*రమణమహర్షి సంభాషణలు* తొమ్మిది సంవత్సరాల పాప "భగవాన్ తాతా! నీవు ఎప్పుడూ తిరువణ్ణామలై వదలి భక్తులను చూడడానికి ఎందుకు వెళ్ళరు? అని అడిగింది. అందుకు మహర్షి ఏమీ బదులు చెప్పక మౌనం దాల్చారు. మహర్షి నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి ఆ పాప మరీ మరీ అడిగింది. చివరకు మహర్షి తన మౌనం వదలి నవ్వుతూ ఇలా సెలవిచ్చారు . నువ్వేమో నన్ను చూడాలనుకున్నావు. మరొకరి ద్వారా ఇక్కడికి వచ్చావు. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను కాబట్టి నన్ను చూడగలిగావు. నేను ఊళ్ళు తిరుగుతూ ఉంటే నన్ను ఇక్కడ ఎలా చూడగలుగుతావు! ఎందరో నన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంటారు. నేను లేకుంటే వారందరూ నిరాశతో తిరిగివెళ్ళాల్సి వస్తుంది కదా! ఒకవేళ ఇక్కడినుంచి నేను బయలుదేరినా మీయింటి వరకూ రాగలనని నీకేమి నమ్మకం? తిరువణ్ణామలైలోనూ, దారిలో మిగిలిన ఊళ్ళలోనూ ఎందరో వాళ్ళయిండ్లకు రమ్మని పిలవడానికి సిద్ధంగా ఉంటారు. నేను మీయింటికి రావడానికి ఒప్పుకుంటే వాళ్ళిండ్లకు కూడా వెళ్ళడానికి ఒప్పుకోవలసి వస్తుంది. అప్పుడు నీ యింటికి నేను చేరనే చేరలేకపోవచ్చు. అంతే కాకుండా ఇప్పుడు ఇక్కడ నువ్వు చూస్తున్న ఈ జనసమూహం కూడా నాతోబాటు బయలుదేరుతుంది. ఇక్కడ కూడా నేనెక్కడికీ కదలలేను. ఒకప్పుడు నేను స్కందాశ్రమం వెళ్ళినప్పటిలాగా నేను కదిలితే ఈ గుంపంతా నా వెంటబడతారు అని నవ్వుతూ చెబుతూ "ఇది నా జైలు. నన్ను ఇక్కడ బంధించి ఉంచారు అంతే.
No comments:
Post a Comment