Saturday, September 6, 2025

 


🙏🏻అరుణాచల రమణ🙏🏻
 
🪷ఈశ్వర తత్వం🪷

భగవాన్ రమణులు గారిని ఓక విదేశీ శిష్యుడు ఇలా అడిగాడు... "మీరు అరుణాచల పర్వతాన్ని ఈశ్వరుడిగా ఎందుకు భావిస్తున్నారు... అది మీతో మాట్లాడదు, ఉలకదు, పలకదు. అది మీకు గురువు ఎలా అయ్యింది"...

అప్పుడు భగవాన్ రమణులు వారు... 
"ఏది ఉలకదో, 
ఏది పలకదో, 
నీతో సంభాషించదో, 
నీతో ఎప్పుడూ వాదోపవాదాలు చేయదో 
అదే ఈశ్వర తత్వం" అని జవాబిచ్చారు.

నీటిలో వల వేసి చేపలను పట్టగలమేగాని,
వలతో నీటిని పట్టగలమా?
నీరు - భగవంతుడు,
వల - నీవు చేసే సాధన,
చేపలు నీకు దొరికే ఐహిక సుఖాలు!

 ప్రపంచానికి కనిపించవుగాని
స్వర్గానరకాలు ఈ తనువుతోనే 
అనుభవించి పోవాల్సిందే!

🌹🙏సద్గురు రమణా..శరణం శరణం శరణం🙏🌹

 నీవు ప్రయత్నం చేసినా చేయకపోయినా
అమలయ్యేది దైవ నియతియే.
ఇది తెలిసి స్థిమితంగా ఉండి
కర్మలను ఆచరిస్తే.. అదే జ్ఞానం..అదే మోక్షం!

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏

No comments:

Post a Comment