Saturday, September 6, 2025

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ

   ఒకసారి రమణాశ్రమ భక్తబృందం ఆర్ధ్రరాత్రి పూర్ణిమ వెన్నెలలో వేదపారాయణం చేసుకుంటూ అరుణగిరి ప్రదక్షిణ చేస్తున్నారు.

   ఆ సమయంలో అరుణగిరి మీద నుండి ఒక చిరుతపులి దూకుతూ వచ్చి రోడ్డుమీద భక్తబృందం దారికి అడ్డంగా నిలబడింది. ఒక్కసారిగా భక్తబృందం హడలిపోయి భయంతో నోట వేదపారాయణం కూడా ఆగిపోయింది. అటు వెనక్కి వెళ్లడానికి కాళ్ళు ఆడలేదు.

   ఆ చిరుతపులి అలాగే కొంచెము సేపు నిలుచుని భక్తబృందం వైపు కొంతసేపు చూచి అరుణగిరి వైపుకు మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయింది.  
        
  ఇక భక్తబృందం బ్రతుకుజీవుడా అని తొందరగా నడచుకుంటూ అరుణగిరి ప్రదక్షిణ ముగించుకుని రమణాశ్రమానికి వచ్చి జరిగిన విషయాన్ని మహర్షికి వివరించారు. 

        మహర్షి ఇలా సెలవిచ్చారు ....

  వారికి(చిరుతపులి) భయపడి వేదపారాయణం చేయడం ఎందుకు ఆపివేశారు? వారు ఒక జ్ఞాని. మీరు చేసే వేదపారాయణం విని ఇంకా దగ్గరగా వేదపారాయణం వినాలని అమితమైన ఉత్సాహంతో మీ వద్దకు వచ్చారు; అంతే.

No comments:

Post a Comment