*భగవంతుడి తోడు.....*
*ఒక వ్యక్తి రాత్రి నిద్రపోతున్న సమయంలో ఒక విచిత్రమైన కలను చూశాడు. అతను భగవంతునితో బాటు ఒక సముద్రం ఒడ్డున ఇసుకలో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలో మెరుపు మెరిసింది. ఆ మెరుపులో అతనికి గత జీవితంలోని కొన్ని దృశ్యాలు కనిపించాయి. ఒక దృశ్యంలో అతనికి రెండు జతల పాదచిహ్నాలు దర్శసమిచ్చాయి. అతనిలా అనుకున్నాడు-ఒక జత పాదాలు నావి, మరి రెండో జత భగవంతుడివి. కాని ఆశ్చర్యంగా కొన్ని దృశ్యాలలో అతనికి కేవలం ఒక జత పాదచిహ్నాలు మాత్రమే కనబడ్డాయి. ఆ దృశ్యాలు అతని జీవితంలో అతి కష్టమైన సమయంలోవి.*
*ఈ దృశ్యాలు చూసిన అతను తనతో బాటు నడుస్తున్న భగవంతుడిని ఇలా అడిగాడు - 'భగవాన్! మీరు ఎప్పుడూ నాతోనే ఉంటానని చెప్పారు. కాని నా దుఃఖ సమయంలో కేవలం ఒక జత పాదచిహ్నాలు మాత్రమే ఎందుకు కనబడుతున్నాయి? ఆ సంకట పరిస్థితులలో మీరు నన్ను ఎందుకు ఒంటరిగా వదిలివేశారు. ఆ సమయంలోనే నాకు* *మీ అవసరం ఎక్కువ కావాలి కదా' అన్నాడు.*
*భగవంతుడు నవ్వుతూ, 'పుత్రా! నేనెప్పుడూ సంకట పరిస్థితులలో నిన్ను వదిలేయలేదు. ఎక్కడైతే నీకు ఒక జత పాదచిహ్నాలు కనపడినాయో, అక్కడ నేను నిన్ను ఎత్తుకున్నాను' అన్నాడు.*
*┈┉┅━❀꧁జై గణేశా꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌺📿🌺 🙏🕉️🙏 🌺📿🌺
No comments:
Post a Comment