ఇక్కడ ఇద్దరు తమ తమ దృక్కోణాలను పర్స్పెక్టివ్స్ పంచుకుంటున్నారు. ఇది చాలా సహజం. కానీ గ్యాస్ లైటింగ్ పాటర్న్ అలా ఉండదు. అక్కడ ఎదుటి వ్యక్తి ఉద్దేశం తన వర్షన్ చెప్పడం కాదు మీ వర్షన్ పూర్తిగా తప్పు అని నిరూపించడం. నీ మెమరీనే నమ్మలేం. నువ్వు ఎప్పుడూ ఇలాగే పిచ్చి పిచ్చిగా రియాక్ట్ అవుతావు. నీకు ఏది సరిగ్గా అర్థం కాదు.
(03:23) ఇలా పదే పదే అంటూ మీ క్యారెక్టర్ ని మీ ఆలోచన విధానాన్ని అటాక్ చేస్తారు. అయితే ఎవరైనా ఒకసారి కోపంలో ఇలా అన్నంత మాత్రాన వాళ్ళని గ్యాస్ లైటర్ అని మనం డిసైడ్ చేయకూడదు. ఇందులో పాటర్న్ రెపిటీషన్ అంటే పదే పదే జరగడం మరియు మనిపులేషన్ కాంటెక్స్ట్ చాలా ముఖ్యం. ఇది రియల్ లైఫ్ లో ఎలా జరుగుతుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం.
(03:44) ఒక యువకుడు తన ఆఫీస్ లో లేదా ఒక ఫ్రెండ్ తో జరిగిన ఒక సంభాషణను గుర్తు చేసుకుంటాడు. ఒక ముఖ్యమైన విషయం గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడు ఆ విషయం గురించి అడిగినప్పుడు ఆ ఫ్రెండ్ చాలా క్యాజువల్ గా మనం అసలు ఆ టాపిక్ మాట్లాడనే లేదు. నువ్వు ఎవరితోనో మాట్లాడి నాతో మాట్లాడాను అనుకుంటున్నావు అంటాడు. మొదట ఆ యువకుడు లేదు నేను కరెక్ట్ గానే గుర్తుపెట్టుకున్నాను నాకేం పిచ్చి కాదు అనుకుంటాడు.
(04:06) కానీ ఆ ఫ్రెండ్ ఏమాత్రం తడబడకుండా చాలా కాన్ఫిడెంట్ గా తన వాదన మీదే నిలబడతాడు. పైగా నీకు ఈ మధ్య మతిమరపు ఎక్కువైంది అంటూ ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. ఇదే పరిస్థితి వేరు వేరు విషయాల్లో పదే పదే జరుగుతుంది. ఆ యువకుడు ఏది చెప్పినా నువ్వు తప్పుగా విన్నావు నీకు కరెక్ట్ గా అర్థం కాలేదు అని ఆ ఫ్రెండ్ కొట్టిపారేస్తూ ఉంటాడు. కొంతకాలం తర్వాత ఆ యువకుడిలో ఒక భయం మొదలవుతుంది.
(04:26) బహుశా నిజంగానే నా తప్పేమో నేను సరిగ్గా వినలేదేమో నా మెదడు నన్ను మోసం చేస్తోందేమో అనే అనుమానం మొదలవుతుంది. తన సొంత నిర్ణయాలు తీసుకోవాలంటే ఒకటికి 10 సార్లు వేరే వాళ్ళని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. [సంగీతం] కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఎదుటివారు మన మెమరీని టార్గెట్ చేసినప్పుడు మనం ఎందుకు అంత సులభంగా నమ్మేస్తాం.
(04:44) ఎందుకంటే మన మెమరీ అనేది ఒక కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఫైల్ లాంటిది కాదు. సైకాలజీ ప్రకారం మన మెమరీ రీకన్స్ట్రక్టివ్ నేచర్ కలిగి ఉంటుంది. అంటే ఒక సంఘటన మనకు గుర్తుంది అంటే ప్రతి ఫ్రేమ్ ఎగజాక్ట్ గా మన మెథడ్లో ప్లే అవ్వదు. ఆ సమయంలో ఉన్న భావోద్వేగాలు, ఎమోషన్స్, వాతావరణం ఆ తర్వాత మనం విన్న విషయాలు. ఇవన్నీ మన మెమరీని కొద్దిగా ఇన్ఫ్లయెన్స్ చేస్తాయి.
(05:03) గ్యాస్ లైటింగ్ చేసేవాళ్ళు మన మెదడుకున్న ఈ నాచురల్ వీక్నెస్ ని పట్టుకుంటారు. నీకే సరిగ్గా గుర్తుండదు కదా అని మన సెల్ఫ్ డౌట్ ని పెంచుతారు. కానీ దీని అర్థం మన మెమరీ పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఎదుటివాడు చెప్పిందే నిజం అని మాత్రం కాదు. మీ ఇన్స్టింట్ మీ బేసిక్ లాజిక్ ఎప్పుడూ మీ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు అసలు డేంజరస్ పార్ట్ ఏంటో చూద్దాం.
(05:20) ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగానే గ్యాస్లైట్ చేస్తున్నాడని గుర్తించడానికి కనీసం ఐదు వార్నింగ్ పాటర్న్స్ ఉంటాయి. అవి ఏంటో స్పష్టంగా తెలుసుకుందాం. పాటర్న్ ఒకటి రిపీటెడ్ డినయల్ ఆఫ్ క్లియర్లీ డిస్కస్డ్ ఇవెంట్స్ జరిగిన విషయాలను మాట్లాడుకున్న మాటలను పదే పదే అసలు జరగలేదు అని బుకాయించడం ఆధారాలు లేని ప్రతిసారి మీరే ఊహించుకున్నారు అని కాన్ఫిడెంట్ గా చెప్పడం.
(05:42) పాటర్న్ రెండు మీ ఫీలింగ్స్ ని ప్రాబ్లం గా మార్చడం. ఇది చాలా సూక్ష్మంగా జరుగుతుంది. మీరు ఏదైనా విషయమై బాధపడితే ఆ బాధకు కారణం గురించి వాళ్ళు మాట్లాడరు. దానికి బదులు నువ్వు మరీ సెన్సిటివ్ అయిపోతున్నావు. చిన్న విషయానికి ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నావు అని కన్వర్సేషన్ మొత్తాన్ని మీ క్యారెక్టర్ మీదకు తిప్పుతారు. ఇక్కడ టాపిక్ మారిపోయి మీ ఎమోషన్ే ఒక పెద్ద తప్పులాగా ఫీల్ అయ్యేలా చేస్తారు.
(06:03) పాటర్న్ మూడు విషయాన్ని పూర్తిగా వక్రీకరించడం డిస్టార్టింగ్ ఫాక్ట్స్ నేను అలా అనలేదు నా ఉద్దేశం అది కాదు నువ్వే కావాలని తప్పుగా అర్థం చేసుకున్నావు అని మీరు విన్న వాక్యాలను పూర్తిగా మార్చేసి వాదించడం. పాటర్న్ నాలుగు బాధ్యత తీసుకోకుండా బ్లేమ్ షిఫ్ట్ చేయడం. వాళ్ళు తప్పు చేసినప్పుడు సారీ చెప్పడం కాకుండా ఆ తప్పు జరగడానికి మీరే కారణమని మీ మీదకు నెట్టేయడం.
(06:23) ఉదాహరణకు నువ్వు నన్ను రెచ్చగొట్టడం వల్లే నేను కోపంలో ఆ మాట అన్నాను. కాబట్టి తప్పంతా నీదే అని చెప్పడం. పాటర్న్ ఐదు మీ జడ్జిమెంట్ మీద మీకే నమ్మకం పోవడం చివరికి మీరు మీ ఆలోచనలను మీ జ్ఞాపకాలను మీ నిర్ణయాలను అన్ని అనుమానించడం. ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళ అప్రూవల్ కోసం ఎదురుచూడటం. ఇక్కడే చాలా మంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు.
(06:43) ఈ పాయింట్స్ వినగానే తమ లైఫ్ లో ఎవరైనా ఒకసారి అబద్ధం చెప్పి ఉంటే లేదా ఏదైనా గొడవలో తమను నిందించి ఉంటే వాళ్ళని వెంటనే గ్యాస్ లైటర్ అని లేబుల్ చేసేస్తారు. కానీ అలా చేయకూడదు. ప్రతి టాక్సిక్ పర్సన్ గ్యాస్ లైటర్ కాదు. ఒకసారి ఎవరో అబద్ధం చెప్పారు కాబట్టి వాళ్ళు గ్యాస్ లైటర్ కారు. ఒకసారి గొడవలో వాళ్ళ వర్షన్ వాళ్ళకు అనుకూలంగా గుర్తుంచుకున్నారంటే అది వాళ్ళ కాగ్నిటివ్ బయాస్ కావచ్చు. కానీ గ్యాస్ లైటింగ్ కాదు.
(07:07) ఒక వ్యక్తి మీ బాధను అర్థం చేసుకోలేకపోతున్నాడంటే అది వాళ్ళ ఎమోషనల్ ఇన్వాలిడేషన్ కావచ్చు లేదా వాళ్ళకు ఎంపతీ లేకపోవడం కావచ్చు. కానీ అది ఆటోమేటిక్ గా గ్యాస్ లైటింగ్ అవ్వదు. గ్యాస్ లైటింగ్ అనే పదాన్ని ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా విపరీతంగా వాడేస్తున్నారు. కానీ సైకలాజికల్ గా చూస్తే ఇది ఒక ఉద్దేశపూర్వకమైన పాటర్న్.
(07:24) మీ బుర్రను కంట్రోల్ చేయాలి. మీ రియాలిటీని మార్చేయాలి అనే ఒక మనిపులేషన్ ఉంటేనే దాన్ని గ్యాస్ లైటింగ్ గా పరిగణించాలి. కానీ బయటి వారి ఉద్దేశ్యం మనకు ఎప్పుడూ ఎక్స్రే తీసినట్టు స్పష్టంగా కనబడదు కదా. అందుకే ఎవరికీ డైరెక్ట్ గా ఒక క్లినికల్ డయాగ్నోసిస్ ఇవ్వకూడదు. ఇలాంటి గ్యాస్ లైటింగ్ లాంటి పాటర్న్ కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి అని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి.
(07:45) కానీ ఇక్కడ ఒక సైకలాజికల్ క్వశ్చన్ వస్తుంది. మనుషులు తమని తాము ఎందుకు అంత త్వరగా అనుమానించుకుంటారు? దీనికి ముఖ్యమైన కారణాలు అథారిటీ ఎమోషనల్ అటాచ్మెంట్ మరియు సోషల్ ఇన్ఫ్లయెన్స్ మనం ఒక వ్యక్తిని బాగా నమ్మినప్పుడు లేదా ప్రేమించినప్పుడు వాళ్ళ మాటలకు మన బ్రెయిన్ చాలా విలువిస్తుంది. అలాగే ఒక అధికారంలో ఉన్న వ్యక్తి బాస్ లాంటి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఒక అబద్ధం చెప్పినప్పుడు ఆ అథారిటీ ప్రెషర్ వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ మన నిజం కంటే వాళ్ళ అబద్ధాన్నే నమ్మడానికి ట్రై చేస్తుంది.
(08:11) ఒకే మాటను పదే పదే వింటే మన మెదడులో ఉండే సర్టెన్టీ ఖచ్చితత్వం మెల్లగా తగ్గిపోతుంది. దీన్నే ఇల్లు ట్రూత్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. మరి ఇది కేవలం మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకే జరుగుతుందా ఇంటెలిజెంట్ పీపుల్ ఇలాంటి మనిపులేషన్ కి చిక్కుకోరా ఇదే ఒక పెద్ద అపోహ. ఇది వీక్ మైండెడ్ పీపుల్ కి మాత్రమే జరుగుతుంది అనేది ఒక మిత్.
(08:31) నిజానికి మీ ఇంటెలిజెన్స్ మీకు సైకలాజికల్ మనిపులేషన్ నుంచి పూర్తి రక్షణ ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఎవరితోనైనా రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అక్కడ లాజిక్ కంటే ట్రస్ట్, ఫియర్ ఆఫ్ లూజంగ్ దెమ్ వాళ్ళని కోల్పోతామేమో అన్న భయం, స్ట్రెస్ వంటి ఎమోషనల్ ఫాక్టర్స్ డామినేట్ చేస్తాయి. ఇంటెలిజెంట్ పీపుల్ కూడా కొన్నిసార్లు ఎదుటివారి తప్పులను లాజికల్ గా కవర్ చేయడానికి ట్రై చేస్తారు.
(08:49) బహుశా తను ఆ ఉద్దేశంతో అని ఉండడు అని వాళ్ళకు వాళ్లే రీజన్స్ వెతుక్కొని ఈ ఉచ్చులో పడిపోతారు. సరే మరి ఈ గ్యాస్ లైటింగ్ అనేది ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి సందర్భాల్లో ఎదురవుతుంది ప్రధానంగా నాలుగు చోట్ల ఇది కనిపిస్తుంది. మొదటిది రిలేషన్షిప్స్ ప్రేమ లేదా పెళ్లి. ఇక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్యాస్ లైటింగ్ చాలా ఈజీ.
(09:08) మీరు ఏదైనా తప్పును ప్రశ్నించినప్పుడు నువ్వు నన్ను అసలు అర్థం చేసుకోవడం లేదు. నీకు నా మీద నమ్మకమే లేదు అని రివర్స్ మనిపులేషన్ జరుగుతుంది. రెండవది ఫ్యామిలీ కుటుంబం చిన్నప్పటి నుంచి జరిగిన కొన్ని ట్రామాటిక్ సంఘటనలను లేదా ఎమోషనల్ అబ్యూస్ ను పేరెంట్స్ గాని బంధువులు గాని పూర్తిగా కొట్టి పారేయడం అదంతా నీ ఊహ మేము నీకెప్పుడూ అలా చేయలేదు.
(09:27) నువ్వు చాలా అదృష్టవంతుడివి అని మీరు ఫీల్ అయిన బాధను తుడిచేయడానికి ప్రయత్నించడం. మూడవది ఫ్రెండ్షిప్, స్నేహం ఒక ఫ్రెండ్ మీ గ్రూప్ లో అందరి ముందు మిమ్మల్ని దారుణంగా అవమానించి మీరు హర్ట్ అయినప్పుడు కమాన్ యార్ అది జస్ట్ జోక్. నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు అని మీ ఫీలింగ్స్ ని తప్పు పట్టడం. నాలుగవది వర్క్ ప్లేస్, ఆఫీస్ ఇది చాలా డేంజరస్ మీ బాస్ ఒక ప్రాజెక్ట్ గురించి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. మీరు అలాగే చేస్తారు.
(09:51) అది ఫెయిల్ అయినప్పుడు బాస్ మీ దగ్గరకు వచ్చి నేను నీకు అలా చెప్పనే లేదు నీకే అర్థం కాలేదు అంటాడు. [సంగీతం] ఇక్కడ డాక్యుమెంటేషన్ అనగా రాతపూర్వక ఆధారాలు లేకపోతే ఆ ఎంప్లాయి తన మెమరీని తానే అనుమానించుకునే పరిస్థితి వస్తుంది. కానీ [సంగీతం] గుర్తుంచుకోండి ఆఫీస్ లో జరిగే ప్రతి కమ్యూనికేషన్ గ్యాప్ గ్యాస్ లైటింగ్ కాదు. పదే పదే రిపీట్ అయితేనే అది పాటర్న్ ఇదంతా విన్నాక మీకు ఒక ప్రశ్న రావచ్చు నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా మీరు ఎప్పుడైనా ఒకరితో ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత ఒంటరిగా కూర్చొని అసలు ఈ గొడవలో తప్పు నాదేనా నేనేమైనా ఎక్కువ ఆలోచిస్తున్నానా
(10:20) నాదే తప్పు అని నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను అని పదే పదే అనుకున్నారా అలాంటప్పుడు మీ పరిస్థితిని మీరే అర్థం చేసుకోవడానికి ఒక ప్రాక్టికల్ చెక్ లిస్ట్ ఇస్తున్నాను. ఇది వాళ్ళకు ఏదో జబ్బు ఉందని నిర్ణయించడానికి కాదు మీ పరిస్థితిని మీరు అంచనా వేసుకోవడానికి మాత్రమే. ఇదే పాటర్న్ అంటే ఒకే రకమైన మనిపులేషన్ పదే పదే జరుగుతోందా మీరు చాలా క్లియర్ గా చెప్పిన వాస్తవాలు ప్రతిసారి కంప్లీట్లీ డినై అవుతున్నాయా ఒక విషయం గురించి మాట్లాడటం మొదలు పెడితే చివరికి అసలు టాపిక్ మాయంపోయి బ్లేమ్ మొత్తం మీ పైకి వస్తుందా? మీ మెమరీ లేదా మీ పర్సెప్షన్ నే పదే పదే
(10:50) అటాక్ చేస్తున్నారా? మీ ఫీలింగ్స్ ని వాాలిడేట్ చేసే బదులు వాటినే మీ క్యారెక్టర్ లో ఉన్న లోపంగా చూపిస్తున్నారా? మెల్లమెల్లగా మీరు మీ ఓన్ జడ్జిమెంట్ పై కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారా? ఈ ప్రశ్నలకు ఎక్కువ శాతం సమాధానం అవును అయితే మీరు అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మనం అత్యంత ప్రాక్టికల్ విషయానికి వద్దాం.
(11:06) ఈ పరిస్థితిలో మీరు ఉంటే వాట్ షుడ్ యు డూ ఏం చేయాలి? మనిపులేషన్ కి మనిపులేషన్ తో కౌంటర్ చేయడం ఎప్పటికీ సొల్యూషన్ కాదు అది మిమ్మల్ని కూడా వాళ్ళలాగానే మారుస్తుంది. దానికి బదులు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. స్టెప్ ఒకటి కన్వర్సేషన్ లో జరిగిన విషయాలను ప్రశాంతంగా క్లారిఫై చేయండి. కోపంతో అరిస్తే చూడు నువ్వు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నావో అని వాళ్ళకు ఇంకో అవకాశం దొరుకుతుంది. కామ్గా ఉండండి.
(11:31) స్టెప్ రెండు డాక్యుమెంటేషన్ ముఖ్యమైన విషయాలలో ముఖ్యంగా వర్క్ ప్లేస్ లో ఈమెయిల్స్, మెసేజెస్, డేట్స్ లేదా అగ్రీమెంట్స్ రాతపూర్వకంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ మెమరీకి ఒక ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. అయితే ఎవరినైనా సీక్రెట్ గా రికార్డ్ చేయడం లాంటివి లీగల్ గా కొన్ని దేశాల్లో రాష్ట్రాల్లో నేరం కావచ్చు.
(11:52) కాబట్టి దాని గురించి జాగ్రత్త వహించండి. కానీ మీ పర్సనల్ నోట్స్ మీరు రాసుకోవచ్చు. స్టెప్ మూడు ఒక ట్రస్టెడ్ పర్సన్ పర్స్పెక్టివ్ తీసుకోండి. మీకు బాగా నమ్మకమైన న్యూట్రల్ గా ఆలోచించే ఒక స్నేహితుడికో కుటుంబ సభ్యుడికో ఈ పరిస్థితిని వివరించి వాళ్ళ అభిప్రాయం అడగండి. బయటి వాళ్ళకు మనిపులేషన్ ఈజీగా కనిపిస్తుంది. స్టెప్ నాలుగు రిపీటెడ్ పాటర్న్ ఉంటే ఖచ్చితమైన బౌండరీస్ హద్దులు సెట్ చేయండి.
(12:15) నీకు అలా గుర్తుంది కావచ్చు కానీ నాకు గుర్తున్నది ఇది. నేను దీని గురించి ఇక వాదించదలుచుకోలేదు అని సంభాషణను ఆపేయండి. స్టెప్ ఐదు పరిస్థితి మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటే కచ్చితంగా క్వాలిఫైడ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ అంటే సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ సపోర్ట్ తీసుకోండి. ఒకవేళ ఎక్కడైనా భౌతికమైన ప్రమాదం గాని సేఫ్టీ ఇష్యూ గాని ఉంటే మాత్రం వెంటనే లోకల్ సపోర్ట్ సర్వీసెస్ లేదా పోలీసులను సంప్రదించాలి. ఇక్కడ మొహమాటానికి పోకూడదు.
(12:40) ఈ క్రమంలోనే మీరు తెలుసుకోవాల్సిన మరొక కాన్సెప్ట్ ఉంది. దాని పేరు గ్రే రాక్ మెథడ్. గ్రే రాక్ అంటే ఒక బూడిద రంగు రాయిలాగా మారిపోవడం అంటే మనిపులేట్ చేసే వాళ్ళ ముందు ఎలాంటి ఎమోషన్ చూపించకుండా చాలా బోర్ కొట్టించే విధంగా చిన్న చిన్న సమాధానాలు అవును కాదు సరే ఇస్తూ రియాక్ట్ అవ్వడం వాళ్ళకు మీ నుంచి ఎమోషనల్ రియాక్షన్ దొరకనప్పుడు వాళ్ళకు ఇంట్రెస్ట్ పోతుంది.
(13:03) కానీ ఇది యూనివర్సల్ సొల్యూషన్ కాదు. దీన్ని అన్ని చోట్లా వాడలేం. ఎప్పుడు ఎమోషన్ తగ్గించి మాట్లాడాలో ఎప్పుడు డైరెక్ట్ గా హద్దులు విధించాలో ఎప్పుడు సేఫ్టీ కోసం కన్ఫేషన్ ఆపేయాలో మీరు సిచువేషన్ ని బట్టి నిర్ణయించుకోవాలి. చివరగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని అతి పెద్ద మిస్టేక్ ఒకటి ఉంది. ఈ వీడియో చూశాను ఇందులో ఉన్న పాయింట్స్ నా లైఫ్ లో ఆ వ్యక్తి బిహేవియర్ కి మ్యాచ్ అవుతున్నాయి.
(13:23) కాబట్టి ఆ వ్యక్తి పక్క గ్యాస్ లైటర్ అని కన్ఫర్మ్ అయిపోయింది అని ఒకే సెకండ్ లో డిసైడ్ అయిపోకండి. మనుషులు చాలా కాంప్లెక్స్ మీరు వాళ్ళ పాటర్న్ ని అబ్సర్వ్ చేయాలి. ఎవిడెన్స్ ని చూడాలి. కాంటెక్స్ట్ [సంగీతం] ని అర్థం చేసుకోవాలి. అవసరమైతే ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్ తీసుకోవాలి. అంతేగాని మనమే జడ్జిలు అవ్వకూడదు.
(13:42) [సంగీతం] కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక అత్యంత లోతైన వాస్తవం ఉంది. మనకు మనం నిజం చెప్పుకునే సామర్థ్యాన్ని మన కళ్ళ మీద మనకున్న నమ్మకాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడు బయట ప్రపంచం మన గురించి చెప్పే మాటలన్నీ మన రియాలిటీగా మారిపోతాయి. అలా అని మీ ఫీలింగ్స్ ని ఎప్పుడూ గుడ్డిగా నమ్మేయమని నేను చెప్పట్లేదు. అలాగని వాటిని పూర్తిగా పక్కన పెట్టేయమని కూడా అనట్లేదు.
(14:04) ఫాక్ట్స్, వాస్తవాలు, పాటర్న్స్ వాళ్ళ ప్రవర్తన తీరు మరియు కాంటెక్స్ట్, సందర్భం ఈ మూడింటిని కలిపి చూడాలి. అప్పుడే మీకు అసలు రియాలిటీ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియో నుంచి మీరు బయటికి వెళ్ళే ముందు మీ మైండ్ లో ఫిక్స్ అవ్వాల్సిన ఒక సింపుల్ ఫ్రేమ్ వర్క్ ఇస్తాను గుర్తుపెట్టుకోండి. స్టాప్ ఎవరైనా మీ మీద నింద వేయగానే వెంటనే భయపడి సెల్ఫ్ బ్లేమ్ చేసుకోకండి.
(14:24) ఆగండి చెక్ అసలు అక్కడ నిజంగా ఏం జరిగింది? వాస్తవాలు ఏంటి అని లాజికల్ గా చెక్ చేయండి. రికార్డ్ అవసరమైన విషయాలను ఫాక్చువల్ గా నోట్ చేసుకోండి. రిఫ్లెక్ట్ ఇది కేవలం ఈ ఒక్కసారి మాత్రమే జరిగిందా? లేక పదే పదే రిపీట్ అవుతున్న పాటర్న్ అని రిఫ్లెక్ట్ చేసుకోండి. బౌండరీ గ్యాస్ లైటింగ్ పాటర్న్ అనిపిస్తే మీకు సరైన హద్దులు బౌండరీస్ నిర్ణయించుకోండి.
(14:46) గ్యాస్ లైటింగ్ గురించి తెలుసుకోవడం అంటే మీ చుట్టూ ఉన్న ప్రతి మనిషిని ప్రతి బంధాన్ని అనుమానించడం కాదు. అసలు [సంగీతం] లెసన్ ఏంటంటే మీ రియాలిటీని ఎవరో బయట వ్యక్తి డిఫైన్ చేయకుండా మీ జీవితంలో ఉన్న వాస్తవాలను మీరే స్వయంగా చూడడం నేర్చుకోవడం. మీ మీద మీకు నమ్మకాన్ని తిరిగి నిర్మించుకోవడం సైకాలజీ థింకింగ్ స్కిల్స్ లెర్నింగ్ సైన్స్ మరియు హ్యూమన్ బిహేవియర్ వంటి మన జీవితానికి ఉపయోగపడే ప్రాక్టికల్ టాపిక్స్ పై మరిన్ని వీడియోస్ సులభమైన తెలుగులో చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలోచిస్తూ ఉండండి.
(15:15) వాస్తవాలను గమనిస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. ట

No comments:

Post a Comment