Saturday, September 6, 2025

 *లక్ష్మీనారాయణులు - లక్ష్మీగణపతి* 

*బుద్ధినే గాక సిద్ధిని కూడా కలగజేసేవాడు గణపతి. స్వామి ఆశీర్వాదం అందుకున్నాక చేపట్టిన ఏ పనైనా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఇంతటి మహత్తు వున్న గణేశునితో బాటు సమస్త సంపదలకు, నిధులకు అధిదేవత యైన మహాలక్ష్మిని కూడా కలిపి పూజిస్తే జీవితంలో ఇక దేనికీ లోటనేదే వుండదు. ఈ కారణంగానే లక్ష్మీదేవిని గణేశునితో కలిపి పూజిస్తారు.*

*గణేశుని బుద్ధికి 'స్వామి'గా అభివర్ణించారు. అందువల్లనే కార్తికేయుడు ప్రపంచ ప్రదక్షిణకు బయలుదేరినా, గణేశుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరు లకు ప్రదక్షణ చేసి బుద్ధిబలంతో వృద్ధినీ, సిద్ధినీ పొందగలిగాడు.*

*లక్ష్మీదేవి ప్రసాదించిన సంపద స్థిరమై వృద్ధిని, గణపతి పూజతో సిద్ధిని పొందటానికై లక్ష్మీగణేశుల పూజ, ఉపాసన ఏకకాలంలో చేస్తారు. వివేకవంతులైన వారు మాత్రమే సంపదను సద్వినియోగపరచుకొని, వృద్ధి చేసుకోగలుగుతారు.*

*┈┉┅━❀꧁ శివ శివా ꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🌺🍁 🙏🕉️🙏 🍁🌺🍁

No comments:

Post a Comment