Saturday, October 10, 2026

ముక్తుడికి ముక్తి ఎక్కడ? | అష్టావక్ర గీత లోతైన బోధ

ముక్తుడికి ముక్తి ఎక్కడ? | అష్టావక్ర గీత లోతైన బోధ

Author Name:Dhyana Jagath

Youtube Channel Url:https://www.youtube.com/@Dhyanajagath

Youtube Video URL:https://www.youtube.com/watch?v=vv6Lmj-g8Dg





Title: ముక్తుడికి ముక్తి ఎక్కడ? | అష్టావక్ర గీత లోతైన బోధ

Author Name: Dhyana Jagath

Description: #AshtavakraGita #SelfRealization #Enlightenment #AdvaitaVedanta #SpiritualWisdom

Transcript:
(00:01) మిధిలా రాజ్యం రాజభవనం నిద్రలేస్తుంది. రాజసభ సిద్ధమవుతుంది. రథాలు కదులుతున్నాయి. వ్యాపారాలు తమ దుకానాలు తెరుస్తున్నారు. ఆ రాజ్యం మధ్యలో ఒక రాజు కూడా అతను రోజు ప్రారంభిస్తున్నాడు. అతను నిర్ణయాలు తీసుకుంటాడు ప్రజలను కలుస్తాడు పనులు చేయిస్తాడు కానీ ఒక్క విషయం మాత్రం ఆయనలో కనిపించదు. అతని లోపల నేనే కర్త అనే మనిషి క్రమంగా కనుమరుగయ్యాడు.
(00:28) అయితే రాజ్యాన్ని నడిపిస్తుంది ఎవరు కార్యాలు జరుగుతున్నప్పుడు లోపల కర్త లేకపోవడం అంటే ఏంటి అక్కడి నుంచే అష్టావక్రుడే అత్యంత లోతైన బోధ మొదలవుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి జీవన్ముక్తుడు. అతను ఎలా జీవిస్తాడు అతను ప్రపంచాన్ని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతాడా రోజంతా కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఉంటాడా అతనికి భావోద్వేగాలు అసలు ఉండవా అతను పని చేయడా అతనికి సంబంధాలు ఉండవా? అష్టావక్కుడు ఇచ్చే సమాధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది.
(00:57) బయటకు చూస్తే అతను సాధారణ మనిషిలాగే కనిపించొచ్చు. నడుస్తాడు మాట్లాడతాడు తింటాడు పని చేస్తాడు ప్రజల మధ్యలో తిరుగుతాడు. కానీ అతని లోపల జరిగిపోయిన మార్పు మాత్రం పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది. మనకు సాధారణంగా ప్రశాంతంగా ఉండాలంటే ఒక ప్రయత్నం కావాలి. మనసు పరిగెడితే ఏకాగ్రత పెంచుకోవాలి అంటాం. ఆలోచనలు ఎక్కువైతే వాటిని నియంత్రించాలి అంటాం.
(01:23) బాధ వస్తే సానుకూలంగా ఉండాలి అంటాం. అంటే కలత చెందిన మనసును మరో ప్రయత్నంలో అదుపులోకి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ అష్టావక్కుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి గురించి చెప్తున్నది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అతనికి చంచలత్వానికి విరుద్ధంగా ఏకాగ్రతను బలవంతంగా సృష్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చంచలత్వం, ఏకాగ్రత రెండు మనసుకు సంబంధించిన స్థితులే.
(01:45) సుఖం రావడం దుఃఖం రావడం ఇవన్నీ మనసు బుద్ధిలో జరిగే మార్పులు కానీ జీవన్ముక్తుడు తనను ఈ మార్పులతో కలిపి చూడడు అందుకే అతని ప్రశాంతత అంటే మనసును బలవంతంగా ఆపివేయడం కాదు అది సహజమైన అంతర్మౌనం బయట వందల సంఘటనలు జరుగుతున్నా లోపల ప్రతి సంఘటన వెనుక పరిగెత్తే మానసిక కదలిక ఉండదు. అష్టావక్రుడు చెప్పే స్వేచ్ఛ మొదట ఇక్కడే కనిపిస్తుంది.
(02:10) శాంతిగా ఉండడానికి కూడా అతను పోరాడడం లేదు. శాంతి అతన్ని సృష్టించే స్థితి కాదు అది అతని సహజ స్వభావంగా మారిపోయింది. ఒకరోజు అతను రాజభవనంలో ఉండొచ్చు మరోరోజు ఏమీ లేని పరిస్థితిలో ఉండవచ్చు ఒకరోజు లాభం రావచ్చు మరో రోజు నష్టం రావచ్చు. ఒకరోజు చుట్టూ వందల మంది ఉండొచ్చు. మరోరోజు అడవిలో పూర్తిగా ఒంటరిగా ఉండొచ్చు. సాధారణ మనిషి ఆనందం ఎక్కువ బయట పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది ఉంటే నేను ఆనందంగా ఉంటాను.
(02:38) ఈ వ్యక్తి నాతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఈ పని దొరికితే నాకు శాంతి వస్తుంది. ఈ సంపద వస్తే నేను తృప్తిగా ఉంటాను. నన్ను అందరూ గుర్తిస్తే నేను సంతోషంగా ఉంటాను. అంటే మన శాంతికి ఎన్నో షరతులు పెడతాం. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అంతరంగ శాంతిని ప్రపంచ పరిస్థితులు నిర్ణయించలేవని అష్టావక్కుడు చెబుతున్నాడు.
(03:02) అంటే పేదరికం, శారీరక బాధ, లాభం, నష్టం అన్నీ అతనికి ఒకేలా కనిపిస్తాయని కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే బయట వస్తువులు వచ్చినంత మాత్రాన అతని అంతరానందం పెరగదు. అవి పోయినంత మాత్రాన అతని అంతరానందం తగ్గదు. అతను జన [గొంతు సవరించుకోవడం] సమూహంలో ఉన్న అడవిలో ఉన్న లోపల అదే అనంతమైన ఆత్మలో నిలిచి ఉంటాడు. అందుకే నిజమైన స్వేచ్ఛ అంటే పరిస్థితులు ఎప్పుడూ మారిపోవడం కాదు.
(03:28) పరిస్థితులు మారినా నీ అంతర కేంద్రం కదలకపోవడం. మన జీవితంలో ఎన్నో నిర్ణయాలు ఉంటాయి. ఇది చేయాలనా అది చేయకూడదా ఇలా చేస్తే తప్ప అలా చేస్తే నాకు లాభమా ఇలా మనలో ఎప్పుడూ ఒక అంతర్గత విచారణ జరుగుతూనే ఉంటుంది. ఒకవైపు కోరిక మరోవైపు బుద్ధి కోరిక ఒక వస్తువు వైపు లాగుతుంది. బుద్ధి మాత్రం ఇది సరైంది కాదు అని హెచ్చరిస్తుంది.
(03:53) కొన్నిసార్లు కోరిక గెలుస్తుంది తర్వాత పశ్చాత్తాపం వస్తుంది. నేను అలా చేయకూడదు. ఎందుకు చేశాను? అష్టావక్రుడు చెబుతున్న జీవన్ముక్తి స్థితిలో ఈ సంఘర్షణకు మూలమైన అహంకార భావన దాటిపోవడం. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది సాధకుడు తన ధార్మిక బాధ్యతలను వదిలేయాలి అనే బోధ కాదు. సాధకుడికి వివేకం అవసరం స్వీయ నియంత్రణ అవసరం సరైన కార్యం అవసరం.
(04:18) కానీ అష్టవక్కుడు ఇప్పుడు ప్రయాణంలో ఉన్న వాడి గురించి కాదు. గమ్యాన్ని చేరి అందులో స్థిరమైన వాడి గురించి మాట్లాడుతున్నాడు. అతనిలో వ్యక్తిగత కోరిక, వ్యక్తిగత లాభం అహంకారంతో నడిచే సంఘర్షణ తగ్గిపోయింది. అందుకే నేను ఇది చేసిన ఆనందాన్ని పొందాలి అనే బలవంతపు అంతర్గత విభజన ముగిసిపోయింది. సాధకుడికి నాకు ముక్తి కావాలి నా ప్రేమ తొలగాలి బంధం నుంచి బయట పడాలి అనే భావాలు సహజమే.
(04:45) ఎందుకంటే అతనికి ఇంకా బంధం నిజమైన అనుభవంలా కనిపిస్తుంది. కానీ తన స్వరూపాన్ని స్పష్టంగా తెలిసిన జ్ఞానికి పరిస్థితి పూర్తిగా భిన్నం. అతని దృష్టిలో ప్రశ్నలు ఇలా మారిపోతాయి. మోహం ఎక్కడ [సంగీతం] ప్రపంచం ఎక్కడ త్యాగం ఎక్కడ ముక్తి ఎక్కడ ఇక్కడ అర్థం ప్రపంచం భౌతికంగా కనిపించడం ఆగిపోయిందని కాదు. కానీ తనకు వేరుగా స్వతంత్రంగా ఉన్న రెండవ సత్యంగా ప్రపంచాన్ని పట్టుకునే బ్రమ ఇక లేదు.
(05:12) తన శుద్ధ చైతన్య స్వరూపమే తాను అని తెలిసినప్పుడు నేను దీనితో బంధించబడ్డాను. ఇప్పుడు దీన్ని వదిలి ముక్తుడవ్వాలి అనే అంతర్గత విభజనకు ఆధారం ఉండదు. ఎందుకంటే బంధం నిజమని భావించినప్పుడే ముక్తి కోసం పోరాటం అవసరమవుతుంది. జ్ఞాని శాంతి అంటే ప్రపంచాన్ని జయించిన శాంతి కాదు. తనకు వేరుగా ఉన్న రెండవ సత్యం లేదని తెలిసిన శాంతి.
(05:36) ప్రపంచం నిజంగా ఉందని భావిస్తున్న వ్యక్తి దాన్ని తిరస్కరించడానికి ప్రయత్నించొచ్చు. ఇది అసత్యం ఇది మాయ, ప్రపంచం లేదు అని తన మనసును ఒప్పించడానికి ప్రయత్నించొచ్చు. కానీ కోరికలు శాంతించిన జ్ఞానికి అలాంటి ప్రయత్నం ఎందుకు? అతను ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాడు మనుషులను చూస్తాడు వస్తువులను చూస్తాడు జీవితంలోని సంఘటనలను చూస్తాడు అతను చూస్తున్నప్పటికీ అతన్ని చూడడు దీని అర్థం అతని కళ్ళకు ప్రపంచం కనిపించదని కాదు కనిపిస్తుంది కానీ కనిపిస్తున్న దానిని తనకు వేరుగా ఉన్న స్వాతంత్ర సత్యంగా పట్టుకోవడం అతనిలో ఉండదు.
(06:10) సాధారణంగా మనం ఏదైనా చూస్తే చూసిన వెంటనే దానితో ఒక సంబంధాన్ని సృష్టిస్తాం. ఇది నాకు కావాలి ఇది నాకు వద్దు ఇది నాది ఇది నాకు ఆనందం ఇస్తుంది ఇది నాకు బాధ కలిగిస్తుంది. ఇలా కనిపించేది మనసులో కోరికగా భయంగా ఆకర్షణగా లేదా ప్రతిఘటనగా మారుతుంది. కానీ వాసనలను శాంతించిన జ్ఞాని చూస్తాడు. అయినా అతని లోపల ఆ పట్టుకోవడం ప్రారంభం కాదు. అతను ప్రపంచాన్ని నిరాకరించడానికి ప్రయత్నించడు.
(06:36) ప్రపంచంలో చిక్కుకపోవడం లేదు. అందుకే ఇక్కడ చూసినా చూడడు అంటే దృష్టి లేకపోవడం కాదు. చూసిన దానితో బంధాన్ని సృష్టించని దృష్టి ప్రపంచం అతని ముందు కనిపిస్తుంది. కానీ అది అతని అంతరంగంలో కోరికను కర్తుత్వాన్ని బంధాన్ని సృష్టించదు. బ్రహ్మని తెలుసుకున్న వ్యక్తి నేను బ్రహ్మను అని ఆలోచించవచ్చు. బయటకు చూస్తే అతను కూడా పనులు చేస్తున్నట్టే కనిపిస్తాడు.
(07:01) మాట్లాడుతాడు నడుస్తాడు నిర్ణయాలు తీసుకుంటాడు అవసరమైన కార్యాలు చేస్తాడు. కానీ లోపల అతని స్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అష్టావక్కుడు ఏం చెప్తున్నాడుఅంటే అతను తృప్తుడై ఉంటాడు. వాసన నుంచి విముక్తుడై ఉంటాడు. ఇది ఉంది ఇది లేదు అనే మానసిక పట్టులో చిక్కుకోడు. అందుకే బయటకి అతనికి ఎన్నో పనులు చేస్తున్నట్టుగా కనిపించినా అతని దృష్టిలో నేను చేశాను అనే కర్తృత్వం లేదు.
(07:29) ఇది చాలా ముఖ్యమైన విషయం. సాధారణంగా మనం ఒక పని చేసిన వెంటనే దానిని మనతో కలుపుకుంటాం. నేను చేశాను నా వల్ల ఇది జరిగింది నాకు ఫలితం రావాలి నా ప్రయత్నానికి గుర్తింపు రావాలి. అలా కర్మతో పాటు ఒక నేను కూడా ఏర్పడుతుంది. ఆ నేను తర్వాత ఫలితాన్ని ఆశిస్తుంది. ఫలితం అనుకున్నట్టు వస్తే ఆనందిస్తుంది రాకపోతే బాధపడుతుంది. కానీ జ్ఞాని దగ్గర కార్యం ఉండొచ్చు.
(07:55) కర్తుత్వ బంధం మాత్రం ఉండదు. అతను ఇప్పటికే తనలో తాను తృప్తుడై ఉన్నాడు. అందుకే తన సంపూర్ణత కోసం ప్రపంచం నుంచి ఏదైనా పొందాల్సిన అంతర్గత అవసరం లేదు. అతను పని చేస్తే కూడా తన ఆనందాన్ని సంపాదించుకోవడానికి పని చేయడం కాదు. తనను నిరూపించుకోవడానికి పని చేయడం కాదు కార్యం జరుగుతుంది. కానీ దానిపై ఇది నాది నేనే చేశాను అనే మానసిక ముద్ర పడదు.
(08:21) అందుకే అష్టావకుడు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తున్నాడు. బయటకు చూస్తే అతను చేస్తున్నాడు. కానీ జ్ఞాని దృష్టిలో అతని చేత ఏది చేయబడలేదు. ఇది పనులు ఆపేయడం కాదు కర్మ మధ్యలో కర్తుత్వం కరిగిపోయిన స్థితి చర్య ఉంది జీవితం ఉంది కానీ వాటిని తన అహంకారానికి జోడించుకునే పట్టుదల లేదు. ఇదే జ్ఞాని యొక్క అకర్తుత్వం. జ్ఞాని ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా తన స్వరూపంలోనే విశ్రాంతిగా ఉంటాడు.
(08:52) అతనికి ఇది నాకు అనుకూలం ఇది నాకు అనానుకూలం అనే బలమైన మానసిక విభజన ఉండదు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అతని అంతరంగ స్వరూపం వాటితో మారదు. బయట పరిస్థితులు మారవచ్చు అనుభవాలు రావచ్చు పోవచ్చు కానీ జ్ఞాని వాటిని తన నిజ స్వరూపంగా భావించడు. అందుకే అతను సహజంగా ప్రశాంతంగా ఉంటాడు. పరిస్థితి మారుతుంది స్వరూపంలో స్థిరమైన జ్ఞాని మాత్రం మారడు.
(09:20) బంధాన్ని దాటి నిలిచిన జ్ఞానికి ఎక్కడా ఉప్పొంగే హర్షం లేదు. నిరశతో కూడిన విషాదం కూడా లేదు. అతని మనసు ఎల్లప్పుడూ శీతలంగా ప్రశాంతంగా ఉంటుంది. శరీరం ఉన్నప్పటికీ తాను శరీరమే అన్న గుర్తింపులో జీవించడు. అందుకే అతను శరీరం లేని వాడిలా ప్రకాశిస్తాడు. ఇక్కడ అర్థం భావాలు పూర్తిగా మారిపోయాయని కాదు. సుఖం వచ్చినప్పుడు అతను దానిలో మునిగిపోడు. దుఃఖం వచ్చినప్పుడు దానిలో కూలిపోడు.
(09:47) అతని అంతరంగం వాటికంటే లోతైన ప్రశాంతతలో ఉంటుంది. హర్షం అతన్ని పైకి లేపదు. విషాదం అతన్ని కిందికి పడేయదు. అతని శీతాళమైన మనసుతో తన స్వరూపంలో నిలిచి ఉంటాడు. దానికి ఈ ప్రపంచంలో ఏదైనా పొందాలి అనే పట్టుదల ఉండదు. ఏదైనా వదిలేయాలి అనే బలవంతం కూడా ఉండదు. వచ్చిన దాన్ని అతను సహజంగా స్వీకరిస్తాడు. పోయిన దాన్ని పట్టుకొని బాధపడడు.
(10:13) అతని మనసు ఆశతో భవిష్యత్తు వైపు పరిగెత్తదు. గతాన్ని పట్టుకొని కూడా ఉండదు. అందుకే అతను సహజమైన తృప్తిలో ఉంటాడు. పొందాలనే తపనే లేదు వదలాలనే బలవంతమే లేదు ఉన్నదానితోనే స్వస్థంగా ఉండే స్థితి జ్ఞాని ఇలా తెలుసుకుంటాడు ఈ కార్యం శరీరం ద్వారా జరిగింది. శుద్ధ స్వరూపమైన నేను చేయలేదు. అష్టావకుడు అందుకే చెప్తున్నాడు. చేస్తున్నట్లే కనిపించిన నిజానికి అతను చేయనివాడే.
(10:43) ఇది పనిని నిరాకరించడం కాదు కార్యం శరీర స్థాయిలో జరుగుతుంది. కానీ శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ అకర్త కార్యం ఉంది శరీరం చేస్తుంది. ఆత్మ మాత్రం చేయదు. జీవన్ముక్తుడు సంసారంలో తిరుగుతున్నప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటాడు. అతని స్వేచ్ఛ ప్రపంచాన్ని వదిలి పారిపోవడంలో లేదు. ప్రపంచంలో ఉన్నప్పటికీ బంధానికి లోను కాకపోవడంలో ఉంది. జ్ఞాని మనసులో కోరికలాలు జడే తగ్గిపోతుంది.
(11:09) అందుకే అతను ప్రపంచాన్ని సాధారణ మనిషిలా పట్టుకొని చూడడు. ఏదైనా వస్తువు కనిపిస్తే ఇది నాకు కావాలి అనే ఆకర్షణ వెంటనే లేచిపోదు. ఏదైనా అనుకూలంగా లేకపోతే ఇది నాకు వద్దు అనే బలమైన ప్రతిఘటన కూడా అతన్ని కదిరించదు. అతను చూసేది వస్తువులే అయినా వాటిపై మనసు సృష్టించే ఆకర్షణ వికర్షణల బరువ ఉండదు. అందుకే అతని మనసు సహజంగా ప్రశాంతంగా ఉంటుంది.
(11:33) వస్తువులు ఉన్నాయి అనుభవాలు ఉన్నాయి కానీ వాటిని పట్టుకొని పరిగెత్తే కోరిక లేదు. ఇదే జ్ఞాని యొక్క అంతరంగ స్వేచ్ఛ. జ్ఞాన దృష్టిలో ఇక పొందాల్సిన ప్రత్యేకమైన స్థితి ఏదీ లేదు. త్యజించాల్సిన ప్రత్యేకమైన వస్తువు లేదు. ఏదైనా సంపాదిస్తే తాను సంపూర్ణుడు అవుతాడని అతను భావించడు. ఏదైనా వదిలేస్తేనే ముక్తుడవుతానని కూడా అతను అనుకోడు. ఎందుకంటే తన స్వరూపం ఎప్పటి నుంచో సంపూర్ణమని అతనికి స్పష్టంగా ఉంది.
(12:01) అందుకే అతనిలో ఇది పొందాలి అనే ఆశే లేదు. ఇది తొలగించాలి అనే అంతర్జ్ఞత ఒత్తిడి కూడా లేదు. అష్టావక్రుడి బోధలో ముక్తి అంటే కొత్తగా ఏదో పొందడం కాదు. బంధం నిజమని పట్టుకున్న మనసు నిశశబ్దమయ్యే స్థితి. నేను కర్తను అనే భావం సడలుతుంది. ఇది నాది అనే పట్టుదల తగ్గుతుంది. ఇది తప్పకుండా జరగాలి అనే అంతర్గత ఒత్తిడి కలుగుతుంది. ప్రపంచం అలాగే ఉంటుంది.
(12:27) కార్యాలు అలాగే జరుగుతాయి. శరీరం తన పని చేస్తుంది. మనసు తన చలనాలను కలిగి ఉండొచ్చు. కానీ జ్ఞాని వాటన్నింటిని తన అసలు స్వరూపంగా భావించడు. అందుకే అతనికి ముక్తి భవిష్యత్తులో పొందాల్సిన ఫలితం కాదు. అది తన నిజ స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకొని అందులో సహజంగా నిలిచిపోవడం అక్కడ పొందాల్సింది ఏదీ లేదు వదలాల్సింది ఏదీ లేదు నిరూపించుకోవాల్సింది కూడా లేదు ప్రపంచంతో పోరాటమే లేదు తనతో కూడా పోరాటం లేదు మిగిలేది సహజమైన నిత్యత్వం సహజమైన స్వేచ్ఛ సహజమైన శాంతి కార్యం ఉంది కర్తృత్వ బంధం లేదు ప్రపంచం కనిపిస్తుంది కానీ అది అంతరంగ స్వేచ్ఛను బంధించదు. అనుభవాలు
(13:08) వస్తాయి పోతాయి స్వరూపం మాత్రం మారదు. ఇదే అష్టావక్కుడు చూపించే జీవన్ముక్తుడి స్థితి ముక్తి ఎక్కడో చేరుకోవలసిన ప్రదేశం కాదు తాను ఎప్పటి నుంచో స్వాతంత్రుడనేనని తెలుసుకోవడం. అష్టవక్తుడు చెప్పిన ఈ జ్ఞానంలో ఎక్కువగా తాకిన ఒక వాక్యాన్ని మీరు కామెంట్ లో పంచుకోవచ్చు. మన అసుర స్వరూపాన్ని తెలుసుకునే ఈ ప్రయాణాన్ని కలిసి కొనసాగుద్దాం.
(13:34) థాంక్యూ సో మచ్ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.

No comments:

Post a Comment