Saturday, September 6, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

  ఆంధ్రదేశం రేపల్లె దగ్గర మూరతోట అనే పల్లెటూరు నుండి ఒక శవమును పెట్టెలో పెట్టుకుని రమణాశ్రమానికి తీసుకు వచ్చారు. వారు ఆశ్రమానికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలు అయింది.

   వారికి ఒక్కగానొక్క బిడ్డ. రమణ భగవానులు ఆ బిడ్డను బ్రతికిస్తారు అనే గంపెడు ఆశతో ఎంతో శ్రమలకు ఓర్చి మహర్షి సన్నిధానానికి తీసుకు వచ్చారు. 

      ఆ తల్లి ఆశ్రమంలోనే భోజనం చేసి, మహర్షితో రాత్రి పది గంటల వరకు తన బాధను చెప్పుకుంది. భగవాన్ ఏమీ మాట్లాడలేదు. 

   ఆ తరువాత వారు తిరువన్నామలై ఊరులోకి వెళ్లారు. మహర్షి, బిడ్డను బ్రతికిస్తారు అనే ఆశతో తెల్లవారే వరకు చూసింది ఆ తల్లి; ఇక చేసేది ఏమిలేక ఆ బిడ్డమీద ఆశను వదలుకొని శవము(పీనుగ)ను తగలపెట్టారు. 

      ఆ తరువాత వారు రెండు రోజులు రమణాశ్రమంలొనే ఉన్నారు. మహర్షి అనుగ్రహంతో వారు దుఃఖమంతా మరచిపోయి సంతోషంతో  వెళ్లిపోయారు. బిడ్డ దాదాపు  బ్రతికినంత పని అయ్యింది వారికి.

    వారు వెళ్లిన తరువాత మహర్షి ఇలా సెలవిచ్చారు......
    
      పాపం వారు ఎంతో విశ్వాసంతో చాలా దూరం ప్రయాణించి ఆశ్రమానికి వచ్చారు. ఏమి చేస్తాం మనం? కాని ఒకరిని బ్రతికిస్తే చాలు; ఈ  బ్రతికించడాలకి ఇక అంతమే ఉండదు.

No comments:

Post a Comment